నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మోదీ ట్వీట్ | Three nation tour focused on economy: tweets PM | Sakshi
Sakshi News home page

నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మోదీ ట్వీట్

Published Sat, Mar 28 2015 12:27 PM | Last Updated on Thu, Oct 4 2018 6:53 PM

నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మోదీ ట్వీట్ - Sakshi

నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మోదీ ట్వీట్

న్యూఢిల్లీ:  తన విదేశీ పర్యటనతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడంతో పాటు దేశంలో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మోదీ భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సహకారంతో పాటు పారిస్ వెలుపలి కొన్ని హైటెక్ పారిశ్రామిక యూనిట్లను సందర్శించనున్నారు. జర్మనీ-భారత్ సంయుక్తంగా చేపట్టబోతున్న హన్నోవర్ మెస్సే ప్రాజెక్టుకు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తో పాటు సంయుక్తంగా పాల్గొనబోతున్నట్లు ట్విటర్లో తెలిపారు. కెనడా పర్యటనపై ఆసక్తితో ఉన్నట్లు, ఈ  సందర్భంగా తాను కెనడా రాజకీయవేత్తలను, ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను కలవనున్నట్లు తెలిపారు.  మోదీ మొదట ఏప్రిల్ 9వ తేదీన ఫ్రాన్స్ లో, 12వ తేదీన జర్మనీలో, అనంతరం 14 నుంచి 16 వరకు కెనడాల్లో పర్యటించనున్నారు.

Will discuss strengthening India-France economic co-operation & visit some high-tech industrial units outside Paris.

In Germany, Chancellor Merkel & I will jointly inaugurate @Hannover_Messe where India is a partner country.

Looking forward to enhancing ties with Canada & interacting with leaders, captains of industry & diaspora in Canada.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement