dhawaleswaram barrage
-
మరింత పెరిగిన ‘గోదావరి’
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం సా.6 గంటలకు బ్యారేజ్‌లోకి 15,99,761 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. డెల్టా కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 15,90,761 క్యూసెక్కుల ప్రవాహాన్ని అధికారులు 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్టంగా వచ్చిన వరద ఇదే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15.7 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.మరోవైపు.. శనివారం రాత్రి నుంచి బేసిన్లో వర్షాలు కాస్త తెరిపివ్వడంతో ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి తదితర ఉప నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేణ తగ్గుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 48.4 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో గ్రామాలు, రహదారులు ముంపులోనే ఉన్నాయి. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లోని 191 గ్రామాలు వరదలకు ప్రభావితమైనట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. 35,746 కుటుంబాలను 149 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే ఎగువన నీటి మట్టం 34.12 మీటర్లకు తగ్గింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలోని పోలీస్ చెక్‌పోస్ట్‌లో రెండు అడుగుల మేర నీరు చేరింది. దీంతో దీనిని మరోచోటుకి మార్చారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో కూడా ఐదు అడుగుల మేర వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, ఏజెన్సీ సిబ్బంది కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఇక ఎగువన వరద ప్రవాహం క్రమేణ తగ్గుతుండడంతో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టనుంది. లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద..మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోసీమ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో శనివారం కన్నా ఆదివారం సాయంత్రం అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తున వరద పెరిగింది. మరో రెండడుగుల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని లంక గ్రామాల్లో జూన్ 19న మొదలైన వరద ముంపు పది రోజులుగా కొనసాగుతోంది. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. పలు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరుతోంది. వరదలు, భారీ వర్షాలవల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డెల్టాలో మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతుండడంతో సుమారు 5 వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. అలాగే, లంక గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో అరటి, కంద, కూరగాయ పంటలు నీట మునిగాయని అంచనా. మరో నాలుగు రోజులపాటు వరద ముంపు ఉండే అవకాశం ఉన్నందున నష్టం మరింత పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌లు కె.గంగవరం మండలం కోటిపల్లి వరద ప్రాంతాల్లో పర్యటించారు.పరిహారమివ్వండి.. పునరావాసం కల్పించండి..వరద నీటిలో బాధితుల ఆందోళనఏటా వరదల కారణంగా బాధలు పడలేకపోతున్నామని, తమకు పోలవరం పరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో వరద బాధితులు ఆదివారం వరదనీటిలో ఆందోళన చేపట్టారు. ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు తమకు ఈ వరద కష్టాలు తీరడంలేదని, ఏడాది పొడవునా సంపాదించిందంతా వరదల సమయంలో సామాన్ల తరలింపుకే ఖర్చయిపోతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించి తమను ఇక్కడినుంచి తరలించాలని బాధితులు డిమాండ్ చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఐటీడీఏ పీఓ కావూరి చైతన్య హామీతో వారు ఆందోళన విరమించారు. -
గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం
గోదావరి నది చరిత్రలోనే మూడవ అతి పెద్ద వరదను చూశాం. సాధారణంగా ఆగస్టు నెలలో గోదావరికి పెద్ద వరదలు వస్తాయి. అటువంటిది చరిత్రలో మొదటిసారి జూలై నెలలో అతి పెద్ద వరదను చూడాల్సి వచ్చింది. అయినా వరదను ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొంది. కొన్నిచోట్ల గట్లు దాటి ప్రవహించినా గండ్లు పడకపోవడానికి ఏకైక కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు చూపు... దార్శనికతలు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. 1847– 55 మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరిపై సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆనకట్ట నిర్మాణం చేశారు. 1851 నుంచి పి.గన్నవరం వద్ద అక్విడెక్టు నిర్మాణం కూడా చేపట్టారు. ఆ సమయంలో గోదావరి వరద నియంత్రణ పనులు కూడా ఆరంభించారు. దీనిలో భాగంగా బ్యారేజ్ ఎగువ అఖండ గోదావరి, దిగువన గోదావరి నదీ పాయల చుట్టూ ఏటిగట్ల నిర్మాణాలు ఆరంభించారు. నాటి నుంచి నేటి వరకు పలు సందర్భాలలో వరద ఉధృతిని బట్టి ఏటిగట్ల ఎత్తును పెంచుకుంటూ వస్తున్నాం. గోదావరికి 2006లో రెండవ అతిపెద్ద వరద వచ్చింది. ఈ వరద వల్ల ఇప్పటి కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంక, పి. గన్నవరం మండలం మొండెపు లంకల వద్ద ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. పెద్దగా ప్రాణ నష్టం లేకున్నా అంతులేని ఆస్తి నష్టం సంభవించింది. నాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్సార్ ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు చేపట్టమని ఆదేశించారు. 2008 నుంచి డెల్టాలో ఏటిగట్లను పటిష్ఠం చేసే పనులు ఆరంభమయ్యాయి. గోదావరి ఏటిగట్ల విస్తీర్ణం సుమారు 530 కి.మీ.లు. పటిష్ఠం చేసే పనులకు వైఎస్సార్ రూ. 650 కోట్లు కేటాయించారు. 1986 వరదను ప్రామాణికంగా తీసుకున్నాం. నాడు వచ్చిన మాగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్ (ఎంఎఫ్ఎల్)కు రెండు మీటర్లు (6.56 అడుగులు) ఎత్తు చేయడం, గట్టు ఎగువ భాగంలో (టాప్ విడ్త్) 6.5 మీటర్లు (21.32 అడుగులు) వెడల్పున పటిష్ఠం చేశాం. వైఎస్సార్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరగకున్నా అటు గోదావరి, ఇటు గోదావరి పాయల చుట్టూ మహాకుడ్యం ఏర్పడింది. ప్రస్తుతం వచ్చిన వరద వల్ల బ్యారేజ్ నుంచి దిగువకు 25 లక్షల 63 వేల 833 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అయినా గట్లకు నష్టం వాటిల్ల లేదు. నాడు ఏటిగట్లను పటిష్ఠం చేయకుంటే ఇప్పుడు కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్ర విపత్తును చవిచూడాల్సి వచ్చేది. వైఎస్సార్ దార్శనికతే గోదావరి తీర ప్రాంత జనాన్ని కాపాడింది. ఈ మహాయజ్ఞంలో ఇరిగేషన్ అధికారిగా (హెడ్‌వర్క్స్ డీఈఈ, ఈఈ) నేనూ భాగస్వామిని కావడం గర్వంగా అనిపిస్తోంది. (క్లిక్: ‘బురద జల్లుదాం ఛలో ఛలో’) - విప్పర్తి వేణుగోపాలరావు తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్; రిటైర్డ్ ఎస్ఈ, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ -
వరద తగ్గింది
సాక్షి, అమరావతి: వరద నీటితో ఉరకలెత్తిన కృష్ణా నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 6.16 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వచ్చే వరద భారీగా తగ్గింది. ఆల్మట్టిలోకి 2.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్‌లోకి 2 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. భీమానదిలో ప్రవాహం కొంత పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 12,351 క్యూసెక్కులు వస్తుండగా.. 15,590 క్యూసెక్కులను కృష్ణాలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.32 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 5.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.73 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4.24 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 5.13 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చే వరద సోమవారం నుంచి తగ్గుముఖం పట్టనుంది. తగ్గిన గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపివ్వడంతో ఆదివారం గోదావరిలోకి వచ్చే ప్రవాహం తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 6 గంటలకు 4.81 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 13,129 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
అపార జలసిరి..జలధి ఒడికి..
