delivers
-
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
వింత కేసు: ముప్పైలో గర్భం దాల్చగా.. 92 ఏళ్ల వయసులో ..
వైద్యులనే అవాకయ్యేలా చేసిన అత్యంత వింత కేసు ఇది. సాధరణంగా మనుషులు గర్భం దాల్చితే తొమ్మిది లేది పదో నెలలో డెలిరీ అవుతుంది. ఇది సహజం. కానీ ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, తొమ్మిది పదుల వయసులో ప్రసవించటమా!. ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదూ. అన్నేళ్లు గర్భంలో ఎలా మోసింది. ఆ తల్లి బిడ్డలు బతికే ఉన్నారా? ఇది సాధ్యమేనా? ఎన్నో సందేహాలు వైద్యులను సైతం ఒకింత గందరగోళానికి గురిచేశాయి. ఆమె అన్నేళ్లు ఆ గర్భాన్ని మోస్తూ ఎలా బతికిందా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన మహిళ హువాంగ్ యిజున్(92) 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని, ఇది ఇరువురికి ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆమెను వైద్యులు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండ ఎదగదని అబార్షన్ అవుతుందని చెప్పారు కూడా. ఐతే ఆర్థిక ఇబ్బందులు రీత్యా హువాంగ్ యిజున్ ఆ పిండాన్ని తీయించేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదైతే అది అవుతుందని భావించి అలానే ఉండిపోవాలనుకుంది. విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ విచ్ఛతి అయినట్లుగా బ్లీడింగ్ అవ్వలేదు. ఇక ఆమె ఆ గర్భంతో అలానే మోస్తూ వచ్చింది. బతికే ఉంటుందన్న ఆశ, లేక బిడ్డ కడుపలోనే బతుకుతుందో అనుకుందో గానీ అలానే 61 ఏళ్లు గడిపింది. చివరికి తొమ్మిది పదుల వయసులో వైద్యులను ఆశ్రయించింది. వారు ఆమెను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె చెప్పింది నిజేనా అని అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా..వైద్యులంతా ఒక్కసారిగి ఆశ్చర్యపోయారు. ఇదసలు ఊహకే అందని వింత కేసు అన్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్లా మారి అలా ఉండిపోయిందని చెప్పారు. ఇలా జరగడం అత్యంత అరుదని. ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. చివరికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని అన్నారు. అందుకు సంబంధించన ఫోటోలు, హువాంగ్ యిజున్ కథ నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు 61 ఏళ్లు ప్రెగ్నెన్సీనా! అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలో చాలామంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నురాని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. In 1948, Huang Yijun, a 31-year-old Chinese woman, discovered that she was pregnant. She went to the doctor, who informed her that the fetus was growing outside her uterus, specifically in her abdomen, a condition known as ectopic pregnancy. Huang needed to undergo surgery to… pic.twitter.com/ttu8ARl0jj — Historic Vids (@historyinmemes) August 17, 2023 (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
మన్‌కీబాత్ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..
డిల్లీలో జరిగిన మన్ కీ బాత్ 100వ ఎపీసోడ్‌ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్‌కిబాత్ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన 24 ఏళ్ల పూనమ్ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్‌ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్ భర్త ప్రమోద్ కుమార్ చెప్పారు. సదరు మహిళ పూనమ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం. ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్ లఖింపూర్ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్ సంగతన్ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ ఎపిసోడ్లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గుజరాత్ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్ కునుకు.. ఆ కమిట్మెంట్కు ఫలితంగా..) -
సర్పంచ్ అంటే అట్లుండాలి! తొలిసారిగా నగదు డెలివరీ చేసే డ్రోన్!
ఇంకా చాలా మూరుమూల ప్రాంతాల్లోని వారు రాష్ట్ర పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అందుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ దివ్యాంగుల పరిస్థితి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలానే ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగుడి కోసం స్వయంగా డ్రోన్ కొనుగోలు చేసి మరీ పెన్షన్ అందించి.. తన గొప్ప మనుసును చాటుకుంది ఓ మహిళా సర్పంచ్. వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో హెతారం సత్నామీ అనే శారీరక వికలాంగుడు నివశిస్తున్నాడు. ప్రభుత్వ ఫించను కోసం ప్రతి నెల దట్టమైన అడవి గుండా రెండు కి.మీ పైగా దూరంలో ఉన్న పంచాయతీ వద్దకు వచ్చేందుకు నానాతంటాలు పడుతున్నాడు. ఈసారి సర్పంచ్ చొరవతో అతను ఫించన్‌ను నేరుగా ఇంటి వద్ద తీసుకున్నాడు. ఆ గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల దివ్యాంగుడు సత్నామీ పరిస్థితితి గురించి తెలుసుకుని అతని సమస్యను పరష్కరించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆన్లైన్లో డ్రోన్‌ని కొనుగోలు చేశారు అగర్వాల్. ఈ మేరకు సర్పంచ్ అగర్వాల్ మాట్లాడుతూ..సత్నామీ పుట్టుకతోనే వికలాంగు, కదలలేడు. దీంతో అతని పేరును రాష్ట్ర ఫించన్ పథకంలో నమోదు చేశాం. ఐతే ఫించన్ కోసం ఆ అడవిని దాటి పంచాయతీ వద్దకు రావడానికి చాల కష్టపడుతున్నాడు. ఇతర దేశాలలో డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుని వెంటనే కొనుగోలు చేసి అతడికి ఫించన్ పంపేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నా. ఐతే సదరు వ్యక్తికి విజయవంతంగా డ్రోన్ సాయంతో డబ్బు డెలివరీ చేయగలిగాం అని సర్పంచ్ చెప్పుకొచ్చారు. డ్రోన్లను కొనుగోలు చేసే సదుపాయం ప్రభుత్వం వద్ద లేనందును సర్పంచే స్వయంగా కొనుగోలు చేయడంతో ఇది సాధ్యమైందని నువాపాడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుబదార్ ప్రధాన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందులు, కిరాణ సామాగ్రి, ఆహారం, ఇతర వస్తువులను డ్రోన్ల సాయంతో డెలివరీ చేయండ చూశాం. గానీ ఇలా డ్రోన్‌తో నగదు డెలవరీ చేయండం భారత్‌లోనే ప్రపథమం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?.. నా నుంచి అది మాత్రం లాక్కోలేరు: ఉద్దవ్ థాక్రే) -
మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!
కంపెనీ యజమాని స్వయంగా వర్కర్లా మారి పని చేయడం లాంటి ఘటనలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే రీల్‌పై ఇలాంటివి సాధ్యమే గానీ రియల్ లైఫ్‌లో ఇలాంటివి చాలా అరుదనే చెప్పాలి. కానీ ఓ కంపెనీ సీఈవో స్థాయిలో ఉంటూ సాధారణ డెలివరీ బాయ్‌గా సేవలు అందించారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. అది కూడా ఒకటి, రెండు సార్లు కాదండోయ్, గత మూడు సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఆయన ఇలా డెలివరీ బాయ్‌లా మారి కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నాడట. వినడానికి ఆశ్చర్యంగా విన్నా ఇది నిజమే! ఈ విషయాన్ని నౌకరీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ తెలిపారు. దీని వెనుక అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇలా వెలుగోలోకి వచ్చింది! దీపిందర్ గోయల్ సాధారణ జొమాటో డెలివరీ బాయ్ లాగా ఎర్ర టీషర్డ్ వేసుకుని ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారని నౌకరీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ తన ట్వీట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ట్వీట్లో.. కంపెనీలోని సీనియర్ మేనేజర్లు సైతం ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతారని తెలిపారు. మోటార్ సైకిల్‌పై తాను ఆర్డర్లు డెలివరీ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదని జోమోటో సీఈఓ దీపిందర్ చెప్పినట్లు ఆ ట్వీట్లో ప్రస్థావించారు. సీక్రెట్‌గా మూడు నెలలకొక సారి.. ఒక స్టార్టప్ కంపెనీగా మార్కెట్లో వచ్చిన జొమోటో, అనతి కాలంలోనే తన కస్టమర్ల సంఖ్యను లక్షల నుంచి కోట్లకు మార్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే కంపెనీ స్టార్ట్ చేయడం, ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ స్థానాన్ని, కస్టమర్ల నమ్మకాన్ని, మార్కెట్లో ఉన్న కంపెనీ విలువలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పైగా ఏ కంపెనీకైనా కస్టమర్లకు అనుగుణంగా సేవలను అందించేందుకు ప్రాముఖ్యతనిస్తుంది. ఈ క్రమంలోనే అసలు మార్కెట్లో కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకోవటం చాలా కీలకమని భావించారు Zomato CEO దీపిందర్ గోయల్. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక రోజంతా డెలివరీ బాయ్‌గా మారి సేవలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆధార్ కార్డ్‌లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవ్! -
ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ వర్టస్ సంచలనం
హైదరాబాద్: జర్మనీకి చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ మధ్యస్థాయిసెడాన్ వర్టస్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే 2,000లకుపైగా యూనిట్లు డెలివరీ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ చేసిన దగ్గర్నుంచి ఈ కారు అద్భుతమైన స్పందనతో కస్టమర్ డిమాండ్‌ను సాధించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన 'బిగ్ బై డెలివరీ', మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను ఇండియా వ్యాప్తంగా ప్రారంభించామని చెప్పింది. ప్రారంభ ఆఫర్లో వర్టస్ ధర ఎక్స్‌షోరూంలో రూ.11.21 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైన్స్ పొందుపరిచారు. 1.0 లీటర్ ట్రిమ్‌లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 1.5 లీటర్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ 18.67 కిలోమీటర్ల మైలేజీ ఉంటుందని తెలిపింది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుండై వెర్నా, స్కోడా స్లావియాలకు ఇది పోటీనిస్తుంది. ఎంక్యూబీ ఏ0 ఇండియా ప్లాట్‌ఫామ్‌పై పూణే సమీపంలోని చకన్ ప్లాంటులో ఇది తయారైంది. కాగా ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల రిలీజ్ చేసిన వర్టస్ ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక షోరూం ఒకేరోజు 150 కార్లను డెలివరీ చేసింది. తద్వారా ఇండియా బుక్ రికార్డ్స్‌లో వర్టస్ చోటు సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. -
జస్ట్ డెలీవరీకి ముందు ఈ డాక్టర్ ఏం చేశారో తెలుసా..
కెంటకీ: వైద్యులంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేవారని ప్రతీతి. అందుకే దాదాపు రోగులందరూ డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తారు. దీనికి అనుగుణంగానే ఓ మహిళా డాక్టర్ డ్యూటీలో లేకపోయినా..పెద్దమనసుతో వ్యవహరించి శబాష్ అనిపించుకుంది. ప్రసవ వేదనను అనుభవిస్తూ..తోటి మహిళ కష్టాన్ని, వేదను అర్థం చేసుకుని కార్యరంగంలోకి దూకింది. మరి కొద్దిక్షణాల్లో తాను బిడ్డకు జన్మ నివ్వబోతూ కూడా వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్న వైనం పలువురి ప్రశంసలందుకుంటోంది. డా. హాలా సాబ్రీ ఈ ఉదంతాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ అమండా హెస్ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరారు. పేషెంట్ గౌన్ వేసుకుని లేబర్ రూంలో వెళుతున్నారు. ఇంతలో మరో మహిళ ప్రసవ వేదన ఆమె చెవిన పడింది. ఆమె గర్భంలో బిడ్డ పేగు మెడకు వేసుకుని ప్రమాదంలో పడ్డాడు. దీంతో ప్రసవం కష్టంగా మారింది. మరోవైపు డ్యూటీ డాక్టర్ రావడానికి ఇంకా సమయం ఉంది. దీంతో సమయ స్పూర్తిగా వ్యవహరించిన డా. అమండా క్షణం ఆలస్యం చేయకుండారంగంలోకి.. తల్లీ బిడ్డలను కాపాడారు. ఆ తరువాత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తాను తన వృత్తిని ప్రేమిస్తానని, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం తనకు సంతోషాన్నిస్తుందని డా. అమండా తెలిపారు. అంతేకాదు అనారోగ్యానికి గురైనా తమ రోగుల సంరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించే డాక్టర్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. -
టెస్లా మోడల్3 తొలి ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ
లాస్ ఏంజిల్స్: అమెరికన్ లగ్జరీ ఎలెక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మూడు ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు అందించింది. కాలిఫోర్నియాలోని ఫ్రెమొంట్ వాహన తయారీ కర్మాగారంలో సంస్థ మొట్టమొదటి 30మందిలో ముగ్గురు కొనుగోలుదారులకు కార్ల కీ ని అందజేసింది. మోస్ట్ ఎవైటెడ్ ఎఫర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీకి శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ముగింపు పడిందని టెస్లా సీఈవో ఎల్లోన్ మస్క్ ప్రకటించారు. అమెరికా మార్కెట్లో మోడల్ 3 ప్రారంభ ధర 35వేల డాలర్లుగా (సుమారు రూ. 22.8 లక్షలు) ఉండనుంది. కాగా ఇప్పటికే లాంచ్ చేసిన మొట్టమొదటి మూడు వాహనాలు - రోడస్టర్, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లు చాలా ఖరీదు. దాదాపు లక్ష డాలర్లకు ( సుమారు రూ. 64 లక్షలు) పై మాటే. టెస్లా ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకుంటే మోడల్ 3 అత్యంత సరసమైన కారుగా చెప్పొచ్చు. మొత్తం అల్యూమినియం బాడీకాకుండా కొంత స్టీల్‌తో రూపొందించారు. ఇంకా సింగిల్ చార్జ్‌తో 5 నుంచి 6 సెకన్స్ లో 0.60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అయితే లార్జ్ బ్యాటరీ, ఆన్ స్క్రీన్ డ్యాష్ బోర్డు, ఫాన్సీ వీల్స్, మెటాలిక్ పెయింట్, అటానమస్ డ్రైవింగ్ ఫీచర్స్‌ను కావాలంటే కస్టమర్లు జోడించుకోవచ్చు. అలాగే ఈ కారుకు నాలుగు సంవత్సరాల, 50,000 మైళ్లవరకు వారంటీ ఉంది. 100,000 మైళ్ళ పరిధిలో ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంది. ఇది టెస్లా కు సంబంధించి గొప్ప రోజు..ఎప్పుడూ కేవలం ఖరీదైన కార్లనే తయారు చేయడం తమ లక్ష్యం కాదని , కార్లను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని తాము కోరుకుంటున్నామని టెస్లా సీఈవో మీడియాకు చెప్పారు. మోడల్ 3 కార్లను ఇపుడు ప్రీ బుకింగ్ చేసుకుంటే 2018లో చివరికి నాటికి అందించే అవకాశం ఉందని చెప్పారు. టెస్లా రూపొందించే ప్రతిదీ అందమైనదిగా ఉంటుందని టెస్లా చీఫ్ డిజైనర్ ఫ్రాంజ్ వాన్ హోల్జాజెన్ అన్నారు. మోడల్ 3 మరింత విశాలంగా కనిపించడానికి ప్రత్యేకంగా గ్లాస్ రూఫ్‌తో తయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్ విపరీతంగా ఉండడంతో మోడల్ 3 ప్రొడక్షన్ పెద్ద ఛాలెంజ్ అని టెస్లా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2017 ఆగష్టు నాటికి 100 కార్లను, సెప్టెంబర్ 2017 నాటికి 1500 కార్లను ఉత్పత్తి చేయనుంది. -
ఏటీఎం క్యూలైన్లో ప్రసవించిన మహిళ
-
'లక్ష్మి' కోసం వెళ్తే మరో లక్ష్మి వచ్చి పలకరించింది
-
నగదుకోసం క్యూలో ఉంటే...
కాన్పూర్: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు విత్ డ్రా కోసం ఏర్పడుతున్న క్యూ లైన్లలో మరో ఆసక్తికర సంఘటన నమోదైంది. డబ్బుల కోసం క్యూలో నిలుచుంటే.. అనూహ్యంగా శుక్రవారం పూట లక్ష్మి వచ్చి పలకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...దేహత్ జిల్లాకు చెందిన సర్వేష (30) అత్తగారితో కలిసి నగదు విత్ డ్రా కోసం బ్యాంకు కు వెళ్లింది. గురువారం క్యూ లో నిలుచున్నా ఫలితం దక్కకపోవడంతో మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి క్యూలో వెయిట్ చేస్తోంది. ఇంతలో సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో అక్కడున్న మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వారి సహాయంతో సర్వేష బ్యాంకులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పోలీసులు తల్లీబిడ్డలను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అయితే తనకోడలు చాలా బలహీనంగా ఉండడటంతో తనకు భయమేసిందని సర్వేష అత్తగారు తెలిపింది. కానీ అందమైన పుట్టడం సంతోషంగా ఉందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో సర్వేష భర్త అశ్వేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో యూపీ ప్రభుత్వం సుమారు రూ.2.75 లక్షలు, ఇల్లు పరిహారాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడకోసం అత్తతో కలిసి బ్యాంకుకు వెళ్లింది. -
బస్టాండ్ ఎదుటే మహిళ ప్రసవం
తూర్పుగోదావరి(సామర్లకోట): సామర్లకోట ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న రోడ్డుపై గుర్తుతెలియని మహిళ బుధవారం సాయంత్రం ప్రసవించింది. ఆ మహిళను108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మహిళ ఒరియా భాషలో మాట్లాడుతోంది. మహిళకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువశక్తి మన సొంతం: మోదీ