జైళ్ల పై నజర్ | 15 before the start of kalwakurthy sub jail | Sakshi
Sakshi News home page

జైళ్ల పై నజర్

Published Mon, Sep 1 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

15 before the start of kalwakurthy sub jail

- కొత్త భవనాలకు రూ.40 కోట్లు
- 14వ ప్రణాళికలో ప్రతిపాదనలు
- 15లోగా కల్వకుర్తి సబ్‌జైల్ ప్రారంభం
- ఖైదీలకు అక్షరాభ్యాసం
జిల్లా జైలుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఖైదీల రాకపోకలు సాగుతుంటాయి. అప్పట్లో 5.5 ఎకరాల స్థలంలో 147 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు దీనిని నిర్మించారు. అయితే ప్రస్తుతం 300 మంది ైఖైదీలు ఉంటున్నారు. ఒక్కో సమయంలో 400 మందికి పైగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖైదీ లకు సౌకర్యవంతంగా ఉండేందుకుగాను జడ్చర్ల సమీపంలోని చిట్టెబోయిన్‌పల్లిలో పదేళ్లక్రితం ప్రభుత్వం 42 ఎకరా లు సేకరించి అందులో జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. అయితే గత ప్రభుత్వాల అలసత్వంతో నిధుల కేటాయింపులో జాప్యం ఏర్పడింది.

తాజాగా 14వ ఆర్థిక ప్రణాళికలో జైళ్ల నిర్మాణానికి *40 కోట్ల ప్రతిపాదనలు పెట్టారు. ఈ నిధులు త్వరలోనే మంజూరు చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల జిల్లాలో అన్ని హంగులతో కూడిన ఆధునిక జైళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లాలో ఆరు సబ్‌జై ళ్లు ఉన్నా నాగర్‌కర్నూల్ మి నహా ఏ ఒక్కటి అందుబాటులో లేవు. అన్నీ శిథి లావస్థకు చేరాయి. కొడంగల్‌లోని సబ్‌జైలుకు మరమ్మతు చేపట్టేందుకు 90 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. తాజాగా కల్వకుర్తి సబ్‌జైలుకు మరమ్మతు చేపట్టారు. దీనిని సెప్టెంబర్ 15లోగా ప్రారంభించనున్నారు.

ఇందులో 30 నుంచి 40 మంది ఖైదీలను ఉంచేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక అచ్చంపేట, నారాయణపేట, కొల్లాపూర్‌లోని జైళ్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నారాయణపేటలోని భవనం జైలుకు పనికిరాదని అధికారులు తేల్చి ప్రభుత్వానికి గతంలోనే నివేదించారు. జిల్లాలోనే అత్యధిక నేరాలు జరిగే ప్రాంతాల్లో షాద్‌నగర్‌కు మొదటి స్థానం దక్కింది. ఇక్కడ జైలు ఆవశ్యకత ఎంతో ఉంది. ఖైదీల్లో మార్పులు తీసుకురావడానికి గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, న్యాయవాదులను జైలులోకి అనుమతించేవారు. తాజాగా ఖైదీలతో ఎవరైనా బయటి నుంచే మాట్లాడాలని జైళ్ల శాఖ ఐజీ వీకే సింగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
ములాకత్‌లపై నిఘా
జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటంబ సభ్యులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ములాకత్‌కు వచ్చే వారి వివరాలను కచ్చితంగా నమోదు చేస్తున్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, న్యాయవాదులకు ప్రత్యేక సమయాల్లో జైలులో వెళ్లేందుకు అనుమతి ఉండేది. రానున్న రోజుల్లోనే వీరికి క ప్రవేశం ఉండకపోవచ్చని జైలు అధికారులు తెలిపారు. శిక్ష అనుభవిస్తున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిది ద్దేందుకు జైళ్ల శాఖ ప్రతి జిల్లాలో విద్యదాన యోజనను అమలు చేస్తోంది.

ప్రస్తుతం జిల్లా జైలులోని సుమారు 300 మంది ఖైదీలకుగాను 150 మందికి పైగా నిరక్షరాస్యులే. నెలరోజుల క్రితం ఈ పథకం ప్రారంభం కాగా ప్రస్తుతం 140మందిపైగా ఖైదీలు సంతకాలు నేర్చుకున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం.ఆర్.భాస్కర్ తెలిపారు.  దీని ఆవరణలోనే పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  దీనివల్ల జైలులో సత్ప్రవర్తన కలిగిన, చదుకున్న ఖైదీలకు ఈ బంకులో పనిచేసే అవకాశంతో పాటు ఉపాధి అవకాశాలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement