dismantle
-
జోషీమఠ్‌లో మళ్లీ కూల్చీవేతలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో మంచు, వర్షం కారణంగా నిలిచిపోయిన భవనాల కూల్చీవేత పనులు శనివారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. 269 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. వీరికి హీటర్లు, ఉలెన్ దుస్తులు, వేడి నీరు, ఆహారపదార్థాల కిట్లు అందజేశామన్నారు. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచు కురవడం, తుంపర్ల వర్షం కారణంగా చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. భూమి కుంగిపోవడంతో జోషీమఠ్‌లో 849 ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. అంతేగాక జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. -
FIFA: అదృశ్యం కానున్న 'స్టేడియం 974'; ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లను ఎనిమిది స్టేడియాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎనిమిది స్డేడియాల్లో ఒక స్టేడియాన్ని మాత్రం వినూత్న శైలిలో నిర్మించారు. అదే 974 స్టేడియం. అంకెలు ఎందుకు ఉన్నాయనేగా మీ డౌటు.. ఈ స్టేడియం నిర్మాణంలో 974 షిప్పింగ్ కంటైనర్లను ఉపయోగించారు. అందుకే ఈ స్డేడియానికి 974 అని పేరు వచ్చింది. కాగా ఇదే '974' సంఖ్య ఖతార్ అంతర్జాతీయ టెలిఫోన్ కోడ్‌ను సూచిస్తుంది. అయితే ఫిఫా వరల్డ్‌కప్ ముగియగానే 974 స్టేడియం కనుమరుగు కానుంది. సోమవారం బ్రెజిల్, సౌత్ కొరియాల మధ్య మ్యాచ్ 974 స్టేడియంలో చివరిది కావడం విశేషం. దోహా పోర్ట్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూలగొట్టనున్నట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. తాజాగా స్టేడియానికి సంబంధించిన వీడియోను ఫిఫా వరల్డ్ కప్ అభిమానులతో పంచుకుంది. ''త్వరలో అదృశ్యం కానున్న 974 స్టేడియాన్ని ఒకసారి చూసేయండి'' అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Built with 974 shipping containers. the stadium can be fully dismantled and re-purposed post-event 🧱 Take a look at Stadium 974 🏟️ #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022 చదవండి: పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు! -
కొత్త సచివాలయం అవసరమా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. కరోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం) తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని కోరారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కరోనా విషయంలో తప్పుడు విధానాలనే ఆయన అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సీఎం మొండివైఖరి కారణంగానే రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని హితవు పలికారు. కూల్చివేత దారుణం: జీవన్ రెడ్డి సచివాలయాన్ని కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద కట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఊరి వాడికి వారి ఆపద వస్తే... ఊసు గళ్ళ వాడికి దోమల ఆపద అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే సచివాలయ భవనాలు కూల్చివేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. -
‘అయోధ్య’ రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. నవంబర్ 9వ తేదీన వెలువరించిన చారిత్రక తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రివ్యూకోసం దాఖలైన పిటిషన్లను, జత చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. వీటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని భావిస్తున్నాం. అందుకే ఈ పిటిషన్లన్నిటినీ తిరస్కరిస్తున్నాం’ అంటూ వాస్తవ కక్షిదారులు వేసిన 10 పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ఈ ధర్మాసనం పేర్కొంది. తీర్పుపై సమీక్ష కోరేందుకు అనుమతించాలంటూ మూడోపక్షం(థర్డ్ పార్టీ) దాఖలు చేసిన 9 పిటిషన్లను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులోని 10 పిటిషన్లు వాస్తవ కక్షిదారులవి కాగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, దాని మద్దతుతో వేసినవి 8, హక్కుల కార్యకర్తలు 40 మంది కలిసి వేసిన మరో పిటిషన్ ఉన్నాయి. వీటితోపాటు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్, నిర్మోహి అఖాడా వేసిన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆఖరి చాన్స్ ‘క్యూరేటివ్’ అన్ని రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురికావడంతో కక్షిదారులకు ఇక ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే క్యూరేటివ్ పిటిషన్. తీర్పులో ఏవైనా లోపాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించిన పక్షంలో వాటిని సవరించేందుకు క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. పునస్సమీక్షకు తగిన ఆధారాలున్నాయని న్యాయస్థానం భావించినా, విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. -
నేనొస్తే ధ్వంసం చేస్తా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ముందువరుసలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుపోతున్న ఆయన ఏమాత్రం తన వాగ్దాడిని తగ్గించడం లేదు. అంతకంటే వేగంగా ఆయన మాటలు జారవిడుస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే విదేశాంగ విధానంలో తన తొలి ప్రాధాన్యం ఇరాన్ అణుఒప్పందం అంశమే ఉంటుందని, ఆ ఒప్పందాన్ని ధ్వంసం చేస్తానని అన్నారు. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందే ప్రపంచ ఉగ్రవాద నెట్ వర్క్‌కు టెహ్రాన్ మాత్రమే కీలక స్థావరంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను ఎంతో కాలంగా వ్యాపార రంగంలో ఉన్నానని, ఒప్పందాన్ని ఎలా చేసుకుంటారో తనకు తెలుసని అన్నారు. ఇరాన్ తో జరిగిన అణుఒప్పందం ఒక దురదృష్టకరం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని తాను విచ్ఛిన్నం చేస్తానని ప్రకటించారు.