Disabled Certificate
-
పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు
తణుకు అర్బన్ : ‘ఇరవయ్యేళ్ల నుంచి పింఛను తీసుకుంటున్నాం.. ఎప్పుడూ లేదు, ఇదేం ఖర్మో మరి.. కంటిచూపు కనిపించడం లేదంటే మళ్లీ పరీక్షలంటున్నారు.. పింఛను తొలగించేందుకే ఈ పరీక్షలు.. ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు.. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా ఫర్వాలేదు వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో.. మీ ఖర్మ కాలింది మీకు కూడా మా గతే పడుతుంది’.. అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మొదలైంది. ముందుగా పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులిచ్చారు. మొదటి దఫాలో కంటి, చెవికి సంబంధించి ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరానికి దివ్యాంగులు తమ సహాయకులను తీసుకుని హాజరయ్యారు. ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు.. ముఖ్యంగా కంటిచూపు లేని దివ్యాంగుల వెతలు వర్ణనాతీతం. వీరు అటూ ఇటూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీసిచ్చి ఈరోజు నిర్థారణ శిబిరానికి రావాలంటూ హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ‘పింఛను మొత్తాన్ని పెంచడమెందుకు? ఇప్పుడు తొలగించేందుకు కుట్ర లు పన్నడమేంటి?’ అంటూ రుసరుసలాడారు. పింఛనుదారుల్లో ఎవరు సక్రమమో, ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్లప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. -
సదరం..ఇక సత్వరం
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి సదరం సర్టిఫికెట్లను వారు ఈజీగా పొందవచ్చు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొత్తగా ‘సదరం’ఆన్లైన్ స్లాట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెర్ప్ సహకారంతో మహిళా రైతు ఉత్పత్తిదారులు (ఎఫ్‌పీవో) నిర్వహించే బేనిషాన్ కంపెనీని ప్రారంభించిన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సదరం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానానికి కూడా శ్రీకారం చుట్టారు. సాంకేతిక, ఇతర కారణాలతోగానీ పెన్షన్ల చెల్లింపులో ఆసరా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్లో వినతుల స్వీకరణ, పరిష్కారం చేస్తున్నామని, తాజాగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. త్వరగా ధ్రువీకరణ పత్రం.. ► కొత్త విధానంతో అర్హులైన దివ్యాం గుల(వికలాంగుల)కు త్వరగా దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం జారీ చేయవచ్చు. ► దివ్యాంగులు వారికి సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి వైకల్యం అంచనా, ధ్రువీకరణ పత్రం కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ► దీనికోసం సదరు వ్యక్తి ఆధార్ కార్డును మీసేవ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► మీసేవ కేంద్రం నమోదు ప్రక్రియ దరఖాస్తుదారుల వేలిముద్ర/ఐరిస్ ప్రామాణీకరణతో మొదలవుతుంది. అలాగే మొదటిసారి స్లాట్ బుకింగ్ కోసం పేరు, చిరునామా వివరాలను నమోదు చేస్తారు. ► అనంతరం ఆయా జిల్లాల్లో ఏ రోజున, ఏ మెడికల్ క్యాంపునకు హాజరుకావాలో స్లాట్ బుకింగ్ చేసి వివరాలతో కూడిన రసీదును దరఖాస్తుదారుకు ఇస్తారు. ► ఒకవేళ దివ్యాంగులు అంతకుముందే ‘సదరం ధ్రువీకరణపత్రం’కలిగి ఉన్నా... వైకల్య శాతం గతంలోనే అంచనా వేసి, అర్హత కంటే తక్కువ శాతం ఉంటే స్లాట్ బుకింగ్‌ను తిరస్కరిస్తారు. ► స్లాట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మీసేవ రసీదుతో మెడికల్ క్యాంపునకు హాజరవుతారు. మెడికల్ క్యాంపులోని నిర్వాహకులు దరఖాస్తుదారుడికి సదరం గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ► సదరం క్యాంపులో వైద్యులు దరఖాస్తుదారుడి వైకల్యం శాతాన్ని అంచనా వేస్తారు. సదరు దరఖాస్తుదారుకు అదేరోజున సదరం సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. మహిళా రైతుల జీవన ప్రమాణాలు పెంపు.. మహిళా రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గ్రామీణ పేద నిర్మూలన సంస్థ (సెర్ప్) కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీజీ) ను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు తోడ్పాటును అందిస్తోందన్నారు. వ్యవసాయ విలువ అభివృద్ధిలో భాగంగా 1,928 గ్రామాల్లో పంటల విశ్లేషణ చేశామని, 4,139 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి 66,116 మంది రైతుల బేస్‌లైన్ సర్వే పూర్తి చేశామని, ఆయా గ్రామాల్లో రైతు సంఘాలను సంఘటితం చేసి... రైతు ఉత్పత్తిదారుల కంపెనీలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, పార్థసారథి, సెర్ప్ సీఈవో పౌసుమిబసు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులకు చెక్.. ⇒ సదరం శిబిరాలకు ఇప్పుడు ఒకే సారి వేల మంది వస్తున్నారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ స్లాట్‌బుకింగ్ విధానం అమల్లోకి రావడం వల్ల.. రద్దీకి సంబంధించిన ఇబ్బందులుండవు. ⇒ దివ్యాంగులు వారికి అనుకూలంగా ఉన్న సమయంలో ఏదైనా మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ⇒ సదరం శిబిరాల్లో ప్రస్తుతం కంప్యూ టర్ ఆపరేటర్ అందరి వివరాలను అదేరోజు నమోదు చేయడం వల్ల టైం ఎక్కువ పడుతోంది. దీనివల్ల దివ్యాంగులు, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆపరేటర్ల తొందరపాటుతో కొన్నిసార్లు టైపింగ్ తప్పులు దొర్లుతున్నాయి. ఆన్లైన్ విధానంతో ఈ సమస్యలుండవు. ఆన్లైన్లో వివరాలన్నీ ముందుగానే నమోదై ఉంటాయి. -
వసూల్ రాజా
‘ప్రయివేటు’ రోగులకు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్న వైనం ♦ సీటీ స్కాన్‌కు రూ.1,000 చొప్పున వసూలు ♦ వికలాంగుల ధ్రువీకరణ పత్రానికి రూ.2వేలు ♦ వైద్యులు, సిబ్బందితోనూ దురుసు ప్రవర్తన ♦ ఇదీ ప్రభుత్వాస్పతి అభివృద్ధి కమిటీ సభ్యుడి నిర్వాకం ♦ అధికార పార్టీ నేత కావడంతో నోరుమెదపని అధికారులు లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ‘వికలాంగుల సర్టిఫికెట్ కావాలా... రూ.2 వేలు తెచ్చుకోండి. వైద్యులతో మాట్లాడి వెంటనే ఇప్పించేస్తా. సీటీ స్కాన్ తీయించాలా... రూ.1,000 ఇవ్వండి. బయట అయితే రూ.4వేలు అవుతాయి. ఎలాంటి కార్డులు అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటా. పోస్టుమార్టం త్వరగా చేయించాలా... అయితే, నాకు డబ్బులు(పరిస్థితిని బట్టి రేటు) ఇస్తే వైద్యులకు అందజేసి వెంటనే పని పూర్తిచేయిస్తా. అన్నీ నేను మేనేజ్ చేస్తాను..’ ఇదీ విజయవాడ ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న ఓ టీడీపీ నాయకుడు సాగిస్తున్న దందా. ఆయన చిల్లర వేషాల వల్ల తమ పరువు పోతోందని సహచర కమిటీ సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సింగ్, ఇతర మహిళా సిబ్బంది పట్ల కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిసింది. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో అధికారులు, సిబ్బంది ఎదురు చెప్పేందుకు సాహసించడం లేదు. నిత్యం రోగులను వెంటబెట్టుకుని... చిల్లర కోసం కక్కుర్తిపడుతున్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు నిత్యం ఇద్దరు, ముగ్గురు రోగులను వెంటబెట్టుకుని వస్తున్నారు. వారికి ఓపీ చీటీలు కూడా లేకుండానే స్కానింగ్ తీయాలని, ఇతర పరీక్షలు చేయాలని సిబ్బంది, అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వారు ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అక్కడ పరీక్షలు చేయించుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారిని సదరు కమిటీ సభ్యుడు ఇక్కడికి తీసుకువచ్చి తన పలుకుబడిని ఉపయోగించి ఉచితంగా స్కానింగ్ తీయిస్తారు. పరీక్షలు చేయిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా వారిని నుంచి ప్రయివేటు ల్యాబ్‌లో అయ్యే ఖర్చులో సగం తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడ ముత్యాలంపాడు ప్రాంతానికి చెందిన ఓ రోగి ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా, సీటీ స్కాన్ తీయాలని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వాస్పత్రి కమిటీ సభ్యుడు వెంటనే వారితో మాట్లాడారు. రూ.1,000 ఇస్తే ప్రభుత్వాస్పత్రిలో ఎటువంటి వెయిటింగ్ లేకుండానే స్కానింగ్ చేయిస్తానని చెప్పారు. రోగి అంగీకరించడంతో ఆయన వెంటబెట్టుకుని వచ్చి స్కానింగ్ తీయించి పంపారు. ఆయన ఆగడాలు పెరిగిపోతుండటంతో వైద్యులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఆయనకు తెలిసిన వారైతే ఒక ఫోన్ చేస్తే సరిపోతుందని, ఇలా వెంట తీసుకువచ్చి హంగామా చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినా.. సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడికి మూగ, వినికిడి లోపం వంద శాతం ఉంది. ఆయనకు వికలాంగ ధ్రువీకరణపత్రం కోసం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సదరు కమిటీ సభ్యుడు కలవడంతో పరిస్థితి వివరించారు. దీంతో రూ.2వేలు ఇస్తే వెంటనే ధ్రువీకరణపత్రం ఇప్పిస్తానని చెప్పారు. ఆ డబ్బులు తనకు కాదని, వైద్యుడికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆ దివ్యాంగుడి కుటుంబ సభ్యులు కార్పొరేటర్‌తో కలిసి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటువంటి పనులు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చ రించినట్లు సమాచారం. అయినా ఆయ నలో మార్పు రాకపోవడం గమనార్హం.