Demanad
-
హాస్టళ్లకు గిరాకీ.. అద్దెలూ పెరుగుతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు.క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో స్టాంజా, హౌసర్, యువర్ స్పేస్, ఓలైవ్ లివింగ్ వంటి సంస్థలు విద్యార్థి వసతి గృహాల సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 1.10 కోట్ల మంది వలస విద్యార్థులు ఉండగా.. 2036 నాటికి 3.10 కోట్లకు చేరుతుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది. అయితే ఆయా విద్యార్థులకు కోసం వసతి గృహాలలో కేవలం 75 లక్షల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత విద్యార్థి గృహాల అద్దెలు ఏటా 10–15 శాతం మేర పెరుగుతున్నాయి. -
అమర వీరుల కుటుంబాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రానున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ పార్టీలో కూడా చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ మాట్లాడుతూ.. సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్కు రెండే రాజ్యసభ స్థానాలు వస్తాయని, ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మూడోది గెలవాలి కనుక తమ ఆలోచనకు అనుగుణంగా అమరవీరుల కుటుంబాలకు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. తన బంధువు సంతోష్‌ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ యోచిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లే అర్హత సంతోష్‌కు ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు సపర్యలు చేయడమే సంతోష్ అర్హతా? అని ఎద్దేవా చేశారు. అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపుతామని రేవంత్ హెచ్చరించారు. -
దోషులను అరెస్ట్ చేయాలి
కాగజ్‌నగర్/బెజ్జూర్ : బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన దళిత మహిళ దుర్గం సేవంతకు నిప్పు పెట్టి సజీవదహనం చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు, టీ మాస్ జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు, ఉపాధ్యక్షుడు కూశన రాజన్న డిమాండ్ చేశారు. శుక్రవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామానికి వెళ్లి మృతురాలు సేవంతబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో దోషులను శిక్షించాలని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత మహిళను అతికిరాతకంగా చంపిన నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారం క్రితం సేవంతాబాయి ఇంటిని తగలపెట్టిన దుండగులపై మృతురాలు బెజ్జూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఇళ్లు తగలపెట్టినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. మృతిరాలి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ విషయంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్, బవండ్లపల్లి నర్సయ్య, అల్లూరి లోకేశ్, కార్తిక్, జాడి మల్లయ్య ఆర్.తిమ్మారావు, దినకర్ పాల్గొన్నారు. ‘అధికారుల నిర్లక్ష్యంతోనే దారుణం’ వాంకిడి(ఆసిఫాబాద్): దళిత మహిళపై కిరోషిన్ పోసి అతికిరాతకంగా హతమార్చిన సంఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్మోహార్కర్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బెజ్జుర్ మండలం మర్తిడిలో దళిత మహిళపై దాడికిపాల్పడడం, ఇళ్లు తగలపెట్టడం సంఘటనలు జరిగిన అధికారులు స్పందించలేదన్నారు. దోషులను శిక్షించి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో దళిత సంఘం నాయకులు విలాస్ ఖోబ్రాగడె, విటల్, రోషన్, పాండుజీ, దుర్గాజీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు గణేశ్ ఉన్నారు. -
జిల్లా కోసం రేపటినుంచి రిలే దీక్షలు
గద్వాల న్యూటౌన్ : గద్వాల జిల్లా సాధనలో భాగంగా మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఐక్య కార్యాచరణ వేదిక చైర్మన్ వెంకట్రాములు, కన్వీనర్ మధుసూదన్‌బాబు తెలిపారు. ఆదివారం స్థానిక రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక పాతబస్టాండ్ ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని, జిల్లా సాధించే వరకు శిబిరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఆమరణ దీక్షలకు సైతం తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. రెండు నియోజకవర్గాలోని 9 మండలాలకు చెందిన 8 లక్షల మంది ప్రజలు ఏకగ్రీవంగా జిల్లా కావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. అన్ని వసతులు, వనరులు ఉన్న గద్వాలను జిల్లా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు అంపయ్య, ఉశేన్, వాల్మీకి, వినోద్‌కుమార్, సాయిసవరణ్, కృష్ణ, హరిబాబు తదతరులు పాల్గొన్నారు.