అనురాగ్ శర్మకు మాతృవియోగం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు మాతృవియోగం కలిగింది. అనురాగ్ శర్మ తల్లి సుశీల (82) బుధవారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం డీజీపీ నివాసానికి వెళ్లి అనురాగ్ శర్మను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు నేతలు డీజీపీని పరామర్శించినవారిలో ఉన్నారు.