Demands solve
-
డీలర్ల సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: నాయకోటి రాజు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా డీలర్ల ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మా సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరిస్తారనే ఇంత వరుకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నోటీసుల పేరుతో బయపెటడం సరి కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. గజ్వేల్ డీలర్ ఆత్మహత్య యత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా డీలర్‌ని పరామర్శించాడానికి వస్తున్నా తోటి డీలర్లను పోలీసులు అడ్డుకోవడం విచారకరం అని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు, డీలర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మల్లేశం గౌడ్, ప్రసాద్ గౌడ్, మురళి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన రైతన్న
ముంబై: అన్నదాతలు ఆదివారం ముంబై నగరాన్ని ముంచెత్తారు. డిమాండ్ల సాధన కోసం దాదాపు 50 వేల మంది మహారాష్ట్ర రైతులు ముంబైలో అడుగుపెట్టారు. వారంతా సోమవారం అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలు తీర్చాలంటూ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది కర్షకులు పాదయాత్రగా వచ్చారు. ఎండలు మండిపోతున్నా, అరికాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయకుండా దీక్షతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచిన వారంతా ముంబైలోని కేజే సోమయ మైదానానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు అర్ధరాత్రి ఆజాద్ మైదానానికి బయల్దేరారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వీరికి ముంబై శివార్లలో స్వాగతం పలికారు. మంగళవారం నాసిక్‌లో యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా రైతు రుణాలను మాఫీ చేయడం, పెట్టుబడికి అయిన ఖర్చు కన్నా కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండేలా చూడడం, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన వారిని ఆదుకోవడం, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను వారి పేర్లన రిజిస్టర్ చేయడం తదితరాలు రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. రైతు సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, ఆ సంఘం రైతులతో చర్చలు జరుపుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. కమ్యూనిస్టుల అనుబంధ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రైతుల పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, శాంతియుతంగా తాము నిరసన తెలుపుతామని ఏఐకేఎస్ తెలిపింది. -
సమ్మెకు దిగిన డాక్టర్లు
- రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలకు అంతరాయం - పది డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించిన ఎంఏఆర్డీ - డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: వినోద్ తావ్డే ముంబై: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు గురువారం నుంచి సమ్మెకు దిగారు. సుమారు 4000 మంది డాక్టర్లు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (ఎంఏఆర్డీ) అధ్యక్షుడు డాక్టర్ సాగర్ ముండడ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఐదేళ్లుగా విన్నవిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పేషెంట్ చనిపోతే డాక్టర్లపై దాడికి దిగుతున్నారని చెప్పారు. తాము చదివిన స్పెషలైజేషన్‌కు సంబంధించిన శాఖలోనే ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మానసిక రుగ్మతల శాస్త్రంలో ఎండీ చేసినవారికి దానికి సంబంధించిన శాఖలోనే పని చేసేందుకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు. ఒక శాఖలో స్పెషలైజేషన్ చేసి మరో శాఖలో పని చేస్తే అది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అన్నారు. తమ పది డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. సమ్మె విరమించండి: తావ్డే డాక్టర్ల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, డాక్టర్లు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే కోరారు. డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి తాను ఎంఏఆర్డీ ప్రతినిధులతో చర్చించానని తావ్డే చెప్పారు. భేటీలో ముఖ్యంగా డాక్టర్ల భద్రత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, డాక్టర్లకు కల్పిస్తున్న ఏర్పాట్లపై చర్చించామన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని కాబట్టి సమ్మె విరమించాల్సిందిగా డాక ్టర్లను కోరాన్నారు. రాత పూర్వక హామీ ఇవ్వలేదు: సాగర్ ప్రభుత్వం తమకు వ్రాతపూర్వక హామీ ఇవ్వలేదని భేటీ అనంతరం ఎంఏఆర్డీ అధ్యక్షుడు సాగర్ వెల్లడించారు. బుధవారం సమావేశానికి ముందు వినోద్ తావ్డేతో జూన్ 12 సమావేశమయ్యామని.. ఆ సమయంలో కూడా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని తావ్డే చెప్పారని అన్నారు. ప్రతిసారి ప్రభుత్వం ఇవే మాటలు చెబుతోందన్నారు కానీ డిమాండ్లు నెరవేరడంలేదని.. అందుకే సమ్మెకు దిగాలని నిర్ణయించామన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితిని ప్రభుత్వం చెప్పలేదన్నారు.