నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)