diaspora
-
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్‌లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
దావోస్: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు
-
సీఎం జగన్‌ను కలిసిన స్విట్జర్లాండ్ ప్రవాసాంధ్రులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరై దావోస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు స్విట్జర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని వారు కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చక్కటి కృషి చేస్తోందంటూ తమ అభిప్రాయాలను సీఎం జగన్‌కి తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ వారు ఏపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం
హ్యుస్టన్ (టెక్సాస్): గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం 75 వ జయంతి సందర్భంగా 75 పాటలతో ప్రవాస భారతీయులు అలరించారు. పది మంది గాయకులు నాటి నుంచి నేటి వరకు బాలు పాడిన పాటలను మనసారా ఆలపించి ఆ మహనీయుడి పాటకు పట్టాభిషేకం చేశారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా - తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ - శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021 జూన్ 13 ఆదివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 గంటలకు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ గాయని, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోష్ ఫిలిం న్యూస్., TRINET , తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.వీనుల విందైన ఈ కార్యక్రమానికి అతిధులుగా, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, రవిప్రకాష్, యూకే నుంచి డా నగేష్ చెన్నుపాటి , సురేష్ కొండేటి, ఒమన్ నుంచి హరి వేణుగోపాల్, వంశీ రామరాజులు హాజరయ్యారు. ఈ పాటల పట్టాభిషేకంలో గాయకులు రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం, శ్రీ సాందీప్. పవన్ చరణ్, హరి గుంట , విపంచి శశిధర్, ధనుంజయ్‌లు పాలు పంచుకున్నారు. బాలు గొంతు నుంచి జాలువారిన అద్భుతమైన 75 పాటలను వీనులవిందుగా వినిపించారు. -
మీరే మా రాయబారులు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని కితాబిచ్చారు. కెన్యా రాజధాని నైరోబీలో ప్రారంభమైన శ్రీ కచ్చి లేమా పటేల్ సమాజ్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. కెన్యా స్వాతంత్య్ర పోరాటంలో కచ్చి లేమా నాయకులు కీలక పాత్ర పోషించిన సంగతిని గుర్తుచేశారు. 2001లో భూకంపానికి గురైన గుజరాత్‌లోని కచ్ ప్రాంత పునర్నిర్మాణానికి ఆ సంస్థ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఒకప్పుడు ఎడారిని తలపించిన కచ్‌ను దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ భారత్‌లో పర్యటించని కచ్చి లేమా సభ్యులు అలహాబాద్ కుంభమేళాకు వచ్చి భారత సాంస్కృతిక, వారసత్వ గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. -
డిగ్రీ ఉంటేనే రుణం
సాక్షి, హైదరాబాద్: ప్రవాసులకు గృహ రుణాల మంజూరులో విద్యార్హత, నడవడిక ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే దేశంలో కేవలం పట్టభద్రులైన ఎన్నారైలకు మాత్రమే గృహరుణం మంజూరవుతుంది మరి. స్థిరాస్తి విలువలో 80 శాతం వరకూ గృహ రుణాన్ని పొందవచ్చు. మిగిలిన మొత్తాన్ని ప్రవాస కొనుగోలుదారుడే వెచ్చించాలి. అయితే ప్రాపర్టీ లావాదేవీలు పూర్తిగా రూపాయిల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచైనా సరే కానీ ఎన్నారై ఖాతా ద్వారానే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ లేదా ఎఫ్సీఎన్ఆర్ ఖాతాకు చెందిన లేదా పోస్ట్ డేట్ చెక్స్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ (ఈసీఎస్) ద్వారా కూడా చెల్లించవచ్చు. ఒకవేళ విదేశాల్లో ఉంటూ.. అక్కడ సంపాదిస్తుంటే గనక స్థానిక బ్యాంకుల నుంచి నిధులను తీసుకొని ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలు ఎన్నారైలకుంటుంది. ఎందుకంటే మన దేశంతో పోల్చుకుంటే కొన్ని దేశాల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ఒకవేళ ప్రాపర్టీని వినియోగించలేని పక్షంలో అద్దెకిచ్చేసి అద్దెను బ్యాంకు రుణ చెల్లింపులో వినియోగిస్తే మాత్రం.. స్థానిక బంధువుల హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వారి స్థానిక బ్యాంక్ ఖాతాకు చెందిన చెక్కులను కూడా జారీ చేయాల్సి ఉంటుంది. -
'దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి'
న్యూఢిల్లీ: భారత్‌లో అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళన, ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) కార్యక్రమం కింద ప్రవాస భారతీయులు తమ ఆర్థిక సహాయం అందజేయవచ్చని, వీటిని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్నా పుట్టిన దేశంతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎన్‌ఐఆర్‌ఐలకు ఇదో చక్కని అవకాశమని ఆమె తెలిపారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు చాలామంది ఎన్ఆర్ఐలు ఎదురుచూస్తున్నారని, అలాంటి వారి కోసమే ఈ ఐడీఎఫ్ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్‌లోని వివిధ పథకాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేసేందుకు గాను ఐడీఎఫ్ కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: తన విదేశీ పర్యటనతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడంతో పాటు దేశంలో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సహకారంతో పాటు పారిస్ వెలుపలి కొన్ని హైటెక్ పారిశ్రామిక యూనిట్లను సందర్శించనున్నారు. జర్మనీ-భారత్ సంయుక్తంగా చేపట్టబోతున్న హన్నోవర్ మెస్సే ప్రాజెక్టుకు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తో పాటు సంయుక్తంగా పాల్గొనబోతున్నట్లు ట్విటర్లో తెలిపారు. కెనడా పర్యటనపై ఆసక్తితో ఉన్నట్లు, ఈ సందర్భంగా తాను కెనడా రాజకీయవేత్తలను, ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను కలవనున్నట్లు తెలిపారు. మోదీ మొదట ఏప్రిల్ 9వ తేదీన ఫ్రాన్స్ లో, 12వ తేదీన జర్మనీలో, అనంతరం 14 నుంచి 16 వరకు కెనడాల్లో పర్యటించనున్నారు. Will discuss strengthening India-France economic co-operation & visit some high-tech industrial units outside Paris. In Germany, Chancellor Merkel & I will jointly inaugurate @Hannover_Messe where India is a partner country. Looking forward to enhancing ties with Canada & interacting with leaders, captains of industry & diaspora in Canada.