Development of tourism
-
పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు
పుట్టపర్తి అర్బన్: ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో పుట్టపర్తి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ హెచ్ఓడీలు అనిల్ కె.గుప్తా, కన్నన్ పేర్కొన్నారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన వారు ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావును కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై వారు చర్చించారు. అనంతరం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం, శిల్పారామంను సందర్శిం చారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల ప్యాకేజీని అందించే అవకాశం ఉందన్నారు. ఇందులో రాయల సీమ టూరిజం స ర్యూట్కు రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నా రు. అనంతరం వా రు సత్యసాయి మ హా సమాధిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ శ్రీధర్, డివిజనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శనరావు, డీఈ ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
పడకేసిన పర్యాటకం
మన్యంలో కానరాని టూరిజం ప్రగతి అమలుకు నోచుకోని ప్రతిపాదనలు పాడేరు: ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి రూపొందిం చిన ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా మన్యంలో పర్యాటక అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఏజెన్సీలోని డల్లాపలి, లమ్మసింగి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ రూ.14.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఈ పర్యాటకాభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టులను మం జూరు చేస్తూ ప్రభుత్వం గతేడాది జీవో జారీ చేసింది. డల్లాపల్లిలో రూ.6.5 కోట్లు వెచ్చించి 30 రిసార్ట్స్‌తోపాటు రెస్టారెంట్, వ్యూపాయింట్, స్విమ్మింగ్‌పూల్, కాన్ఫరెన్స్ హాల్, చింతపల్లి మండలంలోని లంబ సింగిలో రూ.8 కోట్లతో 40 రిసార్ట్స్, 2 రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్‌హాల్, ఆయుర్వేద హెల్త్ స్పా, ఓపెన్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, వ్యూపాయింట్ తదితర వాటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే నేటికీ మన్యంలో పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపుదాల్చలేదు. డల్లాపల్లిలో బటర్‌ఫ్లై పార్కు నిర్మించాలనే ప్రతిపాదనను ఆదిలోనే విరమించారు. డల్లాపల్లి, లమ్మసింగి ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏడాది పొడవునా వివిధ రాష్ట్రాల నుంచి ఏజెన్సీకి పర్యాటకులు వస్తుం టారు. డల్లాపల్లి, లమ్మసిం గి ప్రాంతాలలో పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కనీసం కాటేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు సౌలభ్యం చేకూరడమే కాకుండా పర్యాటక ప్రాం తాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డల్లాపల్లి నుంచి లంబసింగి వెళ్లే మార్గ మధ్యంలోని కొత్తపల్లి జలపాతాన్ని మాత్రం వనబంధు కల్యాణ యోజన పథకం నిధులతో అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఏజెన్సీలో జలపాతాలు, ఇతర 150 పర్యాటక స్థలాలను గుర్తించి అధికారులు ఇది వరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇవేవీ కార్యరూపం దాల్చడం లేదు. గతేడాదిగా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మన్యంలోని పర్యాటక ప్రాజెక్టులు రూపుదాల్చక ముందే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి వద్ద రూ.192 కోట్లతో ఒక ప్రాజెక్టును చేపట్టేందుకు గత మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ దీన్పార్కు, వాటర్పార్కు, బోటింగ్, స్టార్ హోటల్ నిర్మాణానికి క్యేజిల్ హిల్స్ ప్రాజెక్టు లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోనే ఇది భారీ పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. మన్యంలో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన అరకు, అనంతగిరి పర్యాటక కేంద్రాలకు, విశాఖపట్నం, విజయనగరం జిల్లా కేంద్రాలకు చేరువగా ఉన్న తాటిపూడి లో భారీ పర్యాటక ప్రాజెక్టు చేపడుతుండటంతో ఏజెన్సీలో పర్యాటకాభివృద్ధిని ప్రభుత్వం వెనుక్కినెట్టే పరిస్థితి కనిపిస్తోంది. డల్లాపల్లి, లమ్మసింగి ప్రాంతాలో రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉందని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
ప్రకృతి సోయగాల కూర్పు
ఆదిలాబాద్ : ప్రకృతి సోయగాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు కూర్పు చేస్తోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటక స్థలాలు గుర్తించారు. ఈ ప్రాంతాలను ఐదేళ్లలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో 16 పనులు, మండల స్థాయిలో 33 పనులు మొత్తం 49 పనులకు రూ.115.95 కోట్లు అవసరమని భావిస్తున్నారు. కాగా, జిల్లా స్థాయి పనులకు పర్యాటక శాఖ నిధులు కేటాయించనుంది. వీటిని 2016లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక మండల స్థాయి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే ఇతరత్రా నిధులతో చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు పర్యాటక శాఖ నుంచి రూ.9 కోట్లు రాగా, జిల్లాలో అనేక పనులు చేపట్టారు. జన్నారం ఏకో టూరిజం, కడెం జలపాతం వద్ద బోటింగ్, రీసార్ట్, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా టూరిజం సర్క్యూట్ టూర్(కూర్పు) ప్రణాళిక చేస్తున్నారు. ఐదేళ్లలో విడతలవారీగా.. తెలంగాణ సర్కారు ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా పర్యాటక శాఖ వివిధ టూరిజం పాయింట్లను గుర్తించింది. జిల్లా స్థాయిలో గుర్తించిన 16 పనుల్లో 11 పనులను 2014-15లో రూ.50.70 కోట్లతో పూర్తి చేయాలని, అదే విధంగా మిగిలిన ఐదు పనులను 2015-16లో రూ.37.65 కోట్లతో పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు. తద్వార జిల్లా స్థాయిలో గుర్తించిన పనులను 2016లోగా నిధులు వెచ్చించి పూర్తి చేయాలని ఒక ప్రణాళిక బద్ధంగా ఉన్నారు. కాగా, నార్నూర్ మండలంలో కుండాయి, పారాకఫీ జలపాతాలు వెంకటేశ్వర మందిరం అభివృద్ధి పనులను కూడా రానున్న జిల్లా స్థాయి పనుల్లో చేర్చే అవకాశాలున్నాయి. ఇక మండల స్థాయిలో గుర్తించిన 33 పనులను రూ.27.60 కోట్లతో 2016-17 నుంచి మొదలు కుంటే 2018-19 వరకు విడతల వారీగా చేపట్టాలని ప్రతిపాదనల్లో రూపొందించారు. అయితే మండల స్థాయిలో గుర్తించిన ఈ పనులకు టూరిజం శాఖ పరంగా నిధులు కేటాయించే అవకాశాలు లేకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యే ఇతరాత్ర నిధుల నుంచి కేటాయించి వాటిని పూర్తి చేయాలని యోచిస్తున్నారు. మండల స్థాయిలో గుర్తించిన పనులు భైంసా మండలంలోని బుద్ధవిహార్, దిలావర్పూర్ మండలంలోని కాల్వ నర్సింహాస్వామి ఆలయం, నిర్మల్‌లోని జంగల్ హనుమాన్ మందిరం, నిర్మల్ మండలం అక్కాపూర్, ముత్తాపూర్, సోన్లలో వెంకటేశ్వర ఆలయం, మామడలోని వెంకటేశ్వర ఆలయం, నిర్మల్‌లోని దేవరకోట వెంకటేశ్వర ఆలయం, లక్ష్మణచాందలోని న్యూవెల్మల్ వెంకటేశ్వర ఆలయం, మామడ మండలం పొన్కల్, నిర్మల్ మండలంలోని విశ్వనాథపేట వెంకటేశ్వర ఆలయాలు, నిర్మల్‌లోని అభయ అంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాలను 2016-17లో అభివృద్ధి చేయాలని మన ప్రణాళికలో చేర్చారు. మామడలోని భీమన్న ఆలయం, దిలావర్పూర్లోని చక్రలింగేశ్వర ఆలయం, నిర్మల్ మండలం మేదిపల్లి గణేష్ ఆలయం, నిర్మల్ వడ్డెర కాలనీలోని హనుమాన్ మందిరం, సారంగపూర్‌లోని అడెల్లి పొచ్చమ్మ ఆలయం, నిర్మల్ మంగల్‌పేట్, జాఫ్రపూర్, సారంగపూర్ మండలంలోని వంజర్ మహాలక్ష్మీ ఆలయాలు, మామడలోని పొన్కల్ నాగదేవత ఆలయం, ఆలూరులోని రాజరాజేశ్వర ఆలయాలను 2017-18లో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. నిర్మల్ బ్రహ్మపురి రామాలయం, మునిపల్లి సాయిబాబ ఆలయం, మామడ మండలం న్యూసాంగ్వి సాయిబాబ ఆలయం, నిర్మల్ గండిరామన్న సాయిబాబ ఆలయం, సారంగాపూర్ మండలం భీరవెల్లి సాయిబాబ ఆలయం, సోన్ శివాలయం, నర్సాపూర్(జి)లోని శివాలయం దేవుని చెరువు, ఎల్లమ్మ ఆలయం, ఖానాపూర్ సదర్మట్, దండేపల్లి చిన్నయ్యగుట్టలను 2018-19లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.