Department officials
-
టపాసుల దందాలో.. ఫైర్ అధికారులకు సపరేటు!
సాక్షి,అనంతపురం : అనంతపురంలోని తిలక్‌రోడ్డులో ఈ నెల 3న వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐ సాగర్ ఆధ్వర్యంలో పలు షాపుపై దాడులు నిర్వహించారు. నందకిశోర్ అనే వ్యక్తి కిరాణాషాపులో టపాసులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రూ. 62వేలు విలువ జేసే టపాసులు సీజ్ చేశారు. సదరు దుకాణం రద్దీ ప్రాంతంలోనే కాకుండా ఇళ్ల మద్య ఉంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిన చుట్టూ నాలుగైదు ఇళ్లకు ప్రభావం చూపే అవకాశముంది. గతేడాది దీపావళి పండగకు జిల్లా కేంద్రంలో దాదాపు 123 షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి 185 దరఖాస్తులు వచ్చినా కొంతమంది తప్పుకోవడంతో 123 మంది ముందుకువచ్చారు. వీరు షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అగ్నిమాపకశాఖ అధికారులకు ఒక్కొక్కరు రూ. 5వేలు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన గతేడాది అగ్నిమాపకశాఖ అధికారులకు మూడు రోజుల షాపులకు రూ.6.15 లక్షల అక్రమ ఆదాయం పొందారు. గతేడాది మాత్రమే కాదు కొన్నేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఈసారి రూ. 5వేలు ‘రేటు’ పెంచాలనే యోచనలో ఆ శాఖ ఉన్నట్లు సమాచారం. అనంతపురం సెంట్రల్: టపా(కా)సులదందాలో ప్రతి ప్రభుత్వశాఖకూ ఉన్నట్లుగానే అగ్నిమాపకశాఖ అధికారులకూ ఓ రేటు ఉంది. వారి ముడుపులు వారికి ముట్టిన తర్వాతనే టపాసుల వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. అయితే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ముందు వరుసలో ఉండగా అగ్నిమాపకశాఖ అధికారులు మాత్రం చివరి వరుసలో ఉంటారు. అంతే తప్ప మిగతా దందా సేమ్ టూ సేమ్. జిల్లాలో ప్రతి ఏటా సాగుతున్న రూ.వందల కోట్ల చీకటి వ్యాపారం పేదల్లో ఏమో కానీ అధికారుల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపుతోంది. అక్రమ వ్యాపారాన్ని సక్రమం చేసే పనిలో భాగంగా భాగస్వామ్య ప్రభుత్వశాఖలకు ముడుపులు భారీగా ముడుతున్నాయి. ఇందులో సింహభాగం కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖలకు వెళ్తుండగా చివరిలో అగ్నిమాపకశాఖ అధికారులు తమ వాటా లెక్కలేసుకొని మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నింబంధనల ఉల్లంఘనలకే వాటాలు ప్రతి వ్యాపారంలోనూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాతనే లావాదేవీలు ప్రారంభించాలి. కానీ టపాసుల వ్యాపారం మొత్తం ‘జీరో’తో మొదలవుతోంది. తమిళనాడులో శివకాశి నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా జిల్లాకు అక్రమ మార్గంలో తీసుకొస్తున్నారు. ఆదివారం టీఎన్–67 ఏబీ 1103 లారీలో తమిళనాడు నుంచి అక్రమంగా (ఎలాంటి బిల్లులు లేకుండా) ధర్మవరం, ముదిగుబ్బ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.50 లక్షలకు పైగా విలువైన టపాసులు తీసుకొస్తుండగా ధర్మవరం పోలీసులకు పట్టుబడ్డారు. ప్రభుత్వానికి టోకరా వేసి టపాసులు ఏ విధంగా జిల్లాకు వస్తాయని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. వాస్తవానికి ఇలాంటి వాటిపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దృష్టి పెట్టాలి. అయితే జిల్లాలో టపాసుల వ్యాపారం ఎవరు చేస్తారు? ఎక్కడ నిల్వ ఉంచుతారు అనే విషయాలు అన్ని తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వారిపై వినిపిస్తున్నాయి. తిరిగి వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించే సమయంలో సదరు అధికారులకు భారీగా ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మామూళ్లకు తలొగ్గి అనుమతులు సాధారణంగా టపాసులను ఊరి బయట నిల్వ ఉంచాలి. అయితే నిర్మానుష్య ప్రదేశంలో టపాసుల గోడౌన్ ఏర్పాటు చేస్తే అందరికీ తెలిసే అవకాశముంది. దీంతో ఎక్కువశాతం పట్టణ ప్రాంతాల్లో జనావాసాల మధ్యనే నిల్వ ఉంచుతున్నారు. నగరంలో తిలక్‌రోడ్డులో నందకుమార్ అనే వ్యక్తి రూ.