చినుకు పడితే ఆనందం ... ఆ చినుకుల జోరు పెరిగితే భయం. మళ్లీ కొద్ది నెలలకే నీటికోసం కటకట. ఇలాంటి పరిణామాలు ఎందుకు తలెత్తుతున్నాయి...కుండపోతగా కురిసిన వర్షపు నీటిని పది కాలాలపాటు భద్రపరుచుకొని ... వినియోగించుకునే సామర్థ్యం కొరవడడమే దీనికి కారణం. అలా చేయగలిగితే లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యేవి. వేలాది గ్రామాల్లో దాహార్తి తీరేది. ప్రకృతి ప్రసాదించిన ఈ నీటిని ... సముద్రంలో కలిసిపోతున్న లక్షల క్యూసెక్కుల జలాన్ని భవిష్యత్తు తరాలకోసం ఎలా వినియోగించుకోవాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. సాక్షి, తూర్పుగోదావరి : జూలై 5వ తేదీ..సాధారణంగా ఆ సమయానికి గోదావరికి ఎంతోకొంత వరద పోటు తగులుతుంటుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి స్వల్ప మొత్తంలోనైనా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. బ్యారేజీ నుంచి ఒక్క క్యూసెక్కు నీరు కూడా సముద్రంలోకి వదలలేదు. తరువాత నీటి రాక పెరిగినా పంట కాలువలకు, పట్టిసీమకు తోడివేయగా మిగిలిన కొద్దిపాటి నీటిని మాత్రమే సముద్రంలోకి విడదల చేసేవారు. ఈ సమయంలో గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగుకు పూర్తిస్థాయిలో నీరందించగలమా? అనే అనుమానం అధికార యంత్రాంగంలో కూడా వచ్చింది. ముఖ్యంగా గత జూలై 27 నుంచి వరద జోరందుకుంది. జూలై 27న 20,953 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తరువాత రోజు అదికాస్తా 33,475 క్యూసెక్కులకు పెరిగింది. అలా పెరుగుతూ..పెరుగుతూ ఈ నెల 9వ తేదీన అత్యధికంగా 14,59,068 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మొత్తం మీద జూన్ 1వ తేదీ నుంచి ఇంత వరకూ 1294.35 టీఎంసీల నీరు సముద్రంలో కలవడం విశేషమైతే, గడిచిన 12 రోజుల్లోనే ఏకంగా 1,159. 284 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే మొత్తం మీద 90 శాతం నీరు గడిచిన 12 రోజుల్లోనే సముద్రంలోకి వదిలారు. జూన్ నెలలో సముద్రంలోకి వదిలింది కేవలం 2.131 టీఎంసీ కాగా, జూలైలో 132.935 టీఎంసీలు. ఈ నెలలో కూడా 25వ తేదీ నుంచి 31వ తేదీకి మధ్యలోనే 85 శాతం నీరు సముద్రంలోకి వదిలినట్టు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైన తరువాత ఇప్పటి వరకు పట్టిసీమకు 22.924 టీఎంసీలు, డెల్టా కాలువలకు 62.648 టీఎంసీల నీటిని విడుదల చేయగా, సముద్రంలోకి 1,294.35 టీఎంసీల నీరు వదిలారు. ఈ నేపథ్యంలో వృథా జలాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉందో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఉగ్ర గోదారి
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో 15 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. 14.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద సాయంత్రం 6 గంటలకు 47.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, ఏజెన్సీ మండలాల్లో 111 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో 20 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దేవీపట్నం మండలంలో తొయ్యేరు, పూడిపల్లి తదితర 36 గ్రామాలు ఎనిమిదో రోజూ వరద ముంపులోనే ఉన్నాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండగా.. దిగువన ఆచంట, యలమంచిలి మండలాల్లో అనగారలంక, పెదమల్లంలంక, అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమాలలంక, దొడ్డిపట్ల పల్లెపాలెం, లక్ష్మీపాలెం, పెదలంక, కనకాయలంక గ్రామాల్లో వరద నీరు చేసింది. వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము, తిర్లాపురం, నాళ్లారం, కట్కూరు, కొయిదా సహా 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో గొమ్ముగూడెం, కౌండిన్యముక్తి గ్రామాలను వరద చుట్టుముట్టింది. పాత పోలవరంలోని నెక్లెస్ బండ్ కోతకు గురై గోదావరిలోకి అండలుగా జారుతూ భయపెడుతోంది. ఇదిలావుంటే.. వంశధార, నాగావళి నదుల్లో శుక్రవారం వరద తగ్గింది. ఒకరి మృతి.. ఇద్దరు గల్లంతు తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం కొచ్చావారివీధి వద్ద జర్తా భద్రమ్మ అనే మహిళ మడేరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఇదే జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై నడిచి వెళ్తున్న నమీర్‌బాషా (23), షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతు కాగా.. షేక్ వజీర్ అనే యువకుడిని స్థానికులు రక్షించారు. ముంపును జయించి పెళ్లాడింది పెండ్లి కుమార్తెను ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి వివాహం జరిపించిన అరుదైన ఘటన తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడిలో చోటుచేసుకుంది. పెదపట్నంలంకకు చెందిన దేవిశ్రీకి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం నిశ్చయించారు. ఆమెను నగరం గ్రామంలోని వరుడు దాకే బాలరాజు ఇంటికి తీసుకు వెళ్లాల్సి ఉంది. ప్రధాన రహదారులన్నీ వరద ముంపులో చిక్కుకోవడంతో దేవిశ్రీని అప్పనపల్లి మలుపు వరకు కారులో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి అనుకున్న సమయానికే వివాహ తంతును పూర్తి చేశారు. -
