'ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సొంతిల్లు'
రాజేంద్రనగర్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తామని టీఎన్జీఓ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, ఎంఏ. హమీద్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్‌లో నిర్మించిన హైద్రాబాద్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (రంగారెడ్డిజిల్లా విభాగం) కార్యాలయాన్ని సోమవారం వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సొంత ఇల్లు అనేది ఉద్యోగి హక్కుగా పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.