Denduluru TDP MLA
-
చింతమనేని దాడి చేయలేదట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేసిందీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు తనపై ఉన్న కేసులు ఎత్తి వేయించుకున్న సంగతి తాజాగా వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహశీల్దార్ వనజాక్షిపై దాడి కేసు కూడా తప్పుడు కేసుగా తీసేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు కీలకమైన కేసులను తప్పుడు కేసులుగా చూపించి ఎత్తివేశారు. ఈ విషయాలన్నీ పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు చింతమనేని పరారీలో ఉండటంతో అతనిపై ఉన్న కేసులను పరిశీలిస్తున్న సమయంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారి ఈ కేసులను ఎత్తివేయించినట్లు సమాచారం. 2015 జూలై ఎనిమిదిన అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుక ర్యాంపు వద్ద తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. చింతమనేనినే వెనకేసుకు వచ్చారు. అయితే కనీసం ఫిర్యాదుదారునికి సమాచారం కూడా ఇవ్వకుండా కేసును తప్పుడు కేసు కింద చూపి ఈ ఏడాది ఫిబ్రవరి 15న తొలగించారు. డీఎస్పీ కేసును తప్పుడు కేసు కింద రిఫర్ చేసినప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు బాధితునికి కూడా నోటీసులు పంపుతుంది. ఈ ప్రక్రియ చేయకుండా కేసులను ఎత్తివేశారు. ఎన్నికల ముందు పెదవేగి మండలం లక్ష్మీపురంలో అక్రమంగా మట్టి తోలడాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత మేడికొండ కృష్ణారావు కేసును, దళిత మహిళను దూషించిన కేసును, గుండుగొలను వద్ద ఏఎస్ఐపై దాడి చేసిన కేసును, ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యంగా ప్రవేశించి నిందితులను తీసుకువెళ్లిన కేసులను కూడా తప్పుడు కేసులుగా రిఫర్ చేశారు. ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్‌పై 49 కేసులు నమోదు కాగా, అందులో 23 కేసులు రిఫర్ చేసి తీసివేశారు. ఈ కేసులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తొలగించడం విశేషం. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి: ఎస్పీ చింతమనేని అరాచకాలకు బలి అయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ కోరారు. శనివారం కూడా పలువురు బాధితులు ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాలలో తమ భూములను చింతమనేని, అతని అనుచరులు అక్రమించుకున్నారంటూ పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు చింతమనేని కేసులో సాక్షులు ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడంపై ఎస్పీ స్పందించారు. చింతమనేనిపై ఫిర్యాదు చేసిన జోసఫ్‌ను విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా కేసు విచారణ జరుగుతోందని, పోలీసులపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చింతమనేనిపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పేర్కొన్నారు. -
చింతమనేని చట్టాలకు అతీతుడా?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చట్టాలు వర్తించవా? వరుసగా ప్రజలు, అధికారులు, విపక్ష నేతలు, అధికార పార్టీ నేతలపై దాడులు చేస్తున్నా మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం తప్ప వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో చింతమనేని ప్రభాకర్ పెట్రేగిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూడు నెలల క్రితం దెందులూరుకు చెందిన దివ్యాంగుడు, అతని తల్లితండ్రులపై దాడి చేయగా కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదు. రెండున్నర నెలల క్రితం దళిత కార్మికుడు జాన్‌పై దాడి చేయగా, కేసు నమోదుచేయడానికి కూడా పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ ఆ కేసు ముందుకు కదలడం లేదు. ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఉన్నా కేసు అతనికి అప్పగించకపోవడంపై అఖిలపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి, డీజీపీ నుంచి సీఐ స్థాయి వరకూ అందరికీ నోటీసులు జారీ చేసింది. అయినా పోలీసుల్లో కదలిక రాలేదు. తాజాగా రెండురోజుల క్రితం వైఎస్సార్ సీపీకి చెందిన గార్లమడుగు మాజీ సర్పంచ్ మేడికొండ కృష్ణారావుపై కిడ్నాప్, హత్యాయత్నం కేసుల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏ–2గా పెట్టారు. నమోదు అయిన సెక్షన్లు నాన్‌బెయిలబుల్ అయినా ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్లలేదు. ఏకంగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు నమోదు అయినా ఆయన ఎస్పీ ఆఫీసుకు వచ్చి దర్జాగా వెళ్లిపోయారు. కనీసం చింతమనేని అనుచరులను కూడా అరెస్టు చేయలేదు. ఈ కేసులో చింతమనేని గన్‌మేన్ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇప్పటివరకూ అతడిని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. తొత్తులుగా ఇరిగేషన్ అధికారులు చాలాకాలం నుంచి పోలవరం కుడికాలువను యథేచ్ఛగా చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు తవ్వుకు పోతున్నా, దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినా ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావా ల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పోయింది. లక్ష్మీపురం వద్ద పోలవరం మట్టిని తవ్వుకుంటున్నారని గార్లమడుగు మాజీ సర్పంచ్ కృష్ణారావు స్వయంగా పోలవరం కుడికాలువ సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేస్తే మట్టితవ్వుకుపోతున్న వారిపై చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి ఎమ్మెల్యేకు సమాచారం అందించడం విమర్శలకు దారితీసింది. ఇరిగేషన్ అధికారుల సమాచారంతో అక్కడికి వచ్చిన చింతమనేని అనుచరులు కృష్ణారావును కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకువెళ్లి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ అబ్బయ్యచౌదరి ఎస్ఈని కలిసి బాధితునికి రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. సీఎం అక్షింతలు? వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే చింతమనేని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఎల్లోమీడియాలో లీకులు ఇచ్చారు. గార్లమడుగు మాజీ సర్పంచ్ మీద దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని చింతమనేనిపై మండిపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పునకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందని, ఆ విషయం చింతమనేనికి చెప్పాలని, ఒకటి రెండు రోజుల్లో చింతమనేనిని అమరావతికి పిలిపించి మాట్లాడతానని చంద్రబాబు అన్నట్టు సమాచారం. చట్టంలోని నిబంధల ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికైనా పోలీసులు చింతమనేనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి. -
తొక్కించేస్తా.. తొక్కేస్తా... చింతమనేని వీరంగం
ఓటర్లపై చింతమనేని చిందులు పెదపాడు : ‘ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా...’ అంటూ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. పెదపాడు శివారు కేఆర్ పాలెంలో ఆదివారం రాత్రి ప్రచారానికి వచ్చిన ఆయన దుర్భాషలాడటంతో ఓటర్లు నిర్ఘాంతపోయూరు. ఓట్లు అభ్యర్థించడం మానేసి ‘నాకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి గుంటూరు నుంచి వచ్చాడొకడు. వేరే చోటనుంచి తయూరయ్యూడు మరొకడు. వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి. ఓటును మాత్రం నాకే వేయం డి’ అంటూ చింతమనేని ప్రసంగిస్తుండగా.. ఇదేమిటని ఓ ఓటరు ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని ‘నాకే ఎదురు చెబుతావా. ఎవడ్రా నువ్వు.. నిన్ను తొక్కించేస్తా.. తొక్కేస్తా. ఎవరైనా ఎదురుతిరిగితే ఇదేగతి’ అంటూ చిం దులు తొక్కారు. ‘అలా అంటారేంటి బాబూ’ అని ఓ మహిళ ప్రశ్నించగా.. ‘నువ్వెవరు.. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా..’ అంటూ దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే చింతమనేని ఈ విధంగా మాట్లాడుతున్నారని మిగిలిన ఓటర్లంతా గుసగుసలాడుకోవడం కనిపించింది. మొత్తానికి చింతమనేని వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. -
టిడిపి ఎమ్మెల్యేపై మరో ఫిర్యాదు