Disaster risk
-
మరణాలు లెక్కలేనంత.. నష్టం ఊహించలేనంత!!
International Day for Disaster Risk Reduction 2021: విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్, సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్), కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తులు ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి. కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009, డిసెంబర్ 21న ఒక ప్రతిపాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని International Day for Disaster Risk Reduction అధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు, రిస్క్ అవేర్నెస్ గురించి ప్రమోట్ చేస్తుంది ఈ దినోత్సవం. మొదట్లో నేచురల్ డిజాస్టర్ రెడక్షన్ డేగా ఉండేది. 2002లో ఓ రెజల్యూషన్ పాస్ చేసింది ఐరాస. ఆపై 2009లో అధికారికంగా ప్రకటించడంతో పాటు International Day for Natural Disaster Reduction పేరును International Day for Disaster Reductionగా మార్చేసింది. విపత్తు నిర్వహణ విపత్తులు సంభవించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా?. ఈ దిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆ దశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి. లోపాలను అధిగమించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’.. ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2017 World Conference on Disaster Risk Reductionలో సెండాయ్(జపాన్) సెవెన్ క్యాంపెయిన్‌ను ప్రతిపాదించారు. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గించాలనేది ఈ క్యాంపెయిన్ ఉద్దేశం మన దగ్గర.. భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ, చట్టం వచ్చింది మాత్రం 2005లో. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్(సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరోవైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది. థీమ్ Disaster Risk Governance.. 2021 ఏడాది కోసం ఇచ్చిన థీమ్ పిలుపు. కరోనాతో లక్షల మంది(కోట్ల మంది!) చనిపోయారు. ఈ నేపథ్యంలో విపత్తుల ప్రభావం తగ్గించే పరిపాలన మీద దృష్టిసారించాలని ప్రభుత్వాలకు చెబుతోంది ఈ థీమ్. లోపాలు ఇండియాలో 2001–21 మధ్య కాలంలో విపత్తుల మూలంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని రీతిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఐదేళ్ల క్రితం ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ అనుకున్నప్పటికీ.. అది విఫలమైంది. అంతెందుకు మూడేళ్ల క్రితం వచ్చిన కేరళ వరదలనే చూసుకుంటే.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి కేరళకు ముందస్తు హెచ్చరికలేవీ చెయ్యలేదన్న విమర్శలు వినిపించాయి. అదే సమయంలో వర్షాలు, వరదలను కేరళ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని, డ్యాముల నుంచి నీటిని ఆలస్యంగా విడుదల చేసిందని ప్రతివిమర్శలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందని వేసుకుని చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కామన్ పాయింట్ మాత్రం నిర్వహణ లోపమే. జాతీయ విపత్తు విపత్తు నిర్వహణ చట్టంలో లొసుగులూ ఉన్నాయి. ఇవి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తుంటాయి. ఉదాహరణకు.. కేరళ వరదలను ‘జాతీయ విపత్తి’గా కేంద్ర ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. మహా విపత్తు, మానవ తప్పిదాల వల్ల భారీ తప్పిదాలు జరిగాలి. ఆ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం ‘జాతీయ విపత్తు’గా ప్రకటిస్తుంది. కానీ, సహజ విపత్తులను ఖచ్ఛితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రూలేం చట్టంలో లేదు. అసలు సహజ విపత్తులు అంటే ఏంటో తేల్చేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆనాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని కమిటీ ఎలాంటి సూచనలు చెయకుండానే డిజాల్వ్ అయ్యింది. రాష్ట్రాలకు ఇదే మైనస్‌గా మారింది. అయితే విమర్శలు వచ్చినప్పుడల్లా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దింపి, ఏదో మొక్కుబడి ఆర్థిక సాయం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది కేంద్రం. విపత్తులు/ఆపదలు చెప్పి రావు. ఆకస్మాత్తుగా వస్తాయి. మానవ తప్పిదాలతో జరిగే విపత్తులను అరికట్టొచ్చు. కానీ, ప్రకృతి విపత్తులను పూర్తిగా జయించే శక్తి మనకు లేదు. ఎదుర్కొవటానికి.. తీవ్రతను తగ్గించడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలి!. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణను ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాలి. అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మున్ముందు కూడా అంతులేని నష్టం జరుగుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. - సాక్షి, వెబ్‌స్పెషల్ చదవండి: చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా టచ్ చేస్తే చెప్పేయ్ -
204 మంది మిస్సింగ్.. ఇద్దరు బతికారు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. కాగా, ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం సంభవించి 6రోజులు ముగుస్తున్నాయి. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకున్నవారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ ఘటనలో ఇద్దరు సజీవంగా బయట పడ్డారు. ఇప్పటికే 204 మంది తప్పిపోయారు. టన్నెల్ చిక్కుకున్న మరికొందరితో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి అనేక ఏజెన్సీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తపొవన్ సొరంగంవద్ద సహయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు చమోలి జిల్లా కలెక్టర్ స్వాతి భదోరియా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు హిమనీనదం పేలుడు కారణం కాదని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 56 ఏళ్ల కిందట అధికారులునందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్పీడీఆర్ఆర్ చైర్మన్‌గా అమిత్ షా
న్యూఢిల్లీ: విపత్తు నిర్వహణకు ఉద్దేశించిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ జాతీయ వేదిక (ఎన్పీడీఆర్ఆర్)కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉంటారు. ఇందులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు మంత్రులు ఉన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను సమాయనుగుణంగా పర్యవేక్షించడం, విపత్తు నిర్వహణ పాలసీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా ఎన్పీడీఆర్ఆర్ పర్యవేక్షించడంతో పాటు సలహాలు కూడా ఇస్తుంది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్లు ఎన్పీడీఆర్‌ఆర్‌కు వైస్ చైర్మన్లుగా ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఓ మంత్రి, మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల మేయర్లు కూడా సభ్యులుగా ఉంటారు. (చదవండి: అవినీతి అధికారులకు కేంద్రం షాక్) -
విపత్తు.. ఇక చిత్తు
సాక్షి, హైదరాబాద్: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 8 డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం ద్వారా సమకూర్చుకున్న వీటిని గురువారం నెక్లెస్ రోడ్‌లోని జీహెచ్ఎంసీ పార్కింగ్ యార్డులో మంత్రి కేటీఆర్ ప్రారంభిం చారు. ఒక్కో వాహనానికి రూ.18 లక్షలు వ్యయం కాగా, ఒక్కో జనరేటర్‌కు రూ.3.5 లక్షలు, ఇతర సామగ్రికి రూ.20 లక్షల చొప్పున వెచ్చించారు. విపత్తులను ఎదుర్కోవడంతో పాటు అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఈ వాహనాలను వినియోగిస్తారు. దేశంలోనే ఇలాంటి వాహనాలను తొలిసారిగా జీహెచ్ఎంసీ సమకూర్చుకుందని అధికారులు చెప్పారు. -
ఘోర ప్రమాదం
ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీ ఇద్దరి దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇంకో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు పావగడ సమీపంలో ఘటన పావగడ/రొద్దం: కర్ణాటక రాష్ట్రం పావగడ-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలోని పావగడ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ-02.జెడ్-148 నంబర్ గల బస్సు 62 మంది ప్రయాణికులతో పావగడకు బయలుదేరింది. పావగడ విడ్స్ సమీపంలోని నాగలమడక మలువులోకి రాగానే పావగడ వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తూ ఎదురొచ్చిన ఐచర్ వాహనం, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ధ్వంసమైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారిలో యశోద(35)గా గుర్తించారు. మరో యువకుడు మృతి చెందగా, అతని వివరాలు తెలియరాలేదు. బస్సు డ్రైవర్ నరసింహులు(45), ఐచర్ వాహన డ్రైవర్ మణి(40) పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 20 మందిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు... ఐచర్ క్లీనర్ మూర్తి(34), వెంకటేసు(40)కంబదూరు తిమ్మాపురం, సుబ్బరాయుడు(35)కంబదూరు తిమ్మాపురం, లక్ష్మిదేవి(50), ఆదిలక్ష్మి(45)కళ్యాణదుర్గం, నరసింహప్ప(30) పావగడ, చెన్నమ్మ(65) చెన్నంపల్లి, పద్మావతి(40) బస్సు కండక్టర్, అమృత విద్యార్థి(16), గంగమ్మ(40), శ్రీనివాసులు(40) అండేపల్లి, రత్నయ్యశెట్టి(55)పావగడ, నాగభూషణ(40)కదిరిదేవరపల్లి, నారాయణ(34) తదితరులు ఉన్నారు. మరో ఆరుగురు స్వల్ప గాయాలతో చికిత్స బయటపడ్డారు. సీఐ ఆనంద్, ఎస్ఐ మజునాథ్ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేపసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కలిసి పనిచేయడానికి సిద్ధం: మోదీ
న్యూఢిల్లీ: విపత్తుల మూలంగా సంభవించే నష్టాలను తగ్గించే విషయంలో ప్రపంచదేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. గురువారం ఇక్కడ జరుగుతున్న డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2016 ఆసియా మంత్రుల సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు నివారణకు సంబంధించిన వనరుల అభివృద్ధికి ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఆర్థిక వృద్ధిపై విపత్తులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని.. వీటి తీవ్రతను తగ్గించడానికి విశాల దృక్పథంతో, సృజనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. విపత్తు నిర్వహణలో మహిళల ప్రాధాన్యతను పెంచాల్సిందిగా సదస్సులో పాల్గొన్న దేశాలను మోదీ కోరారు. విపత్తులపై 10 అంశాలతో కూడిన ఎజెండాను ప్రకటించిన ఆయన.. విపత్తుల నివారణకు యూనివర్సిటీల నెట్వర్క్ అభివృద్ధి చెందాలన్నారు. విపత్తుల నివారణకు భారత్ తన వనరులు, స్పేస్ టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. -
దుకాణంపైకి దూసుకొచ్చిన మృత్యువు
►అతి వేగంతో వస్తూ అదుపుతప్పిన లారీ ►జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం ►టీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ దుర్మరణం ►మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పార్వతీపురం (ప్రత్తిపాడు) లారీ రూపంలో మృత్యువు దుకాణంపైకి దూసుకురావడంతో ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన ప్రత్తిపాడు మండలం పార్వతీపురంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం గ్రామానికి చెందిన కామినేని అనూరాధ (25), దగ్గు లీలావతి (36)లు 16వ నంబరు జాతీయ రహదారిపై బడ్డీ కొట్లు పెట్టుకుని టీ దుకాణాలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం ఉదయం కొట్టు వద్ద వ్యాపారం సాగిస్తున్నారు. 7 గంటల సమయంలో పేపర్లోడుతో గుంటూరు నుంచి మద్రాసుకు మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి అమాంతం టీ దుకాణంపైకి దూసుకొచ్చింది. దుకాణం చెల్లాచెదురైంది. ఈ ప్రమాదంలో అనూరాధ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం రహదారికి ఆనుకుని ఉన్న ఫెన్సింగ్ వైపునున్న సైడుకాలువలో పడిపోయింది. ఆ సమయంలో అనురాధ దుకాణం వద్ద నిలబడిన లీలావతితో పాటు అక్కడ నిలబడి ఉన్న తుమ్మలపాలెం గ్రామానికి చెందిన సత్రపు నాగేశ్వరరావు (37)కు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లీలావతిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, నాగేశ్వరరావును దగ్గరలోని కేఎంసీహెచ్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ సిబ్బందితో వచ్చి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. అండగా నిలిచి.. అనాథలుగా విడిచి.. అనురాధ భర్త నరసయ్య రెండేళ్లుగా అనారోగ్యంతో మంచం పట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు వెంకటస్వప్న (6), శ్రీనివాస్ (3) ఉన్నారు. వయసు మీదపడిన ఆమె తల్లి నరసమ్మ కూడా వీరితోనే ఉంటోంది. దీంతో కుటుంబ భారమంతా అనూరాధపై పడింది. కుటుంబ పోషణకు జాతీయ రహదారి పక్కనే టీ దుకాణం నిర్వహిస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఆమె రహదారి పక్కన ఫెన్సింగ్‌లో ఇరుక్కుపోయింది. మృతదేహాన్ని అతి కష్టంమీద స్థానికులు బయటకు తీశారు. ముఖం పూర్తిగా చిధ్రమవ్వడంతో గగుర్పాటుకు గురయ్యారు. విగత జీవిగా మారిన తల్లిని చూసి లోకజ్ఞానం తెలియని పసివారు అమాయకం చూస్తుండటం స్థానికులను కలచివేసింది. జాతీయ రహదారిపై వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనాలు రయ్య్ ్రమంటూ దూసుకుపోతుంటాయి. ఏమాత్రం పొరబాటు జరిగినా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ విషయం పోలీసులకు, హైవే అథారిటీ అధికారులకు తెలిసి కూడా బడ్డీ కొట్ల ఏర్పాటుకు అనుమతించడం విమర్శలకు దారితీస్తోంది.