‘ట్రాక్టర్ల పంపిణీ’ అక్రమాలపై నివేదిక ఇవ్వండి
- జీవన్‌రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన లోకాయుక్త
- విచారణ నవంబర్ 23కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జరుగుతోన్న ట్రాక్టర్ల పంపిణీలో అక్రమాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకాయుక్త ఆదేశించింది. ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే లబ్ధి పొందుతున్నారని, అర్హులకు ట్రాక్టర్లు అందడం లేదంటూ జీవన్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది.
ట్రాక్టర్లు ఎవరెవరికి ఇవ్వాలో మంత్రులే జాబితాలు సిద్ధం చేసి పంపుతున్నారని, దీంతో టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ మేర ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న లోకాయుక్త ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.