డిజైర్...
సిల్వర్ స్క్రీన్‌పై అందాలు చిందించే ముద్దుగుమ్మ కెనిషా చంద్రన్ బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో వయ్యారాల సింగారాలు పోయింది. లూజ్ హెయిర్‌లో... ప్లెజంట్ డ్రెస్సింగ్‌తో అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో తాజ్ కృష్ణలో జరగనున్న ‘డిజైర్’ ఎగ్జిబిషన్ కర్టెన్‌రైజర్ కార్యక్రమం ఈ సొగసరి రాకతో కలర్‌ఫుల్‌గా మారింది.
దాదాపు ఎనభై స్టాల్స్‌తో ఏర్పాటు చేయనున్న ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ నగరాలకు చెందిన ప్రముఖ డిజైనర్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఎన్నో ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. మనసు కోరుకునే ట్రెడిషనల్, కాంటెంపరరీ వెరైటీలెన్నో ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. వీటితో పాటు నయా ట్రెండ్‌ను ప్రతిబింబించేలా ఆభరణాలు, విభిన్న రకాల షూస్, గృహాలంకరణ వస్తువులు, కళాకృతులవంటివన్నీ ఒకే చోట కొలువుదీరే ప్రదర్శన ఇదన్నారు.
సాక్షి, సిటీ ప్లస్