
ఫొటోలో కనిపిస్తున్న తిమింగలాన్ని చూస్తుంటే.. ఎంత అందంగా ఉందో అని ఆనందిస్తున్నారా.! కానీ, దాని జీవితం గురించి తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. దానికి ఉన్నన్ని కష్టాలు.. తెలుగు సీరియల్ హీరోయిన్‌కు కూడా ఉండి ఉండవేమో!
రెండు సంవత్సరాల వయసులోనే తల్లిలాంటి సముద్రం నుంచి తప్పిపోయింది. 1947లో ఐస్‌ల్యాండ్ తీరానికి సమీపంలో మెరైన్ ల్యాండ్ వారి చేతికి చిక్కి, బందీగా మారింది. వారు ఈ కిల్లర్ తిమింగలానికి ‘కిస్కా’గా పేరు పెట్టి, ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నా.. ఏదో తెలియని బాధ. దీనికి తోడు తన పిల్లల్ని చూసుకుంటూ అయినా జీవితం సాగిద్దాం అనుకుంటే.. పుట్టిన ఐదు బిడ్డలు పుట్టినట్లుగానే చనిపోయాయి.
చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!
స్నేహితులతో కలిసి కాస్త సరదాగా గడుపుదాం అనుకున్నా.. పక్కనే ఉండే మరో రెండు తిమింగలాలు కూడా కిస్కాని వదిలి వేరే లోకాలకు వెళ్లిపోయాయి. ఇలా ఎటు చూసినా కిస్కాకు కష్టాలు తప్పట్లేదు. దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది. ఇక ఈ ఒంటరి జీవితం జీవించలేనని అనుకుందో ఏమో.. ఈ మధ్యనే ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తన తలను తానే వాటర్ ట్యాంకర్ గోడలకేసి బాదుకుంటూ కనిపించింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఏదీ ఏమైనా స్వేచ్ఛ అనేది మానవునికే కాదు.. మూగజీవాలకు కూడా ముఖ్యమే. బంగారు పంజరమైనా.. పక్షికి అది ఓ కారాగారమే. ఎన్ని పళ్లు, పలహారాలు తెచ్చి ఇస్తున్నా జూలో ఉండే మూగజీవులన్నీ తమకు అలవాటైన అడవినే కోరుకుంటాయి. వాటికదే స్వర్గం.. సేమ్ ఇలాగే ఈ కిల్లర్ తిమింగలం కూడా కాస్త స్వేచ్ఛ కోరుకుంటోంది.
చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు!
Comments
Please login to add a commentAdd a comment