District Joint Collector
-
జాయింట్ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
ప్రగతినగర్ : జిల్లా సంయుక్త కలెక్టర్‌గా రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో ఎస్టేట్ సెక్రెటరీగా ఉన్న ఆయనను జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. తహశీల్దార్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన రవీందర్‌రెడ్డి డీఆర్ఓ, జడ్పీ సీఈఓ, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర విషయాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కొత్త జేసీకి బాధ్యతలను అప్పగించారు. ఏడు నెలలుగా జేసీ బాధ్యతలను కలెక్టరే చూస్తున్నారు. బాధ్యతలు స్వీక రించిన అంతనరం జేసీకి పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. -
సంతృప్తిగా పనిచేశా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో దాదాపు రెండేళ్లు సంతృప్తికరంగా విధులు నిర్వహించాను. దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించటం నా ఉద్యోగ జీవితంలో మరిచిపోలేని అనుభూతి. జిల్లాలో పనిచేసిన కాలం ఓ మధురస్మృతిగా నిలిచిపోతుంది. ఖమ్మం నాకెన్నో పాలనానుభవాలు నేర్పింది..’ అని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన ఆయన సోమవారం ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మంచి జిల్లాలో ఉద్యోగం చేయాలని... ప్రజలకు సేవ చేయాలంటే మంచి జిల్లాలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. ఖమ్మం జిల్లాలో పని చేయడంతో ఆ ఆకాంక్ష నేరవేరింది. జిల్లాలో పని చేయడం ఆనందంగా ఉంది. నా 13 ఏళ్ళ సర్వీస్‌లో రెండేళ్లు పూర్తిస్థాయిలో ఇక్కడ పనిచేయటం సంతృప్తిగా ఉంది. ప్రజా ప్రతినిధు లు అధికారులు, ఉద్యోగుల సహకారం మరువలేనిది. చైతన్యానికి జిల్లా మారుపేరు. ఒకవైపు ఏజెన్సీ, మరోవైపు నదులు, ఖనిజం, అటవీసంపద, పలురకాల వృత్తులు, ప్రవృత్తుల మేళవింపు మన జిల్లా. 1996లో సర్వీస్‌లో జాయిన్ అయ్యా ను. అందరి సహకారంతో 100 శాతం పని చేశా. నేను చాలా అదృష్టవంతుడుని.. ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఉద్యోగం సజావుగా సాగింది. భూ సమస్యలు... భూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని ముందుగానే భావించా. అనేక ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించా. జంగ్ సిపాయి భూములను నిబంధనల ప్రకారం అర్హులకు అందించాను. జిల్లా వ్యాప్తంగా 7 వ విడత అసైన్మెంట్ కింద మూడు నెలల్లో ఏడుగురికి 15 వేల ఎకరాలకు పట్టాలు, పహణీలు అందించాం. ఇందుకోసం గిరిజనులు, గిరినేతరులకు అవగహన కల్పించి భూముల సర్వే చేపట్టాం. డిజిటల్ సర్వే యంత్రాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేసి సక్సెస్ అయ్యాం. మీసేవ... గతంలో మీసేవ కేంద్రాలలో 20 సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటిని 250 సర్వీసులకు చేర్చాం. మీసేవా కేంద్రాలు సజావుగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులైన వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు కంప్యూటర్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మీసేవలో పహణీల విషయంలో కొంత మేర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని నిరోధించేందుకు తహశీల్దార్లకు అవగహన కల్పించాం. అక్రమ పహణీలను అరికట్టాం. తహశీల్దార్ల బాధ్యత పెరిగింది. ల్యాండ్ సర్వే కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. రికార్డులను భద్రపరిచేందుకు అత్యాధునిక రికార్డురూమ్ను ఏర్పాటు చేశాం. టెక్నాలజీ వాడకంపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం, భద్రాచలంలో రూ.20 లక్షలతో ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. రికార్డుల భద్రతకు అత్యాధునిక రూం నెలకొల్పాం. ‘ఆధార్’తోనే అన్నీ.. ఆధార్ అనుసంధానంతో అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఆధార్ అనుసంధానంలో జిల్లా 3వ స్థానంలో ఉంది. జిల్లాలో 98 శాతం ఆధార్ నమోదు పూర్తయింది. ఏజెన్సీ ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్ళకుండా వారి చెంతనే ఆధార్ అందించే ప్రకియ చేపట్టి విజయవంతం అయ్యాం. సివిల్ సప్లైలో ఆధార్ అనుసంధానంతో అక్రమంగా ఉన్న 50 వేల తెల్లరేషన్‌కార్డులను తొలగించాం. నెలకు 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా చేశాం. ఆధార్ వల్ల గ్యాస్కనెక్షన్ లబ్ధిదారులను గుర్తించి కిరోసిన్ కోటానూ ఆదా చేశాం. గ్యాస్‌తో పాటు కిరోసిన్ పొందుతున్న వారిని అదుపు చేయడం వల్ల రూ.50 లక్షలు ఆదా అయ్యాయి. నిర్వాసితులకు న్యాయమే చేశాం భూ నిర్వాసితులకు అప్పటి విలువ ప్రకారం న్యాయమే జరిగింది. ప్రజలు అంగీకరించిన తరువాత మాత్రమే మేము ఫైల్స్ పని ప్రారంభించాం. అప్పటి విలువ ప్రకారం కొమ్మేపల్లిలో రూ.5 లక్షలు, కిష్టారంలో రూ.6 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రజలు తొలుత అంగీకరించి తర్వాత నిరాకరించారు. అప్పటికే గడువు రెండు సంవత్సరాలు ఉంది. చివరి సమయంలో ల్యాప్సయ్యే అవకాశం ఉండటంతో దానిని అమలు చేశాం. ఒప్పందం ప్రకారం ఎవరూ ముందుకు రాని సమయంలో సెక్షన్ 31 ప్రకారం కోర్టులో రూ.20 కోట్లు డిపాజిట్ చేశాం. కేసు జిల్లా జడ్జి కోర్టులో ఉంది. విద్యుత్ ప్రాజెక్టుల్లో.. జిల్లాలో నీరు, బొగ్గు, భూమి, రవాణావ్యవస్థ అనుకూలంగా ఉం డటంతో కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, అశ్వాపురంల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. ఏడో దశ విస్తరణలో భాగంగా ఇప్పటికే పాల్వంచలో మరో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మణుగూరులో 1031 ఎకరాల్లో 1080 మెగావాట్ల ప్రాజెక్టు, అశ్వాపురంలో 1300 ఎకరాల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టు, కొత్తగూడెంలో 3000 ఎకరాల్లో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. అర్హులందరికీ ఆహారభద్రత.. జిల్లాలో అర్హులందరికీ ఆహారభద్రత అందించటమే లక్ష్యంగా పనిచేశాం. ఇప్పటికే 6,50,000 కార్డుల వివరాలు కంప్యూటరీకరించాం. ఇంకా 50వేల మంది వివ రాలు నమోదు చేయాలి. ఈ నెల 16 నుంచి అర్హులైన కుటుంబాలకు పూర్తిస్థాయిలో రేషన్ అందించేందుకు చర్యలు చేపట్టాం. గతంలో రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. ఇక నుంచి రేషన్ అర్హులకు మాత్రమే అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పాలని అనుకున్నాను. అది పూర్తిస్థాయిలో అమలైంది. మొదట 30 స్కూల్స్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ ప్రారంభించాం. ఇప్పుడు 250 పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. 25 వేల మంది విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా మూడునెలల్లో కోర్సు పూర్తి చేశాం. తరువాత హైదరాబాద్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటా. జిల్లాలో జమాబందీని అమలు చేయలేకపోయాం. గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల వివరాలు పంచాయతీ కార్యాలయం గోడలపై రాయిస్తున్నాం. -
జేసీగా కన్నబాబు
ఏలూరు :జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కూనపరెడ్డి కన్నబాబు నియమితులయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కర్నూలు జేసీగా పనిచేస్తున్న కన్నబాబు బదిలీపై ఇక్కడకు రానున్నారు. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఆయన గతంలో శ్రీకాకుళం అదనపు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై 2011 డిసెంబర్ 5న జేసీగా ఇక్కడకు బదిలీపై వచ్చారు. మూడేళ్లకుపైగా ఇక్కడ పనిచేసిన బాబూరావునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు, పౌర సరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రతినెలా 2వ తేదీన ‘నా రేషన్’ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రేషన్ కార్డుదారుల సమస్యలను పరిష్కరించారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాల పరిష్కారంలోనూ కీలక భూమిక పోషించారు. కన్నబాబుకు ఏడేళ్ల అనుబంధం జేసీగా నియమితులైన కూనపురెడ్డి కన్నబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. గ్రూప్-1 ఉత్తీర్ణులైన ఆయన 1997 జూలై 14న నరసాపురం ఆర్డీవోగా నియమితులయ్యారు. ఆర్డీవోగా ఐదేళ్లకు పైగా సమర్థవంతమైన సేవలం దించారు. రబీలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించి రెండో పంటకు సక్రమంగా నీరందించడం ద్వారా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందారు. 2002 మే 29న డీఆర్డీఏ పీడీగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండేళ్లపాటు పనిచేసి విశాఖపట్నం డీఆర్డీఏ పీడీగా పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితి తరపున డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా, అనంతరం హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వట్టి వసంత్‌కుమార్‌కు ఓఎస్డీగా వ్యవహరించారు. 2012లో ఐఏఎస్ హోదా పొందిన కన్నబాబు అదే ఏడాది నవంబర్ 30న కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. -
‘విలీన’ సమస్యలపై ప్రత్యేక దృష్టి
భద్రాచలం :ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. బుధవారం నెల్లిపాక, కూనవరం, చింతూరు మండలాల్లో రంపచోడవరం ఆర్డీఓ శంకర వరప్రసాద్‌తో కలిసి పర్యటించారు. భద్రాచలం సమీపంలోని ఎటపాకను విలీన మండలాలకు డివిజన్ కేంద్రంగా ప్రకటించినందున ఇక్కడున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముందుగా ఎటపాకలో ఏర్పాటు చేసిన నెల్లిపాక తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించారు. ఎంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు, ఇంకా ఎంత మంది అవసరమని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న వీఆర్ఓల సమస్యలు ఏమిటన అడగగా, తాము తెలంగాణ ప్రాంత వాసులమని, ఆ రాష్ట్రానికే బదిలీ చేయాలని కోరారు. దీంతో జేసీ, ఆర్డీఓ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా ఏపీకి బదలాయించారని, ఇక్కడ కార్యాలయాలు, భవనాలు అన్నీ ఏపీకే చెందుతాయన్నారు. ఉద్యోగులు కూడా ఎక్కడి వార క్కడే పనిచేయాల్సి ఉంటుందని, కమల్‌నాథన్ కమిటీ సిఫారసు వచ్చేంత వరకూ ఉద్యోగులంతా ఏపీలోనే పనిచేయాలన్నారు. వారికి జీతాలు కూడా తామే చెల్లిస్తామన్నారు. కార్యాలయంలో సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణకుమారితో మాట్లాడుతుండగా.. సిబ్బంది ఎవరూ లేకపోవటంతో పనిచేయటం కష్టంగా ఉందని చెప్పడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరూ లేకపోతే పనిచేయటం మానేస్తారా..? ఇలా అయితే మీరెందుకు’ అని ప్రశ్నించారు. అలా అయితే తనను తెలంగాణకు సరెండర్ చేయాలని కృష్ణకుమారి కోరగా.. చింతూరులో పనిచేసినప్పుడు కూడా ‘మీపై ఆరోపణలు ఉన్నాయి..తెలంగాణకు సరెండర్ కాదు.. సస్పెండ్ చేస్తా’ అని జేసీ హెచ్చరించారు. ఖాళీలు భర్తీ చేస్తాం.. విలీన మండలాల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని జేసీ అన్నారు. ఎటపాకలో ఇప్పటికే డీఎస్పీ కేడర్ గల అధికారికి పోస్టింగ్ ఇచ్చామని, పాలన గాడిలో పెట్టేందుకు ముందుగా పంచాయతీ కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించామని చెప్పారు. ఏ నియామకాల్లో అయినా విలీన మండలాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. నెల్లిపాకతో పాటు అన్ని తహశీల్దా కార్యాలయాల నుంచి ఏపీ ప్రభుత్వం పేరుతోనే సర్టిఫికెట్లు జారీచేస్తామన్నారు. -
కొత్త జేసీ వివేక్ యూదవ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అడిషనల్ సీఈవోగా బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను నియమించింది. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వీరపాండ్యన్ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన జిల్లా జేసీగా విధుల్లోకి చేరారు. ఆయన పనిచేసిన ఏడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించారు. కొత్త రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆయన శాఖలో ఉన్న కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. ప్రధానంగా తహశీల్దార్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకదశలో ఆయన నిర్వహించిన సమావేశాలు కూడా బహిష్కరించారు. అలాగే డీలర్లు, వీఆర్వోలు, రైస్‌మిల్లర్ల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సప్లయ్ సిబ్బంది కూడా విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. కార్యాయంలో ఫైళ్ల నిర్వహనలో జాప్యం, అనవసర కొర్రిలు వేసి కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అపవాదు కూడా ఉంది. మన్ననలు పొందిన జెసీ.. గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా సుమారు ఏడాది కాలం పని చేసిన వివేక్‌యాదవ్ ఆ జిల్లాలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అధికారిగా వ్యవహరించి ప్రజల మన్ననలు, అభిమానాన్ని చూరగొన్నారు. పలు కార్యక్రమాలు చేపట్టడం దారా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుదలకు కృషి చేశారు. ముక్కుసూటిగా వ్యవహరించడమే ఆయనకు కొన్ని సమయాల్లో ఇబ్బందులు తెచ్చిపెట్టిందని పలువురు అధికారులు అంటుంటారు. పేదల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో ప్రత్యేకించి ఆ వర్గం ఆయన అంటే ప్రేమ చూపేవారు. భూ సమస్యల పరిష్కారంలో తనదైన శైలి చూపారు. వెబ్ ల్యాండుకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల సమస్యను పరిష్కరించారు. సివిల్ సప్లయ్స్‌కు సంబంధించి ఆధార్ సీడింగ్‌లో జిల్లాను ఆగ్రభాగంలో నిలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకకరణ, పునరావాస కార్యక్రమాల్లో విశేష కృషి చేశారు. -
విద్యుత్ సబ్స్టేషన్లకు స్థల పరిశీలన
కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రిలో 33/11కేవీ ఐదు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాల రాజు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో మరో 3 రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హుకుంపేట, అరవింద్ నగర్, రామకృష్ణ నగర్లో రైతుబజార్ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామన్నారు. పిఠాపురం, మండపేటలలో కూడా రైతు బజార్లు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి వచ్చిందన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. అనుమతి ఇచ్చిన వెంటనే రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామన్నారు. అమ్మ హస్తం పథకంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయకపోతే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 27 ఇసుక రీచ్‌లను గుర్తించినట్టు జేసీ తెలిపారు. వాటికి అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ఇసుక రీచ్‌ల అనుమతికి 2, 3 రోజులలో మార్గదర్శకాలు వస్తాయని జేసీ తెలిపారు. 99.98 శాతం ఆధార్ సీడింగ్ జిల్లాలో ఆధార్ సీడింగ్ 99.98 శాతం పూర్తి అయి ప్రథమ స్థానంలో ఉందని జేసీ ముత్యాలరాజు తెలిపారు. ఆయన వెంట రాజమండ్రి సబ్ కలెక్టర్ వి. విజయ రామరాజు ఉన్నారు. విద్యుత్ అధికారులతో సమావేశం జెయింట్ కలెక్టర్ ముత్యాల రాజు శుక్రవారం ట్రాన్స్ కో- అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజమండ్రి నగరంలో విద్యుత్ వినియోగం, పుష్కరాలకు అదనంగా ఏర్పాటు చేయవలసిన సబ్ స్టేషన్లు, స్ధల సేకరణ ఏదశలో ఉంది సబ్ స్టేషన్లు ఏర్పాటు వలన పుష్కరాలకు విద్యుత్ సరఫరా సామర్థ్యం తదితర అంశాలపై చర్చించారు. ట్రాన్స్ కో ఎస్ఈ ఎన్. గంగాధర్, సిటీ ప్లానర్ రామ్ కుమార్, అర్బన్ తహశీల్దార్ పీవీవీ గోపాల కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రూ.వంద కోట్ల రుణాలకు చర్యలు
సాక్షి, కాకినాడ : జిల్లాలోని కౌలురైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. గత ఏడాది కౌలురైతులకు రూ.90కోట్ల రుణాలిచ్చిన బ్యాంకర్లు ఈసారి కనీసం రూ.100కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలురైతుల సమస్యలపై శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలోని కౌలురైతులను ఐదుగురు వంతున రుణ అర్హత గ్రూపులను ఏర్పాటుచేయాలన్నారు. కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేసి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించి నాలుగైదు రోజుల్లోగా బ్యాంకులకు పంపాలన్నారు. తహశీల్దార్ల నుంచి వెంటనే కౌలు రైతుల వివరాలు తీసుకొని వాటిలో అనర్హులైన వారిని, రుణఎగవేతదారులను తొలగించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రెన్యూవల్, కొత్త రుణ అర్హత కార్డుల కోసం లక్షా 13వేల మంది కౌలు రైతుల నుంచి దరఖాస్తులొచ్చాయన్నారు. వీటిలో ఇప్పటి వరకు 23వేల మందికి కార్డులు జారీ చేయగా, ఇప్పటి వరకు 700 మంది కౌలు రైతులకు కేవలం రూ.47లక్షలు మాత్రమే రుణాలు ఇవ్వడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు, అధికారులకు మధ్య అనుసంధానం చేసేందుకు తన కార్యాలయంలో పనిచేసే జి.పద్మశ్రీ అనే అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. 28న జన్‌ధన్ యోజన ప్రారంభం కేంద్రం తలపెట్టిన జన్‌ధన్‌యోజన కార్యక్రమం ఈ నెల28న ప్రారంభం కానుందని జిల్లాలీడ్ బ్యాంకు మేనేజర్ ఎస్.జగన్నాథస్వామి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం రాష్ర్టంలో మన జిల్లాతో పాటు విశాఖ, కృష్ణా, అనంతపురం జిల్లాలు ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోడి దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈకార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. ఇందుకోసం రాష్ర్ట స్థాయి మిషన్‌కు డెరైక్టర్‌గా రాష్ర్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎల్డీఎం, నాబార్డు ఏజీఎం సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి కుటుంబంలో భార్యభర్తలిద్దరిచేతా జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు ప్రారంభింపచేసి వారందరికీ ఏటీఎం కార్డు తరహాలోనే రూపీ కార్డు (స్వదేశీ ఏటీఏం కార్డు) జారీ చేయడం పథక ముఖ్య ఉద్దేశమని వివరించారు. సమావేశంలో వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు, వ్యవసాయశాఖ ఏడీఏలు పాల్గొన్నారు. ఇక ఆన్లైన్లోనే సంక్షేమ ఫలాల పంపిణీ రౌతులపూడి : రాబోయే కాలంలో పేదలకు అందించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ఆన్లైన్లోనే అందించనున్నట్టు జేసీ ముత్యాలరాజు తెలిపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో గ్రామాలవారీగా రెవున్యూ రికార్డులను పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్తో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ రాష్ట్రస్థాయిలో 92శాతం, జిల్లావ్యాప్తంగా 97శాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తిచేశామని పేర్కొన్నారు. మండలంలో మిగిలి ఉన్న 12శాతం ఆధార్ నమోదు ప్రక్రియపై రికార్డుల పరిశీలన కోసం వచ్చినట్లు వివిరించారు. రేషన్‌కార్డులకు సంబంధించి ఆధార్ అనుసంధానం సక్రమంగా లేదని గుర్తించి జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎస్ఓ రామారావుకు చార్జ్‌మెమో ఇవ్వాలని ఆదేశించారు.