distressed
-
యాక్సిస్ ఏఎంసీ 3,500 కోట్ల డి్రస్టెస్డ్ ఫండ్
ముంబై: యాక్సిస్ ఏఎంసీ (మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థ).. ఇన్వర్షన్ అడ్వైజరీ సర్విసెస్ భాగస్వామ్యంతో రూ.3,500 కోట్ల డి్రస్టెస్డ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీలను లాభాల్లోకి తీసుకురావడంలో (టర్న్అరౌండ్) నైపుణ్యం ఉన్న ఇన్వర్షన్ అడ్వైజరీ సర్విసెస్ (అఖిల్ గుప్తా ఏర్పాటు చేసిన సంస్థ)తో ఒక ఈక్విటీ ఫండ్ మేనేజర్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం కొత్త తరహాగా యాక్సిస్ ఏఎంసీ పేర్కొంది. సెబీ ఆమోదం అనంతరం రూ.3,500 కోట్లతో డి్రస్టెస్డ్ ఫండ్‌ను ప్రారంభిస్తామని.. అదనంగా మరో రూ.500 కోట్ల మేర గ్రీన్ షూ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. పనితీరు సజావుగా లేని కంపెనీల్లో నియంత్రిత వాటాలను ఈ ఫండ్‌తో కొనుగోలు చేసి.. తదుపరి వాటి నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ద్వారా టర్న్అరౌండ్ చేస్తామని వివరించింది. ‘‘టర్న్అరౌండ్ పెట్టుబడుల విధానంలోకి అడుగు పెట్టడం ద్వారా దేశ వృద్ధి పథంలో పాల్గొని, ప్రయోజనం పొందే వినూత్న అవకాశాన్ని ఇన్వెస్టర్లకు తీసుకొచ్చాం’’ అని యాక్సిస్ ఏఎంసీ ఎండీ, సీఈవో చంద్రేష్ నిగమ్ పేర్కొన్నారు. -
పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!
ఫొటోలో కనిపిస్తున్న తిమింగలాన్ని చూస్తుంటే.. ఎంత అందంగా ఉందో అని ఆనందిస్తున్నారా.! కానీ, దాని జీవితం గురించి తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. దానికి ఉన్నన్ని కష్టాలు.. తెలుగు సీరియల్ హీరోయిన్‌కు కూడా ఉండి ఉండవేమో! రెండు సంవత్సరాల వయసులోనే తల్లిలాంటి సముద్రం నుంచి తప్పిపోయింది. 1947లో ఐస్‌ల్యాండ్ తీరానికి సమీపంలో మెరైన్ ల్యాండ్ వారి చేతికి చిక్కి, బందీగా మారింది. వారు ఈ కిల్లర్ తిమింగలానికి ‘కిస్కా’గా పేరు పెట్టి, ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నా.. ఏదో తెలియని బాధ. దీనికి తోడు తన పిల్లల్ని చూసుకుంటూ అయినా జీవితం సాగిద్దాం అనుకుంటే.. పుట్టిన ఐదు బిడ్డలు పుట్టినట్లుగానే చనిపోయాయి. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! స్నేహితులతో కలిసి కాస్త సరదాగా గడుపుదాం అనుకున్నా.. పక్కనే ఉండే మరో రెండు తిమింగలాలు కూడా కిస్కాని వదిలి వేరే లోకాలకు వెళ్లిపోయాయి. ఇలా ఎటు చూసినా కిస్కాకు కష్టాలు తప్పట్లేదు. దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది. ఇక ఈ ఒంటరి జీవితం జీవించలేనని అనుకుందో ఏమో.. ఈ మధ్యనే ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తన తలను తానే వాటర్ ట్యాంకర్ గోడలకేసి బాదుకుంటూ కనిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఏదీ ఏమైనా స్వేచ్ఛ అనేది మానవునికే కాదు.. మూగజీవాలకు కూడా ముఖ్యమే. బంగారు పంజరమైనా.. పక్షికి అది ఓ కారాగారమే. ఎన్ని పళ్లు, పలహారాలు తెచ్చి ఇస్తున్నా జూలో ఉండే మూగజీవులన్నీ తమకు అలవాటైన అడవినే కోరుకుంటాయి. వాటికదే స్వర్గం.. సేమ్ ఇలాగే ఈ కిల్లర్ తిమింగలం కూడా కాస్త స్వేచ్ఛ కోరుకుంటోంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
పీడీసీసీబీని వెంటాడుతున్న మొండి బకాయిలు
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (పీడీసీసీబీ)నష్టాల్లోనే కొనసాగుతోంది. పీడీసీసీబీని తమ సొంత జేబు సంస్థగా చేసుకున్న కొందరు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవటంతో మొండి బకాయిలు పీడలా బ్యాంకును వెంటాడుతున్నాయి. గత మూడు, నాలుగేళ్లుగా బ్యాంకు పాలక మండలి విషయంలో తీవ్ర సంక్షోభంలో ఉండిపోయింది. మూడేళ్ల క్రితం బ్యాంకులో కుదువ పెట్టిన బంగారు ఆభరణాల కుంభకోణం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంకు సిబ్బంది, బ్యాంకు అప్రైజర్లు కొందరు బంగారాన్ని కుదువ పెట్టిన రుణగ్రస్తులు కలిసి బ్యాంకును మోసం చేశారు. అప్పట్లో బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. దీంతో పాటు వరుసగా బ్యాంకు చైర్మన్లు మారటం, కోర్టులకు ఎక్కడం ఇలా బ్యాంకు పాలకమండలి పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనటంలో సందేహం లేదు. దీనికి తోడు బ్యాంకును తమ సొంత జేబు సంస్థలా వాడుకున్న కొందరు రూ.కోట్ల కొద్దీ తీసుకున్న రుణాలు తిరిగి వసూలు చేయటంలో బ్యాంకు యాజమాన్యం మెతక వైఖరి అవలంభించిందనే చెల్పాలి. బ్యాంకుకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన కలెక్టర్లు బ్యాంకు అభివృద్దిపై పూర్తిగా దృష్టి సారించకపోవటం కూడా బ్యాంకు నష్టాల్లోకి వెళ్లటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి.. ఇవన్నీ ఒక ఎత్తయితే గత ఐదేళ్లుగా వరుస కరువుతో జిల్లా రైతాంగం అతలాకుతలం అయ్యారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేయలేకపోవటం, ఒక వేళ పంటలు వేసినా దిగుబడి రాకపోవటం, లేకుంటే వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోయిన మాట వాస్తవమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుత కలెక్టర్ పోలా భాస్కర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకు వ్యవహారంలో ప్రత్యేక దృష్టి సారించారు. అయినా పాత బకాయిలు బ్యాంకుకు గుది బండలా మారటంతో జిల్లా కలెక్టర్ అందుకు సంబంధించిన వ్యవహారంపై దృష్టి సారిస్తున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిట్ ఇటీవలే పూర్తయింది. ఆడిట్లో కొన్ని బ్యాంకు సిబ్బంది సాంకేతిక పరంగా చేసిన కొన్ని పొరపాట్లు కూడా బ్యాంకు అభివృద్ధికి కొంత ఆటంకంగా మారింది. బకాయిల వసూళ్లలో కనిపించని పురోగతి.. ఆడిట్ ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.3.11 కోట్లు నష్టం వచ్చినట్లు తేలింది. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మేర తగ్గింది. గత సంవత్సరం రూ.3.28 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తేల్చారు. దీంతో 2017–18తో పోలిస్తే ఆడిట్ నిర్వహించిన ఏడాదికి గాను రూ.17 లక్షలు నష్టం తగ్గినట్లు తేలింది. ఇకపోతే బ్యాంకును పీడిస్తున్న మొండి బకాయిలు విషయంలో మాత్రం కొంత పురోగతి కనిపించింది. ఆప్కాబ్ నుంచి డిప్యూటేషన్‌పై బ్యాంకు సీఈఓగా వచ్చిన జి.జయ శంకర్ ఆధ్వర్యంలో బ్యాంకు బృందం మొండి బకాయీల విషయంలో చేసిన కసరత్తు కొంతమేర ఫలించింది. గత సంవత్సరంతో పోలిస్తే రూ.4.50 కోట్లు తగ్గింది. 2017–18 సంవత్సరానికి గాను మొండి బకాయీలు రూ.38.50 కోట్లు ఉండగా 2018–19 సంవత్సరానికి అదికాస్తా రూ.34 కోట్లకు తగ్గింది. అధికారులకు తలనొప్పిగా మారిన రీ ఎంట్రీలు.. ఇదిలా ఉంటే బ్యాంకు కమ్యూనికేషన్ వ్వవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల వల్ల కొంత అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్లలో నిక్షప్తం అయిన సమాచారం ప్రకారం లోపాలను సరిదిద్దటంతో రూ.8.04 కోట్లు రీ ఎంట్రీలు వేయాల్సిన పరిస్థితి నెలకొని ఆడిట్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాటితో పాటు నిరర్ధక ఆస్తులు రూ.1.74 కోట్లు ఉన్నట్లు తేల్చారు. లాంగ్ టర్మ్ రుణాల వడ్డీల్లో వచ్చిన తేడాల వల్ల రిసీవబుల్స్ కింద రూ.60 లక్షలు తేడా ఉన్నట్లు తేల్చారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు 2018–19లో ఇచ్చిన రుణాల రికవరీలో కొంతమేర పురోగతి ఉండటంతో నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్స్(ఎన్పీఏ)ల పరిస్థితి 3 శాతంగా నమోదు అయింది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ఎన్పీఏ 5 శాతం దాటితే బ్యాంకు దివాలా పరిస్థితిని ఎదుర్కొనేది. అలాంటిది 3 శాతం కావటంతో ఆ ప్రమాదం నుంచి బయట పడినట్లు అయింది. మొత్తం మీద 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,100 కోట్లు వివిధ రకాల రుణాలుగా అందజేశారు. అయితే బ్యాంకు మాత్రం డిపాజిట్లు సేకరించే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బ్యాంకు డిపాజిట్ల సేకరణ లక్ష్యం రూ.745 కోట్లు కాగా రూ.633 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. దీంతో డిపాజిట్ల లోటు రూ.112 కోట్లు ఏర్పడినట్లయింది. జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు పరిధిలో మొత్తం జిల్లాలో 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 169 పిఏసిఎస్‌లు పనిచేస్తున్నాయి. వాటితో పాటు 7 సీడెడ్ సొసైటీలు ఉన్నాయి. -
మానసిక అలజడితో ఈ ముప్పు అధికం
లండన్ : మానసిక అలజడి, ఒత్తిడి కారణంగా అర్థరైటిస్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు చుట్టుముట్టే ముప్పు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. మానసిక అలజడి తక్కువగా ఉన్నప్పటికీ తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం పొంచిఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 16,485 మందిపై మూడేళ్ల పాటు పరిశీలించిన అనంతరం సౌతాంప్టన్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించే వారితో పోలిస్తే మానసిక అలజడి కొద్దిపాటిగా ఉన్న వారిలోనూ అర్ధరైటిస్ వచ్చే అవకాశాలు 57 శాతం అధికమని తేలింది. అధిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి అర్థరైటిస్ వచ్చే అవకాశం 72 శాతం ఉండగా, తీవ్ర అలజడితో బాధపడేవారికి అర్థరైటిస్ ముప్పుతప్పదని పరిశోధకులు హెచ్చరించారు. యాంగ్జయిటీ, కుంగుబాటులను ప్రాథమిక దశలోనే నియంత్రించడం ద్వారా తీవ్ర అనారోగ్యాలను నివారించవచ్చని జర్నల్ సైకోమాటిక్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయన రచయిత ప్రొఫెసర్ కేథరిన్ గేల్ పేర్కొన్నారు.మానసిక అశాంతి ఏస్థాయిలో ఉందనే దానిపై గుండె జబ్బులు చుట్టుముటే అవకాశాలు అంత అధికమని అథ్యయనంలో గుర్తించినట్టు చెప్పారు. -
పరిణామాలు బాధిస్తున్నాయి: ఇన్ఫోసిస్ మూర్తి
బెంగళూరు: దేశంలో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో ప్రకంపనలపై సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్ తొలి చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)లో అత్యుత్తమ ప్రమాణాలకు మారు పేరుగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్థలో సంక్షోభం తలెత్తిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే సమస్య సీఈవో విశాల్ సిక్కాతో కాదనీ బోర్డులోని పారదర్శకత ప్రామాణికత ప్రధాన సమస్య అని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్ దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. ఇటీవల రాజీనామా చేసిన డేవిడ్ కెన్నెడీ, సిఎఫ్ఒ రాజీవ్ బన్సాల్ తదితరుల సెవరెన్స్ ప్యాకేలజీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బన్సల్ కు సాధారణంగా 12 నెలల ప్యాకేజీ కంటే అదనంగా 10 రెట్లు చెల్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రెమ్యునరేషన కమిటీ ఛైర్మన్ (జెఫ్రీ లేమన్) నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ చెల్లింపు సందర్భంలో ఆయన ప్రత్యేక సమావేశం ద్వారా ఆమోదం పొంది ఉండాల్సిందన్నారు. ఇలాంటి అసాధారణ చెల్లింపు వెనుక అసలు కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది సాధారణ ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలను అందిస్తుందని కంపెనీ ఏకైక పెద్ద వాటాదారు (3.44శాతం)గా ఉన్న మూర్తి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిడిల్ లెవల్, జూనియర్ లెవల్ ఉద్యోగులు ఇప్పటికే ఈ పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారనీ, దాదాపు 1800 పైగా ఈ మెయిల్స్ కు తనకు అందాయని చెప్పారు. దీనిపై సంస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి ఉద్ఘాటించారు. ఇది ఉద్యోగుల నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. ఎంతో మందిమి దశాబ్దాలుపాటు కష్టపడి ఉత్తమ విలువలు, సంస్కృతితో కూడిన సంస్థను తీర్చిదిద్దామని, కానీ ప్రస్తుత పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. అయితే కంపెనీని వీడిన మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్, జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెనడీలకు బోర్డు సెవెరెన్స్ ప్యాకేజీలను ఇచ్చింది. డిసెంబర్లో బాధ్యతల నుంచి తప్పుకున్న కెనడీకి 8.68 లక్షల డాలర్లతోపాటు, ఏడాదిపాటు బీమా కవరేజీ కొనసాగింపునకు నిర్ణయించింది. ఇక 2015 అక్టోబర్‌లో కంపెనీని వీడిన రాజీవ్‌కు రూ. 17.38 కోట్లను చెల్లించింది. అయితే ఈ చెల్లింపులను కంపెనీ నిబంధనలు, ఉద్యోగ ఒప్పందం ప్రకారమే నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. గత ఏడాదికాలంగా విలువలు, పారదర్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఆందోళనలు చెలరేగినప్పటికి ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులో వచ్చాయి. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలను కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా ఖండించారు.. కార్పొరేట్ నైతికత, సమగ్రత, విలువల విషయంలో ఇన్ఫోసిస్‌కు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ఉద్యోగులను కోరారు. కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత ఈమెయిల్లో ఆయన ఈ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే -
నిరాశా నిస్పృహల్లో ఇంజినీరింగ్ పట్టభద్రులు