లక్షలు విలువ జేసే సరుకును నిల్వ ఉంచుకొనడంతో పాటు విక్రయాలు చేస్తున్నా అగ్నిమాపకశాఖ అధికారులకు కనీస సమాచారం లేదు. జనసంచార ప్రాంతాల్లో నిల్వ ఉంచితే చర్యలు తీసుకోవాల్సింది అగ్నిమాపకశాఖ అధికారులే. కానీ ఇవేమీ పట్టించుకోకుండా అగ్నిమాపకశాఖ అధికారులు ఉన్నారంటే ఏ స్థాయిలో ముడుపులు వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీపావళి పండుగ రోజు ఏర్పాటు చేసే దుకాణాల వద్ద ఏ మాత్రం నిబంధనలు పాటించకపోయినా మామూళ్లకు తలొగ్గి అనుమతులు మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి ఒక షాపు నుంచి మరో షాప్‌కు మధ్య కనీసం 10 అడుగులు దూరం ఉండాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే ఆర్పి వేసేందుకు డ్రమ్ములో సిద్ధంగా నీళ్లు, ఇసుక, ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటు ఉంచుకోవాలి. ఇవేమీ ‘అనంత’లో కనిపించవు. తిరుణాళ్లలో అంగళ్ల తరహాలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఒకషాపులో ప్రమాదం జరిగిదే మొత్తం కాలిపోయే ప్రమాదముంది. ఈ నిబంధనలను తుంగలోకి తొక్కేందుకు వ్యాపారస్తులు ముందే ముడపులు ముట్టజెప్పుతుండడంతో అగ్నిమాపకశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
అటకట్టు
రేషన్ డీలర్ల అక్రమాలపై కొరడా ఎట్టకేలకు రేషన్ డీలర్ల అక్రమాలకు ‘చెక్’ పడుతోంది. నెల నుంచి దుకాణాలపై వరుస విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. ‘రేషన్’ అక్రమాలపై ‘సాక్షి’ చేసిన అక్షర సమరాన్ని తప్పు పడుతూ ఖండించిన అధికారులే నేడు అవే కథనాల ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల తీరును వివరిస్తూ మేలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సరిగ్గా ‘సాక్షి’ ఎత్తి చూపిన అంశాలపైనే దృష్టి సారించిన జేసీ వెంకట్రామిరెడ్డి సారథ్యంలోని ప్రత్యేక బృందాలు... డీలర్ల ఆట కట్టిస్తున్నాయి. - 13 మందిపై వేటు.. కేసులు నమోదు - 3 బియ్యం మిల్లుల సీజ్.. రూ 6 కోట్ల బియ్యం స్వాధీనం - ఎల్ఎమ్మెస్ పాయింట్ ఇన్చార్జి సస్పెన్షన్‌కు సిఫారసు - ‘సాక్షి’ సాగించిన అక్షర సమరం ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ దోపిడీ కట్టడికి ఆ శాఖ అధికారులు కార్యోన్ముఖులయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి లక్షలు గడిస్తున్న వారి పని పట్టేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకునే వీలు లేకుండా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడులు చేసి పట్టుకుంటున్నారు. పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ నెల రోజులుగా దాడులు ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నారు. నిత్యావసర సరుకులను నల్లబజారుకు తరలించడం, దుకాణాలు సమయపాలన పాటించకపోవడం, రికార్డుల్లో లబ్ధిదారుల సంతకం లేకపోవడం వంటి అభియోగాల మీద రేషన్ డీలర్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. 13 మంది డీలర్లు సస్పెన్షన్ రేషన్ డీలర్ల అక్రమాలు జిల్లాలో వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు డీలర్లు కోట్లకు పడగలెత్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటువంటి డీలర్లపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. నెల రోజులుగా దాడులు చేస్తున్న అధికారులు... జిల్లా వ్యాప్తంగా పటాన్చెరు, నారాయణఖేడ్, కంగ్టీ, కల్హేర్, కంది, ఆందోల్, దుబ్బాక మండలాల్లో ఒక్కొక్క డీలర్ చొప్పున, తూప్రాన్‌లో ఇద్దరు డీలర్లను సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా బియ్యం కొనుగోలు చేసి రవాణా చేస్తున్న ఇద్దరిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనికి సహరిస్తున్న సిద్దిపేటలోని మూడు రైస్ మిల్లులను సివిల్ సప్లై శాఖ అధికారులు సీజ్ చేశారు. వీటిల్లోని దాదాపు రూ 6.5 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ ఎల్ఎమ్మెస్ పాయింట్లో డీలర్లకు బియ్యం తక్కువగా ఇచ్చినట్టు, ఇక్కడ ఇన్చార్జి ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించి, అతని సస్పెషన్ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. దాడులు పెరగాలి... జిల్లాలో వేళ్లూనుకుపోయిన రేషన్ అక్రమాలను కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే ప్రస్తుతం జరుగుతున్న దాడులు సరిపోవని ప్రజలు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. జిల్లాలో దాదాపు 1860 దుకాణాలుండగా కేవలం మూడు ప్రత్యేక బృందాలు మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. నల్లగొండ జిల్లా తరహాలో సివిల్ సప్లై శాఖలలో దోపిడీని నిరోధించడానికి పోలీసులతో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని కోరుతున్నారు. -
