Detailed project report
-
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ డీపీఆర్‌పై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-పుణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై కసరత్తు సాగించేందుకు నవంబర్ 5న ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. 711 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్‌పై సర్వే, ఉపరితలం,అండర్‌గ్రౌండ్ సదుపాయాలు, సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముంబై-పుణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు టెండర్లను నవంబర్ 18న తెరుస్తారు. టెండర్లో విజయవంతమైన బిడ్డర్‌ను గుర్తించి టెండర్‌ను ఖరారు చేస్తారు. ఇక ప్రభుత్వం మొత్తం ఏడు రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయాలని గుర్తించింది. ముంబై-పుణే-హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ-లక్నో-వారణాసి, ముంబై-నాసిక్-నాగపూర్, ఢిల్లీ-జబల్పూర్-అహ్మదాబాద్, చెన్నై-మైసూర్, ఢిల్లీ-చండీగఢ్-అమృత్సర్, వారణాసి-పాట్నా-హౌరా రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లను తయారు చేసే బాధ్యతను రైల్వే మంత్రిత్వ శాఖ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు అప్పగించింది. చదవండి : భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్! -
కాళేశ్వరం డీపీఆర్ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం పేరు మీద కార్పొరేషన్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఏమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల ముందు డీపీఆర్‌ను ఎందుకు పెట్టలేదని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వల్లే సాధ్యమైందని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో గతంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని గుర్తుచేశారు. అదే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ హాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జాతీయ హోదా కోసం పోరాడితే 95 శాతం నిధులు కేంద్రమే ఇచ్చేదని, కానీ కమీషన్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు పోరాడలేదని ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. దీనికి ఏటా రూ.5 వేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టు టెండర్లన్నీ ఇరిగేషన్ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్ర నేతలను పిలవకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తున్నారని, ఇదెక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా పార్టీ అవసరాలకు ఆర్థిక వనరులు సమకూర్చే వనరుగా మార్చారని, అభివృద్ధి కోసం మండిపడ్డారు. పార్టీకి, డబ్బులు కావాల్సినప్పుడల్లా కాళేశ్వరాన్ని కామధేనువులా వాడుకుంటున్నారని ఆరోపిం చారు. ఈ ప్రాజెక్టులో అవినీతి చిట్టా బయటపెడతారన్న భయంతోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు రాజ్యాంగాన్ని కాపాడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా టీఆర్ఎస్లో చేర్చుకోవడం దుస్సంప్రదాయమని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా చేవెళ్లకు నీళ్లు రావాలని గతంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర చేశారని, ఈ ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీటి వాటా ఇస్తామని టీఆర్ఎస్ వాళ్లు చెప్పారా అని ఆమెను భట్టి ప్రశ్నించారు. నీళ్లివ్వనప్పుడు టీఆర్ఎస్లో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మెట్రోకు పచ్చజెండా!
డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం గాజువాకను కలుపుతూ నిర్మాణం 2018నాటికి పూర్తిచేస్తామని ప్రకటన విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు దిశగా ముందడుగు పడింది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం శనివారం ఆమోదించింది. శ్రీధరన్ డీపీఆర్‌ను సీఎం చంద్రబాబుకు శనివారం విజయవాడలో సమర్పించారు. దాన్ని యధాతథంగా ఆమోదిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముందుగా అనుకున్న విధంగానే గాజువాకను కలుపుతూ మెట్రోరైలు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. రూ.12,727కోట్ల బడ్జెట్లో 49శాతం నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయని సీఎం చెబున్నారు. విశాఖపట్నం : మూడు కారిడార్లుగా మెట్రోరైలు ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుంది. మొదటి కారిడార్ గాజు వాక నుంచి కొమ్మాది వరకు నిర్మిస్తారు. 30.39కి.మీ.పొడవుం డే ఈ కారిడార్‌లో మొత్తం 22 స్టేషన్లు ఉంటాయి. రెం డో కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి పాతపోస్టాఫీసు వరకు నిర్మిస్తారు. 5.25కి.మీ. పొడవుండే ఈ కారిడార్‌లో 7 స్టేషన్లు ఉంటాయి. మూడో కారిడార్‌ను తాటిచెట్లపాలెం నుం చి చినవాల్తేర్ ఈస్టుపాయింట్కాలనీ వరకు నిర్మిస్తారు. 6.91కి.మీ. పొడవుండే ఈ కారిడార్‌లో 9 స్టేషన్లు ఉంటాయి. రూ.12,727కోట్లు బడ్జెట్ మొత్తం మెట్రోరైలు ప్రాజెక్టును రూ.12,727కోట్లు బడ్జెట్‌తో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా భారంకావడంతోపాటు ఫీజబులిటీ తక్కువుగా ఉన్నందున ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తిచూపించవు. అందుకే దీన్ని ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించారు. మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 49శాతం నిధులు సమకూరుస్తాయి. మిగిలిన 51 శాతం నిధులను రుణరూపంలో సేకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.2,163కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,231కోట్లు కేటాయిస్తాయి. మిగిలిన 6,371కోట్లను అంతర్జాతీయ సంస్థల నుంచి రుణంగా సేకరిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టి 2018, డిసెంబర్‌నాటికి పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. 2018, డిసెంబర్‌నాటికి మెట్రోరైలును పట్టాలు ఎక్కిస్తామని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం విజయవాడలో ప్రకటించారు. అందుకు అవసరమైన భూసేకరణ, ఇతర ప్రక్రియలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
అడ్డగోలుగా భూ పందేరం
చట్టాలు, తీర్పులు బేఖాతరు చేసి మరీ.. 625 ఎకరాల జూపార్కుభూములపై పెద్దల కన్ను పీపీపీ విధానంలో అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేయత్నం జూపార్కును కంబాలకొండకు తరలించే వ్యూహం వన్యప్రాణి చట్టాలు అడ్డురావు.... న్యాయస్థానం తీర్పులూ పట్టవు. అస్మదీయులకు భూపందేరమే లక్ష్యం అన్నట్లుగా తయారైంది ప్రభుత్వ తీరు. అందుకే వన్యప్రాణుల ఆవాసాలకు పెనుముప్పు కలిగిస్తూ మరీ భూపందేరానికి పన్నాగం పన్నుతోంది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు కు చెందిన 625 ఎకరాలను లక్ష్యంగా చేసుకుంది. అక్కడి నుంచి జూపార్కును తరలించి ఆ భూములను నైట్‌సఫారి, రిసార్టుల పేరుతో పీపీపీ విధానంలో ఆ భూములను తమ అనుకూల సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తోంది. ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పంతం నెగ్గించుకునే దిశగా పావులు కదుపుతోంది. విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. కంబాలకొండ రిజర్వు ఫారెస్టుకు జూపార్కును తరలిస్తామని కూడా వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజానీకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖపట్నంలో ఆందోళనలు నిర్వహిస్తున్నా మంత్రి గంటా మాత్రం తాము జూపార్కును తరలిస్తామని పునరుద్ఘాటిస్తున్నారు. ఇందుకోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించాలని వుడా అధికారులను కూడా ఇప్పటికే మౌఖికంగా ఆదేశించారు. ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానం తీర్పులను బేఖాతరు చేస్తోంది. పాంథర్ బయోస్పీయర్ నేచరల్ పార్కుకు ముప్పు : శివారులోని 16వేల చదరపు కి.మీ.లలో విస్తరించిన కంబాలకొండ అరుదైన చిరుతపులలకు సహజసిద్ధ ఆవాసంగా ఉంది. అందులో 8కిపైగా చిరుతపులులు సంచరిస్తున్నట్లు 2007లోనే అటవీశాఖ గుర్తించింది. చిరుతల సంఖ్యను పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర అటవీశాఖ 2013లో సర్వే నిర్వహించి కంబాలకొండను ‘పాంథర్ బయోస్పియర్ నేచురల్ పార్కు’గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రకారం కంబాలకొండ అభయారణ్య ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ మంత్రి గంటా ఆ కంబాల కొండలో 200 ఎకరాల్లో జూపార్కును ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. జూపార్కు ఏర్పాటు చేయాలంటే కంబాలకొండ అభయారణ్యంలో భవన, రోడ్లు నిర్మాణాలు చేపట్టాలి. ఇది కేంద్ర నిబంధనలకు విరుద్ధం. సుప్రీం కోర్టు తీర్పూ బేఖాతరు : అభయారణ్యాల్లో పర్యాటకాభివృద్ధి పేరుతో నైట్సఫారీలు ఏర్పాటు చేయకూడదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పులులు సంచరించే అభయారణ్యాల్లో నైట్సాఫారీలు, రిసార్టులు ఏర్పాటు చేయమని కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఈ తీర్పును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం జూపార్కును కంబాలకొండ అభరాణ్యానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కంబాల కొండను ఆనుకుని ఉన్న జూపార్కులో నైట్సఫారీ, రిసార్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జూపార్కుకు చెందిన విలువైన 625 ఎకరాలను తమ అనుకూల సంస్థలకు కట్టబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానాల తీర్పులను బేఖాతరు చేస్తోందని స్పష్టమవుతోంది. -
రహదారులు సిద్దం!
సర్కారుకు డీపీఆర్ అందజేత 150 అడుగులకు రూ.2,700 కోట్ల నష్టం అవాంతరాలూ కోకొల్లలు 100 ఫీట్లకు రూ.401 కోట్ల పరిహారం దీనికే మొగ్గు చూపుతున్న ఆర్అండ్బీ అధికారులు వరంగల్ రూరల్ : నగరంతోపాటు చుట్టూ ఉన్న రహదారుల అభివృద్ధిపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఆరు లేన్లుగా 150 అడుగులతో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేశారు. మొత్తం ఐదు రహదారులపై రూపొం దించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. 150 అడుగులుగా రహదారులను అభివృద్ధి చేస్తే రూ.వేల కోట్లలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందన్న విషయం సర్వేలో వెలుగుచూసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ అధికారులు 100, 150 అడుగులతో అభివృద్ధి చేస్తే కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తూ నివేదికలో పొందుపర్చారు. 150 అడుగులతో అభివృద్ధి చేయూలనుకుంటే నష్టపరిహారం అందించేందుకే నిధులు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుందని, ఈ క్రమంలో విస్తరణకు నిధుల కొరత ఏర్పడుతుందని అంచనా వేశారు. 150 అడుగులుగా మారిస్తే... నగరం, చుట్టు పక్కల రహదారులు హంటర్‌రోడ్-నాయుడు పంప్, కాజీపేట-పెద్దమ్మగడ్డ, కడిపికొండ -ఉర్సుగుట్ట, రాంపూర్-ములుగురోడ్డు (ఎన్‌హెచ్-163), ములుగురోడ్డు-ధర్మారం వరకు ఐదు రోడ్లను 150 అడుగులుగా అభివృద్ధి చేస్తే 7,51,275 చదరపు గజాల స్థలాన్ని సేకరించాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. 2,938 పక్కా భవనాలను కూల్చివేయాల్సి ఉంటుందని... ఇందుకోసం బాధితులకు సుమారు రూ.2,700 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. 150 అడుగులు అరుుతే... ఈ ఐదు రహదారులను 100 అడుగులుగా విస్తరిస్తే 1,85,600 చదరపు గజాల స్థలం అవసరమవుతుందని నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు 790 భవనాలను కూల్చివేయాలని, సుమారు రూ. 401 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 1971 మాస్టర్ ప్లాన్ బెటర్... రహదారులను 150 అడుగులుగా విస్తరిస్తే వందలాది పక్కా భవనాలు నేలమట్టమై పలు కుటుంబాలు ఆశ్రయం కోల్పోయే అవకాశాలున్నాయని వివరించిన ఆర్ అండ్ బీ అధికారులు 1971 మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో వివరించారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం 1971లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్లు రహదారికి వదిలివేసే విధంగా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని, ఈ మేరకు నష్టపరిహార భారం ప్రభుత్వంపై తక్కువ పడుతుందని పేర్కొన్నారు. 150 అడుగులతో విస్తరించాల్సి వస్తే నష్టపరిహారం ప్రభుత్వానికి భారంగా మారడంతోపాటు కోర్టు చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నివేదికలో వివరించారు. -
ముమ్మరంగా మెట్రో సర్వే
మార్చికి డీపీఆర్ సిద్ధం చేస్తామంటున్న డీఎంఆర్సీ అధికారులు నగరంలో మొదటి సర్వే పూర్తి ట్రాఫిక్‌పై సమగ్ర పరిశీలన కొనసాగుతున్న రెండో సర్వే విజయవాడ : మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. నగరంలో 25 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారీ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) నిర్వహిస్తోంది. ఇందుకోసం నాలుగు సర్వేలు నిర్వహించి సమగ్ర అధ్యయనం తర్వాత డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. డీపీఆర్ తయారీకి రూ.25కోట్లు మంజూరయ్యాయి. చకచకా సాగుతున్న పనులు ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ సలహాదారు శ్రీధరన్ బృందం సెప్టెంబర్ 20 నగరంతోపాటు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పర్యటించి మెట్రో రైలు ఏర్పాటుకు రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. సుమారు రూ.8వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దీనిలో 20 శాతం కేంద్ర ప్రభుత్వం, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. మిగిలిన 45 శాతం రుణం మంజూరవుతుంది. డీపీఆర్ పనులను డీఎంఆర్సీ నాలుగు భాగాలుగా విభజించి వాటి బాధ్యతలను నాలుగు కన్సల్టెన్సీలకు అప్పగించింది. డీపీఆర్‌కు సంబంధించిన సర్వేను నగరంలోనే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకుని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. మొదటిగా ట్రాఫిక్ సర్వే పూర్తిచేశారు. రెండో విడతగా టోఫోగ్రఫీ సర్వే, మూడో విడతలో జియోటెక్ సర్వే (భూసార పరీక్షలు), నాలుగో విడతలో ఎన్విరాన్మెంటల్ సర్వే నిర్వహిస్తారు. ఈ క్రమంలో గత వారం డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ కూడా పర్యటించి డీపీఆర్ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సర్వే పూర్తి నగరంలో ట్రాఫిక్ సర్వేను గత వారంలో పూర్తిచేశారు. ప్రస్తుతం ట్రోఫోగ్రఫీ సర్వే పనులు జరుగుతున్నాయి. మొదటి సర్వేలో భాగంగా నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, సిగ్నలింగ్ సిస్టం, బందరు, ఏలూరు రోడ్లలో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగంపై, మెట్రో రైలు నిర్మించిన తర్వాత ఆక్యుపెన్సీ శాతంపై పరిశీలన చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించే ప్రధాన మార్గాల్లో బస్సులు, ఆటోలు, కార్ల రాకపోకలపై సమగ్రంగా సర్వే నిర్వహించారు. సర్వే బృందాలు ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద ఉండి వాహనాల రాకపోకలను పరిశీలించాయి. ప్రస్తుతం టోఫోగ్రఫీలో భాగంగా రోడ్ల విస్తీర్ణం, ప్రధాన మార్గల్లో రోడ్ల స్థితిగతులు, ఇతర అంశాలపై సర్వే కొనసాగుతోంది. మార్చికి డీపీఆర్ సిద్ధం : రంగయ్య వచ్చే ఏడాది మార్చికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తిగా సిద్ధమవుతుందని ప్రాజెక్ట్ డెప్యూటీ డెరైక్టర్ సీహెచ్ రంగయ్య ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రెండో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగిలిన రెండు సర్వేలను కూడా త్వరగా పూర్తిచేసి, మార్చి నెలాఖరులోపు డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని వివరించారు. -
‘పాలమూరు’ డిజైన్ మార్పు అవాస్తవం
చేవెళ్లః పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగామాట్లాడుతూ పథకం డిజైన్ మార్చి, పరిధిని కుదించినట్లు వస్తున్న కథనాలలో వాస్తవం లేదన్నారు. మొదటి దశ కింద తీసుకున్న పనులను గురించి మాత్రమే ప్రచారం జరుగుతున్నదని, వచ్చే జనవరి, ఫిబ్రవరిలోగా రెండవ దశ నివేదిక సిద్ధమైతేనే ఈ ఎత్తిపోతల పథకం పూర్తి స్వరూపస్వభావాలు బయటపడతాయని చెప్పారు. ఈ పనుల కోసం పూర్తిస్థాయి డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి అప్పగించగా నివేదికను సమగ్రంగా అందించడానికి రెండు మూడు నెలల సమయం కావాలని కోరారని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకం జూరాల నుంచి ప్రారంభమై కోలికొండ, గండీడు, లక్ష్మీదేవిపల్లి వరకు నాలుగు లిఫ్ట్‌లుగా ఉంటుందని గతంలో కేసీఆరే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 3లక్షల ఎకరాలతో పాటుగా నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నారని చెప్పారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాకుగా చూపి ఆయకట్టును లక్షా 30వేల ఎకరాలకు కుదింపు చేస్తున్నారని వస్తున్న కథనాలు వాస్తవం కాదన్నారు. అంతేకాకుండా చేవెళ్ల, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలను తొలగిస్తూ డిజైన్ చేశారనే వార్తలు కూడా సత్యదూరమని పేర్కొన్నారు. ‘ప్రాణహిత-చేవెళ’్ల అసాధ్యం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 11 లిఫ్ట్‌లను పూర్తిచేసి వాటిద్వారా నీటిని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. నిజంగానే ఆ ప్రాజెక్టు సాధ్యమైనా ఒక పంటకు నీళ్లివ్వడానికి విద్యుత్‌కు ఎకరాకు లక్షా 60వేల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకు రావాలనుకుంటే హైదరాబాద్‌కు వాడే విద్యుత్ మొత్తాన్ని ఈ ప్రాజెక్టు నీటి సరఫరాకే వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు రౌతు కనకయ్య, కొండా రాందేవ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భీమేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కన్వీనర్ చింపుల సత్యనారాయణరెడ్డి, నాయకులు ఆంజనేయులు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంచంద్రయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారంలో ఇక.. శాశ్వత పనులు
హన్మకొండ, న్యూస్‌లైన్: మేడారంలో ఇక... శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు పనులు చేస్తున్న విషయం తెలిసిందే. జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఉంటుండడంతో శాశ్వత పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల ఆరో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సైతం శాశ్వత పనుల కోసం నివేదికలివ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. మేడారంలో ఎలాంటి పనులు చేపట్టాలి... ఎక్కడెక్కడ చేయాలి... భూ సేకరణ ఎంత అవసరం వంటి అంశాలపై సర్వే చేసేందుకు నాలుగు శాఖలకు నిధులిచ్చారు. అంతేకాకుండా... సర్వే కోసం రూ. పది లక్షలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే జాతరను పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం శాశ్వత పనులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. దీని కోసం సోమవారం నుంచే అధికారులు సర్వే మొదలుపెట్టారు. జాతర సమయంలోనే కాకుండా... మిగతా రోజుల్లో భక్తుల రాక ఎలా ఉంది... వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలపై సమగ్ర నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యూరు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూ సేకరణ, అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు, వారి నుంచి కొనుగోలు తదితర పనుల కోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. శాఖల వారీగా చేపట్టనున్న పనులు ఆర్డబ్ల్యూఎస్ : మేడారంలో నీటి తిప్పలు లేకుం డా రూ. 11 కోట్లతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శాశ్వత పనులను చేపట్టనున్నారు. మేడారం చుట్టూ పంట కాల్వల నుంచి లోతుగా (అండర్ గ్రౌండ్) పైపులైన్ నిర్మించి, ప్రధాన దారుల వద్ద నల్లాలు, మినీ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. గుట్టలు, చెట్ల మధ్య విడిది చేసే భక్తులకు ఇబ్బందులు రాకుండా తక్కువ వ్యవధిలోనే నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. నీటి సరఫరాకు ఇబ్బం దులు రాకుండా పడిగాపూర్, రెడ్డిగూడెం గుట్టల వద్ద రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు, జంపన్నవాగులో రెండు ఫిల్టర్ బావులను తవ్వనున్నారు. వీటి ద్వారా ట్యాంకులు... అక్కడ నుంచి పైపులైన్లకు లింక్ చేయనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం గ్రామపంచాయతీ అనుమతితో ఆర్డబ్ల్యూఎస్ మినీ కార్యాలయాన్ని నిర్మించుకోనున్నారు. కొంతమంది సిబ్బందిని కేటాయించనున్నారు. ఆర్ అండ్ బీ : మేడారం చుట్టూ ఉన్న ఊరట్టం, రెడ్డిగూడెం, కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూర్, నార్లాపూర్, పడిగాపూర్ గ్రామాల నుంచి ప్రధాన రోడ్లను మరింత వెడల్పు చేయడమే కాకుండా... మేడారం వచ్చే ఈ దారుల వెంట ప్రత్యేక ఏర్పా ట్లు చేయనున్నారు. పంట పొలాలకు ప్రమాదం వాటిల్లకుండా రోడ్ల వెంట మురికి కాల్వల నిర్మాణం చేయనున్నారు. అదే విధంగా ప్రధాన ప్రాంతాల్లో నల్లాలను బిగించనున్నారు. మేడారంలో సమ్మక్కను దర్శించుకున్న భక్తులు ఈ చుట్టూ గ్రామాల్లో ఎక్కడైనా సేద తీరవచ్చు. జాతర సమయంలోనే కాకుండా... ఈ దారుల వెంట ప్రత్యేక స్తంభాలను వేసి, విద్యుత్ సరఫరా చేసేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ : జంపన్న వాగులో చెక్ డ్యాంల నిర్మాణానికి బ్రేక్ పడనుంది. ఇక్కడ మినీ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇప్పటివరకు సుమారు 10 చెక్ డ్యాంలను నిర్మాణం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిం చారు. కానీ.. జాతర సమయంలో కాకుండా వివిధ రోజుల్లో వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నారుు. ఈ మేరకు జంపన్న వాగును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ. 8.8 కోట్లతో మినీ రిజర్వాయర్ు నిర్మాణం చేసి, కట్టపైన మినీ పంపింగ్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. జంపన్నవాగు నుంచి స్నాన ఘట్టాలకు లింక్ చేయనున్నారు. దీంతో ప్రతిసారి స్నాన ఘట్టాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే... ఈ ప్రాంతంలోని పంట పొలాలకు కూడా కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ : జాతర సమయంలో స్తంభాలు వేయడం, ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం వంటి పనులను కాదని... ప్రతిరోజూ వినియోగంలో ఉండే విధంగా రూ. 2.80 కోట్లతో విద్యుత్ పనులను శాశ్వత ప్రాతిపాదికన చేయనున్నారు. మేడారంతోపాటు చుట్టూ గ్రామాల పరిధిలో విద్యుత్ లైన్లు వేయనున్నారు. పస్రా నుంచి మేడారం వరకు స్తంభాలు వేయనున్నారు. అంతేకాకుండా ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి సరఫరాకు 200 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు నిరంతరం నడిచే విధంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇలా అరుుతే.. ప్రతీ జాతర సమయంలో వెచ్చిస్తున్న నిధులు ప్రభుత్వానికి మిగిలే అవకాశముంది. కేవలం ఎనర్జీ చార్జీలు, నిర్వహణ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది.