Denmark player
-
French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు
పారిస్: రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన గ్రీస్ స్టార్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టాడు. సోవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 40వ ర్యాంకర్, డెన్మార్క్‌కు చెందిన 19 ఏళ్ల హోల్గర్ రూనె 7–5, 3–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో హోల్గర్ రూనె తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హోల్గర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సిట్సిపాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డెన్మార్క్ టీనేజర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేశాడు. రూడ్ ముందంజ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తమ ప్రత్యర్థులపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రూడ్ 6–2, 6–3, 3–6, 6–3తో 12వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి తన కెరీర్లో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... 11వ సీడ్ జాక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో రుబ్లెవ్ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయి రెండో సెట్‌ను 6–4తో నెగ్గి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో గాయం కారణంగా సినెర్ వైదొలిగాడు. ఈ గెలుపుతో రుబ్లెవ్ తన కెరీర్లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వెరోనిరా కుదుర్మెతోవా (రష్యా) 1–6, 6–3, 6–1తో 22వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ కసత్కినా (రష్యా) 6–2, 6–2తో కామిలా జార్జి (ఇటలీ)పై, 11వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 6–2, 6–3తో ఇరీనా బేగూ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..?
కోపెన్‌హెగెన్: ఆట శత్రువులను సైతం దగ్గరికి చేస్తుందనటానికి ఇప్పుడు మనం చూడబోయే వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. యూరోకప్ 2020 ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా ఫిన్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అపురూప ఘట్టం చోటు చేసుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన క్రీడా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయపడ్డాడు. గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎరిక్సన్ కెమెరా కంట పడకుండా డెన్మార్క్ ఆటగాళ్లంతా చుట్టూ రక్షణగా నిలిచారు. ఇది గమనించిన ఫిన్లాండ్ అభిమానులు తమ చేతుల్లోని జాతీయ జెండాలను డెన్మార్క్ ఆటగాళ్లకు ఇచ్చారు. Prayers for Christian Eriksen 🙏 Finland fans gave their flags after Christian Eriksen collapsed during the match 🇫🇮 Wishing him speedy recovery. pic.twitter.com/LZ3hSn4Gka — Nigel D'Souza (@Nigel__DSouza) June 12, 2021 వాటి సాయంలో డెన్మార్క్ క్రీడాకారులు ఎరిక్సన్ను మైదానం బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు దేశాల అభిమానులు క్రిస్టియన్ ఎరిక్సన్ పేరును స్మరిస్తూ.. హర్షధ్వానాలు చేశారు. కాగా, ఫిన్లాండ్ అభిమానులు చూపిన ఔదార్యం క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నిజమైన క్రీడా ప్రేమికులు తమ అభిమానాన్ని ఇలానే చాటుతారంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్ 1-0 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌లో ఫిన్లాండ్ ప్లేయర్ జోయెల్ పోజాన్పాలో గోల్ చేసి, తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. చదవండి: పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు! -
మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్
రోమ్: యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొపెన్‌హగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్లాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో అంతరాయం ఏర్పడింది. 42వ నిమిషంలో ఒక్కసారిగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియాన్ ఎరిక్సన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతన్ని వైద్య సబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. క్రిస్టియన్ కుప్పకూలడంతో మ్యాచ్‌ను రిఫరీలు రద్దుచేశారు. ఇక క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అతను స్పృహలోకి వచ్చాడని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిస్టియన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, క్రీడా ప్రముఖలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. చదవండి: ఇటలీ శుభారంభం -
రాకుమారుడు ఉన్నాడు
ఒక కప్పను ఓ యువరాణి ముద్దాడితే ఆ కప్ప అందాల రాకుమారుడిగా మారిపోయింది. పట్టరానంత సంతోషంతో రాణి మైమరచిపోయింది. ఇది కథ అని చాలామందికి తెలుసు. అప్పటినుంచి కూడా ‘ఒక రాకుమారుడిని పొందాలంటే ఎన్నో కప్పలను ముద్దాడాలి’ అనేది వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే మాటను తాప్సీ చెబుతున్నారు. ‘‘నా రాకుమారుడు దొరకడానికి నేను ఎన్నో కప్పలను ముద్దాడాను’’ అంటూ తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టారీ బ్యూటీ. అయితే ఆ రాకుమారుడి పేరు మాత్రం చెప్పలేదు. దాదాపు నాలుగైదేళ్లుగా డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పిన తాప్సీ, ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు అతను ఆ వృత్తి (ఓ క్రికెటర్‌తో తాప్సీ లవ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది)కి సంబంధించినవాడు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో ఎవరున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. అతను నటుడు కాదు.. క్రికెటర్ కాదు. అసలు ఇక్కడివాడు కాదు’’ అన్నారు తాప్సీ. ‘‘నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకే రోజులో పెళ్లి వేడుక ముగించేయాలనుకుంటున్నాను. పెళ్లి పేరుతో రోజుల తరబడి వేడుకలు చేసుకోవడం నాకిష్టం లేదు’’ అని కూడా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తప్పాడ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ‘షూటర్స్’ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా తీసిన ‘సాండ్ కీ ఆంఖ్’లో ప్రకాశీ పాత్ర చేశారు తాప్సీ. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుంది. -
ప్రతి బ్యాడ్మింటన్ టోర్నీ ఫిక్సయ్యేదే..
డెన్మార్క్ ఆటగాడు విట్టింగస్ ఆరోపణ సింగపూర్: బ్యాడ్మింటన్‌లో దాదాపు ప్రతీ టోర్నమెంట్లోనూ ఫిక్సింగ్ జరుగుతుంటుందని డెన్మార్క్ ఆటగాడు హన్స్ క్రిస్టియాన్ విట్టింగస్ సంచలన ఆరోపణలు చేశాడు. కచ్చితంగా కొన్ని ఈవెంట్స్ ముందే రిగ్గింగ్ అవుతాయని చెప్పాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ అయిన విట్టింగస్ను గతేడాది ఓ మలేసియన్ ఫిక్సింగ్ కోసం సంప్రదించాడు. ‘బ్యాడ్మింటన్‌లో డబ్బు ప్రవాహం పెరిగింది. ఓరకంగా ఇది మంచి విషయమే అయినా అదే డబ్బు మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు కూడా ఉసిగొల్పుతోంది. నేనైతే మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతుందని కచ్చితంగా చెప్పగలను. లేదు అని ఎవరైనా అంటే అది వారి అమాయకత్వమే. అందుకే ఏ టోర్నీ కూడా స్వచ్ఛంగా లేదు. ఆధునిక యుగంలో మనం జీవిస్తున్నాం. ఇంటర్నెట్ ద్వారా కూడా ఇది వ్యాపించగలదు’ అని విట్టింగస్ అన్నాడు. గతేడాది జపాన్ ఓపెన్ సందర్భంగా ఫిక్సింగ్ కోసం ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా తనను సంప్రదించాడని చెప్పాడు. అదే ఏడాది జరిగిన సింగపూర్ ఓపెన్, థామస్ కప్‌ల్లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయాల్సిందిగా కోరాడని తెలిపాడు. విట్టింగస్ సహచరులు డేన్, కిమ్ అస్ట్రప్లను కూడా ఇలాగే సంప్రదించిన బుకీలు వేల డాలర్లను ఇవ్వజూపారు. అయితే వీరంతా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్యకు ఫిర్యాదు చేశారు.