disapande
-
ఆ వీడియోలో ఏముంది?
అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలిపోయిన ప్రమాదం నుంచి బయటపడిన ఓ అమ్మాయి, అబ్బాయికి ఆ సమయంలో ఒక వీడియో టేప్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇండియా వచ్చేసిన ఈ ఇద్దరికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? అనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కంట్రోల్-సి’. అశోక్, దిశాపాండే జంటగా సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చే సిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- ‘‘ట్విన్ టవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన సాఫ్ట్వేర్ థ్రిలర్ ఇది. ఈ సినిమాలోని నైట్ ఎఫెక్ట్స్ థ్రిల్‌కు గురి చేస్తాయి’’ అని అన్నారు. ‘‘ సుకుమార్‌గారి వల్లే నేను సినిమా పరిశ్రమలోకి వచ్చాను. ఆయన సలహా మేరకు ఈ చిత్రాన్ని లో-బడ్జెట్లో తీశాను. ఈ సినిమాకి కథే హీరో’’ అని దర్శకుడు తెలిపారు. -
తెలుగులో... మిఠాయి
కన్నడంలో విజయవంతమైన ‘బొంబాయి మిఠాయి’ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో తెలుగు ప్రేక్షకు లకు అందిస్తున్నారు. చిక్కన్న, దిశాపాండే ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడు. ట్రైలర్‌ను ప్రముఖ గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత అన్నారు. చిత్ర సమర్పకుడు రాజ్ కందుకూరి, ఉప్పల శారద తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివ వై.ప్రసాద్, సత్యనారాయణ,