రహదారిపై మావోల వాల్పోస్టర్లు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి ప్రధాన రహదారిపై గురువారం ఉదయం మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పేరిట ఈ పోస్టర్లు ఉన్నాయి. ఈనెల 21 నుంచి 27 వరకు సీపీఐ(మావోయిస్టు) పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను ప్రజలు గ్రామగ్రామాన నిర్వహించాలని మావోయిస్టులు ఈ పోస్టర్లలో కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.