డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ టెండర్లు రద్దు
హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టులో భాగంగా ఉండే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ టెండర్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెలదేవరపల్లి గ్రామం మోతియా తాండా వద్ద డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ఈపీసీ పధ్ధతిలో జీవీవీ - వీఎస్ఎం - జీవీఆర్ కాంట్రాక్టు సంస్థ టెండర్ దక్కించుకున్న పనులు మాత్రం మొదలుపెట్టలేదు. ఈ దృష్ట్యా కాంట్రాక్టు సంస్థతో కుదుర్చుకున్న టెండర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.