Desire Exhibition
-
తాజ్‌కృష్ణాలో డిజైర్ ఎగ్జిబిషన్
-
ట్రెండీ టైమ్
మోడ్రన్ ట్రెండ్స్ ఎన్ని పుట్టుకొస్తున్నా... అచ్చమైన భారతీయ సంప్రదాయంలోని అందం అలా అరవిరిస్తూనే ఉంటుంది. కాదంటారా..! ఈ భామలను చూడండి! తెలుగింటి పడచు పిల్లలా లంగా ఓణీలో మెరిసి మురిపిస్తున్నారు ఒకరు. కలర్‌ఫుల్ అనార్కలీ వెరైటీలో ట్రెడిషన్‌కు సింబాలిక్‌గా సిరులొలికిస్తున్నారు ఇంకొకరు. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో బుధవారం ప్రారంభమైన ‘డిజైర్’ ఎగ్జిబిషన్లో తళుకులివి. టాలీవుడ్ నటి సిమేర్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన ఈవెంట్లో... సిటీ అమ్మాయిలూ ఇలా బ్యూటీ‘ఫుల్’గా ఎంట్రీ ఇచ్చి ఆహా అనిపించారు. లేటెస్ట్ ట్రెండ్స్‌ను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఫ్యాషన్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవారందరి ‘డిజైర్’ను ఫుల్‌ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదనేది నిర్వాహకుల మాట. గురువారం కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది. మీరూ ఓ లుక్కేయండి మరి! సాక్షి, సిటీ ప్లస్ -
డిజైర్...
సిల్వర్ స్క్రీన్‌పై అందాలు చిందించే ముద్దుగుమ్మ కెనిషా చంద్రన్ బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో వయ్యారాల సింగారాలు పోయింది. లూజ్ హెయిర్‌లో... ప్లెజంట్ డ్రెస్సింగ్‌తో అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో తాజ్ కృష్ణలో జరగనున్న ‘డిజైర్’ ఎగ్జిబిషన్ కర్టెన్‌రైజర్ కార్యక్రమం ఈ సొగసరి రాకతో కలర్ఫుల్గా మారింది. దాదాపు ఎనభై స్టాల్స్‌తో ఏర్పాటు చేయనున్న ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ నగరాలకు చెందిన ప్రముఖ డిజైనర్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఎన్నో ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. మనసు కోరుకునే ట్రెడిషనల్, కాంటెంపరరీ వెరైటీలెన్నో ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. వీటితో పాటు నయా ట్రెండ్‌ను ప్రతిబింబించేలా ఆభరణాలు, విభిన్న రకాల షూస్, గృహాలంకరణ వస్తువులు, కళాకృతులవంటివన్నీ ఒకే చోట కొలువుదీరే ప్రదర్శన ఇదన్నారు. సాక్షి, సిటీ ప్లస్ -
సమ్ థింగ్ స్పెషల్
రంగు రంగుల చీరలు... ఏ అవ్మూరుుకైనా ఇట్టే నప్పే వెరైటీ డ్రెస్సులతో ఏర్పాటు చేసిన డిజైర్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సల్వార్ కమీజ్, డిజైనర్ శారీస్, బ్లౌజ్ పీసెస్ వంటివి ఆకర్షణీయుమైన వెరైటీల్లో ఉన్నారుు. వీటితో పాటు డిఫరెంట్ నెరుుల్ పాలిష్‌లు, డోర్ కర్టెన్స్, మైల్డ్ స్టీల్ ఫ్లవర్స్, లేడీస్ ఫుట్‌వేర్, హోం డెకార్ ఐటెమ్స్ కొలువుదీరారుు. వజ్రాభరణాలు స్పెషల్ ఎట్రాక్షన్. నటి సుహానీ తళుకులీనింది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది. సిటీ ప్లస్