dharmavaram constituency
-
సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు బీజేపీకి ఇచ్చినా లేక టీడీపీ వద్దే ఉంచుకున్నా తానే బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోను గుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలిచానని, తనకే టికెట్ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు. పైగా శ్రీరామ్, సూరి మధ్య ముందు నుంచీ సఖ్యత లేదు. టికెట్ విషయంలో పంతం నెగ్గించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. బల ప్రదర్శనకు కూడా సిద్ధ మయ్యారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గీ యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా బరి లో ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో కూ టమి భిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. యువగళంతో శ్రీరాంలో ఆశ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరదాపురం సూరి తన కాంట్రాక్టుల కారణంగా బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ తరఫున ధర్మవరం ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వచ్చారు. తొలి మూడేళ్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కేడర్‌ను బలోపేతం చేయడంలోనూ పరిటాల శ్రీరామ్ పూర్తిగా విఫలమైనట్లు చెబుతున్నారు. అయితే యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ బత్తలపల్లిలో శ్రీరామ్ చేయి పైకెత్తి గెలిపించాలని కోరడంతో ఆయనలో టికెట్ ఆశ మొదలైంది. అంతేకాకుండా రాప్తాడులో ఓడిపోయిన బాధతో ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావించారు. మరోవైపు వరదాపురం సూరి చంద్ర బాబుతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు వదలకపోవడంతో ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: జనసేన నేతలకు పవన్ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే.. -
ధర్మవరం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్ మొదలైంది. ఇద్దరిలో ఒకరు గత ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయాడు. తర్వాత బీజేపీలో చేరాడు. ఇప్పుడు పార్టీ ఏదైనా మళ్ళీ అక్కడే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంకోనేత మాజీ మంత్రి కుమారుడు. ఇప్పుడు ఇద్దరూ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. తమ రాజకీయ ఉనికి కోసం శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు కూడా వెనకాడటంలేదు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? పరిటాల శ్రీరాం, గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలియాస్ వరదాపురం సూరీ... ఈ ఇద్దరూ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎవరి మార్గంలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వరదాపురం సూరి 2014లో ధర్మవరం నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల భయంతో టీడీపీ జెండా పీకేసీ..కమలం గూటికి చేరాడు. దీంతో ధర్మవరం ఇన్చార్జ్ బాధ్యతలను పరిటాల కుటుంబ వారసుడు శ్రీరాంకు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్ళుగా ధర్మవరంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిటాల శ్రీరాం వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ధర్మవరంపై కన్నేశారు వరదాపురం సూరీ. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన అవసరం అయితే మళ్ళీ టీడీపీలో చేరి పోటీ చేస్తానని చెబుతున్నారు. ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీకి వంద కోట్లు ఫండ్ ఇచ్చేందుకైనా సిద్ధమంటూ వరదాపురం సూరీ కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మవరం టిక్కెట్ వరదాపురం సూరీకి ఖరారు అయిందని ఆయన వర్గీయులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సూరీ వర్గీయుల వైఖరిపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పారిపోయిన వరదాపురం సూరీ మళ్లీ టిక్కెట్ కోరటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ టిక్కెట్ వందకోట్లకు కొంటానంటూ సూరీ, ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారాన్ని పరిటాల శ్రీరాం ఖండిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెనుకొండ వద్ద జరిగిన చంద్రబాబునాయుడు రా. కదలిరా సభకు జనాన్ని సమీకరించడానికి పరిటాల శ్రీరాం- వరదాపురం సూరీ పోటీపడ్డారు. పైగా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. వరదాపురం సూరీ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై పరిటాల వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వరదాపురం సూరీ వర్గీయులు కూడా ప్రతిదాడులు చేశారు. దీంతో దాదాపు పది వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య దాదులు ప్రతిదాడులతో బత్తలపల్లి ప్రాంతం రణరంగమైంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదాపురం సూరి, పరిటాల శ్రీరాం వర్గాల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని సాధారణ ప్రజలు భయపడే పరిస్థితి కొనసాగుతోంది. టీడీపీ నేతల తీరుపై సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పరిటాల శ్రీరాం- వరదాపురం సూరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నిజాలు సమాధి చేయబోయి.. చివరికి తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ..
సాక్షి, ధర్మవరం: హిందూముస్లింల ఐక్యతకు, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ధర్మవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అలజడులు సృష్టించాలని పన్నాగం పన్నారు. తన స్వార్థం కోసం కబరస్తాన్‌ను పావుగా వాడుకున్నారు. పట్టణంలోని మసీదు, అంజుమన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగే అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై బురద జల్లాలని ప్రయత్నించారు. అసలేం జరిగిందంటే.. ధర్మవరం ఇందిరానగర్‌లో ముస్లింల కబరస్తాన్ ఉంది. దానికి ఆనుకునే ఎగువ భాగంలో పెద్ద డ్రైనేజీ ఉంది. దీంతో మురుగునీరు తరచూ కబరస్తాన్లోకి వచ్చి చేరుతుండగా, సమాధులన్నీ మునిగిపోతున్నాయి. దీనికి తోడు స్థలం తక్కువగా ఉండటంతో కబరస్తాన్ పూర్తిగా సమాధులతో నిండిపోయింది. దీంతో ముస్లింలు ఎవరైన చనిపోతే ...వారి అంత్యక్రియలను పట్టణానికి 6 కి.మీ దూరంలోని ఈద్గా మైదానంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం కోసం చర్యలు.. కబరస్తాన్‌లో మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు వసతులు కల్పించేందుకు గత అక్టోబర్‌లో.. జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు సమావేశం నిర్వహించారు. కబరస్తాన్‌ను పునర్ నిర్మించాలని 40 మసీదులకు చెందిన ముతవల్లీలు ఆమోదించి తీర్మానం చేశారు. అందులో భాగంగా కబరస్తాన్లోని సమాధులను తొలగించి మైదానం మొత్తం 4 అడుగులకుపైగా మట్టితో ఎత్తు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అభ్యంతరాలకు రెండు నెలల సమయం తీసుకున్నారు. అందుకు గడువు కూడా ముగియడం, ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో 3 రోజుల క్రితమే మసీదు కమిటీలు, అంజుమన్ కమిటీల ఆధ్వర్యంలో మత పెద్దలు, దాతల సహకారంతో పనులను ప్రారంభించారు. పరిటాల శ్రీరామ్ రంగ ప్రవేశంతో రాజకీయ రంగు కబరస్తాన్ పునరి్నర్మాణ పనులు ప్రశాంతంగా సాగిపోతుండగా... గురువారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వాటి గురించి తెలుసుకున్నారు. స్థానికంగా నివాసం లేని ఆయన...నిజానిజాలు తెలుసుకోకుండా కబరస్తాన్‌లో సమాధులను ఏక పక్షంగా తొలగిస్తున్నారని, ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. దీనిపై ముస్లిం మత పెద్దలంతా స్పందించారు. కబరస్తాన్ పునర్ నిర్మాణ పనులన్నీ తమ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, దానికి రాజకీయ రంగు పులమడం అన్యాయమన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దని రాజకీయ పారీ్టల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి ఆమోదంతోనే పనులు.. ర్మవరంలోని అన్ని మసీదు కమిటీలతో చర్చించి 40 మంది ముతవల్లీల ఆమోదంతోనే కబరస్తాన్ పునరి్నర్మాణ పనులు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. రాజకీయ పారీ్టల నాయకులు ఇందులో జోక్యం చేసుకోకూడదు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే మేము చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాం. – ముస్తాక్ అహ్మద్, ముతవల్లి, జామియా మసీదు, ధర్మవరం. రాజకీయం చేయొద్దు ఇస్లాం సంప్రదాయంలో కబరస్తాన్ల పునర్నిర్మాణం కొత్తేమీ కాదు. గతంలో అనంతపురంలోని ఈద్గాలో, బత్తలపల్లి కబరస్తాన్, హిందూపురంలోనూ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ధర్మవరంలోనూ అందరి ఆమోదంతోనే ముస్లింలతా కలసికట్టుగా దాతల సహకారంతో కబరస్తాన్‌ను పునర్నిర్మిస్తున్నాం. వీటిని రాజకీయం చేయవద్దు. – జాకీర్, ముతవల్లి, మదీనా మసీదు, ధర్మవరం ఐక్యతను దెబ్బతీయొద్దు కబరస్తాన్ పునర్ నిర్మాణం పవిత్ర కార్యం. ఇందులో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోకూడదు. అంజుమన్ కమిటీ, మతపెద్దలు, మసీదు కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. ప్రతి ముస్లిం ఈ పనుల్లో భాగస్వామిగా ఉంటాడు. ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దు. – స్టార్ ఖలీల్, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు, ధర్మవరం గీత దాటితే చర్యలు కబరస్తాన్ పునర్ నిర్మాణం సున్నితమైన అంశం. ఏ ఒక్కరూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు. ఈ విషయంపై ఇప్పటికే ముస్లిం మత పెద్దలందరితో చర్చించాం. కబరస్తాన్ పునరి్నర్మాణంలో ఎవరికైనా సందేహాలుంటే మత పెద్దల ద్వారా నివృత్తి చేసుకోవాలి. చట్టపరిధి దాటి సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేసినా, భావోద్వేగాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు. – సుబ్రమణ్యం, వన్‌టౌన్ సీఐ, ధర్మవరం -
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
భూ బకాసురుడు 'వరదాపురం'
సాక్షి, అనంతపురం: ఆయనో మాజీ ప్రజాప్రతినిధి. వందల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టాడు. అమాయక రైతు లను బెదిరించి కనిపించిన పొలాన్నల్లా లాక్కున్నాడు. అంతేకాదు.. అసైన్డ్ భూముల చట్టానికి తూట్లు పొడిచి అధికారం లో ఉండగా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడు. వాగులు, వంకలను కలిపేసుకున్నాడు. చుట్టు పక్కల పొలాలకు దారి వదలకుండా రైతులను వేధిస్తున్నాడు. ఎవరైనా సరే తనకు మాత్రమే విక్రయించాలని లేదంటే గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాడు. ఈ అరాచకాలను భరించలేక ఏకం గా ఒక గ్రామమే ఖాళీ కావటాన్ని బట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో వేరే చెప్పాలా? అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ భూ దందాలు, దౌర్జన్యాలివీ.. టీడీపీ అధికారంలో ఉండగా.. ముదిగుబ్బ మండలం ముక్తాపురం రెవెన్యూ పరిధిలో చిన్న, సన్నకారు రైతులే అధికం. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న సూరి గ్రామంలో పొలాల ఆక్రమణల పర్వాన్ని ప్రారంభించాడు. నితిన్‌సాయి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 332.45 ఎకరాలను రైతుల నుంచి కారుచౌకగా కాజేశాడు. ఇందులో 155.88 ఎకరాలు ప్రభుత్వ, అనాదీన, చుక్కల భూములే కావడం గమనార్హం. నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను వరదాపురం బలవంతంగా సొంతం చేసుకున్నాడు. సూరి కుమారుడు నితిన్‌సాయి, సతీమణి నిర్మలాదేవి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. చండ్రాయునిపల్లి ఖాళీ ముక్తాపురం రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా సూరి వేధించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే రైతుల పొలాల్లో నీళ్ల మోటార్లు, స్టార్టర్ పెట్టెలు రాత్రికి రాత్రే మాయమయ్యేవి. దీంతో దిక్కుతోచక అయినకాడికి అమ్ముకుని వలస వెళ్లిపోయారు. ఇలా చండ్రాయునిపల్లి అనే గ్రామం మొత్తం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలు, కూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అసైన్మెంట్ చట్టానికి తూట్లు 1977 అసైన్మెంట్ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. దీన్ని బేఖాతర్ చేస్తూ నితిన్‌సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట ఏకంగా 155.88 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందుకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సహకరించారు. పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసేశారు. ఆధారాలు ఇవిగో.. నితిన్‌సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట వరదాపురం సూరి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం పరిధిలో 48–2, 50, 52–3, 53–2, 54–1, 57–1, 57–2, 63–1, 63–2, 63–3, 84, 85–1, 85–2, 86, 87–1ఎ, 87–1బి, 87–2, 88, 96–1, 96–2, 97, 106–2,106–3, 113, 119, 134, 199, 203, 378 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అనాదీన, అసైన్డ్, గయాలు లాంటి నిషేధిత జాబితాలోని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పొలానికి వెళ్లనివ్వడం లేదు.. ముక్తాపురం, చండ్రాయునిపల్లి మధ్యలో 330 ఎకరాలకు పైగా కొనుగోలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మేం పొలానికి వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదు. అక్కడ మాకు మధ్యలో పది ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తుండంతో దిక్కు తోచడం లేదు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. – వెంకటేశ్ నాయక్, ముక్తాపురం తండా మా గ్రామాన్ని కాపాడండి.. వరదాపురం సూరి ఇక్కడ భూములు కొన్నప్పటి నుంచి మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా పొలాల వద్దకు వెళ్లాలంటే సూరి భూములను దాటుకుని వెళ్లాలి. ఆయన మా పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఈ దౌర్జన్యాలను తట్టుకోలేక ఇప్పటికే చండ్రాయునిపల్లి ఖాళీ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మేం కూడా ముక్తాపురం వదిలి వెళ్లక తప్పదు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. – కేశవ, ముక్తాపురం -
ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్: సూరీ.. ప్రమాణానికి సిద్ధమా ?
సాక్షి, ధర్మవరం టౌన్: ‘మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే అన్ని సౌకర్యాలతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ఎంఐజీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఇస్తోంది. అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో ఎల్లో మీడియా, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి దుష్ప్రచారానికి తెరతీయడం సిగ్గుచేటు’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంఐజీ లేఅవుట్లపై ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా చూపించారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీఐఐసీ కుణుతూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఎకరా రూ.4.75 లక్షలు నిర్ణయించి 126 ఎకరాలను ఎంఐజీ లేఅవుట్ కోసం సేకరించిందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ఒక్కో ఎకరానికి రూ.25 లక్షలు ప్రకారం పరిహారం అందించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఇక జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్ కింద ఇస్తున్న ప్లాట్లు అభివృద్ధి చేయకుండానే ఇచ్చేస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లేఅవుట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందని, ఈనెల 17న టెండర్ కూడా పూర్తి చేశామన్నారు. ఈ ఏడాదిలోపే లేఅవుట్లో సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు. ఇవేవి తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద జల్లే వార్తలు రాయడం దారుణమన్నారు. ఎంఐజీ సమీపంలో తాను కూడా వెంచర్ వేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నానని ఆరోపిస్తున్నారని, వాస్తవంగా ఎంఐజీ లేవుట్ ప్రతిపాదన రాక ముందే తాను వెంచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంఐజీ లేఅవుట్ ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోందని, ఆ లేవుట్ రావడం వల్ల ప్రైవేటు వెంచర్లకు నష్టం తప్ప లాభం ఉండదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: (Railways: ఇకపై ఆ రైళ్లలో జనరల్ ప్రయాణం) సూరీ... ప్రమాణానికి సిద్ధమా ? ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సూరి చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. తాను ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో బ్రిటీష్ కాలంలోనే పట్టాలు పొందిన రైతులకు సంబంధించిన 25 ఎకరాలను కొనుగోలు చేశానన్నారు. ఎన్ఓసీ లేకుండానే వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వం 575 జీఓ ఇచ్చిందని వివరించారు. ఇవన్నీ పక్కన పెట్టి వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించిన ఆర్‌హెచ్, డైక్లాట్, రైతుల వివరాలను మీడియాకు అందించారు. తాను కొనుగోలు చేసిన భూమిలో రూ.25 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మిస్తే రూ,కోట్లతో ఇంటి నిర్మాణం చేపట్టానని ఆరోపించడం హేయమన్నారు. రూ.7.50 లక్షల వ్యయంతో కొన్న చిన్నబోటును చెరువులోకి తీసుకెళ్తే... స్టీమర్లు కొన్నారని సూరి చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. గత లాక్డౌన్లో హార్స్‌రైడింగ్ నేర్చుకునేందుకు తాను, తన స్నేహితులు అనంతపురం నుంచి గుర్రాలను అద్దెకు తెచ్చుకుంటే... రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని సూరి ఆరోపించారని మండిపడ్డారు. తుంపర్తి పొలంలో నాగమ్మ దేవాలయాన్ని ఆక్రమించానని, గుప్తనిధులు తీశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాగమ్మ కట్ట వద్ద ఉన్న వేప చెట్టు స్థలాన్ని వదిలి కంచె వేసిన ఫొటోలను, చెరువు ఆక్రమించలేదని నిరూపించే శాటిలైట్ చిత్రాలను మీడియాకు అందించారు. వరదాపురం సూరికి దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు కట్టుబడి శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలో గానీ, తాడిపత్రి చింతల రాయుడు దేవాలయంలో గానీ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు. -
బోరును అడ్డుకుంటే మీ ప్రాణాలు తీస్తా: బీజేపీ నేత దౌర్జన్యం
తాడిమర్రి: ఓ పేద రైతు కుటుంబంపై బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంగులకుంట గోపాల్‌రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బోరుబావిని తవ్వేందుకు యత్నిస్తున్న ఆయన.. అడ్డుకుంటే ప్రాణాలు తీయిస్తా అంటూ భయపెడుతున్నారు. చేసేది లేక ఆ రైతు కుటుంబం విలేకరులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బీసీ కాలనీకి చెందిన దేవర వెంకట్రాముడు, లక్ష్మీదేవి దంపతులకు తాడిమర్రి సర్వేనంబర్ 561లో 5.29 ఎకరాల పొలం ఉంది. బోర్లు వేసి వేరుశనగ సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం 800 చీనీచెట్లు నాటుకున్నారు. వీరి పొలం పక్కనే బీజేపీ నాయకుడు గోపాల్ రెడ్డి భూమి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బోరు ఉంటే దానికి 200 అడుగుల దూరం పైన మరో బోరు వేయాల్సి ఉంటుంది. అయితే, గోపాల్ రెడ్డి 30 అడుగుల లోపు బోరు వేసుకునేందుకు కొన్ని రోజుల క్రితం యత్నించాడు. అక్కడ బోరు వేస్తే తమ బోరులో నీరు పోతాయంటూ వెంకట్రాముడు కుటుంబం అడ్డు చెప్పగా, గోపాల్ రెడ్డి వారిపై దౌర్జన్యానికి దిగాడు. అంతటితో ఆగక ఒక బోరులో రాళ్లు వేశాడు, మరో బోరు, మీటర్ పెట్టె ధ్వంసం చేశాడు. బోరు వేయకుండా అడ్డుకుంటే మీ ప్రాణాలు తీయిస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన బాధిత రైతులు ఆదివారం విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమకు గోపాల్ రెడ్డి నుంచి ప్రాణాపాయం ఉందని, ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
నవ్వు‘తారు’.. సూరీ!
సూరి. ఈ పేరు చర్చకు వస్తే మొదటగా గుర్తొచ్చేది వెన్నుపోటు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు వెంటనడిచిన ‘తమ్ముళ్ల’ను గాలికొదిలేసి సొంత ‘వ్యాపారం’ చూసుకునేందుకు పార్టీ ఫిరాయించిన నేతగానే ఇప్పుడు ధర్మవరం చూస్తోంది. అధికారంలో ఉండగా దక్కించుకొన్న కాంట్రాక్టుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో బతుకుజీవుడా అని ‘కమలం’ పంచన చేరడం తెలిసిందే. ఈ కోవలోనే ఆయన చేపడుతున్న అనంతపురం–కదిరి రహదారి పనులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆ నల్లని రోడ్డు వెనుక దాగిన అవినీతి ఔరా అనిపిస్తుంది. సాక్షి, అనంతపురం: నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న రోడ్డు పనుల్లో నాణ్యత నవ్వులపాలవుతోంది. ఎక్కడా నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు కనిపించవు. రోడ్డు పూర్తి చేస్తున్నారనే మాటే కానీ.. నాలుగు కాలాల పాటు నిలుస్తుందనే నమ్మకం కనిపించదు. అనంతపురం–కదిరి రహదారి పనులే ఆ సంస్థ తాజా అవినీతికి నిదర్శనం. రోడ్డు పనుల్లో ఎర్రమట్టి, గులకరాళ్లతో కూడిన మొరుసును కాకుండా నల్లమట్టి, సుద్దను వినియోగిస్తుండటం చూస్తే ఈ రోడ్డు ఎంతకాలం నిలుస్తుందో ఇట్టే అర్థమవుతుంది. మొరుసు కంటే నల్లమట్టి, సుద్ద తక్కువ ధరకు లభిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సూరి నిబంధనలకు నీళ్లొదిలారు. ఈ కారణంగా రోడ్డు పక్కన వాహనం వెళితే.. ప్రధానంగా వర్షాకాలంలో దిగబడిపోయి చుక్కలు చూడాల్సిందే. ఇకపోతే అధికారికంగా వాహనాల రాకపోకలు ప్రారంభం కాకముందే రోడ్డు తేలిపోయింది. నాసిరకంగా కంకర తేలి దర్శనమిస్తోంది. ఎక్కడికక్కడ ప్యాచులు వేయడంతో పాటు.. పనుల్లో వినియోగిస్తున్న కంకర కూడా పొడిగా ఉండటం నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తోంది. తేలిపోతున్న నాణ్యత...! వాస్తవానికి జాతీయ రహదారి పనులను ఎంతో నాణ్యతగా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా అప్పుడే రోడ్డు కాస్తా కంకర తేలి నాసిరకంగా దర్శనమిస్తోంది. అనంతపురం నుంచి కదిరి వరకు వెళ్లే మార్గంలో 76 కిలోమీటరు నుంచి 99.92 కిలోమీటరు వరకు మొత్తం 22.92 కిలోమీటర్ల పొడవున ఈ పనులను సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపడుతోంది. ఇప్పటివరకు సుమారు 18 కిలోమీటర్ల మేర పనులను కంపెనీ పూర్తి చేసింది. మరో 5 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సంస్థకు రూ.75 కోట్ల మేర బిల్లులను కూడా చెల్లించేశారు. ఈ రోడ్డు పనుల్లో సదరు కంపెనీ వాడుతున్న సుద్దపొడి కూడా ఉచితంగా దొరికేదే అనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మొరుసును వాడితే తారు రోడ్డు పక్కనే ఉండే రోడ్డు కూడా గట్టిపడుతుంది. దీంతో ఏదైనా వాహనం దీనిపై వెళితే రోడ్డు కుంగిపోయే అవకాశం ఉండదు. అందుకే మొరుసును వాడాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మాత్రం ఉచితంగా దొరికే సుద్దపొడితో పాటు నల్లమట్టిని కలిపి వాడుతున్నారు. నిర్మాణ వ్యయం తగ్గించుకుని భారీగా లాభాలు ఆర్జించేందుకు సదరు సంస్థ చేస్తున్న వ్యవహారంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి రానుంది. రోడ్డు పనులకు వినియోగిస్తున్న నల్లమట్టి, సుద్ద పనులన్నీ నాసిరకమే.. వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏ పని మంజూరైనా.. ఏ సంస్థకు కాంట్రాక్టు దక్కినప్పటికీ పనులు మాత్రం సదరు సూరీ కంపెనీయే చేపట్టాలి. ఈ మేరకు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కూడా పనులను సబ్‌కాంట్రాక్టు కింద వీరికి అప్పగించాల్సిందే. లేనిపక్షంలో సదరు కాంట్రాక్టు సంస్థ పనులు చేసే పరిస్థితి లేకుండా ఉన్న దుస్థితి. కొద్దిరోజుల క్రితం ఇదే ధర్మవరం మండలంలోని దర్శనమల ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడ కేవలం గాలికే కుప్పకూలిపోయింది. కనీసం సిమెంటు బెడ్ లేకుండా నాసిరకం ఇటుకలు పేర్చుకుంటూ పోవడంతో సదరు సూరి అనుచరులు నిర్మించిన గోడ గాలికే కుప్పకూలింది. ఇదే తరహాలో నియోజకవర్గంలో సూరి, ఆయన అనుచరులు చేపట్టిన పనులన్నీ నాసిరకంగా ఉంటూ 50 శాతం మేర నిధులను దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పనులన్నింటిపైనా విచారణ చేయాలంటూ రాష్ట్ర విజిలెన్స్‌తో పాటు కేంద్ర విజిలెన్స్‌కు కూడా అనేక ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై విచారణ చేస్తే అనేక అవకతవకలతో పాటు భారీ అవినీతి వ్యవహారం బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోది. ఈ నేపథ్యంలోనే విచారణ జరగకుండా తనను తాను కాపాడుకునేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుల వ్యవధిలోనే పార్టీ మారినట్లు చర్చ జరుగుతోంది. -
ఎమ్మెల్యే అభ్యర్థికి గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు..!
-
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..!
సాక్షి, ధర్మవరం: టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని పాండురంగ వీధిలో పర్యటించారు. స్థానిక సమస్యలపైన మహిళలు ఆయన్ను గట్టిగా నిలదీశారు. ‘ఇంటి పట్టాలకోసం ఐదేళ్లలో పది సార్లు అర్జీలు ఇచ్చినాం.. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా.. నీ వెనుక తిరిగే వాళ్లకు పట్టాలు ఇచ్చినావ్’ అంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండా సూరి దాటేసుకుని వెళ్లిపోయారు. స్థానిక నాయకులు ‘మేమున్నాంలేమ్మా.. మళ్లీ అధికారంలోకొస్తే ఇప్పిస్తాం ’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. చూసినాం పోప్పా..’ అంటూ వారిని అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అక్కడా నిలదీతే.. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తమకు అందేలా చేయలేదని చేనేతలు సైతం గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి)ను నిలదీశారు. ‘చేనేత ముడిపట్టు రాయితీలూ బకాయి ఉంది.. ఇంకేం చేశారని మీకు ఓటు వేయాలి.. ఈ ఐదేళ్లలో మీ ఇంటి వద్దకు ఎన్నిసార్లు తిరిగినాం.. ఒక్క మగ్గం లోన్ అయినా ఇప్పించారా? ఒక్క బీసీ రుణ మైనా మంజూరు చేశారా? ఏమన్నా అంటే మీ వార్డు కౌన్సిలర్‌ను అడుగు, మీవార్డు ఇన్‌చార్జ్‌ను అడుగండి అంటారు’ అని చేనేత అన్నలు ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా గుక్కతిప్పుకోండా.. టీడీపీ నాయకుల వైఖరిని ఎండగట్టారు. -
ఫ్యాక్షన్ పోకడలకు జీవం..ధర్మవరం
సీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ధర్మవరం. రాజకీయం అండతో ఇక్కడ విచ్చు కత్తులు స్వైరవిహారం చేశాయి. పచ్చ చొక్కాల అధికార దాహానికి రక్తపుటేరులు తక్కువ పడ్డాయి. ఎగిసి పడ్డ బాంబులు.. తుపాకుల మోతలు.. తెగిపడ్డ కుత్తుకల హాహాకారాలతో ధర్మవరం నియోజకవర్గంలో నాడు అధర్మమే రాజ్యమేలింది. వెన్నుపోటు రాజకీయాలతో అధికారాన్ని చేజిక్కించుకుని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తొలిదశలో ధర్మవరం నియోజకవర్గంలో అరాచకాలు పెచ్చుమీరాయి. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ పాగా వేసేందుకు ఆర్వోసీ పేరుతో రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెడుతూ వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మవరంలో శాంతి బీజాలు పడ్డాయి. ఫ్యాక్షన్ ప్రభావం పూర్తిగా కనుమరుగైన సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పరిస్థితిని పూర్వపు స్థితికి కంటే మరింత దిగజార్చింది. జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా రాజకీయ చరిత్ర పుటల్లో ధర్మవరం చేరిపోయింది. సాక్షి, ధర్మవరం: ధర్మవరం పేరు వినగానే మొదట గుర్తొచ్చేది చేనేత రంగం. శ్రమజీవుల కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో చేనేతకు ఇక్కడి నేత కార్మికులు గుర్తింపు తీసుకువచ్చారు. నియోజకవర్గ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయం, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. 1955 నుంచి జనరల్ కేటగిరి కింద ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుఫున పప్పూరు రామాచారి గెలుపొందారు. మొత్తం 13 దఫాలు జరిగిన ఎన్నికల్లో గరుడమ్మగారి నాగిరెడ్డి వరుసగా మూడుసార్లు (1983, 1985, 1989) ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఇందులో తొలిసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అత్యంత జనాదరణ పొందిన నేతగా నాగిరెడ్డికి పేరుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వైఖరితో విసుగు చెందిన సొంత పార్టీలోనే విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది సీనియర్లు ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. చేనేతలను ఆదుకోవడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలం కావడంతో ఆ వర్గం టీడీపీపై పూర్తి అసంతృప్తితో ఉంది. ఈ రెండేళ్లలో అధికారపార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి చేరిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఎమ్మెల్యే సూరి ఒంటెద్దు పోకడ నచ్చక చాలా మంది వైఎస్సార్ సీపీలో చేరారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉండిపోయారు. సంక్షేమం దూరం చేనేతలకు అందుతున్న అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ పథకం, చేనేత ఆరోగ్య బీమా పథకాలు కార్మికులకు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు టీడీపీ నాయకులకు కమీషన్లు ముట్టజెప్పనిదే ఏ పనీ జరగడం లేదు. సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సూరి తన గుప్పిట్లోకి తీసుకుని కమీషన్ల పైరవీలో జోరుగు నడిపించారు. ఆయన వైఖరి కారణంగా రియల్ వ్యాపారం కుదేలైంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వారి భూములను 08 ఖాతాలోకి చేర్పిస్తూ సామాన్యులతో పాటు రియల్టర్లనూ ఇబ్బంది పెట్టారు. గ్రామాల్లో అర్హత లేకపోయినా.. టీడీపీ అనే ముద్ర ఉంటే చాలు సంక్షేమ పథకాలను కట్టబెడుతూ వచ్చారు. శ్రమజీవుల కేంద్రంగా.. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండలం, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3లక్షల జనాభా ఉండగా, 2,23,007 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,11,980, మహిళలు 1,11,001 ఉన్నారు. చేనేతలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం శ్రమ జీవుల కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇంటికో మగ్గం చొప్పున వీధివీధిలో మగ్గం చప్పుళ్లు నిత్యమూ వినిపించేవి. ప్రపంచీకరణ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడంతో నేతన్నలు కుదేలయ్యారు. ముడిసరుకు ధరలు అమాంతం పెరిగి గిట్టుబాటు ధర లభ్యం కాక అప్పుల ఊబిలో చేనేతలు కూరుకుపోయారు. నేతన్నలను ఆదుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వచ్చారు. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల నిరాదరణ కారణంగా చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాన సమస్యలివే.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా తాగు, సాగునీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని దాదాపు 80 శాతం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 చెరువులు ఉన్నాయి. అయితే ఒక్క ధర్మవరం చెరువుకు తప్ప మిగిలిన చెరువులకు సాగునీరు ఇవ్వలేకపోయారు. ధర్మవరం పట్టణంలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రోజూ 300 నుంచి 500 వరకు ఓపీ నడుస్తూ ఉంటుంది. ధర్మవరం మున్సిపాలిటీతోపాటు, ధర్మవరం మండలం, బత్తలపల్లి ప్రజలు ఇక్కడికి చికిత్సల కోసం వస్తుంటారు. అత్యవసర వైద్య సేవలకు అనంతపురం తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో మౌలిక వసతులూ కరువయ్యాయి. తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని ముంపు గ్రామాల నిర్వాసితులకు నేటికీ పరిహారం సక్రమంగా అందలేదు. ధర్మవరం పట్టణంలో అత్యధికంగా ఉన్న చేనేతలు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదు. శాంతి కుసుమాలు పూయించిన కేతిరెడ్డి 2009లో వైఎస్సార్ నేతృత్వంలో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో శాంతి కుసుమాలు పూయించేందుకు కేతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చరిత్ర పుటలు తిరగేస్తే క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అనే పదాలు వినపడుతుంటాయి. అదే తరహాలో కేతిరెడ్డికి ముందు.. కేతిరెడ్డి తర్వాత అంటూ గొప్పగా చెప్పుకునేలా ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. కేతిరెడ్డి హయంలో ధర్మవరం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కింది. చిత్రావతి నది నుంచి ధర్మవరానికి తాగునీటిని అందించారు. నియోజకవర్గంలోని 80 శాతం గ్రామాలకు రోడ్లు వేయించారు. చేనేతల ఇబ్బందులు తీర్చేందుకు ముడిపట్టు రాయితీ పథకాన్ని తీసుకువచ్చారు. ముడిపట్టు ధరలు పెరిగిన నేపధ్యంలో ఎన్‌హెచ్‌డీసీ స్కీంను తీసుకువచ్చి వారికి ఆసరాగా నిలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ అటకెక్కించేశారు. -
కార్యకర్తల హోరు.. ప్రచారం జోరు
సాక్షి, బత్తలపల్లి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మొదటిరోజు ఎన్నికల ప్రచారం గురువారం చేపట్టారు. ముందుగా శ్రీతలితా త్రిపుర సుందరీ సమేత శ్రీఓంకారేశ్వరుడి సన్నిధిలో పూజలు చేశారు. అక్కడ వేదపండితుల ఆశీర్వాదం తీసుకొని ఆశేష జనవాహిని మధ్య ప్రచారం చేపట్టారు. అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలో మహిళలు హారతులు పట్టి, స్వాగతం పలికారు. మైనార్టీ కాలనీ, ఎస్టీ కాలనీ, వడ్డెర వీధి, వాల్మీకుల వీధి, పాతవూరు, నాలుగు రోడ్లలోనూ ప్రచారం నిర్వహించారు. ఆయా కాలనీల్లో స్థానికులు సమస్యలను కేతిరెడ్డి దృష్టికి తెచ్చారు. వృద్ధులకు పింఛన్ రూ.3వేలు పెంచుతామన్నారు. ఇంటింటా ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వివరించారు. ప్రచారంలో ఎంపీపీ కోటి బాబు, వైస్ ఎంపీపీ గొల్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు అక్కిం నరసింహులు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గజ్జెల వెంగళరెడ్డి, మాతంగి రామాం జనేయులు, వడ్డె కృష్టా, బగ్గిరి రామ్మోహన్‌రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరీంసాబ్, మాజీ సర్పంచులు సానే సూర్యనారాయణరెడ్డి, సంజీవు, లక్ష్మీనారాయణ, జయరామిరెడ్డి, కప్పల నారాయణస్వామి, చిన్న లింగారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు సానే జయచంద్రారెడ్డి, జాంపుల చంద్రమోహన్, డి.చెర్లోపల్లి చల్లా కృష్టా, దరూరి రామకృష్ణ, గుజ్జల ముసలయ్య, సండ్రా రామకృష్ణ, రాంభూపాల్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సీతా రామిరెడ్డి, నాగేంద్ర, రమేష్, గరిశలపల్లి చిన్నా, ఈశ్వరయ్య పాల్గొన్నారు. ప్రచారం షురూ : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బత్తలపల్లి నుంచి ప్రచారం ప్రారంభించారు. స్థానిక శివాలయంలో పూజలు అనంతరం ప్రచారం ప్రారంభించారు.అన్నా.. మీరు గెలవాలి , అన్నా.. మీరు గెలవాలన్నా.. మాలాంటి వారికి అండగా ఉండాలంటూ మానసిక వికలాంగుడు ఇమాముద్దీన్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డితో అన్నాడు. గురువారం బత్తలపల్లి ప్రచారంలో చేసిన సమావేశంలోకి వచ్చి అన్నతో మాట్లాడాలని కోరారు. దీంతో వేదిక దిగి వచ్చి బాలుడుతో మాట్లాడారు. దీంతో ఆ బాలుడు ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బత్తల పల్లి నూరుల్లా, వెంకటగారిపల్లి శేఖర్‌ను కేతిరెడ్డి పరామర్శించారు. -
మహిళను చెప్పుతో కొట్టమన్న టీడీపీ ఎమ్మెల్యే!
సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బరితెగించారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఓ మహిళా రైతును చెప్పుతో కొట్టాలని తన అనుచరులను ఆదేశించారు. మహిళపై దాడిచేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని పోలీసులుకు సురీ హుకుం జారీ చేశారు. ఈ వ్యవహారమంతా పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే జరిగినా వారునోరు మెదపక పోవటం గమనార్హం. ఇకపై భూసేకరణను ఎవరు ఎదిరించినా వారిపై దాడులు చేయాలని అతని అనుచరులను సురీ అదేశించారు. శుక్రవారం జరిగిన ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎమ్మెల్యే తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓట్లేసి గెలిపించిన తమని ఇలా చెప్పులతో దాడి చేయిస్తారా అని నిలదీస్తున్నారు. -
మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు!
-
బరితెగింపు
ధర్మవరం అర్బన్ : ధర్మవరం నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. రేషన్ డీలర్‌షిప్‌ను దక్కించుకోవడానికి ఓ డీలర్ భర్తను కొందరు కిడ్నాప్ చేశారు. రాజీనామా చేయకపోతే చంపేస్తామని బెదిరించి పోలీస్‌స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లారు. పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో రేషన్ షాపు నెంబర్ 112ను నారాయణరెడ్డి భార్య శకుంతల నడుపుతున్నారు. స్టాక్ వచ్చిందని గోడౌన్లో పనిచేసే వ్యక్తితో నారాయణరెడ్డికి ఫోన్ చేరుుంచారు. ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి స్టాక్ లారీలో పంపించి, వెనుక మోటార్ సైకిల్లో బయలుదేరాడు. గేటు వద్ద నారాయణరెడ్డిని సుమారు 10 మంది చుట్టుముట్టి చేరుు చేసుకున్నారు. తమ వెంట రాకపోతే ఇక్కడే ఏమైనా చేసేస్తామని హెచ్చరించి ఆయన బండ్లో మరో ఇద్దరు కూర్చొని బత్తలపల్లి వైపు తీసుకెళ్లారు. సంజీవపురం సమీపంలో వాహనం ఆపి తీవ్రంగా కొట్టారు. భార్య శకుంతలకు ఫోన్ చేయించి నీ వద్దకు నరసింహులు భార్య వస్తుందని తెల్లకాగితంపై సంతకం చేయాలని సూచించారు. అయితే భర్త గొంతులో తడబాటును గమనించిన శకుంతల ఏమి జరిగిందని ప్రశ్నించేలోగా.. రామకృష్ణ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని తెల్లకాగితంపై సంతకం చేయకపోతే నీ భర్తను చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన శకుంతల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, నరసింహులు భార్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి తెల్ల కాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. శకుంతల వారి నుంచి తప్పించుకుని ఏఎస్పీ అబిషేక్ మహంతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఏఎస్పీ వద్ద శకుంతల ఉండగానే కిడ్నాపర్లు మరోసారి ఆమెకు ఫోన్ చేసి హెచ్చరించారు. నిందితులను పట్టుకుని విచారిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు. అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో కిడ్నాపర్లు నారాయణరెడ్డిని పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద సాయంత్రం 5 గంటలకు వదిలిపెట్టి వెళ్లారు. స్టాక్‌ను కూడా కేతిరెడ్డికాలనీలో నరసింహులు బంధువుల ఇంటిలో దింపుకున్నారు. ఆరుగంటల పాటు కిడ్నాపర్లు నారాయణరెడ్డిని వారి అదుపులో ఉంచుకున్నారు. పక్కా వ్యూహంతో ముందుగా కాపుకాచి ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. కాగా, కిడ్నాప్‌కు గురైన బాధితుడితో మాట్లాడించాలని విలేకరులు కోరగా.. సీఐ భాస్కర్‌గౌడ్ అందుకు సమ్మతించ లేదు. బాధితుడిని విచారిస్తున్నామని, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు. ధర్మవరం నియోజకవర్గం, రేషన్ డీలర్షిప్, అరాచకం, Dharmavaram constituency, the ration dealers, anarchy -
ఇసుకాసురులు
ధర్మవరం : దర్మవరం నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ నాయకులు తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లోని చిత్రావతి నది పరీవాహక ప్రాంతం నుంచి రోజూ వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బెంగళూరు, బాగేపల్లి, యలహంక, అనంతపురం, హిందూపురం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట, కనంపల్లి, పోతుల నాగేపల్లి వద్ద నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలించి.. డంప్‌లలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి జేసీబీల ద్వారా లారీలకు లోడ్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. ధర్మవరం మండలం కనంపల్లి- చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఒకటి, ధర్మవరం మండలం కొత్తకోట వద్ద, చెన్నేకొత్తపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో, బసంపల్లి చెరువులో డంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. చిత్రావతి నది నుంచి డంప్ వద్దకు ఒక లారీకి సరిపడే ఇసుక (5 లోడ్లు) తరలించినందుకు గాను ట్రాక్టర్ బాడుగ రూ.10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. లారీ ఇసుకను బెంగళూరులో రూ.70 వేలు, బాగేపల్లిలో రూ.50 వేలు, హిందూపురంలో రూ.45 వేల చొప్పున విక్రయిస్తున్నారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల, మోదుగులకుంట, దాడితోట గ్రామాల వద్దనున్న చిత్రావతి నది నుంచి ఇసుకను ఏకంగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించి మండల పరిధిలోని చిల్లావారిపల్లి సమీపంలో, దాడితోట కనంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో చిల్లావారిపల్లి-నార్పల మండలం గూగూడు మీదుగా పెద్దపప్పూరుకు చేర్చి.. అక్కడి నుంచి బత్తలపల్లి మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారు. మర్రిమాకులపల్లి వద్ద నుంచి బత్తలపల్లి మండలం రామాపురం, అప్రాశ్చెరువు, ధర్మవరం మీదుగా బెంగళూరుకు తీసుకెళుతున్నారు. ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు వద్ద చిత్రావతి నది నుంచి, సంకేపల్లి వద్ద జిల్లేడుబండ ఏరు నుంచి ఇసుకను తీసుకెళ్లి సమీప ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణాపురం క్రాస్, బుక్కపట్నం, గోరంట్ల మీదుగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అందరికీ వాటాలు ఇసుక దందాలో గ్రామ స్థాయిలో ఉండే వీఆర్ఓల నుంచి తహశీల్దార్ల వరకు, గ్రామ పోలీస్ నుంచి సీఐ దాకా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. పేపర్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా దాడులు నిర్వహిస్తూ.. జరిమానా విధిస్తున్నారు. ఆ తర్వాత యథావిధిగా దందా నడుస్తోంది. మార్గం మధ్యలో ఉన్న అన్ని చెక్‌పోస్టులలో కూడా ప్రతిలోడుకూ మామూళ్లు ఇచ్చి సరిహద్దులను దాటిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ టీం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఘరానా మోసం ఇసుకను తరలించే లారీలను పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇసుకను లారీలో నింపిన తరువాత దానిపై ఒక అడుగుమేర పశువుల దాణా(తౌడు) కానీ, వరిపొట్టు కానీ వేసి టార్పాలిన్‌ను గట్టిగా బిగించి వేస్తున్నారు. ఎవరైనా తనిఖీ చేపట్టినప్పుడు పశువుల దాణా అని చెబుతూ తప్పించుకుంటున్నారు.