District Prison
-
వారున్నారని..మాకేం కాదనీ..!
♦ కనిగిరిలో ఖాకీలకు సవాల్‌గా మారిన చోరీ కేసులు ♦ పెండింగ్‌లో విశ్రాంత ఎస్సై ఇంట్లో దోపిడీ కేసు ♦ వీడని గొర్రెల కాపరి హత్య కేసు మిస్టరీ ♦ ఎర్రచందనం చోరీ కథ కంచికేనా? ♦ యథేచ్ఛగా దొంగల చేతివాటం అది జిల్లా జైలు. జిల్లా వ్యాప్తంగా వివిధ చోట్ల చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి అక్కడికి పంపారు. ఓ రోజు జైలులో దొంగలంతా సమావేశమయ్యూరు. దాదాపు 200 మంది దొంగలు పోగయ్యూరు. ఇంతలో దొంగల నేత మైకు అందుకుని తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు.. రానురానూ దొంగతనాలు కష్టమయ్యూరుు. ఇలా చోరీ చేసి అటు వెళ్తున్నామో లేదో వెనుకాలే పోలీసులు వచ్చి పట్టుకుని కటకటాల వెనక్కి నెడుతున్నారు. జిల్లాలో అన్ని చోట్లా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. చోరీ చేసిన సొత్తును సైతం ఇట్టే రికవరీ చేస్తున్నారని అన్నాడు. ఇంతలో ఓ దొంగ లేచి చోరీలు కష్టంగా ఉన్నాయని ఎలా చెబుతారంటూ సదరు దొంగల నేతను సూటిగా ప్రశ్నించాడు. మిగిలిన దొంగలంతా అతడి వైపు ఆసక్తిగా చూశారు. ఎవరితను.. ఎప్పుడూ చూడలేదే.. అంటూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకున్నారు.. మైకు అందుకున్న సదరు దొంగ.. తన ప్రసంగాన్ని ఇలా.. ప్రారంభించాడు.. నాది కనిగిరి. కనిగిరిలో నాతో పాటు సుమారు 20 మంది దొంగలం ఉన్నాం. మేం చాలా ఏళ్లుగా కనిగిరి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తునే ఉన్నాం. ఇప్పటికీ మాలో ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు సరికదా మా ఆనవాళ్లు కూడా వారివద్ద లేవు. చివరకు పోలీసుల ఇళ్లల్లో కూడా చోరీలు చేస్తున్నాం. మేం ఇంతవరకూ జైలుకు వెళ్లలేదు. మరి నువ్వే కేసులో ఇక్కడున్నావంటూ పెద్ద దొంగ అనుమానంగా అడిగాడు. ఓహ్.. అదా.. మొన్న ఓ పనిపై ఒంగోలు వచ్చి తిరిగి కనిగిరి వెళ్తున్నా. బస్సు ఎక్కేందుకు ఒంగోలు బస్టాండ్‌కు వెళ్లి అక్కడ ఓ మహిళ పర్సు కాజేశా. అంతే నిమిషాల్లో పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. పెద్ద దొంగ మళ్లీ మైకు తీసుకుని ప్రియ దొంగలరా.. ఇక్కడి నుంచి విడుదలైన తర్వాత అంద రం కనిగిరి వైపు దృష్టి సారించి దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం.. అని సెలవిచ్చాడు. మిగిలిన దొంగలంతా ఆ కనిగిరి ప్రాంత దొంగను ఉద్దేశించి మాకు దారి చూపావంటూ అభినందించారు. కనిగిరి : కనిగిరి పరిధిలోని పలు చోరీ, హత్య కేసులు పోలీసులకు సవాల్‌గా మారారుు. కనిగిరి ప్రాంతంలో సం చలనం రేపిన పలు కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. కేసులు ఏళ్ల తరబడి దర్యాప్తులో ఉండటంపై పలువురు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇదీ..ఎర్రచందనం దుంగల కథ అటవీశాఖ అధికారులు కనిగిరి రేంజ్‌లోని తుంగోడు, వెదుళ్ల చెరువు, చెన్నపునాయుని పల్లె బీట్లలో మొత్తం రూ.10 లక్షల విలువైన 135 ఎర్రచందనం దుంగలను పట్టుకుని వాటిని కనిగిరి అటవీ కార్యాలయంలో ఉంచారు. అవి 2012 జూలై 5న మాయమయ్యూరుు. అప్పట్లో ఈ చోరీ ఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ శాఖ అధికారులు వాచ్‌మన్‌పై సస్సెండ్ వేటు వేసి కేసును మమ అనిపించారు. అప్పట్లో విచారణకు వచ్చిన పోలీసు అధికారులు మాత్రం దుంగల మాయంపై ఇంటి దొంగల ప్రమేయం ఉండి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అపహరణ కేసులో తొలుత హడావుడి చేసిన ఫారెస్ట్, పోలీసు అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. అటవీశాఖ సబ్ డీఎఫ్ఓ, డీఎఫ్ఓ స్థాయి అధికారులు ఏడాది క్రితం అప్పటి ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌ను కలిసి ఎర్రచందనం దుంగల చోరీపై దర్యాప్తును వేగవంతం చేయూలని విన్నవించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయూలని సాక్షత్తు అప్పటి ఎస్పీ ఆదేశించినా స్థానిక పోలీసులకు చీమకుట్టినట్లు కూడా లేదు. బంగారు ఆభరణాల దోపిడీ కేసూ అంతే ఈ ఏడాది గత నెల 26న విశ్రాంత ఎస్సై పి.నారాయణ ఇంట్లో పోలీసు వేషధారణలో వచ్చిన దొంగలు ఆయన భార్య నాగమణిని తుపాకీతో బెదిరించి సుమారు 60 సవర్ల బంగారం, నగదు అపహరించుకెళ్లారు. ఈ ఘటన కూడా జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు, డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించినా ఫలితం లేకపోరుుంది. నిందితుల ఊహా చిత్రాలు విడుదల చేసి కేసును పలు కోణాల్లో దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు చెప్పారేతప్ప అంతకుమించి వారు తీసుకున్న చర్యలు శూన్యం. దోపిడీ జరిగి నెల రోజులు దాడినా కేసులో ఇంకా పురోగతి లేదు. గొర్రెల కాపరిని చంపిందెవరు? హెచ్‌ఎంపాడు మండలంలో గొర్రెల కాపరి పెరుగు లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యూడు. ఈ కేసు కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కొత్తూరు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహం చెట్టుకు ఉరేసినట్లు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మృతుని భార్య మాత్రం తన భర్తది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుని జేబులు బ్లేడు, శరీరంపై గాయాలు ఉండటంతో లక్ష్మీనారాయణది హత్య? లేక ఆత్మహత్య.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఘటన జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటికీ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దుంగల చోరీ కేసు దర్యాప్తులో ఉంది గతంలో మా కార్యాలయంలో ఎర్రచందనం దుంగలు మాయమైంది వాస్తవమే. నేను ఇటీవలే కనిగిరికి బదిలీపై వచ్చాను. దుంగల చోరీ కేసు పోలీసుల దర్యాప్తులోనే ఉంది. రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు ఇంకా రికవరీ కాలేదు. అప్పట్లో మా శాఖలోని కొందరు సిబ్బందిపై శాఖాపర మైన చర్యలు తీసుకున్నారు. - పోతురాజు, ఫారెస్ట్ రేంజర్, కనిగిరి -
జిల్లా జైలులో ‘సెల్’ కలకలం
వార్డెన్ సస్పెండ్ బుక్కరాయసముద్రం : జిల్లా జైలులో మరోసారి సెల్‌ఫోన్ కలకలం రేగింది. ఓ ఖైదీ దగ్గర సెల్‌ఫోన్ దొరకడంతో ఓ వార్డెన్‌ను సస్పెండ్ చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా సూపరింటెండెంట్ తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లాకు చెందిన మంగళ శీను అలియాస్ శ్రీనివాసులు పలు దొంతనాలు, హత్యా నేరాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని మే-27న వైఎస్సార్ జిల్లా జైలు నుంచి అనంతపురం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ఓ దొంగతనం కేసులో జిల్లా కోర్టుకు వాయిదాల కోసమే అతన్ని జిల్లాై జెల్లో ఉంచారు. అయితే ఈనెల 22న సదరు ఖైదీ సెల్ఫోన్లో మాట్లాడుతూ జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డికి పట్టుబడ్డాడు. సెల్‌ఫోన్‌పై ఆరా తీయ గా జిల్లా జైల్లో వార్డెన్‌గా పని చేస్తున్న హరినాథ్ ద్వారా సెల్‌ఫోన్ వాడుతున్నానని ఒప్పుకున్నాడు. అతనే డబ్బులకు కక్కుర్తిపడి సెల్‌ఫోన్ అందించి సహకరించాడని విచారణలో తేలింది. దీంతో వార్డెన్ హరినాథ్‌ను సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మంగళ శీను వైఎస్సార్ జిల్లా జైల్లో కూడా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. గతంలో కోర్టుకు తీసుకు వచ్చేటప్పుడు ఎస్కార్ట్ ను కూడా అవస్థలకు గురిచేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
కారాగరం @ కర్మగారం
పని ఉపాధి జిల్లా కారాగారం కర్మాగారంగా మారింది. వివిధ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు తమ సృజనకు పదును పెడుతూ పలు రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. చేతినిండా సంపాదిస్తున్నారు. ఆర్థికంగా బలపడుతున్నారు. బయటకొచ్చిన తర్వాత కష్టపడి బతకగలమని భరోసా నింపుకుంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.11 లక్షల విలువైన వస్తువులు తయారు చేసి భేష్ అనిపించుకున్నారు. - కరీంనగర్ క్రైం * జిల్లా జైలులో బెంచీలు, మంచాలు, కుర్చీలు తయారు చేస్తున్న ఖైదీలు * రూ.11 లక్షల విలువైన వస్తువుల విక్రయం * కారాగారంలో క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు కరీంనగర్‌లోని జిల్లా జైలు క్రమ‘శిక్ష’ణాలయంగా మారింది. జైలు సూపరింటెండెంట్ వచ్చిరాగానే ఖైదీలకు ఆర్థిక స్వావలంబన చేకూరాలని తలిచారు. సుమారు రూ. 11 లక్షలు వెచ్చించి బెంచీలు, కుర్చిలు తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. నైపుణ్యంగల ఖైదీలను గుర్తించి పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఉపయోగించే బెంచిలు, టేబుళ్లు, మంచాల తయారీ పనికల్పించారు. తయారు చేసిన సామగ్రిని కలెక్టర్ సహా కాలేజీ యాజమాన్యాలకు చూపించారు. నాణ్యత పరిశీలించిన కలెక్టర్ రూ.30 లక్షల విలువైన పనిని జైలుకు అప్పగించారు. వీటితో పాటు జైలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మరో రూ.14 లక్షల వ రకు ఆర్డర్లు తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు సుమారు రూ. 11 లక్షల విలువైన 300 టేబుళ్లు, కూర్చీలు, మంచాలు విక్రయించారు. ఖైదీలకు వేతనం.. కర్మాగారంలో సుమారు 10 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. ఇందులో ప్రతిభగల వారిని గుర్తించి రోజుకు రూ. 50, అన్‌స్కిల్డ్ ఖైదీలకు రూ. 30 చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఖైదీలకు వేతనంగా రూ. 1.10 లక్షలు అందించారు. 2015-16లో రూ.11 లక్షల వస్తువులు విక్రయించి ఖర్చులు పోను రూ. 2.35 లక్షలు ఆర్జించారు. ఖైదీలకు వేతనంగా అందించిన డబ్బులు పోను మరో రూ. 1.20 లక్షల వరకు జైలు ఖాతాలో జమ చేశారు. వచ్చిన ఆదాయంతో మరింత మంది ఖైదీలకు పనికల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది మరిన్ని ఆర్డర్లు పొంది ప్రణాళికులు రూపొందిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వారికి రోజుకు రూ. 70 చొప్పున చెల్లిస్తున్నారు. క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు.. ఖైదీలకు ఇష్టమైన భోజనం అందించడానికి వీలుగా జైలులోనే ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం ఇడ్లీ, దోష, పూరి టిఫిన్లు, చికెన్, ఎగ్ బిర్యానీలు, ఎగ్‌ఫ్రైడ్, చికెన్ఫ్రైడ్రైస్, ఎగ్బొండా, చపాతి తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో దానికి ఒక్కో రేట్‌కు విక్రయించనున్నారు. అయితే ఈ విధానం ఇప్పటికే విదేశాల్లో అమల్లో ఉంది. అయితే మన రాష్ట్రం విషయానికొస్తే కరీంనగర్లో ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు ఇటీవలే ట్రయల్ నిర్వహించారు. విజయవంతం కావడంతో జైళ్లశాఖ డీసీ వీకేసింగ్ దీనిని రాష్ట్రవ్యాస్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా అమలులోకి వస్తే జిల్లా కేంద్ర కారాగారంలో క్యాంటీన్కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం అటు ఖైదీలకు వెచ్చించడంతోపాటు మరో 20 శాతం జైలు అభివృద్ధికి కేటాయించనున్నారు. సంక్షేమమే లక్ష్యం.. ఖైదీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్థికాభివృద్ధితో పాటు ఖైదీల్లో మార్పు తెచ్చి నేరాల సంఖ్య తగ్గించడానికి కృషిచేస్తున్నాం. శిక్షకాలంలో వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి మంచి మార్గం చూపెట్టి మంచి మార్గంలో నడిచేలా చూస్తున్నాం. విడుదలైన తర్వాత తవు కాళ్లమీద తాము నిలబడేలా వివిధ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాం. రానున్న కాలంలో మరిన్ని ఉపాధి కార్యక్రమాలు చేపడుతాం. క్యాంటీన్ నిర్వహించడానికి డీజీ ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో అమలుకు చర్యలు తీసుకుంటాం. - శివకుమార్, జిల్లా జైలు సూపరింటెండెంట్ -
మ్యూజియంగా పాతజైలు
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డిలోని పాత జిల్లా జైలును తెలంగాణలో మొట్టమొదటి మ్యూజియంగా ఏర్పాటు చేయనున్నట్టు జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వి.కె.సింగ్ తెలిపారు. సోమవారం ఆయన సంగారెడ్డి మండలం కందిలోని జిల్లా జైలును, పాత బస్టాండ్ సమీపంలోని పాత జైలును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత జైలులో తెలంగాణ చారిత్రక ఆనవాళ్లను ప్రదర్శించే మ్యూజియంగా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పనులను ఈనెలలో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభింపజేస్తామని తెలిపారు. సంగారెడ్డిలోని పాత జైలుకు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా సంగారెడ్డికి వచ్చి ఈ మ్యూజియాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పాత జైలుకు మరమ్మతులు చేయడానికి రూ.20 లక్షలు వెచ్చించనున్నట్టు చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించే వారి నుంచి ఎంట్రీఫీజు కింద రూ.5 వసూలు చేస్తామని, దీని ద్వారా అదనపు ఆదాయం వస్తుందన్నారు. పిల్లలకు మాత్రం ఉచితంగా ప్రదర్శనకు అనుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం పాత జైలులోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్త, చెదారాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. మొక్కల పెంపకంతో అదనపు ఆదాయం జిల్లా జైలు ఆవరణలో నర్సరీ ఏర్పాటు చేయడం ద్వారా రానున్న మూడేళ్లలో జైలుకు సంవత్సరానికి రూ. 10 లక్షల చొప్పున ఆదాయం వస్తుందని వి.కె. సింగ్ తెలిపారు. నర్సరీ ఏర్పాటుకు కృషి చేసిన జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. జైలు ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ముగ్ధుడయ్యానని తెలిపారు. ఖైదీలకు ఏమైనా ఇబ్బందులు వున్నాయా? ఆని ఆరా తీశారు. ఇతర వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వి.కె. సింగ్ వెంట జిల్లా ఎస్పీ డా.శెముషీ బాజ్‌పాయ్, ఏఎస్పీ పి.రవీందర్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, డిప్యూ టీ సూపరింటెండెంట్ సతీష్ రాయ్, జైలర్ చిరంజీవి, సంగారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు ఎస్.ఆంజనేయులు, శ్యామల వెంకటేష్ తదితరులు ఉన్నారు. జైళ్లల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు జోగిపేట: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ అన్నారు. సోమవారం జోగిపేటలోని సబ్‌జైల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జైళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తోందన్నారు. దానికి తోడు జైళ్లల్లో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువుల ద్వారా ప్రతి సంవత్సరం జైళ్ల శాఖకు రూ.2 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఈ నిధులను జైళ్లలో క్యాంటిన్, లైబ్రరీల ఏర్పాట్లకు వినియోగించనున్నట్లు తెలిపారు. జైళ్లను మరింతగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. జైళ్లకు వస్తున్న ఖైదీల్లో పరివర్తన, అధ్యయనం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో చదువు చెప్పిస్తున్నామన్నారు. అనంతరం సబ్‌జైలు రికార్డులు, బ్యారక్, వంట గదితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అధికారులను అడిగి ఖై దీల వివరాలను తెలుసుకున్నారు. వీకే సింగ్ వెంట జిల్లా జైలు సూపరింటెండెంట్లు నాగేశ్వరరెడ్డి, సంతోష్‌రాయ్, ఇన్చార్జి సబ్‌జైలర్ గణేష్‌బాబు, జోగిపేట సీఐ వి.నాగయ్య, ఎస్ఐలు శ్రీనివాస్, విజయరావులు ఉన్నారు. -
ఆంధ్రా అధికారి వేధింపులు ?
ఆదిలాబాద్ క్రైం : జిల్లా జైలులో ఓ ఆంధ్రా అధికారి గార్డింగ్ సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్‌ను తీవ్రంగా వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన పెత్తనమే సాగాలని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రం కావడంతో జైలు గార్డింగ్ సిబ్బంది, సదరు అధికారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దసరా సమయంలో సెలవు అడిగేందుకు వెళ్తే కించపరిచే విధంగా దూషించాడనే ఆరోపణలున్నాయి. ఖైదీలతో సదరు అధికారి ఇంటి పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు ఓ ఖైదీని ఇంటికి తీసుకెళ్లి వారితో వెట్టి చాకిరీ చేయించుకుని తిరిగి జైలుకు పంపిస్తున్నారనే తెలిసింది. జెలు అవసరాల కోసం దాతలు, ప్రభుత్వం ఇచ్చిన గృహోపకరణ వస్తువులను క్వార్టర్స్‌కు తీసుకెళ్లి ఉపయోగించుకుంటున్నారని సమాచారం. రిఫ్రిజిరేటర్, పడకలు, ఇతర వస్తువులను ఇంట్లో వినియోగించుకుంటున్నట్లు సమాచారం. జైళ్ల శాఖ డీఐజీకి ఫిర్యాదుకు సిద్ధం.. తమను ఓ అధికారి వేధిస్తున్నారంటూ జైల్ గార్డింగ్ సిబ్బంది జైళ్ల శాఖ డీఐజీని కలిసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటికే జైల్లో పనిచేస్తున్న 17మంది గార్డింగ్ సిబ్బంది మూకుమ్మడిగా ఫిర్యాదు చేసేందుకు సంతకాలతో కూడిన వినపత్రాన్ని అందజేయనున్నారు. శనివారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లినప్పటికీ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా జైళ్ల శాఖ డీఐజీని కలిసి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
జైళ్ల పై నజర్
- కొత్త భవనాలకు రూ.40 కోట్లు - 14వ ప్రణాళికలో ప్రతిపాదనలు - 15లోగా కల్వకుర్తి సబ్‌జైల్ ప్రారంభం - ఖైదీలకు అక్షరాభ్యాసం జిల్లా జైలుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఖైదీల రాకపోకలు సాగుతుంటాయి. అప్పట్లో 5.5 ఎకరాల స్థలంలో 147 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు దీనిని నిర్మించారు. అయితే ప్రస్తుతం 300 మంది ైఖైదీలు ఉంటున్నారు. ఒక్కో సమయంలో 400 మందికి పైగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖైదీ లకు సౌకర్యవంతంగా ఉండేందుకుగాను జడ్చర్ల సమీపంలోని చిట్టెబోయిన్‌పల్లిలో పదేళ్లక్రితం ప్రభుత్వం 42 ఎకరా లు సేకరించి అందులో జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. అయితే గత ప్రభుత్వాల అలసత్వంతో నిధుల కేటాయింపులో జాప్యం ఏర్పడింది. తాజాగా 14వ ఆర్థిక ప్రణాళికలో జైళ్ల నిర్మాణానికి *40 కోట్ల ప్రతిపాదనలు పెట్టారు. ఈ నిధులు త్వరలోనే మంజూరు చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల జిల్లాలో అన్ని హంగులతో కూడిన ఆధునిక జైళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లాలో ఆరు సబ్జై ళ్లు ఉన్నా నాగర్‌కర్నూల్ మి నహా ఏ ఒక్కటి అందుబాటులో లేవు. అన్నీ శిథి లావస్థకు చేరాయి. కొడంగల్‌లోని సబ్‌జైలుకు మరమ్మతు చేపట్టేందుకు 90 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. తాజాగా కల్వకుర్తి సబ్‌జైలుకు మరమ్మతు చేపట్టారు. దీనిని సెప్టెంబర్ 15లోగా ప్రారంభించనున్నారు. ఇందులో 30 నుంచి 40 మంది ఖైదీలను ఉంచేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక అచ్చంపేట, నారాయణపేట, కొల్లాపూర్‌లోని జైళ్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నారాయణపేటలోని భవనం జైలుకు పనికిరాదని అధికారులు తేల్చి ప్రభుత్వానికి గతంలోనే నివేదించారు. జిల్లాలోనే అత్యధిక నేరాలు జరిగే ప్రాంతాల్లో షాద్‌నగర్‌కు మొదటి స్థానం దక్కింది. ఇక్కడ జైలు ఆవశ్యకత ఎంతో ఉంది. ఖైదీల్లో మార్పులు తీసుకురావడానికి గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, న్యాయవాదులను జైలులోకి అనుమతించేవారు. తాజాగా ఖైదీలతో ఎవరైనా బయటి నుంచే మాట్లాడాలని జైళ్ల శాఖ ఐజీ వీకే సింగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ములాకత్‌లపై నిఘా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటంబ సభ్యులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ములాకత్‌కు వచ్చే వారి వివరాలను కచ్చితంగా నమోదు చేస్తున్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, న్యాయవాదులకు ప్రత్యేక సమయాల్లో జైలులో వెళ్లేందుకు అనుమతి ఉండేది. రానున్న రోజుల్లోనే వీరికి క ప్రవేశం ఉండకపోవచ్చని జైలు అధికారులు తెలిపారు. శిక్ష అనుభవిస్తున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిది ద్దేందుకు జైళ్ల శాఖ ప్రతి జిల్లాలో విద్యదాన యోజనను అమలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లా జైలులోని సుమారు 300 మంది ఖైదీలకుగాను 150 మందికి పైగా నిరక్షరాస్యులే. నెలరోజుల క్రితం ఈ పథకం ప్రారంభం కాగా ప్రస్తుతం 140మందిపైగా ఖైదీలు సంతకాలు నేర్చుకున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం.ఆర్.భాస్కర్ తెలిపారు. దీని ఆవరణలోనే పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల జైలులో సత్ప్రవర్తన కలిగిన, చదుకున్న ఖైదీలకు ఈ బంకులో పనిచేసే అవకాశంతో పాటు ఉపాధి అవకాశాలు ఉంటాయి.