నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’ | Today Dial Your MD in Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’

Published Sat, Sep 7 2019 11:25 AM | Last Updated on Mon, Sep 9 2019 11:50 AM

Today Dial Your MD in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నీటి బిల్లులు, మంచినీటి సరఫరా తదితర సమస్యలపై జలమండలి శనివారం ‘మీట్‌ యువర్‌ ఎండీ’ కార్యక్రమం నిర్వహించనుంది. ఇది ఖైరతాబాద్‌ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాయంత్రం 5  నుంచి 6గంటల వరకు జరుగుతుంది. డివిజన్‌ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను వినియోగదారులు నేరుగా ఎండీ దానకిశోర్‌ను కలిసి విన్నవించవచ్చు. ఇక సాయంత్రం 6 నుంచి 6:30గంటల వరకు ‘డయల్‌ యువర్‌ ఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ సమస్యలను ఫోన్‌లో ఎండీకి వివరించవచ్చు. ముందుగా కస్టమర్‌ అకౌంట్‌ నంబర్‌ తెలిపి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఫోన్‌ చేయాల్సిన నంబర్లు 040–23442881 /23442882/23442883. ఇక బిల్లింగ్, రెవెన్యూ, మీటర్‌ సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారులు మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు నిర్వహించే ‘రెవెన్యూ అదాలత్‌’లో పాల్గొని తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జలమండలి కోరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement