Dial Your
-
భూమి ఆన్‌లైన్‌కి లంచం అడుగుతున్నారు
ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్‌కుమార్ నిర్వహించారు. పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్‌ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్‌ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డయల్ యువర్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్చార్జి డీఆర్ఓ సరళా వందనం పాల్గొన్నారు. -
ప్రతి గురువారం డయల్ యువర్ సీఈవో
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును తెలుసుకునేందుకు డయల్ యువర్ సీఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఎ.మల్లిఖార్జున సోమవారం తెలిపారు. ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ సీఈవో కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిర్ణీత సమయంలో 0863–234166కు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని మల్లిఖార్జున పేర్కొన్నారు. -
నేడు ‘మీట్ యువర్ ఎండీ’
సాక్షి, సిటీబ్యూరో: నీటి బిల్లులు, మంచినీటి సరఫరా తదితర సమస్యలపై జలమండలి శనివారం ‘మీట్ యువర్ ఎండీ’ కార్యక్రమం నిర్వహించనుంది. ఇది ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు జరుగుతుంది. డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను వినియోగదారులు నేరుగా ఎండీ దానకిశోర్‌ను కలిసి విన్నవించవచ్చు. ఇక సాయంత్రం 6 నుంచి 6:30గంటల వరకు ‘డయల్ యువర్ ఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ సమస్యలను ఫోన్లో ఎండీకి వివరించవచ్చు. ముందుగా కస్టమర్ అకౌంట్ నంబర్ తెలిపి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఫోన్ చేయాల్సిన నంబర్లు 040–23442881 /23442882/23442883. ఇక బిల్లింగ్, రెవెన్యూ, మీటర్ సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారులు మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు నిర్వహించే ‘రెవెన్యూ అదాలత్’లో పాల్గొని తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జలమండలి కోరింది. -
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా వారి నుంచి సల హాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ భానుకిరణ్ తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యు వర్ డీఎం కార్యక్రమం జరుగుతుం దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ములుగు, ఏటూరునాగారం, హైదరాబాద్, కాళేశ్వరం రూట్ ప్రయాణికులు తమ సల హాలు, సూచనలను 73828 26048 నంబర్‌కు ఫోన్ చేసి అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరార