విజయవాడ : రేషన్ డీలర్ల కోరికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన అర్జీని సీఎంకు ఇచ్చామని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం బియ్యంపై కమీషన్ 20 పైసలు ఇస్తుండగా, దీనిని 40 పైసలకు పెంచారని, పంచదారకు 15 పైసలు కమీషన్ ఇస్తుండగా, రూపాయి చేశారని, కిరోసిన్‌కు 25పైసలుండగా, 50 పైసలకు పెంచినట్లు తెలిపారు. గోధుమలకు 13 పైసల కమీషన్ ఇస్తుండగా, దానిని రూపాయికి పెంచినట్లు వివరించారు.
కార్డుదారుడి నుంచి యూజర్ చార్జి కింద రూ.10 తీసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రేషన్ షాపులకు కమర్శియల్ కింద కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుందని, దీనికి మినహాయింపు ఇచ్చి గృహ వినియోగదారుడు చెల్లించే టారీఫ్‌తోనే కరెంటు బిల్లు చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.