స్వచ్ఛభారత్‌లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానం
ధర్మవరం అర్బన్ : స్వచ్ఛభారత్‌లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానం లభించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రామలక్ష్మి తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛభారత్ కింద ప్రభుత్వం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి మొదటి స్థానం ఇవ్వగా, ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానం వచ్చినట్లు తెలిపారు.
సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, డైరెక్టర్ దేవతా కృష్ణమూర్తి, కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, వైద్యులు లక్ష్మీరాంనాయక్, వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి, వివేక్, యల్లోజీ, కంటి వైద్యుడు ఉరుకుందప్ప, కోఆర్డినేటర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.