‘సబల’ నిధులు స్వాహా..!
ఐసీడీఎస్‌లో మరో అక్రమం ⇒ రూ.75 లక్షలు ఖజానా నుంచి అడ్వాన్స్ గా డ్రా ⇒ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే..! ⇒ కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించిన వైనం ⇒ సబల నిలిపివేతతో నిధుల కైంకర్యానికి పన్నాగం ఆదిలాబాద్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మరో భారీ అక్రమం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ సీడీపీవో లక్షల నిధుల స్వాహా వ్యవహారం మరువక ముందే.. తాజాగా ఈ వ్యవహారాన్నే తలదన్నేలా మరోటి చోటుచేసుకుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి పొందకుండానే ట్రెజరీ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సబల పథకానికి సంబంధించిన రూ.75 లక్షలు అడ్వాన్స్‌గా డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం నిలిచిపోతుందని ముందుగానే తెలిసిన శాఖలోని పలువురు అధికారులు.. ఈ నిధులను తమ కమీషన్ల కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక పథకం నిధులు మరో పథకానికి మళ్లించొద్దని నిబంధనలున్నా.. అధికారులు తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతిలేకుండానే.. ఐసీడీఎస్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి కొనుగోలుకు సం బంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ అనుమతి పొంది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో సబల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతినెలా కిశోర బాలికలకు 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె సరుకులను అందజేస్తారు. కాగా.. గత మార్చిలో రూ.75 లక్షలు ఐసీడీఎస్ అధికారులు ట్రెజరీ నుంచి అడ్వాన్స్‌గా డ్రా చేశారు. నూనె కొనుగోలు కోసం రూ.75 లక్షలు డ్రా కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రతిపాదించారు. కలెక్టర్ అనుమతితో ఆ నిధులను డ్రా చేశారు. అయితే.. ఇప్పటి వరకు నూనె కొనుగోలు కోసం ఏపీ ఆయిల్ ఫెడ్‌కు చెల్లించకపోవడం గమనార్హం. ఆ నిధులను అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం అధికారులపై ఇందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కోడిగుడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబల నిధులను కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించాలనే యత్నాలు ఏ విధంగా సబబన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలకు భారీగా కమీషన్లు ముడుతుండడంతోనే ఈ నిధులు మళ్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయం అధికారులు దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అడ్వాన్స్‌గా డ్రా చేసిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు ప్రతిపాదించిన దానిలో నూనె కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఆ నిధులను తమ కమీషన్ల కక్కుర్తి కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు చెల్లించాలని చూడ్డం విస్తుకలిగిస్తోంది. ఐసీడీఎస్‌కు చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌నే ఈ వ్యవహారంలో ఐసీడీఎస్ అధికారులు తప్పుతోవ పట్టించారు. ఇప్పుడు ఆ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమంటే కలెక్టర్ వరకు వ్యవహారం వెళ్తుందని వారిలో గుబులు మొదలైంది. సబల నిలిపివేత.. సబల పథకం నిలిపివేస్తున్నట్లు మే 5న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ పథకాన్ని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేస్తుండగా తాజాగా నిలిపివేశారు. కిశోర బాలికలకు ప్రతినెలా 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె, 16 కోడిగుడ్లను అందజేసేవారు. ప్రతి లబ్ధిదారుడికి రోజూ రూ.5 విలువైన సరుకులను నెల కోసం అందిస్తారు. 11 నుంచి 18 ఏళ్ల వయసుగల బడిబయట పిల్లలు సుమారు 1.23 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని నిలిపివేశారు. పథకం నిలిచిపోతుందని తెలిసే జిల్లా యంత్రాంగాన్నే తప్పుతోవ పట్టించి పీడీ కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులను అడ్వాన్స్‌గా డ్రా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ‘సాక్షి’ వివరణ కోరగా మార్చి నెలలో సబలకు సంబంధించిన రూ.75.76 లక్షలను నూనె కొనుగోలు కోసం ట్రెజరీ నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. వీటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని చెప్పడం కొసమెరుపు. -
మిషన్ స్పీడ్ పెంచాల్సిందే
బోయినపల్లి : జిల్లాలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది 1188 చెరువులు అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు లక్ష్యం విధించుకోగా ఇప్పటివరకు 355 చెరువుల్లో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభంలోపు పనులు పూర్తికావాల్సి ఉండగా కొన్ని చెరువుల అంచనాలే పూర్తి కాలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం జిల్లాలో 1088 చెరువుల సర్వే పూర్తికాగా, 571 చెరువులకు టెండర్లు పిలిచారు. వీటిలో ఆర్ఆర్ఆర్ (రిజిస్ట్రేషన్, రెనోవేషన్) పథకం చెరువులు 113 ఉన్నాయి. మరో నెలన్నర, రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఇంకా 733 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.262 కోట్లతో 721 చెరువులకు పరిపాలన అనుమతి లభించింది. పరిపాలన అనుమతి పొందిన చెరువుల ఆయకట్టు 71,158 ఎకరాలు. ఇందులో 571 చెరువులకు అధికారులు టెండర్లు పిలిచారు. అంచనాలు పూర్తయి రూ.376 కోట్లతో 933 చెరువులు సీఈ ఆమోదం కోసం ఉన్నాయి. వీటి ఆయకట్టు లక్షా 8 వేల ఎకరాలు. ఇందులో ఆర్ఆర్ఆర్ పథకం కింద 60 చెరువు పనులు ఉన్నాయి. ఇంకా జిల్లాలో దాదాపు 319 చెరువులకు అధికారులు టెండర్లు పిలవాల్సి ఉంది. తీసిన పూడిక 6 లక్షల క్యూబిక్ మీటర్లపైనే... జిల్లాలో ఇప్పటివరకు పనులు ప్రారంభించిన 355 చెరువులనుంచి ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టిని తీశారు. ఈ మట్టిని కొంతమంది రైతులు పొలా ల్లో పోసుకోగా, కొన్ని చోట్ల ఇటుక బట్టీలకు, మరికొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారు. చెరువు పనుల కోసం జిల్లాలో కొత్తగా 50 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను అధికారులు నియమించారు. వీరు నిత్యం చెరువుల పూడికతీత జరుగుతున్న ప్రదేశాల్లో సర్వే పనులు, క్షేత్రస్థారుులో పనుల పరిశీలన చేపడుతున్నా రు. పనులు ఇలాగే ఆలస్యమైతే వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తవడం కష్టం కావడంతో పనులు వేగవంతం చేయూలని నీటిపారుదల శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కష్టమవుతున్న సర్వే జిల్లాలో అధికారులు గుర్తించిన చెరువుల్లో సర్వే చేసి అంచనాలు తయారు చేయడానికి అధికారులకు చాలా సమయం పట్టినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ముళ్ల చెట్లు, పిచ్చిచెట్లతో చెరువుల్లో కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. అటువంటి చెరువులను గుర్తించి వాటిలో ఉన్న ముళ్ల, పిచ్చి చెట్లలో సర్వే చేసే సరికి అధికారులకు తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది. పూడిక మట్టిపై అవగాహన కరువు జిల్లాలోని చెరువుల నుంచి తీస్తున్న పూడిక మట్టి సారవంతమైనదని ఇక్రిశాట్ వారు గుర్తించారని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ ఈ నెల 10న కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మిషన్ కాకతీయ అమలు, పర్యవేక్షణ కమిటీ సమీక్షలో వెల్లడించారు. రైతులు చెరువుల పూడిక మట్టి తీసుకునేలా 2 లక్షల కరపత్రాలు ముద్రించి ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు, ఎంపీడీవోలు, ఏఈలు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. పూడిక మట్టి వేస్తే నేల సారవంతమవుతుంది. కానీ, చాలా చోట్ల రైతులు ఈ మట్టిని పొలాల్లోకి తరలించుకోవడం లేదు. -
పకడ్బందీగా ‘ఓపెన్’ పరీక్షలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 16 నుంచి 25 వరకు జరగనున్న ఓపెన్‌స్కూల్ ఇంటర్, పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఈఓ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 10,935 మంది హాజరుకానున్నారని, ఇందులో 8,791 మంది రెగ్యులర్, 2,144 మంది సప్లిమెంటరీ రాస్తున్నారని తెలిపారు. వీరికోసం 31 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 31 చీఫ్ సూపరింటెండెంట్లు, 56మంది డీఓలు, అదనపు డీఓలు, 12 కస్టోడియన్స్, 550 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వెల్లడించారు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 27 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 6,862 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఇందులో 6,034 మంది రెగ్యులర్, 828 మంది సప్లమెంటరీ రాస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 27 చీఫ్ సూపరింటెండెంట్లు, 28 డీఓలు, 15 కస్టోడియన్స్, 350 మంది ఇన్విజిలేటర్లు, 4 స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్లలో హాల్‌టికెట్లు తీసుకోవాలని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి 1.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్ష లు ఉంటాయని తెలిపారు. 15 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని చెప్పారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్ గౌరిశంకర్, ఓపెనర్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
నేటినుంచి పదో తరగతి పరీక్షలు
సమయం : ఉ.9.30 - మ.12 వరకు రెగ్యులర్ విద్యార్థులు : 52,500 మంది ప్రైవేటు విద్యార్థులు :7,800 మంది పరీక్ష కేంద్రాలు : 296 ఇబ్బందులుంటే కాల్ చేయండి : 92911 06999 మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 11వ తేదీతో ముగిసే ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని డీఈవో డి.దేవానందరెడ్డి చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి తొమ్మిది గంటల నుంచి అనుమతిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్‌గా 52,500 మంది, ప్రైవేటుగా 7,800 మంది.. మొత్తం 60,300 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు కేంద్రాలను పర్యవేక్షిస్తారు. 3,500 మంది ఇన్విజిలేటర్లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 25 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులుంటే తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ 24 గంటలపాటు పనిచేస్తుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే 9291106999 నంబరుకు కాల్ చేయాలని డీఈవో కోరారు. ఇప్పటికే వచ్చిన ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు దగ్గరలోని పోలీస్స్టేషన్లకు తరలించామని, రూట్ ఆఫీసర్ల ద్వారా కేంద్రాలకు తీసుకువెళతామని పేర్కొన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్రాల్లో విద్యుత్‌కోత లేకుండా ఆ శాఖ అధికారులతో మాట్లాడామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సులను సకాలంలో నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కేంద్రాల్లో బల్లలు ఏర్పా టు చేశామన్నారు. ఇలా చేయండి... పరీక్షల సమయంలో ఒంటిరిగా కాకుండా మీకు నచ్చిన తోటి విద్యార్థులతో కలిసి చదువుకోండి. బాతాఖానీలు పెట్టకుండా చదివితే అనుమానాలు నివృత్తి అవుతాయి. పరీక్ష బలంగా రాసే ధైర్యం వస్తుంది. బాగా కష్టమైన ప్రశ్నలను ఒకటికి నాలుగుసార్లు చదువుకుని చిత్తుపుస్తకంలో రాసుకోండి. క్షణాల్లో మీకు జవాబు వచ్చేస్తుంది. ఇవి తీసుకెళ్లండి.. నిర్ణీత సమయానికంటే ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. హాల్‌టికెట్ మరవకూడదు. పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్, స్కెచ్ పెన్నులు తీసుకెళ్లాలి.