సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా డీలర్ల ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మా సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరిస్తారనే ఇంత వరుకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నోటీసుల పేరుతో బయపెటడం సరి కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. గజ్వేల్ డీలర్ ఆత్మహత్య యత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా డీలర్‌ని పరామర్శించాడానికి వస్తున్నా తోటి డీలర్లను పోలీసులు అడ్డుకోవడం విచారకరం అని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు, డీలర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మల్లేశం గౌడ్, ప్రసాద్ గౌడ్, మురళి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment