ration deelars
-
బోగస్‌కు ఇక శుభం కార్డు !
బోగస్ కార్డుల అసలు రంగు తేలిపోనుంది. దర్జాగా అనుభవిస్తున్నవారి బండారం బయటపడనుంది. వేలకువేలు జీతాలు తీసుకుంటున్నా... ఇంకా నిరుపేదలకు అందించే సౌకర్యాలకోసం వెంపర్లాడేవారికి గుణపాఠం కలగనుంది. డీలర్ల వ్యవస్థలో గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారానికి ఇక చెక్‌పడనుంది. ఆధార్ కార్డుల అనుసంధానంతో ఈ రహస్యం కాస్తా బట్టబయలవుతోంది. కొందరు ఉద్యోగుల కుటుంబీకులు తాము అర్హులమేననీ... తమ పిల్లలకు ఉద్యోగం ఉన్నంతమాత్రాన తామెలా అనర్హులమని విన్నవించుకోవడంతో సర్వేకు సన్నాహాలు మొదలయ్యాయి. సాక్షి, విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ... వేలాది రూపాయల వేతనం తీసుకుంటున్న వారిలో చాలా మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలు పొందుతున్నారు. ఈ విషయం ఆధార్ అనుసంధానంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అధికారులు వారి కార్డులు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కొందరి కార్డులు ఆగిపోగా... తాము అర్హులమేనని, అయినా తమ కార్డులు తీసేశారని పలువురు వినతులు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అర్హులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని అధికారులను ఆదేశించింది. ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టి నిజమైన ఉద్యోగులెవరో తేల్చాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతవరకు రేషన్ సరుకుల సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. ఉద్యోగుల వద్ద 7,204 కార్డులుప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాల కోసం తమ ఆధార్ నంబరు లింక్ చేశారు. అంతేగాకుండా ఉద్యోగులకు సంక్రమించే పలు ప్రయోజనాల కోసం వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు నమోదు చేశారు. ఈ వివరాలను తీసుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఈ విధంగా రరేషన్కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 7,12,303 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆధార్ అనుసంధానంతో ఇందులో 7,204 రేషన్‌కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ సెప్టెంబర్ నెలలో రేషన్ ఆపేశారు. రేషన్‌కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి కార్డుగా గుర్తించారు. అయితే పదేళ్ల కిందట కార్డులు ఇవ్వడంతో ఇందులో కొందరు ఉద్యోగం పొందిన తర్వాత కార్డులు పొందగా కొందరు మాత్రం ఉద్యోగం రాకముందు కార్డులు పొందారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు కార్డులు రద్దు చేసుకోపోవడం విశేషం. పిల్లలకు ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు కూడా బీపీఎల్ నుంచి బయటకు వస్తారు. కానీ ఉద్యోగం పిల్లలది కాబట్టి తమకు ఉద్యోగం లేదని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇందులో అనేకమంది తాము పేదలమేనని, తమకు ఉద్యోగాలు లేవని అధికారులకు విన్నవించారు. కొందరు మాత్రం తప్పుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కార్డులు ఆగినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ కార్డులు కొనసాగించాలని వేడుకున్నారు. దీనిపై గందరగోళ పరిస్థితి తలెత్తడంతో వెంటనే ఆపేసిన కార్డులు పునరుద్ధరించి సరుకులు సరఫరా యధాతథంగా కొనసాగించి, తదుపరి చర్యలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా విచారణ కార్డులన్నింటినీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఉన్నతాధికారులు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసి విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి విచారణ చేయాలని మండల పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో గుర్తించాలని ఆదేశించారు. అంతా కలిసి ఉన్నారా? లేకుంటే వేర్వేరుగా ఉన్నారా? అన్నది విచారించాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొనడంతో ఆ విధంగా ముందుకెళ్లాలని జేసీ సూచించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కార్డుకు అర్హులవునో కాదో తేల్చాలి. ఈ మేరకు సర్వే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇంటిస్థలాలకు లబ్ధిదారులు, స్థలాల గుర్తింపు పనిలో బిజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికలు, ఇతర విధులు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు పూర్తయిన తర్వాత రేషన్‌కార్డులపై దృష్టి పెడతారని సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నా యో తేలిపోతుంది. అందులో తెల్లదొరలు బయటకు వస్తారు. విచారణ జరగాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా భావంచి ఆపేసిన తెల్లకార్డులను పదిరోజుల్లోనే పునరుద్ధరించాం. సరుకులు ఇస్తున్నాం. కానీ ఇందులో బోగస్ ఎన్ని అన్నది ప్రతి ఇంటికి వెళ్లి విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అందులో అనర్హులని తేలితే కార్డులు ఆపేస్తారు. – ఎ. పాపారావు, డీఎస్ఓ, విజయనగరం -
ఈకేవైసీ మరింత ఈజీ...
ప్రభుత్వం అందించే రేషన్ పారదర్శకంగా అందాలంటే... సరకులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే... ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలంటే... ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి. వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నందున వాటిని నమోదు చేసుకోవడం అనివార్యమైంది. దీనికోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రేషన్‌దుకాణాల్లో మరో నాలుగురోజులపాటు నమోదు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. విజయనగరం గంటస్తంభం: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై సరుకులు సరఫరా చేసున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు రేషన్‌డిపోలో బయోమెట్రిక్ వేసి సరుకులు తీసుకుంటున్నా రు. ఇకపై ఇంటింటికి సరుకులు సరఫరా చేయాలని... అంతేగాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సరుకులు అత్యంత పారదర్శకంగా పేదల కు సరఫరా చేసేందుకు ప్రతి లబ్ధి దారుడి వేలిముద్రలను ఈకేవైసీ ద్వా రా సేకరిస్తున్నారు. గతంలో ప్రజా సాధికార సర్వే సమయంలో ఈకేవైసీ చేశారు. కానీ అప్పట్లో కుటుంబంలో అందరూ వేలిముద్రలు నమోదు చేయించుకోలేదు. ఇప్పుడు వారందరూ నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం, పురపాలక వార్డులో రేషన్‌డిపోల్లో ఈకేవైసీ కార్యక్రమం చేపట్టారు. డీలర్ వద్ద ఉన్న ఈపాస్ యంత్రంలో నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయినా లబ్ధిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో ఒకటో తేదీ నాటికి 1,65,880మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా.. ఇంకా సుమారు లక్షమంది అవకాశాన్ని వినియోగించుకోలేదు. డీలర్ల వద్ద నమోదుకు అవకాశం.. వాస్తవానికి డీలర్ల వద్ద 16వ తేదీ నుంచి ఈకేవైసీ నమోదు చేయించుకునే వీలుండదు. వారు రేషన్ సరుకులు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. 16వ తేదీన ఈపాస్ యంత్రాన్ని అధికారులు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈకేవైసీ ముఖ్యమని «భావించిన అధికారులు రేషన్ డీలర్ల వద్ద ఈపాస్ యంత్రాల్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికైనా లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలనీ.. లేకుంటే సెప్టెంబరు నెలలో సరఫరా చేసే రేషన్ నిలుపుదల చేసే అవకాశం ఉందనీ అధికారులు చెబుతున్నారు. నాలుగైదు రోజులు పని చేస్తాయి.. రేషన్‌డీలర్లు ఈపాస్ యంత్రాల్లో ఈకేవైసీ నమోదుకు వీలుగా అవకాశం కల్పిం చాం. దానిని లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలి. ఈ అవకాశం నాలుగైదు రోజులు మాత్రమే ఉంటుంది. లబ్ధిదారులు వెంటనే స్పందించాలి. – ఎ.పాపారావు, డీఎస్వో, విజయనగరం -
బియ్యం తరుగు..
తొర్రూరు రూరల్(పాలకుర్తి): పేదలకు సరఫరా చేస్తు న్న బియ్యం తరుగు రేషన్ కార్డుదారులకు శాపంగా మారింది. ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు ప్రతినెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తోందిది. మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచి పంపిణీ బియ్యం బస్తాల్లో తక్కువ బరువు ఉంటోంది. క్వింటాల్‌పై దాదాపు ఐదారు కిలోల తరుగును భరించాల్సి వస్తోంది. ఈ ప్రభావం పరోక్షంగా రేషన్ కార్డుదారులపై పడుతోంది. జిల్లాలోని 553 రేషన్ దుకాణాల ద్వారా మొత్తం 44,726 క్వింటాళ్ల బియ్యాన్ని నెలనెలా పంపిణీ చేస్తున్నారు. 50 కిలోల బస్తాపై రెండు నుంచి మూడు కిలోల తరుగు ఉంటోందని రేషన్ డీలర్లు వాపోతున్నారు. జిల్లా మొత్తం రేషన్‌కార్డులకు సరఫరా చేసే బియ్యం కోటాపై 17.89క్వింటాళ్ల వరకు తరుగు ఉన్నట్లు తెలుస్తోంది. కార్డుదారులకు నష్టం... మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచే సరఫరా చేసే బియ్యం సంచుల్లో క్వింటాల్‌పై ఐదు కిలోల వరకు తరుగు ఉంటోందని డీలర్లు వాపోతున్నారు. కార్డుదారులకు అందించే బియ్యంలోనూ తరుగు తీస్తున్నారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిల్వ కేంద్రం నుంచి సరఫరా అయ్యే బియ్యంలో వచ్చే తరుగు ఎలా భరిస్తామంటూ కొందరు డీలర్లు బాహటంగానే గోడు వెల్లబోసుకుంటున్నారు. గోనె సంచితోనే తూకం... రేషన్ దుకాణాల ద్వారా తెలుపు రంగు కార్డుదారులకు సరఫరా చేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసరాల వస్తువుల పంపిణీలో తూకాల్లో మోసం జరుగుతోంది. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల్లో అవకతవకలకు తావు లేకుండా ఎలక్ట్రానిక్ కాంటా లను ఏర్పాటు చేసింది. తూకంలో హెచ్చుతగ్గులు లేకుండావీటిని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచే తరుగుతో వస్తున్న బియ్యాన్ని పంపిణీ చేయడంలో భాగంగా చాలామంది డీలర్లు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలపై గోనె సంచితో సహా బియ్యం తూకం వేస్తున్నారు. ఒక్కో కార్డుపై 30 కిలోల దాకా బియ్యం ఇస్తారు. అంటే కార్డుదారు దాదాపు కిలో వరకు కోల్పోవాల్సి వస్తోంది. కార్డుదారులు అందరికీ ఇలాగే తూకం వేసి పంపిణీ చేస్తే తరుగు కింద 17.89 క్వింటాళ్ల బియ్యం కోల్పోతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకం ఏది? రేషన్ డిపోల్లో సరుకుల తూకంలో డీలర్లు చేతివాటం ప్రదర్శించకుండా ఈ–పాస్ విధానం ప్రభుత్వం తీసుకువచ్చింది. డిపోల్లో బియ్యం తూకాన్ని పౌర సరఫరాల శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదవుతుంది. దీంతో తూకం ఏ మాత్రం తక్కువ వేయడానికి అవకాశం లేదు. ఇదే విధానం డిపోలకు సరుకులిచ్చే ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉండటం లేదన్నది డీలర్ల ఆవేదన. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద కాంటా యంత్రాలతో తూకం కాలయాపనతో కూడుకున్నదని భావిస్తున్నారు. ప్రతి కేంద్రానికి బియ్యం లోడైన వాహనంతో బరువును తూకం వేసే వేబ్రిడ్జి కాటాలను ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ యోచించింది. దానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు మోక్షం లేదు. సాధారణంగా బియ్యం ఎఫ్‌సీఐ గోదాంలలో బియ్యం ఐదారు నెలలు నిల్వ ఉంటుంది. ఈ కారణంగా అవి ఆరిపోయి కొంత తరుగు ఉండే అవకాశం ఉన్నా అది 50 కిలోల బస్తాకు 300 గ్రాములకు మించి ఉండదని అంటున్నారు. కానీ ప్రతి బస్తాకు రెండు కిలోల వరకు సగటున తరుగు ఉండటంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పంపిణీపై పకడ్బందీగా చర్యలు మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచే బియ్యం సంచుల్లో తరుగు వస్తున్నట్లు గమనిస్తే డీలర్లు మా దృష్టికి తీసుకురావాలి. అంతేకాకుండా నిత్యావసర సరుకులు తీసుకుని రేషన్ దుకాణం వద్ద బియ్యం తూకంలో తేడా వస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. మా దృష్టికి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి తరుగు లేకుండా బియ్యం పంపిణీ అయ్యేలా చూస్తాం. – జి.నర్సింగరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
రేషన్ డీలర్ల అర్ధనగ్న ప్రదర్శన
నిర్మల్అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నిర్మల్అర్బన్ తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట రేషన్‌డీలర్లు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక, డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా, రెచ్చగొట్టే విధానాలను అవలంభించడం సరికాదన్నారు. సంఘం నాయకులు రాజేందర్, గోపాల్‌దాస్, లింగన్న, రమణ, గంగాధర్, తదితరులున్నారు. సోన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రేషన్‌డీలర్లు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంతుల రాజేందర్, డీలర్లు దశరథ్, రామన్న, రాజు, గండయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంటి కాలిపై నిరసన.. లక్ష్మణచాంద: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాల రేషన్‌డీలర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఒంటి కాలిపై నిల్చొని నిరసనను తెలిపారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు ఓస మల్లయ్య, సభ్యులు మోహన్, రాజేశ్వర్, శ్రీనివాస్, రాజాగౌడ్, ప్రతాప్‌రెడ్డి , మరియా, తదితరులు పాల్గొన్నారు. -
డీలర్ల సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: నాయకోటి రాజు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా డీలర్ల ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మా సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరిస్తారనే ఇంత వరుకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నోటీసుల పేరుతో బయపెటడం సరి కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. గజ్వేల్ డీలర్ ఆత్మహత్య యత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా డీలర్‌ని పరామర్శించాడానికి వస్తున్నా తోటి డీలర్లను పోలీసులు అడ్డుకోవడం విచారకరం అని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు, డీలర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మల్లేశం గౌడ్, ప్రసాద్ గౌడ్, మురళి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై ఎల్ఈడీ బల్బులు
సాక్షి మెదక్ : బహిరంగ మార్కెట్లో రూ.120 ఉండే ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై రూ.65కే ప్రజలకు అందజేయనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. జిల్లా అంతటా రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ఎల్ఈడీ బల్బులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఎల్ఈడీ బల్బుల అమ్మకంపై కలెక్టర్ ధర్మరెడ్డి గురువారం మెదక్ పట్టణ రేషన్ డీలర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరకే ఎల్ఈడీ బల్బులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎల్ఈడీ బల్బుల వాడకంతో కరెంటు ఆదా, బల్బులు కింద పడినా పగిలే అవకాశం ఉండదని తెలిపారు. రేషన్‌డీలర్లు అమ్మే ప్రతి బల్బుకు రూ.5 కమిషన్‌గా వస్తుందన్నారు. డీలర్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రజలకు బలవంతంగా బల్బులను అమ్మవద్దని సూచించారు. పౌష్టికాహారం అందించాలి.. గర్భిణులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని కలెక్టర్ ధర్మారెడ్డి స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్లో స్త్రీ శివు సంక్షేమ శాఖపై కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా గర్భిణుల్లో పోషకాహార లోపం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 20 శాతం మంది గర్భిణుల్లో పౌష్టికాహార లోపం ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ ప్రాజెక్టు పరిధిలో 400 మందికిపైగా చిన్నారుల్లో తక్కువ బరువు కలిగి ఉన్నట్లు తెలిపారు. గర్భిణు లు, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందేలా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాబోయే నాలుగు మాసాల్లో తక్కువ బరువుతో పిల్లలకు ఉండకుండా చూడాలని అదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారి జోత్యపద్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో తనిఖీ మెదక్‌జోన్: మెదక్ ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులను ఎప్పటికప్పుడు భద్రపరుచుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట మెదక్ ఆర్డీఓ నగేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు. -
రేషన్ డీలర్ల పోరుబాట
సాక్షి, విజయవాడ : చౌకధరల దుకాణదారులు పోరుబాట పట్టనున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. తొలిదశలో తెల్లకార్డుదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. బకాయిల మాటేమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీలర్లకు ప్రభుత్వం రూ.80 కోట్ల బకాయిలు ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం సరఫరా చేస్తే దాని కమిషన్ ప్రభుత్వం చెల్లించట్లేదు. ఏడాదికాలంగా బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం విడుదలచేసి ఆర్థికంగా ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు. దుకాణాల వద్దకే ఉచితంగా సరకు రావాలి నిత్యావసర వస్తువులను గోదాము నుంచి రేషన్ దుకాణానికి ట్రాన్స్‌పోర్టు ద్వారా తెచ్చుకోవాలంటే డీలర్లకు రూ.వందల్లో ఖర్చు అవుతోంది. తగినంత ఆదాయం లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో బియ్యం, ఇతర సరకులను గోదాముల నుంచి రేషన్ దుకాణాల వరకు ఉచితంగా (డోర్ స్టెప్ ఫ్రీ డెలివరీ) సరఫరా చేయాలని డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ–పోస్ టెక్నీషియన్లను ఏర్పాటుచేయాలి డీలర్లకు సరకు ఇచ్చే ఎంఎల్ఎస్ పాయింట్లు (గోదాముల్లో) ఈ–పోస్ టెక్నీషియన్లు లేకపోవడంతో సరకు డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఈ–పోస్ మిషన్ మూడు నాలుగు గంటలు స్తంభించిపోతే సరకు తీసుకునేందుకు డీలర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్లు బాగుచేసే టెక్నీషియన్లను గోదాముల వద్ద అందుబాటులో ఉంచాలి. గౌరవ వేతనం మంజూరు ప్రస్తుతం బియ్యం మినహా ఇతర సరకుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో డీలర్లకు క్వింటా బియ్యానికి రూ.70 కమీషన్ సరిపోవట్లేదు. ఆ స్థానంలో ప్రతినెలా కనీసం రూ.15వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరుతున్నారు. మూడేళ్లుగా అభ్యర్థిస్తున్నా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించలేదు. ఇక రేషన్ డీలర్ల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందజేయాలి. రేషన్ డీలర్లపై అక్రమంగా బనాయిస్తున్న 6ఏ కేసుల వల్ల వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆ కేసులు సత్వరమే పరిష్కరించాలి. కారుణ్య నియామకాల ద్వారా చనిపోయిన రేషన్ డీలర్ల కుటుంబాలకు న్యాయం చేయాలి. ఆర్థికంగా ఆదుకోవాలి. చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం రుణంగా ఇప్పించాలి. ఈనెల నుంచే నిరసనలు గతనెల నుంచే నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. అయితే, క్రిస్మస్, సంక్రాంతికి ప్రభుత్వం ఇస్తున్న కానుక పేదలకు అందజేయాలని, జన్మభూమిలో భాగస్వామ్యం కావాలని వాయిదా వేశాం. గొల్లపూడిలోని రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం వద్ద కానీ, డీఎం ఆఫీసుల వద్ద కానీ త్వరలోనే నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కాగిత కొండ, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నం
- రేషన్ డీలర్లు అరెస్ట్ హైదరాబాద్: రేషన్ డీలర్లను ఉద్యోగులుగా గుర్తించి వారి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన రేషన్ డీలర్లను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి నివాస గృహమైన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడే రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్, ముదోల్, ఆసిఫాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, సూర్యాపేట, కోదాడ, సత్తుపల్లి, జనగామలో రేషన్ డీలర్లను ముందస్తుగా అరెస్ట్ చేయడంతో వారి ప్రయత్నం విఫలమైంది. -
రేషన్ డీలర్ల కోర్కెలకు సీఎం ఆమోదం
విజయవాడ : రేషన్ డీలర్ల కోరికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన అర్జీని సీఎంకు ఇచ్చామని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం బియ్యంపై కమీషన్ 20 పైసలు ఇస్తుండగా, దీనిని 40 పైసలకు పెంచారని, పంచదారకు 15 పైసలు కమీషన్ ఇస్తుండగా, రూపాయి చేశారని, కిరోసిన్‌కు 25పైసలుండగా, 50 పైసలకు పెంచినట్లు తెలిపారు. గోధుమలకు 13 పైసల కమీషన్ ఇస్తుండగా, దానిని రూపాయికి పెంచినట్లు వివరించారు. కార్డుదారుడి నుంచి యూజర్ చార్జి కింద రూ.10 తీసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రేషన్ షాపులకు కమర్శియల్ కింద కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుందని, దీనికి మినహాయింపు ఇచ్చి గృహ వినియోగదారుడు చెల్లించే టారీఫ్తోనే కరెంటు బిల్లు చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి: రేషన్ డీలర్లు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల కేంద్రంలో తహసీల్ధార్ కార్యలయం ఎదుట ఉద్యోగ భద్రత కల్పించాలని రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు. రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసిన క్రాంతికుమార్ నివేదికను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. డిమాండ్లు సాధించుకునేందుకు దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డీలర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రేషన్‌డీలర్ల జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవరావు, మండల నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు. (ఆసిఫాబాద్)