‘అభివృద్ధికి ఐడియాస్ ఇవ్వండి’ | "Give development Ideas'' : CM Chandrababu | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధికి ఐడియాస్ ఇవ్వండి’

Published Sat, Jun 27 2015 2:05 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

‘అభివృద్ధికి ఐడియాస్ ఇవ్వండి’ - Sakshi

‘అభివృద్ధికి ఐడియాస్ ఇవ్వండి’

వివిధ రంగాల అభివృద్ధిపై కలెక్టర్లు కసరత్తు చేయాలి: సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో : ‘మీరు చెప్పాలనుకుంది చెప్పండి. రాష్ట్ర అభివృద్ధికి మంచి ఐడియాస్ ఉంటే వివరించండి. అలాకాకుండా...ఒకేసారి ఎగిరి దూకితే కాళ్లు విరిగిపోతాయ్ మరి. అనవసరమైన మాటలెందుకు?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై సున్నితంగా మండిపడ్డారు. ప్రాథమికరంగ మిషన్‌పై శుక్రవారం విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పై విధంగా స్పందించారు.

ఫిషరీస్ సెక్టార్‌కు సంబంధించిన చర్చ జరుగుతున్నపుడు ఆ శాఖకు చెందిన ఓ ఉద్యోగి లేచి మాట్లాడిన తీరుకు సీఎం మండిపడ్డారు. జిల్లాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో కలెక్టర్లూ శ్రద్ధ చూపాలి. కొందరు అదనపు జేసీలు, జాయింటు కలెక్టర్లు ఏమడిగినా స్పందించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు దృష్టి సారించాలని, ఉద్యాన పంటలను ప్రమోట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టేందుకు కృషి చేయాలని మంత్రి పుల్లారావు, ఉద్యాన శాఖ కమిషనర్ ఉషారాణికి సూచించారు.

ఈ సందర్భంగా ఉద్యాన శాఖ ప్రగతిని ఉషారాణి, ఫిషరీస్ నివేదికను ఆ శాఖ కమిషనర్ రామశంకర నాయక్, పశుసంవర్థక శాఖ వృద్ధిని ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లాం అసోసియేట్ డెరైక్టర్ ఈదర నారాయణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల కో-ఆపరేటివ్ అధికారులు చంద్రశేఖర్, ప్రవీణలు వ్యవసాయ రంగం, పరిశోధనల్లో అవసరాలను వివరించారు.

క్లౌడ్ టెక్నాలజీ ద్వారా డెయిరీ, ఫిషరీస్, ఆక్వా రంగాల్లోని ప్రగతి డేటాను కంప్యూటర్లలో అప్‌లోడ్ చేసే బాధ్యతలను సీఎం చంద్రబాబు వశిష్టాగ్రూప్ ప్రతినిధి హరివర్మకు అప్పగించారు. కాగా ప్రాథమికరంగ మిషన్‌కు ‘రైతు కోసం’ అని కొత్త పేరు పెట్టారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల వర్క్‌షాపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పేరుపై నిర్ణయం తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement