
జలమండలి ఇచ్చిన నీటి బిల్లు
రహమత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలకు నల్లా బిల్లు రూ.46 వేలు రావడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. అసలు తమ నల్లాకు మీటరు లేదని, అలాంటప్పుడు ఇంత పెద్ద మొత్తంతో బిల్లు రావడంతో చేసేదిలేక తమ ఉన్నతాధికారులకు పంపించారు. ఎస్పీఆర్‌హిల్స్ వినాయకనగర్ ప్రభుత్వ పాఠశాలకు ఇటీవల జలమండలి అధికారులు బిల్లును పంపించారు. ఇందులో రూ.46 వేలు చెల్లించాలని స్పష్టంగా ఉంది. అసలు తమ పాఠశాలకు నల్లాకు మీటర్ లేదని, గతంలో ఎప్పుడూ తమ పాఠశాల పేరుతో నల్లా బిల్లు రాలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.