ఆరో రోజూ...అదే ఆగ్రహం
ఇంటా బయటా నీరు... కాలు బయట పెట్టాలంటే భయం... నిత్యావసర వస్తువులు తెచ్చుకునే వీలులేదు ... తెచ్చినా పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. బిక్కుబిక్కుమంటున్న బాధితులకు భరోసానిస్తూ వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : జిల్లా వాసులకు అన్నపానీయాలు అందించే జీవనది గోదావరి కొన్ని రోజులుగా ఉరుముతూ...వరద ఉరకలేస్తూ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సోమవారం కొంతమేర తగ్గుముఖం పట్టినా ఎగువ మేడిగెడ్డ నుంచి భారీగా వరద నీరు వస్తుండడం.. భద్రాచలం వద్ద తిరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అటు ఏజెన్సీ గ్రామ వాసులను..ఇటు లంక వాసులను తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. వరద సహాయక చర్యలు, బాధితులకు పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికార యంత్రాంగం మంగళవారం నుంచి వరద విపత్తు పెరిగితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భద్రాచలం వద్ద 43 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణాలోని మేడిగెడ్డ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఆ ప్రభావం వచ్చే 24 గంటల్లో జిల్లాపై పడుతుందేమోనని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద 12.50 అడుగులకు తగ్గింది. సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 10.92 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గోదావరి వరద అధికారుల అంచనాకు అందకుండా పోయింది. సోమవారం రాత్రికే రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేయాల్సి వస్తుందని సాగునీటి పారుదల శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. ఇన్‌ఫ్లో కూడా 14 లక్షలు ఉంటుందని భావించారు. అయితే వారి అంచనాల మేరకు బ్యారేజీ వద్ద వరద లేకపోవడం విషయం కాగా, ఉన్న వరద కొంత తగ్గడం గమనార్హం. పోలవరం వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో కొత్త ప్రాంతాలకు వరద విస్తరిస్తోందని, దీనివల్ల బ్యారేజీకు గతం కన్నా తక్కువ సమయానికి వరద వస్తోందని చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి వరద పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ప్రభావం జిల్లాలో తగ్గుతున్నా అటు ఏజెన్సీ, ఇటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. దేవీపట్నం మండలం ముంపు నుంచి నెమ్మదిగా బయటపడుతోంది. ఇక్కడ రెండు అడుగుల మేర నీరు తగ్గింది. గడిచిన నాలుగు రోజులుగా గోదావరి, శబరి నదులు వరదల వల్ల వి.ఆర్.పురం మండలంలో సుమారు 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు సోమవారం కూడా ప్రారంభం కాలేదు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భద్రాచలం వద్ద 76 అడుగుల వరద వచ్చినప్పుడు కూడా ఇంత ముంపు లేదని వారు చెబుతున్నారు. ఈసారి మరింత వరద వచ్చే అవకాశముందనే అంచనాలతో నదిని ఆనుకుని ఉన్న గ్రామం కావడంతో ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని పోచమ్మగండివాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపు బాధితులకు రంపచోడవరం గొర్రనగూడెం పాఠశాల, వీరవరం వద్ద తహసీల్దార్ కార్యాలయం వద్ద, దేవీపట్నంలో ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, దామనపల్లి పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. ముంపులో ఉన్నా కొంతమంది ఇళ్లు వీడి వచ్చేందుకు ముందుకు రాకపోవడంతో భోజనాన్ని పట్టుకుని వెళ్లి అందిస్తున్నారు. ఏజెన్సీతోపాటు కోనసీమలోని మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక్కడ రెండు అడుగుల మేర వరద తగ్గింది. గోదావరి మధ్యలో ఉన్న లంక వాసులతోపాటు కాజ్‌వేలు ముంపుబారిన పడడంతో ఏటిగట్టును ఆనుకుని ఉన్న గ్రామాల వాసులు సైతం రాకపోకలకు పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. గడిచిన మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడం, తాజాగా ఎగువన వరద పెరగడంతో తమ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవని లంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలకు తోడు, కోనసీమలో పలుచోట్ల భారీ వర్షం పడుతుండడం మురుగునీటి కాలువల ద్వారా ముంపునీరు దిగే అవకాశం లేక వరి ముంపు తీవ్రత మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
గోదావరికి పెరిగిన వరద ఉధృతి
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): గోదావరి నదిలో వరద నీటి ఉధృతి పెరుగుతోందని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కోరారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశముందని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక ఉభయ గోదావరి జిల్లాల ప్రభావిత మండలాల అధికారులు ఎటువంటి ఏమరుపాటుకు లోనుకాకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు పంపామని, లోతట్టు ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు. అదేవిధంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని ఆదేశించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. -
పోలవరంలో వరద తగ్గుముఖం
సాక్షి, ఏలూరు: పోలవరం వరద ప్రవాహం క్రమేపి తగ్గుతోందని పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరద పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం ఎగువ నున్న 19 గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరఫరా చేశామన్నారు. పోలవరంలో మూడు, వేలేరుపాడు లో రెండు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద గోదావరి వరద 26 మీటర్లు ఉందని కాపర్ డ్యామ్‌కు ఎటువంటి భయం లేదన్నారు. రేపటికి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందన్నారు. వరద గ్రామాల్లో వైద్య శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వైద్యులు, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. సమీక్ష అనంతరం మంత్రులు ప్రత్యేక లాంచీలో కొండ్రుకోట వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. లాంచీ ఎక్కుతున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. 7 లక్షల 43వేల క్యూసెక్కుల మిగులు జలాలను ధవళేశ్వరం జలవనరుల శాఖ హెడ్‌వర్క్స్ అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13100 క్యూసెక్కుల నీరు వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35.5 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం గోదావరి నది సరాసరి నీటి మట్టం 13.57 మీటర్లుగా ఉంది. కాగా, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. కుండపోతగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. -
గోదావరికి వరద పోటు
కొవ్వూరు : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. మూడు రోజులుగా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 4,39,075 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. సాయంత్రానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆనకట్టకి ఉన్న 175 గేట్లను మీటరు ఎత్తులేపి 4,31,992 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో మూడు రోజుల నుంచి డెల్టా కాలువలకు నీటి విడుదలను కాస్తతగ్గించారు. గురువారం 7,900 క్యూసెక్కులు విడిచిపెట్టగా శుక్రవారం సాయంత్రం నుంచి 8,400 క్యూసెక్కులు వదులుతున్నారు. దీనిలో జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకి 5 వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. -
ప్రక్షాళన పర్వం
కొవ్వూరు : గోదావరి నదీ గర్భాన్ని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల అనంతరం డ్రెడ్జింగ్ ద్వారా నదిలోని ఇసుక మేటలను తొలగించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. «ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటల్ని తొలగించేందుకు గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ.16.52 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, నిధులు సైతం విడుదలయ్యాయి. డ్రెడ్జింగ్ పనులు చేపట్టే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓషన్ స్వార్కిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. క్యూబిక్ మీటర్ ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించేందుకు రూ.155 చొప్పున ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఈ పనులకు సంబంధించి సదరు సంస్థతో రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తికానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. తవ్విన ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి, పోల వరం ప్రాజెక్ట్, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులకు ప్రధానంగా కేటాయించనున్నట్టు చెబుతున్నారు. కొంత ఇసుకను నది మధ్యన గల పిచ్చుకల్లంక లెవెలింగ్ పనులకు వినియోగిస్తామంటున్నారు. గత ఏడాది మే నెలలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ««దl్వర్యంలో అధికారుల బృందం గోదావరిలో సర్వే చేసింది. ఆనకట్టకు ఎగువన 50 లక్షల నుంచి 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. నదిలో ఏటా డ్రెడ్జింగ్ జరిపించాలని ప్రతినిధుల బృందం సూచించింది. పనులను గత ఏడాదే చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతూ వచ్చింది. తాగునీటి ఇబ్బందులకు చెక్ వాడపల్లి, గోంగూరతిప్పలంక, కాటవరం, కోటిలింగాల రేవు సమీపంలో మేటలు తొలగించాలని నిర్ణయించారు. తద్వారా విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాల్లో తాగునీటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రబీ కష్టాలు గట్టెక్కేనా! ఉభయ గోదావరి జిల్లాల్లో 10.12 లక్షల ఎకరాల డెల్టా ఆయకట్టు ఉంది. చేపల చెరువులు, తోటలు మినహాయిస్తే 8.96 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రైతులు ఏటా రెండో పంటకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2.93 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ధవళేశ్వరం ఆనకట్టకు ఉంది. ఈ ప్రాంతంలో ఇసుక మేటలు భారీగా పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. నాలుగు దశాబ్దాల క్రితం వరకు వరదల అనంతరం గోదావరిలో ఇసుక మేటలను ఏటా తొలగించేవారు. ఆ తరువాత ఈ ప్రక్రియను గాలికొదిలేశారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల రైతులకు రెండో పంటలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 2009లో తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తాయి. ఆ తరువాత 2010, 2013 సంవత్సరాలు మినహా ఏటా సాగునీటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వంతులవారీ విధానంలో పంటలను సాగు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఆనకట్టకు ఎగువన 50 నుంచి 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు ఉన్నట్టు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వడానికి మాత్రమే టెండర్లు పిలిచింది. ఈ పనులైనా సకాలంలో సవ్యంగా పూర్తిచేస్తే వస్తే రబీ నాటికి రైతులకు సాగునీటి కష్టాలను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. ఉచిత ఇసుక మాటేమిటో!? క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వడానికి రూ.155 చొప్పున కాంట్రాక్ట్ సంస్థకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన యూనిట్ ఇసుక (మూడు క్యూబిక్ మీటర్లు) రూ.465 అవుతుంది. దీనికి లోడింగ్ చార్జీలు వంటివి కలుపుకుంటే రూ.500 పైబడి ధర పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. ఈ తరుణంలో డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను వివిధ అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే కాంట్రాక్ట్ సంస్థలు ఆ ధర చెల్లించడానికి ఎంతమేరకు ముందుకు వస్తాయనేది అనుమానంగా ఉంది. దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. నెలాఖరు నాటికి పనులు ఈ నెలాఖరు నాటికి ్రyð డ్జింగ్ పనులు ప్రారంభిస్తాం. ముందుగా సర్వే చేపడతాం. ఏ ప్రాంతంలో ఇసుక మేటలు తీయాలన్నది నిర్ణయిస్తాం. గోదావరిలో వరద నీరు తగ్గిన తర్వాత అక్టోబర్ నుంచి పనులు పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. నాలుగు ఆర్మ్‌లలో సమానంగా నీరు ప్రవహించే విధంగా మేటలు తొలగిస్తాం. ముందుగా స్కవర్ స్లూయిజ్, నాలుగు ఆర్మ్‌లకు ఎదురుగా ఉన్న మేటల్ని తొలగిస్తాం. –ఎన్.కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
ప్రక్షాళన పర్వం
