Development of state
-
‘అభివృద్ధికి ఐడియాస్ ఇవ్వండి’
వివిధ రంగాల అభివృద్ధిపై కలెక్టర్లు కసరత్తు చేయాలి: సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో : ‘మీరు చెప్పాలనుకుంది చెప్పండి. రాష్ట్ర అభివృద్ధికి మంచి ఐడియాస్ ఉంటే వివరించండి. అలాకాకుండా...ఒకేసారి ఎగిరి దూకితే కాళ్లు విరిగిపోతాయ్ మరి. అనవసరమైన మాటలెందుకు?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై సున్నితంగా మండిపడ్డారు. ప్రాథమికరంగ మిషన్‌పై శుక్రవారం విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పై విధంగా స్పందించారు. ఫిషరీస్ సెక్టార్‌కు సంబంధించిన చర్చ జరుగుతున్నపుడు ఆ శాఖకు చెందిన ఓ ఉద్యోగి లేచి మాట్లాడిన తీరుకు సీఎం మండిపడ్డారు. జిల్లాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో కలెక్టర్లూ శ్రద్ధ చూపాలి. కొందరు అదనపు జేసీలు, జాయింటు కలెక్టర్లు ఏమడిగినా స్పందించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు దృష్టి సారించాలని, ఉద్యాన పంటలను ప్రమోట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టేందుకు కృషి చేయాలని మంత్రి పుల్లారావు, ఉద్యాన శాఖ కమిషనర్ ఉషారాణికి సూచించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ ప్రగతిని ఉషారాణి, ఫిషరీస్ నివేదికను ఆ శాఖ కమిషనర్ రామశంకర నాయక్, పశుసంవర్థక శాఖ వృద్ధిని ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లాం అసోసియేట్ డెరైక్టర్ ఈదర నారాయణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల కో-ఆపరేటివ్ అధికారులు చంద్రశేఖర్, ప్రవీణలు వ్యవసాయ రంగం, పరిశోధనల్లో అవసరాలను వివరించారు. క్లౌడ్ టెక్నాలజీ ద్వారా డెయిరీ, ఫిషరీస్, ఆక్వా రంగాల్లోని ప్రగతి డేటాను కంప్యూటర్లలో అప్లోడ్ చేసే బాధ్యతలను సీఎం చంద్రబాబు వశిష్టాగ్రూప్ ప్రతినిధి హరివర్మకు అప్పగించారు. కాగా ప్రాథమికరంగ మిషన్‌కు ‘రైతు కోసం’ అని కొత్త పేరు పెట్టారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల వర్క్‌షాపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పేరుపై నిర్ణయం తీసుకున్నారు. -
నేడు చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం
తిరుపతి రూరల్: రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యునిగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేడు హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ కమిటీహాల్లో జరిగే కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం కేబినెట్ హోదా కలిగిన ఈ కమిటీ మొదటి సమావేశం అక్కడే జరగనుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటింగ్ ద్వారా ఈ కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో చేపట్టే పనిఅంచనాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ అమోదం తర్వాతే అసెంబ్లీకి పంపుతారు. దేశ, విదేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిటీ సభ్యులు పరీశిలించి ప్రభుత్వనికి నివేదికలు అందిస్తారు. నెలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో సమావేశమై, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులను, పనుల అంచనాలను పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంటే సంబంధిత అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తారు. సీమ నుంచి చెవిరెడ్డికి ఛాన్స్ న్యాయశాస్త్ర పట్టభద్రుడు, సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన చెవిరెడ్డి భా స్కర్రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ అంచనాల కమిటీలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురికి మాత్రమే అవకాశం ఉండడంతో రాయలసీమ జిల్లాల నుంచి తన సన్నిహితుడైన చెవిరెడ్డిని అధ్యక్షుడు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్.జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.