deraiksan
-
పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! 10 డేస్...10 స్టోరీస్...10 మినిట్స్... ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! రేపటి నుంచి వరుసగా 10 రోజుల పాటు మీకు రోజుకో కథ చెబుతా. దానికి మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు.వాళ్లతోనే షూట్ చేయండి. నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌నిdirectorsakshi@gmail.ఛిౌఝ కి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా... లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బహుమతులు అందించేవారు... -
యాపారం
చెట్టూ పుట్టా, వ్యర్ధం, వ్యసనం, చిన్నా, పెద్దా దేన్నైనా ఎకనామిక్ ఐతో చూడటం మనిషికి ఎప్పట్నుంచో అలవాటు. ఇప్పుడా కన్ను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్స్ మీద పడింది. మొదట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్లాంటి ఇంటర్ఫేస్లతో పాటు చిన్నా చితకా ఆప్స్ ఫోన్లతో నిక్షిప్తం అయి వచ్చేవి. కాని ఇప్పుడు ఆప్స్ ఉండే ఓఎస్‌కే ఆదరణ లభిస్తుంది. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. 19 బిలియన్స్లకి అమ్ముడు పోయినే వాట్సాపే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఆ ఊపులో మన నగర విద్యార్థులు కూడా ఇ-కామ్ ఆప్స్ తయారీలో చొరవ చూపించి విజయవంతమయ్యారు. అందులో విజయవంతమైన ఓ ఆప్ గురించి... ‘‘..... ఖార్ఖానా బస్టాప్ వచ్చి, మాయా బజార్ హోటల్ గల్లీలో నాలుగో రైట్ నుండి మూడో లెఫ్ట్, పచ్చ రంగు గేటు, దాని మీద ఏపుగా మనీ ప్లాంట్ పెరిగి ఉంటుంది. అదే మా ఇల్లు’’ ఇలా తన అడ్రస్ చెప్పాడొకడు విదేశాల నుండి వచ్చిన తన మిత్రుడికి. ఆ అడ్రస్ ఆనవాళ్లను పట్టుకొని, ఆ మనీ ప్లాంట్ మొదళ్లని చేరుకునే సరికి ఆ విదేశీ ఆసామి వీసా కాస్తా ఆవిరైపోతుంది. ఇలా ఈ తంటాలేవి చెప్పినా అడ్రస్ని అర్థం చేసుకుని, అవతల వ్యక్తికి డెరైక్షన్‌తో కూడిన మ్యాప్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా! అచ్చం ఇలాంటి ఆలోచనే 2011లో ఆదిత్యా పుచి అనే వ్యక్తికి వచ్చింది. అలా ఏర్పడిందే ఈ జిప్పర్ అనే ఆప్. ‘‘స్వతహాగా వైద్యులు అయిన మా నాన్నగారు పేషెంట్లకు మా క్లినిక్‌కి దారి చెబుతుండగా పడ్డ ప్రయాసల నుండి పుట్టింది ఈ జిప్పర్ ఐడియా’’ అని అంటారు 34 ఏళ్ల ఆప్ ఎంటర్ప్రెన్యూర్ ఆదిత్య. హైదరాబాద్ వాస్తవ్యులైన ఆదిత్య స్కూలింగ్ అంతా హెచ్.పి.ఎస్.లోను తరువాత ఇంజినీరింగ్‌ని సి.బి.ఐ.టి.లో పూర్తి చేశారు. 2002లో పై చదువులకు యూఎస్ వెళ్లి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసి సిలికాన్ వ్యాలీలో ఎక్స్‌పోనెన్షియల్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తరువాత 7 ఏళ్లకి కంపెనీ పనుల మీద తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు ఆదిత్య. ‘‘మన దేశానికి, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇళ్లు - రోడ్ల నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉండి, ఒకసారి తిరిగి చూస్తే లే అవుట్ అంతా గుర్తుండిపోతుంది. కాని మన దేశంలో రోడ్డు వ్యవస్థ సంక్లిష్టంగా, తిరిగే దూరం తక్కువే ఉన్నా చిన్న చిన్న సందులు, మలుపుల వల్ల ఎంతో కన్ఫ్యూజన్.’’ ఇది తిరిగి భారత దేశానికి వచ్చిన ఆదిత్యా మదిలో మెదిలిన ఆలోచన. ఈ ఆలోచనతో 2011లో ఆప్ పనులు మొదలు పెట్టాడు. అప్పటికే ‘మింట్ మీడియా’ అనే ఆన్లైన్ సైట్ నడుపుతున్న అనుభవంతో ఆప్ రూపకల్పన మొదలైంది. కోటి రూపాయల బడ్జెట్‌తో తన కంపెనీలో పనిచేస్తున్న స్నేహితులతో జిప్పర్‌ని రూపొందించి 2013 జూన్న విడుదల చేశారు. ఏం చేస్తుందీ జిప్పర్: ఈ ఆప్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కాని, ఏదైనా ప్రదేశం తాలూకు లొకేషన్‌కి ఒక జిప్పర్ కోడ్‌ని క్రియేట్ చేయొచ్చు. తరువాత మీ అడ్రస్ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినపుడు, ఆ వ్యక్తికి మీ జిప్పర్ కోడ్‌ని ఎస్.ఎమ్.ఎస్. ద్వారా పంపిస్తే చాలు. సదురు వ్యక్తి కోడ్‌ని జిప్పర్లో ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి ఉన్న మ్యాప్ అతని ఫోన్లో ప్రత్యక్షం అవుతుంది. 108తో ఒప్పందం: ఈ ఆప్‌ని మొదలు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ‘అంబులెన్స్ సేవలకు మెరుగైన సేవలు అందించడం’ అని అంటారు ఆదిత్య. జిప్పర్, 108 జీవీకె సేవలతో గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. ‘‘ఈ రెండేళ్లలో ఎంతో కొంత సాధించామనే అనుకుంటున్నాం. 108తో ఒప్పందం ఒక పెద్ద అచీవ్మెంట్. కోటి రూపాయల బడ్జెట్‌తో మొదలై ఇపుడు లక్షల సెల్ఫోన్స్లలో మా ఆప్ తన సేవలని అందిస్తోంది. మన రాష్ట్రానికి పరిమితం అయిన జిప్పర్‌ని ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపచేసే పనిలో ఉన్నాం’’ అని అంటున్న ఆదిత్య యాపారం ఇది. - జాయ్ ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. -
రజనీకాంత్‌ని హీరోగా అందరూ వద్దన్నారు!
చెన్నైలోని మైలాపూర్ ప్రాంతం. ఓ ఇరుకు సందులో... ఓ పాతకాలం డాబాలో... రెండు గదుల పోర్షన్. బయట నిలబడ్డ ఓ పెద్దాయన ‘‘నేనే ఈరంకి శర్మని. మీరేగా నా కోసం వచ్చింది’’ అని మమ్మల్ని లోపలకు తీసుకువెళ్లారు. ఆయనకు 92 ఏళ్లంటే అస్సలు నమ్మ బుద్ధేయదు. స్ప్రింగ్‌లా అటూ ఇటూ తిరుగుతూ, నాన్‌స్టాప్‌గా కబుర్లు చెబుతూనే ఉన్నారాయన. ‘‘చాలా చిత్రంగా ఉందే. మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడం! నాలాంటి దర్శకుణ్ణి ఇంకా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారంటారా? చిత్ర పరిశ్రమ వాళ్లకే నేను బతికున్నానో లేదో తెలీదు’’ అన్నారాయన. ఆ మాటల్లో నిర్వేదం ఎక్కడా లేదు. సమాజం వాస్తవ పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. డబ్బుతోటీ విజయాలతోటీ ఇక్కడ మనుషుల్ని కొలుస్తారని ఆయనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిక్ట్సీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. రజనీకాంత్‌ని ‘చిలకమ్మ చెప్పింది’తో తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. జయప్రద ‘అంతులేని కథ’ చేయడానికి ముఖ్య కారకుడు ఆయనే. చిరంజీవితో ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘సీతాదేవి’ లాంటి సినిమాలు చేసింది ఆయనే. చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ, అన్నీ గుర్తుండిపోయేవే. ఇప్పటికీ విశ్రాంతి అనేది లేకుండా పని చేస్తున్న 92 ఏళ్ల యువకుడు ఈరంకి పురుషోత్తమశర్మ జీవన ప్రవాహంలోని కొన్ని కెరటాలు ఆయన మాటల్లోనే..! ఆఫీస్ అసిస్టెంట్ నుంచి డెరైక్షన్ వైపు! మాది మచిలీపట్నం. మా నాన్నగారు వెంకటశాస్త్రి చిత్రకళలో ఉద్దండులు. ప్రముఖ సినీ కళాదర్శకులు టీవీయస్ శర్మ, ఎస్వీయస్ రామారావు, గోఖలే, వాలి, తోట తదితరులంతా మా నాన్నగారి శిష్యులే. మా అన్నయ్య ఈరంకి గోపాలకృష్ణమూర్తి పేరొందిన పబ్లిసిటీ ఆర్టిస్ట్. 1952లో నేనూ సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. ఎస్వీయస్ రామారావు దర్శకత్వంలో ‘చిన్నమ్మ కథ’ అనే సినిమా రూపొందుతుంటే ఆఫీస్ అసిస్టెంట్‌గా చేరా. తర్వాత ఎడిటింగ్ సైడ్ జాయినయ్యా. మరో పక్క దర్శకత్వశాఖలోనూ పనిచేశా. బాగా అనుభవం వచ్చాక స్వతంత్రంగా ఎడిటర్‌గా 40 సినిమాలకు పైగా పని చేశాను. కానీ నా మనసు మాత్రం డెరైక్షన్ మీదే ఉండేది. జెమినీ సంస్థ వాళ్లు తెలుగులో కె.బాలచందర్ దర్శకత్వంలో తీసిన ‘భలే కోడళ్లు’కు నేను కో-డెరైక్టర్ని. అప్పటినుంచీ బాలచందర్ దగ్గర చాలా సినిమాలకు పని చేశాను. ఆ అమ్మాయిని నేనే బాలచందర్‌కి పరిచయం చేశా! ఓ రోజు నటి నిర్మలమ్మ ఫోన్ చేసి ‘‘రాజమండ్రి నుంచి ఓ అమ్మాయి వచ్చింది. మంచి వేషం ఉంటే చూడండి’’ అని చెప్పారు. అప్పుడే తెలుగులో ‘అంతులేని కథ’ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెల్లెలు వేషానికి బావుంటుందని నేనే తీసుకెళ్లి బాలచందర్‌కి పరిచయం చేశాను. అంతా ఓకే. తమిళ వెర్షన్లో చేసిన సుజాత తెలుగులోనూ హీరోయిన్గా చేయాలి. కానీ తను చాలా బిజీ. చెల్లెలి వేషానికి తీసుకున్న అమ్మాయినే మెయిన్ హీరోయిన్గా తీసుకుందామన్నారు బాలచందర్. నేను ఓకే అన్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు. జయప్రద. ‘అంతులేని కథ’ సినిమాతో ఆమె ఎంత స్టార్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ పారితోషికం అయిదు వేలు! ‘విజయా’ నాగిరెడ్డి గారు ఓ మలయాళ సినిమా ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో కె. బాలచందర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. చాలా యాంటీ సబ్జెక్ట్ అది. బాలచందర్ బిజీగా ఉండి చేయలేని పరిస్థితి. నాకేమో అలాంటి కథతో డెరైక్షన్ చేయాలని ఆశ. నిర్మాత హరిరామజోగయ్య నాతో సినిమా చేయడానికి రెడీ. తమిళం హక్కులు వేరే వాళ్లతో కొనిపించి, తెలుగులో మేం సినిమా మొదలుపెట్టాం. హీరో వేషానికి కొత్త మొహం కావాలి. నేను ఒక తమిళ హీరో పేరు సూచించాను. అందరూ రిజెక్ట్ చేశారు. నేను మాత్రం అతనే కావాలని పట్టుబట్టాను. ఫైనల్‌గా అతనితో సినిమా చేశాను. సినిమా పెద్ద హిట్టు. ఆ హీరో యాక్షన్‌కి ఒకటే క్లాప్స్. ఆ సినిమా పేరు ‘చిలకమ్మ చెప్పింది’ (1977). ఆ హీరో రజనీకాంత్. తెలుగులో అతనికి అదే తొలి సినిమా. పారితోషికం మూడు వేల రూపాయలు అని మాట్లాడాం కానీ, చివరకు అయిదు వేలు ఇచ్చాం. ఈ సినిమాతో రజనీకాంత్‌కి తెలుగు మార్కెట్ కూడా వచ్చింది. చిరంజీవితో చేయొద్దన్నారు! నేను తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రానికి ఎనిమిది నందులు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి, మాధవితో ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ చేశా. హీరోగా చిరంజీవి వద్దని కొంతమంది చెప్పారు. మళ్లీ చిరంజీవితో ‘సీతాదేవి’ చేశాను. ‘అగ్ని పుష్పం’తో సీతను పరిచయం చేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డెరైక్షన్ చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ డెరైక్ట్ చేశాను. ఇప్పుడు సినిమా డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఇప్పటికీ అద్దె ఇల్లే! ఇన్నేళ్ల కెరీర్లో నేను సంపాదించిందేమీ లేదు. ఇప్పటికీ అద్దె ఇల్లే. హైదరాబాద్‌లో స్థలం తీసుకోమన్నా, ఆ కొండల్లో ఎందుకని వదిలేశా. ఇప్పుడు దాని విలువ కోట్లు. విజయ్ టీవీలో మా అబ్బాయి ఎడిటర్. వాడి జీతమే మాకు ఆధారం. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. నవతరం దర్శకులకి మెళకువలు చెబుతున్నాను. నా ఆత్మకథ రాసుకున్నాను. అయితే అది నాకు మాత్రమే సొంతం. ప్రచురణ చేయాలనుకోవడం లేదు. అప్పటి సంఘటనలు చదువుకుంటుంటే అదో తీయని అనుభూతి. అదే ఈ వయసులో నాకు ఎనర్జీ. - పులగం చిన్నారాయణ