కొవ్వూరు : గోదావరి నదీ గర్భాన్ని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల అనంతరం డ్రెడ్జింగ్ ద్వారా నదిలోని ఇసుక మేటలను తొలగించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. «ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటల్ని తొలగించేందుకు గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ.16.52 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, నిధులు సైతం విడుదలయ్యాయి. డ్రెడ్జింగ్ పనులు చేపట్టే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓషన్ స్వార్కిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. క్యూబిక్ మీటర్ ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించేందుకు రూ.155 చొప్పున ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఈ పనులకు సంబంధించి సదరు సంస్థతో రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తికానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. తవ్విన ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి, పోల వరం ప్రాజెక్ట్, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులకు ప్రధానంగా కేటాయించనున్నట్టు చెబుతున్నారు. కొంత ఇసుకను నది మధ్యన గల పిచ్చుకల్లంక లెవెలింగ్ పనులకు వినియోగిస్తామంటున్నారు. గత ఏడాది మే నెలలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ««దl్వర్యంలో అధికారుల బృందం గోదావరిలో సర్వే చేసింది. ఆనకట్టకు ఎగువన 50 లక్షల నుంచి 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. నదిలో ఏటా డ్రెడ్జింగ్ జరిపించాలని ప్రతినిధుల బృందం సూచించింది. పనులను గత ఏడాదే చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతూ వచ్చింది. తాగునీటి ఇబ్బందులకు చెక్ వాడపల్లి, గోంగూరతిప్పలంక, కాటవరం, కోటిలింగాల రేవు సమీపంలో మేటలు తొలగించాలని నిర్ణయించారు. తద్వారా విశాఖపట్నం, రాజమహేంద్రవరం నగరాల్లో తాగునీటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రబీ కష్టాలు గట్టెక్కేనా! ఉభయ గోదావరి జిల్లాల్లో 10.12 లక్షల ఎకరాల డెల్టా ఆయకట్టు ఉంది. చేపల చెరువులు, తోటలు మినహాయిస్తే 8.96 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రైతులు ఏటా రెండో పంటకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2.93 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ధవళేశ్వరం ఆనకట్టకు ఉంది. ఈ ప్రాంతంలో ఇసుక మేటలు భారీగా పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. నాలుగు దశాబ్దాల క్రితం వరకు వరదల అనంతరం గోదావరిలో ఇసుక మేటలను ఏటా తొలగించేవారు. ఆ తరువాత ఈ ప్రక్రియను గాలికొదిలేశారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల రైతులకు రెండో పంటలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 2009లో తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తాయి. ఆ తరువాత 2010, 2013 సంవత్సరాలు మినహా ఏటా సాగునీటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వంతులవారీ విధానంలో పంటలను సాగు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఆనకట్టకు ఎగువన 50 నుంచి 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు ఉన్నట్టు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వడానికి మాత్రమే టెండర్లు పిలిచింది. ఈ పనులైనా సకాలంలో సవ్యంగా పూర్తిచేస్తే వస్తే రబీ నాటికి రైతులకు సాగునీటి కష్టాలను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. ఉచిత ఇసుక మాటేమిటో!? క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వడానికి రూ.155 చొప్పున కాంట్రాక్ట్ సంస్థకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన యూనిట్ ఇసుక (మూడు క్యూబిక్ మీటర్లు) రూ.465 అవుతుంది. దీనికి లోడింగ్ చార్జీలు వంటివి కలుపుకుంటే రూ.500 పైబడి ధర పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. ఈ తరుణంలో డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను వివిధ అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే కాంట్రాక్ట్ సంస్థలు ఆ ధర చెల్లించడానికి ఎంతమేరకు ముందుకు వస్తాయనేది అనుమానంగా ఉంది. దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. నెలాఖరు నాటికి పనులు ఈ నెలాఖరు నాటికి ్రyð డ్జింగ్ పనులు ప్రారంభిస్తాం. ముందుగా సర్వే చేపడతాం. ఏ ప్రాంతంలో ఇసుక మేటలు తీయాలన్నది నిర్ణయిస్తాం. గోదావరిలో వరద నీరు తగ్గిన తర్వాత అక్టోబర్ నుంచి పనులు పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. నాలుగు ఆర్మ్‌లలో సమానంగా నీరు ప్రవహించే విధంగా మేటలు తొలగిస్తాం. ముందుగా స్కవర్ స్లూయిజ్, నాలుగు ఆర్మ్‌లకు ఎదురుగా ఉన్న మేటల్ని తొలగిస్తాం. –ఎన్.కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం