Director govi
-
ఈ సినిమాలో ఆమే రియల్ హీరో
చెన్నై: హర్రర్, కామెడీ సినిమా నాయకికి రియల్ హీరో త్రిష అని దర్శకుడు గోవి అన్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. నాయకిలో రెండు ముఖ్యమైన మగ పాత్రలు ఉన్నా, సినిమాకు త్రిషే రియల్ హీరో అని గోవి చెప్పాడు. ఈ ప్రాజెక్టు కోసం త్రిష చాలా కష్టపడిందని, ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుందని తెలిపాడు. ఈ సినిమాలో 98 శాతం కామెడీ, 2 శాతం హర్రర్ ఉంటుందని చెప్పాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించినట్టు గోవి తెలిపాడు. ఈ సినిమాలో గణేశ్ వెంకటరామన్, జయప్రకాశ్, సత్యం రాజేశ్, బ్రహ్మానందం తదితరులు నటించారు. -
త్రిష అప్పటి నాయకి
హార్రర్ చిత్రాలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. త్రిష కూడా ఆ ట్రెండ్ ఫోలో అవుతూ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైపోయారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గణేశ్ వెంకట్రామన్, సత్యం రాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిరిధర్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరించారు. త్రిష మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా దర్శకుడు గోవి అయిదు నిమిషాలు కథ చెప్పగానే హిట్ అనిపించింది. 1980లో జరిగే కథ ఇది. నా ఫేవరేట్ జోనర్ అయిన హార్రర్ చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు గోవి మాట్లాడుతూ- ‘‘నా కథకు తగ్గట్టుగా 18 ఏళ్ల అమ్మాయి కావాలి, అలాగే మెచ్యూర్డ్ అమ్మాయి కూడా కావాలి. ఇలా రె ండు విభిన్న కోణాలున్న పాత్రలకు ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తే, టక్కున త్రిష పేరు ఫ్లాష్ అయింది. ఒక త్రిష ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కెమెరా: జగదీశ్ చీకటి సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాంబాబు కుంపట్ల.