Allocation of funds
-
మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు. రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల అనుసంధానం భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వైద్య విద్య బలోపేతం ♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. అత్యున్నత విద్యాలయాలు ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్ కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. పోలవరం పురోగమనం ♦ 2019మే నాటికి 42 శాతం హెడ్ వర్క్‌లు 70 శాతానికి చేరిక ♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్ గేట్ల ఏర్పాటు. ♦ గతేడాది నవంబర్ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్ ప్రారంభం. ♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్ త్వరలో పూర్తి. ♦ గతేడాది సెపె్టంబర్ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రారంభం. ♦ 2022 సెపె్టంబర్ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. ♦ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతి. పారిశ్రామిక పరుగులు ♦ 2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు ♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్íÙప్ల ఏర్పాటు ♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం -
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. -
కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలతో రాష్ట్రం
సాక్షి, అమరావతి: కేంద్రం సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో తగినన్ని నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలతో ఎదురు చూస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధుల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఉన్న బకాయిలకు బడెŠజ్‌ట్‌లో తగినన్ని నిధులు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు నిధులకు సంబంధించి ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం 100 శాతం రీయింబర్స్మెంట్లను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఊతమందేనా.. రాష్ట్రంలో కొత్తమెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాలని కోరినందున బడ్జెట్లో ఆ కాలేజీలకు నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణతో.. ఆ కార్యకలాపాలకు నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్య, వైద్య సంస్థలకు ప్రత్యేకంగా కేటాయింపులను ప్రభుత్వం ఆశిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా కొంత ఉపశమనం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత ఆర్థిక ఏడాది 15వ ఆర్థిక సంఘం ఒక ఆర్థిక ఏడాదికే సిఫార్సులు చేసింది. ఇప్పుడు కూడా కోవిడ్ నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఏడాదికే గతేడాది సిఫార్సులనే మళ్లీ చేస్తుందా లేక కొంత మేర గ్రాంట్లు పెంచుతుందా అనే దానిపై రాష్ట్రానికి నిధులు రావడం ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సహకార రంగానికి ఊతం
సాక్షి, అమరావతి: సహకార రంగానికి జవసత్వాలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతికి దోహదపడే ఈ రంగం మోడువారకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్.. బడ్జెట్లో నిధుల కేటాయింపు, చక్కెర కర్మాగారాల్లోని పరిస్థితుల అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని దశల వారీగా వీటిని పునరుద్ధరించనున్నారు. తొలిదశలో రెండు కర్మాగారాల పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష జరగనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నష్టాల ఊబిలో కర్మాగారాలు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులు పెరగడం, గత ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడంతో సహకార రంగంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని పది చక్కెర కర్మాగారాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. రేణిగుంటలోని ఎస్వీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, గుంటూరు జిల్లాలోని జంపని షుగర్ ఫ్యాక్టరీ, వైఎస్సార్ జిల్లాలోని కడప కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, విజయనగరం జిల్లాలోని భీమ్‌సింగ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన చెరుకు రైతులు, రైతు కూలీలు, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, తాండవ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ ఉత్పాదక రంగంలో కొనసాగుతున్నాయి. చక్కెర కర్మాగారాలకు వాటిల్లిన నష్టాలు.. అవి ప్రభుత్వానికి, ఆర్థిక సంస్థలు, ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తాలు దాదాపు రూ. 1,475 కోట్లు ఉన్నాయి. కర్మాగారాలకు వచ్చిన నష్టాలు రూ. 683 కోట్లు, ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 271.14 కోట్లు, ఆప్కాబ్, ఎన్సీడీసీల నుంచి తీసుకున్న అప్పులు రూ. 416.58 కోట్లు, ఉద్యోగుల జీతాల బకాయిలు రూ. 105 కోట్లు ఉన్నాయి. భారమైనా ఈ రంగాన్ని బతికించాలని... ప్రస్తుత పరిస్థితిలో చక్కెర కర్మాగారాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించినా, భవిష్యత్‌లో అవి లాభాల బాటలో కొనసాగే పరిస్థితులు లేవు. ఏటా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. అయితే భారమైనా ఈ రంగాన్ని బతికించాలని, ఆయా కర్మాగారాలు ఉత్పాదక రంగంలో కొనసాగితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అక్కడి రైతులు, రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ వీటికి దశల వారీగా నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలోని కడప కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తొలిదశలో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిగా సొంత జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో డిసెంబరులోపు అక్కడి కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్లో దాదాపు రూ. 100 కోట్లు కేటాయించారు. పాడి రైతులకు లీటరుకు రూ. 4 బోనస్ ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు మూతపడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను తెరిపించి, రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసి లీటరుకు రూ. 4లను బోనస్‌గా ఇస్తానని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 100 కోట్లు కేటాయించారు. ఒక ఏడాదిలోపు ఇవన్నీ సక్రమంగా నడిచే విధంగా చర్యలు తీసుకుని, ఆ తరువాత రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు. -
నాడు వైఎస్సార్.. నేడు జగన్..
వేదం.. మంత్రం.. దీపం.. ధూపం.. నైవేద్యాలతో ఒకప్పుడు కళకళలాడిన దేవాలయాలు ఇప్పుడు బోసిపోతున్నాయి. హిందూ సంప్రదాయ ఆస్తులైన దేవాలయాలకు పునర్జీవం పోసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. గడిచిన పదేళ్లుగా ప్రభుత్వ ఆర్థిక చేయూతకు దూరమై కేవలం దాతల సహకారంతో నడుస్తున్న ఆలయాలకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించింది. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు తప్పనిసరిగా ఉండాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు కూడా సరైన ఆదాయం లేక దాతల సహకారంతో కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాలో వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. దేవదాయ ధర్మదాయ శాఖ అధీనంలోనే ఉన్న దేవాలయాలు జిల్లాలో 1,313 ఉన్నాయి. ఈ ఆలయాల వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని దేవదాయ శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. ఏటా రూ.50 లక్షలపైన ఆదాయం ఉన్న దేవాలయాలను 6ఏ దేవాలయాలుగా పరిగణిస్తారు. జిల్లాలో 6ఏ కేటగిరీ దేవాలయాలు 22 ఉన్నాయి. ఏటా వార్షిక ఆదాయం రూ.2 లక్షలపైన ఉన్న దేవాలయాలు జిల్లాలో 57 ఉన్నాయి. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న 6సీ కేటగిరీ దేవాలయాలు 1,234 వరకు ఉన్నాయి. సగటున రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు 124 వరకు ఉన్నాయి. ప్రభుత్వం 6సీ కేటగిరీలో ఉన్న దేవాలయాలకు దూపధీప నైవేద్యాలకు నిధులను కేటాయించింది. మొత్తం రూ.234 కోట్లు నిధులు కేటాయించి జనాభా ప్రాతిపదికన కేటగిరీల వారీగా నిర్ణయించారు. వాస్తవానికి జిల్లాలోని దేవదాయశాఖ పరిధిలో నగరంలోని రంగనాయకస్వామి, జొన్నవాడ కామాక్షితాయి, దర్గామిట్ట రాజరాజేశ్వరి, పెంచలకోన నరసింహస్వామి, వెంకటగిరి పోలేరమ్మ, సూళ్లూరుపేట చెంగాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్ని 6ఏ, 6బీ కేటగిరీకి కిందకు వస్తాయి. వీటితో పాటు గ్రామ దేవతల ఆలయాలు మొదలుకొని పురాతన అలయాల వరకు వందల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. మూడు కేటగిరీల్లో 1,110 దేవాలయాలకు నిధుల కేటాయింపు ప్రభుత్వం బడ్జెట్లో రూ. 234 కోట్లు నిధులు కేటాయించి మూడు కేటగిరీలుగా విభజించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల జనాభా ఉన్న ప్రాంతంలోని దేవాలయానికి ఏటా రూ.30 వేలు, 5 వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఆలయాలకు రూ.60 వేలు, 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతంలోని అలయాలకు 90 వేలు, 10 వేల జనాభా ఉన్న ఆలయాలకు రూ.1.20 లక్షలు ఏటా కేటాయించనున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 1,234 దేవాలయాల్లో రూ.2 లక్షలపైన ఆదాయం ఉన్న 124 దేవాలయాలు మినహయిస్తే మిగిలిన దేవాలయాలు 1,110 ఉన్నాయి. వీటికి సగటున జిల్లాలో ఏటా రూ.20 కోట్ల వరకు కేటాయింపు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి పేరుకే దేవదాయ శాఖ ఆలయాలుగా ఉన్నవి వందల సంఖ్యలో ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా ఉన్న గత ప్రభుత్వాలు పూర్తిగా ధూపధీప నైవేద్యాలను పూర్తిగా విస్మరించాయి. అంతకు మునుపు 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆ తర్వాత పాలకులు క్రమంగా ఈ పథకాన్ని అటకెక్కించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాదయాత్రలో అనేక గ్రామాల్లో ప్రజలు ఆలయాల స్థితిని వివరించడం, పీఠాధిపతులు, స్వామీజీలు ఆలయాల్లో నిత్యకైంకర్యాలకు ప్రభుత్వానికి సూచన చేయడంతో ఆలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇప్పటి వరకు జిల్లాలో అత్యధిక శాతం దేవదాయ శాఖ దేవాలయాలు పూర్తిస్థాయిలో దాతల సహకరాంతోనే నడుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీంతో దేవాలయాలు జీవ కళ సంతరించుకోనున్నాయి. -
రైతే రాజు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖకు నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. నిధులు మూడేళ్లలో మూడింతలయ్యాయి. దీనిని బట్టి రైతుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవు తుంది. రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాల కారణంగా వ్యవసాయశాఖ బడ్జెట్ భారీగా పెరిగింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.15,511కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.20,107 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.4,596 కోట్లు పెరిగినట్లయింది. ఈసారి రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతుబీమా అమలుకు రూ.650 కోట్లు కేటాయిం చారు. అంటే సింహభాగం ఈ 3 పథకాలకే ప్రభుత్వం కేటాయించింది. పంట కాలనీపై కేంద్రీకరణ... ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పంట కాలనీలపై దృష్టి సారించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని బట్టి రాష్ట్రాన్ని పంట కాలనీలుగా చేస్తారు. ఆ దిశగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసా యశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా యి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు, దేశవిదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ పంట కాలనీల లక్ష్యం. ఈ పథకాన్ని అమలుచేసే క్రమంలో చిన్న, మధ్యతరహా భారీ ఆహారశుద్ధి కేంద్రాలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పుతారు. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళాసంఘాల్ని భాగస్వాములు చేయాలని ప్రభుత్వం సంక ల్పించింది. 1.61 లక్షలున్న రైతు సమితి సభ్యులకు గౌరవ వేతనమిచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలను అందించాలనే బహు ముఖ వ్యూహంతో సమితులు పనిచేస్తాయి. ఈ సమితుల వేదికగా రైతు లందరినీ సంఘటిత పర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా పథకాలపై అస్పష్టత వ్యవసాయ శాఖ చేపడుతున్న అనేక ఇతర పథకాలు, కార్యక్రమాలకు మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో స్పష్టత ఇవ్వ లేదు. వ్యవసాయ, ఉద్యానశాఖలు ఇప్ప టికే అనేక ముఖ్యమైన కార్య క్రమాలు చేపడుతు న్నాయి. గ్రీన్ హౌస్, వ్యవసాయ యాంత్రీకరణ వంటివి అమలు చేస్తున్నాయి. యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. కానీ ఈసారి ఎంతనేది తెలియరాలేదు. ఉద్యాన శాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఎంతనేది ప్రకటించలేదు. వ్యవసాయ మార్కెటింగ్‌కు గత బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో కేవలం రూ.122 కోటు కేటాయిం చారు. అయితే, ఈసారి ఎంతనేది తెలియాల్సి ఉంది. రైతుబీమాతో ధీమా... రైతు ఏ కారణం వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలను కేవలం పదిరోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటివరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు రూ.283 కోట్లు అందించింది. ఈ బడ్జెట్లో రైతుబీమా పథకానికిగాను రైతుల తరఫున కిస్తీ కట్టేందుకు రూ.650 కోట్లు ప్రతిపాదించారు. ఇన్ని పథకాలు ఎక్కడా లేవు ఒక రాష్ట్రంలో వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ బడ్జెట్ ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొట్ట మొదటిసారి. దీంతో శాస్త్రీయ సాగు, రైతులకు ఆధునిక సాగు పరిజ్ఞానం, సాగులో మౌలిక వసతులు తక్షణమే అందించేందుకు వీలవుతుంది. దేశంలో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ... ఈ మూడూ ఎక్కడా అమలు కావడంలేదు. ఏదో ఒక పథకం అమలు చేయడానికే వివిధ రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. కానీ, ఇక్కడ ఇన్ని పథకాలు అమలు చేయడం చిన్న విషయం కాదు. – పిడిగం సైదయ్య,ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన వర్సిటీ రుణమాఫీకి 40 లక్షల మంది అర్హులు! రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాష్ట్రరైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణా లు మాఫీ కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11ని గడువుగా లెక్కించి ఆ తేదీ నాటికి రుణం తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీని ప్రభు త్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వారందరికీ రూ. లక్ష లోపున రుణా లు మాఫీ చేయాల్సి వస్తే దాదాపు రూ. 28 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 31 నాటి వరకు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న స్పష్టమైన లెక్కల ప్రకారం 48 లక్షల మందికి రూ. 31 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 11కి, డిసెంబర్ 31కి మధ్య రుణాలు తీసుకున్న వారి సంఖ్యలో భారీ తేడా కనిపిస్తుంది. 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి. రుణాలు తీసుకున్న రైతులు తమకు ఎప్పుడు మాఫీ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఈ రబీ సీజన్లో రూ. 16,998 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు కేవలం రూ. 7,765 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఓటాన్ అకౌంట్ ఎందుకంటే.. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి బడ్జెట్‌ను పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దానిపై సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వివరణ ఇచ్చారు. ‘ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు అనేక కారణాలున్నాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉం టాయి? ఏయే రంగాలకు ఎలాంటి కేటాయింపులుంటాయి? ప్రాధాన్యాలేం టి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలపై స్పష్టత లేదు. కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత మేరకు ఆర్థికసాయం అందుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. తెలంగాణ ప్రభు త్వం కూడా ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబో యే ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకున్నామ న్నారు. -
అయ్యో..ఓయూ..
⇒ఓయూలో నిధుల కోసం మల్లాగుల్లాలు ⇒ప్రణాళికలు బారెడు... నిధుల కేటాయింపు మూరెడు ⇒శతాబ్ది ఉత్సవాలకు కేటాయించిన నిధులు అంతంత మాత్రమే తార్నాక: ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్సవాలను ప్రపంచ కీర్తిని గడించేలా నిర్వహించాలనుకున్న అధికారుల ఆశలపై నిధుల కేటాయింపు నీళ్లు చల్లింది. ఎన్నో ఆశలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించిన అధికారుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కోట్ల రూపాయల అంచనాలతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేయగా, ప్రభుత్వం కేటాయించిన నిధులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దాదాపు రూ.416 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ఓయూ అధికారులు నివేదించగా, ఈ వార్షిక బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులకు ,అంచనా వ్యయానికి పొంతనలేకుండా పోవడంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల విషయమై ఓయూ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవంటున్నారు. ముఖ్యంగా ఓయూలో విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది. కనీసం తొలి దశలో హాస్టళ్ల ఆధునీకరణకు శ్రీకారం చుడితే బాగుంటుందంటున్నారు. అంచనా వ్యయం రూ.416కోట్లు.. ఇచ్చింది రూ.200 కోట్లు... శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని, ఈ సందర్బంగా స్థిరంగా గుర్తుండేలా ఉండేందుకు గాను పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. అందుకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మూడు నెలల ముందుగానే వివిధ రకాలుగా తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.416 కోట్లు అంచనా వ్యయంగా నివేదిక అందజేశారు. అంచనా ఇలా.. ఓయూలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను రెండు విధాలుగా రూపొందించారు. అందులో ఒకటి మౌళిక సదుపాయాల కల్పన అంశం కాగా, రెండవది వర్సిటీలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు వాటికి కేటాయించిన అంచానా విలువలు ఇలా ఉన్నాయి.. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో.. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్త్రపతి హాజరు అవుతున్న నేపథ్యంలో ఆయన స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అత్యవసరంగా రూ.20 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నిధులతో ప్రారంభ కార్యక్రమాలను గట్టెక్కించే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. శతాబ్ది ఉత్సవాల నిధుల వినియోగంపై ప్రత్యేక అధికారి..? ఓయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఓయూకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిసింది. కేటాయించిన నిధులను సదరు అధికారి పర్యవేక్షణలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు.ఈ నిధులతోని ప్రతి రూపాయికి అధికారులు లెక్క చూపాల్సి ఉంటుందంటున్నారు. కాగా ఈ విషయమై ఓయూ అ«ధికారులను సంప్రదించగా, దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు. -
తీపి కబురు లేదు
బడ్జెట్లో చక్కెర కర్మాగారాలకు మొండిచెయ్యి నిధుల కేటాయింపు ఊసెత్తని ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంతో అప్పులపాలవుతున్న ఫ్యాక్టరీలు, రైతులు చోడవరం:ఈ సారి బడ్జెట్లోనూ చక్కెర కర్మాగారాలకు మొం డిచేయే చూపారు. దివాలా దిశలో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఎటువంటి చ ర్యలు చేపట్టలేదు. రెండేళ్లుగా చక్కెర కర్మాగారాల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఒక పక్క అప్పులు, మరోపక్క ఆధునికీకరణకు నోచుకోక ఫ్యాక్టరీలు సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ఈ పరిస్థితిలో 2016-17 బడ్జెట్‌పై ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. సహకార చక్కెర కర్మాగారాలు, చెరకు రైతుల సంక్షేమానికి ప్రత్యక్షంగా నిధులు కేటాయించకపోవడం చూస్తే ఈ రంగంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిటో అర్థమవుతుంది. 4 ఫ్యాక్టరీలు మూత రాష్ట్రంలో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వా టిలో ఇప్పటికే 4 ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ ఏడాది 6 ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయి. అవి కూడా అప్పుల బాధతో నడుస్తున్నాయి. గత ఏడాది చెరకు పేమెంట్లే ఇంకా రైతులకు పూర్తిగా ఇవ్వలేదు. ఇటీవల కేంద్రం ఇచ్చిన వడ్డీలేని రుణం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఫ్యాక్టరీలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఫ్యాక్టరీలకు ఆర్థిక సాయం చేసి వాటిని ఆదుకోవాల్సి ఉంది. ఏటా తగ్గుతున్న చెరకు సాగు రాష్ట్ర వ్యాప్తంగా వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగు జరిగే చెరకు పంట ఏటేటా తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 60 శాతానికి చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది. ఫ్యాక్టరీల మనుగడ సరిగా లేకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, పెట్టుబడులు పెరిగి పోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలే ఇందుకు కారణం. చెరకు సాగు తగ్గిపోవడం వల్ల రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది రైతులు, రైతు కూలీలు, కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేవలం రూ.500 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్న 10 ఫ్యాక్టరీలు మళ్లీ ఆధునిక యంత్రాలతో ముస్తాబై రైతులకు అండగా నిలిచే అవకాశం ఉందని గతంలో ఎపిట్కో కమిటీ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వానికి చెప్పింది. తాజాగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వేసిన అధ్యయన కమిటీ కూడా ఫ్యాక్టరీల ఆధునికీకరణ, చెరకు సాగు విస్తీర్ణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. కాని ఇవేవీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కనీసం బడ్జెట్లో నైనా ఫ్యాక్టరీల ఆధునికీకరణ కోసం నిధులు కేటాయిస్తుందని యాజమాన్యాలు, చెరకు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కాని నిరాశే మిగిలింది. రూ.50 కోట్లిచ్చినా బకాయిలు తీరేవి కనీసం గత సీజన్‌కు సంబంధించి టన్నుకు రూ.200 అయినా ప్రోత్సాహం ఇస్తుందని గోవాడ, ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్తోపాటు అన్ని ఫ్యాక్టరీలు ఆశించాయి. సుమారు రూ.50 కోట్లు ఇచ్చినా రైతుల బకాయిలు తీర్చి అప్పుల ఊబిలోంచి ఫ్యాక్టరీలు కొంత బయటపడేవి. కాని బడ్జెట్లో ఆ కేటాయింపు కూడా జరగలేదు.కనీసం వ్యవసాయ బడ్జెట్లోనైనా ఎక్కడైనా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల గురించి ప్రస్తావిస్తారంటే అది కూడా చేయలేదు. సాధారణంగా అన్ని పంటల్లో దీన్ని కూడా ఒకటిగానే పరిగణించారే తప్ప కొన్ని లక్షల మంది ఆధారపడి ఒక ప్రత్యేక రంగంగా నడుస్తున్న సుగర్ ఫ్యాక్టరీలకు స్పష్టమైన నిధుల కేటాయించినట్టు ఎక్కడా పేర్కొనకపోవడం ఫ్యాక్టరీ వర్గాలు, రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
విద్యా సంస్థలకు ‘న్యాక్’ షాక్!
రూసా నిధుల్లో తెలంగాణకు దక్కని ప్రాధాన్యం రూ.400 కోట్లు అడిగితే.. రూ.112 కోట్లకే ఓకే అక్రెడిటేషన్ లేనందువల్లే నిధుల్లో భారీ కోత హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ. 400 కోట్లు అవసరమని రూసా ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో ప్రతిపాదనలు అందజేస్తే కేవలం రూ.112 కోట్ల విలువైన కార్యక్రమాలకే ఓకే చెప్పింది. యూనివర్సిటీలు, కాలేజీలు నిర్వహించే కోర్సులకు నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతోంది. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాత డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు అడిగింది. అయితే, న్యాక్ అక్రెడిటేషన్ లేకపోవడంతో నిధులు ఇప్పుడు ఇవ్వడం కుదరదని, అక్రెడిటేషన్ తెచ్చుకున్నాకే ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయని, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకని ప్రశ్నించింది. వీటిపై ప్రతిపాదనలను మళ్లీ అందజేయాలని చేయాలని పేర్కొంది. ఏప్రిల్‌లో జరిగిన రూ సా సమావేశానికి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కళాశాల విద్యా కమిషనర్ తదితరులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ధికి సం బంధించిన వివిధ ప్రతిపాదనలను రూసా అధికారులకు అందజేశారు. అందులో కొన్నిం టికి ఒప్పుకోగా, మరికొన్నింటికి వివరణలు అడిగారు. ఇంకొన్నింటికి న్యాక్ గుర్తింపు లేనందునా నిధులు ఇచ్చేందుకు నిరాకరించారు. వీసీలు లేకపోవడమూ కారణమే.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, పాలమూ రు యూని వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో యూనివర్సిటీకి రూ. 20 కోట్ల చొప్పున రూ. 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరితే.. కేవలం ఉస్మానియా వర్సిటీకి మాత్రమే రూ. 20 కోట్లు ఇచ్చేం దుకు ఒప్పుకుంది. మిగిలిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు లేనందున నిధులు ఇవ్వబోమని పేర్కొంది. అయితే, 4 వర్సిటీలకు రెండు మూడేళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు లేకపోవడం.. ఇన్చార్జి వైస్ చాన్స్లర్లు వాటికి న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆ యూనివర్సిటీలకు నిధులు రాకుండాపోయాయి. ఇతర ప్రతిపాదనలదీ అదే దారి.. ఆదిలాబాద్ లో రూ. 12 కోట్లతో మోడల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఓకే చెప్పకుండా... మరింత సమాచారం కావాలని కోరింది.ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఒక్కోదానికి రూ.26 కోట్లతో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కోసం రాష్ర్టం ప్రతిపాదించగా... ఇప్పటికే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయంటూ మంజూరుకు అంగీకారం తెలపలేదు. హైదరాబాద్‌లో రెండు, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లో ఒకటి చొప్పున పాత డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకుంటే మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. 44 డిగ్రీ కాలేజీలకు అభివృద్ధి చేసేందుకు ఒక్కో దానికి రూ. 2 కోట్ల చొప్పున నిధులు అడిగితే.. న్యాక్ గుర్తింపు ఉన్న 30 కాలేజీలకు మాత్రమే అనుమతి. మిగితా వాటికి న్యాక్ గుర్తింపు వచ్చాకే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. కొత్త యూనివర్సిటీల ఏర్పాటు, క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలకు మోక్షం లభించలేదు. రూసా అమలులో భాగంగా ముందస్తు ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ. 2.6 కోట్లు మంజూరు చేసింది. మరో రూ. 1.4 కోట్లు రాష్ట్ర వాటాగా వెచ్చించి ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. -
సాంఘిక సంక్షేమానికి కోత
బెంగళూరు:గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది సాంఘిక సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపులో భారీగానే కోతపడింది. గతఏడాది బడ్జెట్లో రూ.6,475 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ.4,584 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మొత్తంగా సాంఘిక సంక్షేమ శాఖకు రూ.1,891 కోట్లు తగ్గించారు.ఎస్సీ, ఎస్టీలకు గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్‌కు రూ.1.5లక్షల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో యూనిట్‌కు రూ.1.8లక్షల వ్యయంతో 50వేల ఇళ్ల నిర్మాణం అస్పృశ్యతా నివారణ దిశగా ఇతర వర్ణాలకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకునే అబ్బాయిలకు ఇచ్చే ప్రోత్సాహకం రూ.50వేల నుంచి రూ. 2లక్షలకు పెంపు, ఇతర వర్ణాలకు చెందిన అబ్బాయిని వివాహం చేసుకునే అమ్మాయిలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రూ.3లక్షలకు పెంపుప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భోజనం ఖర్చులు రూ.800 నుంచి రూ.900కు పెంపు(నెలవారీగా) సొంత భవనం కలిగిన అన్ని ప్రభుత్వ కళాశాలల వసతి గృహాల్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ-లర్నింగ్ సదుపాయం సైతం అందుబాటులోకి ఏడాదికి ఆరు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ,ఎస్టీల పిల్లలకు 100శాతం ఫీజు రీఎంబర్స్మెంట్. -
‘ఈటెల’.. ఏమిటిలా!
బంగారు తెలంగాణకు బాట అన్న ప్రభుత్వం బడ్జెట్లో అంకెలగారడీ చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ జిల్లాపై చిన్నచూపు చూపారని విమర్శలు వస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు..సంక్షేమ పథకాలకు నామమాత్రం కేటాయింపులతో జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యూయి. - రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై చిన్నచూపు - సాగునీటి ప్రాజెక్టులకు స్వల్ప నిధులు - రాజీవ్‌సాగర్‌కు రూ.25 కోట్లు - ఇందిరాసాగర్‌కు రూ.10 కోట్లు - పెదవాగుకు రూ.50 కోట్లు - పెద్ద ప్రాజెక్టులకు అరకొర నిధులు - రైతు రుణమాఫీకి నామమాత్రమే సాక్షి, ఖమ్మం: బంగారు తెలంగాణ ధ్యేయం అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసుల ఆశలను ఆవిరి చేసింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్తెసరుగా నిధులు కేటాయించి జిల్లాపై వివక్ష చూపింది. భారీ మొత్తంలో నిధులు విడుదలై ప్రాజెక్టుల పూర్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేకపోవడం గమనార్హం. ఈ బడ్జెట్లో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ ప్రభుత్వం స్వల్పంగా నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పట్లో పూర్తికానట్లే. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు లేకపోవడంతో గడువు దాటినా ఈ ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులపై శీతకన్నే వేసింది. ఇందిరాసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,824 కోట్లు. కానీ ఇప్పటి వరకు నిధులు రూ.1,150.36 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.886.533 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నాటికి అన్నిరకాల పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్లో కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. గడువు దాటినా నిధుల కేటాయింపు తక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఇక ఇప్పట్లో పూర్తి కానట్లేనని విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాతో పాటు వరంగల్ జిల్లాల్లోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీనికి భారీ ఎత్తున నిధులు విడుదల అవుతాయని ఇరు జిల్లాల రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణలోని ఈ రెండు జిల్లాల్లోని భూములనే సస్యశ్యామలం చేస్తున్నా కేవలం ఈ బడ్జెట్లో రూ.25 కోట్లు మాత్రమే విదిల్చారు. ఈ నిధులు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగిరం కావడానికి ఏమాత్రం సరిపోవు. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నూతన ప్రభుత్వం పెద్దవాగు ప్రాజెక్టుకు రూ.20 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం రూ. 50కోట్లు కేటాయించారు. అశ్వారావుపేట మండలంలోని పెదవాగుపై అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రిజర్వాయర్ నిర్మాణానికి చొరవ చూపారు. మొత్తంగా అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. అయితే కుడి ఎడమ కాల్వల ద్వారా అశ్వారావుపేట మండలంలో 2 వేలు, వేలేరుపాడు మండలంలో 4 వేలు, కుక్కునూరులో మరో 4వేల ఎకరాల ఆయకట్టుకే నీరు అందుతోంది. పంట భూముల చివరి వరకు కాల్వలు లేకపోవడం, ఉన్న కాల్వలు శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినా ఆంధ్రప్రదేశ్‌లోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వెళ్లాయి. మేజర్ ఆయకట్టు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ నిధుల ద్వారా ఎక్కువగా ఆ రాష్ట్ర రైతులే లబ్ధి పొందే అవకాశం ఉంది. గోదావరి నీటినిృకష్ణా నదికి అనుసంధానం చేసే దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్లో రూ.కోటి కేటాయించింది. ఇక జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు గత బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.196. 47 కోట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో నల్లగొండతోపాటు జిల్లా కూడా ఉండటంతో మనకు రూ.100 కోట్ల వరకు రానున్నాయి. వెంకటాపురం మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో పాలెంవాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో 10 వేల ఏకరాలకు సాగునీరు అందించేందుకు రూ.70.90 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం 148.99 కోట్లకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తోంది. గత బడ్జెట్లో రూ.కోటి కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.5కోట్లు కేటాయించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) ద్వారా జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల్లో సుమారు 79వేల ఎకరాలు సాగులోకి రావాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్లుగా సాగుతోంది. ప్రధానంగా వరంగల్ నుంచి జిల్లాలోకి ఈ కాల్వకు సంబంధించిన లింక్ కాల్వల తవ్వకం జరగలేదు. ఈ బడ్జెట్లో ఎస్ఆర్ఎస్పీకి భారీ ఎత్తున రూ.747 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలోని ఈ ఆయకట్టుకు కూడా లింక్ కాల్వల నిర్మాణం చేపట్టవచ్చని రైతులు ఆశిస్తున్నారు. వ్యవసాయ రుణమాఫీ కింద జిల్లాకు రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. 2.90 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.364 కోట్లను జిల్లాకు మంజూరు చేసింది. ఈ బడ్జెట్లో రుణమాఫీ కింద రూ.4,800 కోట్లను చూపింది. ఈ లెక్కన జిల్లాకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ కింద సుమారు రూ.500 కోట్ల వరకు రానున్నాయి. దళితులకు భూమి కొనుగోలు కింద జిల్లాలో కేవలం కొంతమందికే అట్టహాసంగా భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. 2 వేలమందికి పైగా లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే జిల్లాకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అయితే అర్హులైన లబ్ధిదారుల్లో కేవలం 200 మందికే ఈ ఆర్థిక సంవత్సరంలో లబ్ధి కలగనుంది. మిగతా లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పవు. - గతంలో జిల్లా కేంద్ర ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఆస్పత్రి గురించి బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు. - ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు కొంతమేర నిధులు కేటాయించడంతో జిల్లాలోని ఈ వర్గాలకు ఊరట కలగనుంది. - రూ.3లక్షలతో డబుల్ బెడ్ రూమ్, కిచెన్‌తో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్లో ఈ గహ నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేయలేదు. లక్ష మంది వరకు నిరుపేదలు జిల్లాలో ఇప్పటికేృగహ నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూసినా ప్రభుత్వం వారి ఆశలపై నీరు చల్లింది. - గతంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.4,200 ఉండగా ఇప్పుడు రూ.7,000కు పెంచారు. సహాయ కార్యకర్తలకు గతంలో రూ.2,450 వేతనం ఇవ్వగా దీన్ని రూ.4,500కు పెంచారు. జిల్లాలో 3299 మంది కార్యకర్తలు, 1006 మంది సహాయ కార్యకర్తలకు ఊరట దక్కింది. -
పట్టాలెక్కని రైల్వే ప్రగతి
⇒ శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం ప్రతిపాదనలకే పరిమితం ⇒ కృష్ణపట్నం-ఓబులాపురం మార్గానికి పూర్తికాని భూసేకరణ ⇒ బిట్రగుంటలో కలగా మారిన కాంక్రీట్ స్లీపర్ల తయారీ నిర్మాణం ⇒ వచ్చే బడ్జెట్లోనైనా నిధుల కేటాయింపులుపై ఆశలు నెల్లూరు (రవాణా) : జిల్లాలో రైల్వే ప్రగతి ప్రతిపాదనలకే పరిమితమైంది. దశాబ్దాలుగా రైల్వే ప్రగతి ప్రణాళికకు మోక్షం లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం కలగానే మిగిలింది. కృష్ణపట్నం- ఓబులాపురం మధ్య రైలు పట్టాలు మధ్యలోనే ఆగిపోయాయి. బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ల తయారీ యూనిట్ శిలాఫలకానికే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ తరువాత రైల్వేకు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది నెల్లూరు జిల్లానే. సుమారు ఏడాదికి రూ.1500 కోట్లు రాబడిని రైల్వేకు ఆర్జించి పెడుతోంది. ప్రతిసారి బడ్జెట్లో కేంద్రం జిల్లాకు మొండి చెయ్యే చూపెడుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో నెల్లూరు వాసి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి స్థానంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారైన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పడకేసిన రైల్వే ప్రగతిని పరుగెత్తిస్తారని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైల్వేశాఖ ఆయా జిల్లాల్లో ప్రతిపాదనలు పంపాలని ఎంపీలకు లేఖ రాయడంతో జిల్లా ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రం ఈ సారి తప్పకుండా జిల్లాకు నిధులు కేటాయింపులపై పట్టుబడుతున్నారు. శ్రీకాళహస్తి-నడికుడి ప్రతిపాదనలకే పరిమితం జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతాలను కలుపుతూ శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా నడికుడి వరకు రైలుమార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు 2010-11 బడ్జెట్లో మోక్షం లభించింది. శ్రీకాళహస్తి నుంచి రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, కనిగిరి తదితర మెట్ట ప్రాంతాల మీదుగా రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. అంతకు ముందు 2005లో ఈ మార్గానికి ప్రాథమిక సర్వే నిర్వహించారు. అనంతరం 2007లో మళ్లీ పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈ మార్గం నిర్మాణానికి సుమారు రూ.1310 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో భాగంగా రైల్వే మార్గంకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఇందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం రూ. 8 లక్షలు కేటాయించారు. కానీ అక్కడ నుంచి ఏ మాత్రం ప్రగతి లేదు. గూడూరు - దుగ్గరాజపట్నం రైల్వేలైన్ పరిస్థితీ ఇదే.. జిల్లాలో గూడూరు నుంచి దుగ్గరాజుపట్నం వరకు రైలు మార్గాన్ని వేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ మేరకు సర్వే కూడా పూర్తి చేశారు. 2010-11లో రెల్వేలైన్కు అయ్యేఖర్చును రూ. 278 కోట్లుగా అంచనా వేశారు. దీనికి సంబంధించి 2013లో రైల్వే బడ్జెట్లో నామమాత్రంగా రూ. కోటి కేటాయించారు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కృష్ణపట్నం-ఓబులాపురం లైన్‌కు పూర్తిగాని భూసేకరణ జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు నుంచి ప్రధానంగా బొగ్గు, యూరియా, బియ్యం, ఇనుము తదితర సరుకులు ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. వీటిని తరలించేందుకు కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులాపురం వరకు రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో సర్వే చేశారు. నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.930 కోట్లుగా అంచనా వేశారు. ఇందుకు గాను 2011లో మొదటి విడతగా రూ.6 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కృష్ణపట్నం నుంచి వెంకటాచలం వరకు రెండు లైన్లతో కూడిన ట్రాక్‌ను నిర్మించారు. ఈ రైలు మార్గానికి ప్రధానంగా భూసేకరణ అడ్డంకిగా మారింది. ఇప్పటికీ భూసేకరణ పూర్తికాలేదు. కలగామారిన కాంక్రీట్ స్లీపర్ల తయారీ కర్మాగారం జిల్లాలో బ్రిటీష్ కాలంలో బిట్రగుంట కేంద్రంగా రైల్వే శాఖ విస్తరించింది. కాలక్రమేణ బిట్రగుంటకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పటికీ బిట్రగుంటలో రైల్వేకు సంబంధించి దాదాపు 1,600 ఎకరాల భూమి ఉంది. ఇతర అనేక వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేస్తూ రైల్వే పరమైన అభివృద్ధి కోసం 2004 సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర రైల్వే మంత్రి లాలూప్రసాద్‌యాదవ్ కాంక్రీట్ స్వీపర్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో రైలు ఇంజన్ల మరమ్మతుల కర్మాగారాన్ని (ఎలక్ట్రికల్ లోకో పిరియాడికల్ ఓవర్ హోలింగ్) గత పదేళ్లుగా రైల్వేబోర్డు పరిశీలనలో ఉన్నప్పటికి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ ప్రాంతంలో కర్మాగారం స్థాపించినట్లయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు, కోట్లాది రూపాయిల విలువ జేసే రైల్వే ఆస్తులు, వనరులు సద్వినియోగంలోకి వస్తాయి. రైల్వేశాఖలో బంగారు గనిగా భావించే నెల్లూరు జిల్లాకు ఎన్నో ఏళ్లుగా అన్యాయం జరుగుతునే ఉంది. ఏ గ్రేడ్ స్టేషన్ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం ప్రస్తుతం ఏ1 స్టేషన్‌గా ఉన్న నెల్లూరును ఏ గ్రేడ్‌గా చేయాలనే ప్రతిపాదనలు కూడా కాగితాలకే పరిమితమైంది. ప్రయాణికుల రాకపోకలు, రవాణా విభాగంలో అత్యధిక ఆదాయం తెచ్చేపెట్టేది నెల్లూరు రైల్వేస్టేషన్ ఏ గ్రేడ్ స్టేషన్‌గా మార్చినట్లయితే నగరాలకు ఉండే సౌకర్యాలు జిల్లా వాసులకు లభిస్తాయి. గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే సింహపురి రైలు బయలుదేరే సమయం పొడిగించడంతో జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ముందు గూడూరులో రాత్రి 9 గంటలకు బయలు దేరే రైలు సమయాన్ని ప్రస్తుతం 10.40 మార్చడంతో సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చేరుతుందని పలువురు చెబుతున్నారు. రైలు సమయం మార్పుపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రైల్వే అధికారులను కలిసి వినితిపత్రం సమర్పించారు. గతంలో ఉన్న సమయాన్నే పెట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి -నడికుడి వరకు కొత్త లైన్ ఏర్పాటు చేయాలి శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లో సబ్వేను ఏర్పాటు చేయాలి. నాయుడుపేట, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లల్లో ముఖ్యమైన ైరె ళ్లను ఆపాలి. దొరవారిసత్రం వద్ద రైల్వేప్లాట్‌ఫాం, ఆరంబాకం- తడ మధ్య ఉన్న కారూరు వద్ద కొత్తగా రైల్వేస్టేషనును ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనలు అమలు చేయాలి. - వి. వరప్రసాద్, వైఎస్సార్సీపీ ఎంపీ, తిరుపతి ప్రతిసారి అన్యాయం జరుగుతోంది రైల్వే బడ్జెట్లో నెల్లూరు జిల్లాకు ప్రతిసారి అన్యా యం జరుగుతుంది. మూడు దశబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేశాం. ఈ సారి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై ఆశలు పెట్టుకున్నాం. బిట్రగుంటలో రైల్వే ఆస్తుల వినియోగంలో భాగంగా ఎలక్ట్రికల్ లోకో పీఓహెచ్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వే కొత్త మార్గాలను త్వరితగతిన నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలి. నెల్లూరు స్టేషన్‌ను ఏ గ్రేడ్‌గా పరిగణించి అన్ని సదుపాయాలు కల్పించాలి. - జయరాజ్, బీజేపీ దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు -
ప్రోగ్రెస్ నిల్
మచిలీపట్నం :జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం గత నెల అక్టోబరు రెండో తేదీన ప్రారంభమై ఈ నెల 11తో ముగిసింది. తుపాను కారణంగా అక్టోబరు 12 నుంచి ఆ నెలాఖరు వరకు వాయిదా వేశారు. నవంబరు ఒకటి నుంచి 11 వరకు రెండో విడత నిర్వహించి పూర్తిచేశారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జన్మభూమి-మా ఊరు పేరుతో నిర్వహించగా, ఆ పార్టీ నేతలు దీనిని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చివేశారు. జన్మభూమిలోనే పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో అవి నిలిచిపోయాయి. 970 పంచాయతీలు.. 277 వార్డుల్లో... జిల్లాలో జన్మభూమి - మా ఊరు సభలు 970 పంచాయతీల్లో, 277 వార్డుల్లో నిర్వహించారు. 2.77 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా నవంబరు 11 నాటికి 2,26,998 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వారికి తరువాత రోజుల్లో ఇచ్చారు. తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారికి గృహాలకు వెళ్లి పింఛన్లు అందజేస్తామని అధికారులు ప్రకటించారు. నవంబరు 11 నాటికి రూ.23.61 కోట్లను పింఛను రూపంలో అందజేశారు. మండలాలు, ఆయా పురపాలక సంఘాల్లో 1,247 గ్రామసభలు నిర్వహించగా వాటిలో 1,241 వైద్యశిబిరాలను నిర్వహించారు. 1,18,898 మందికి వైద్యపరీక్షలు చేశారు. 1,085 పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 90,245 పశువులకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. భూసార పరీక్షలకు సంబంధించి రైతులకు 12,758 సాయిల్ హెల్త్‌కార్డులను అందజేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1,058 అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గృహనిర్మాణం, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ 5,12,166 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని ఆన్లైన్లో ఉంచుతున్నారు. బడి ఈడు ఉండి అసలు బడికి వెళ్లని ఏడుగురు బాలలను గుర్తించారు. గృహాలు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ 1,70,290 దరఖాస్తులు వచ్చాయి. నిధుల విడుదలపై స్పష్టత లేదు... జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులకు సంబంధించి ఏ విభాగం నుంచి నిధులు కేటాయించాలనే అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. నూతన పింఛన్ల మంజూరు పైనా ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే తదుపరి నిర్ణయం తీసుకోగలమని అధికారులు చెబుతున్నారు. ప్రచారానికే ప్రాధాన్యం జన్మభూమిని ఆద్యంతం పార్టీ ప్రచార కార్యక్రమంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తలకే నాయకులు, కార్యకర్తలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పింఛను మంజూరు పత్రాలను అందజేసే సమయంలో పసుపు రంగులో ప్రత్యేకంగా తయారు చేయించిన కవర్లపై ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తదితరుల ఫొటోలను ముద్రించి ఇచ్చారు. గర్భిణులకు సీమంతం పేరుతో వారికి ఇచ్చే పూలు, గాజులు, చీరతో పాటు చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన పత్రాలు అందజేశారు. సీమంతం కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఏదైనా గ్రామంలో లేదా వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగితే అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేసి ఈ తంతు ముగించారు. జన్మభూమి నిర్వహణ కోసం పంచాయతీకి, వార్డుకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వాటిని జన్మభూమి కార్యక్రమం పూర్తయ్యే సమయంలో అధికారులు విడుదల చేయటం గమనార్హం. అధికారులే టీడీపీ కార్యకర్తలుగా... చాలా గ్రామాల్లో అధికారులే టీడీపీ కార్యకర్తలుగా మాదిరిగా వ్యవహరించి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. బందరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఎలాంటి పదవులూ లేని టీడీపీ నాయకులు వేదికపై నుంచి ప్రసంగించేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద నిర్వహించాలనే నిబంధన ఉన్నా బందరు మండలం గుండుపాలెంలో టీడీపీ కార్యకర్తల సూచనల మేరకు జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది. పలువురు నేతల అత్యుత్సాహం... జన్మభూమి సభల్లో పలువురు టీడీపీ నేతల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. పామర్రు మండలం కొమరవోలు, రిమ్మనపూడి పంచాయతీలో టీడీపీ నేత వర్ల రామయ్య వ్యవహరించిన తీరు ఆ గ్రామాల ప్రజల మధ్య చిచ్చుపెట్టింది. కొమరవోలు పంచాయతీలో పింఛను సర్వేలో భాగంగా గ్రామకమిటీ సభ్యులు 50 మందికి అకారణంగా పింఛన్లను తొలగించారు. దీనిపై ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో పోలీసు బలగాలను దింపి ఇక్కడ జన్మభూమి నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య తదితరులు మళ్లీ ఇక్కడ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించటం వివాదాస్పదమైంది. రిమ్మనపూడిలో టీడీపీ నాయకులను వేదిక ఎందుకు ఎక్కనిచ్చారంటూ గ్రామస్తులు తిరగబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా ఉన్న సర్పంచులు, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఉన్న మండలాల్లో వారిని పక్కనపెట్టి టీడీపీ నాయకులు, కార్యకర్తలే తమ పెత్తనం చెలాయించేందుకు జన్మభూమిని వేదికగా వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మహిళలు ఉన్నచోట్ల వారి భర్తలే అన్నీ తామై వ్యవహరించారు. టీడీపీకి చెందిన గ్రామ, మండల, పట్టణస్థాయి నాయకులంతా జన్మభూమి వేదికలపై నుంచి గంటల తరబడి ప్రసంగించారు. ప్రభుత్వం తమదేనని, తాము చెప్పిందే జరుగుతుందనే ధోరణిలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించటం గమనార్హం. -
గళం విప్పుతారా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగే తొలి బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రవేశపెట్టే తొలిబడ్జెట్ భారీగా ఉండాలనే ఉద్దేశంతో సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా 10 జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ.. వాటిపై అంశాల వారీగా చర్చించనున్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యలకు పరిష్కారమార్గాలను జోడించే అవకాశం ఉండడంతో జిల్లా ప్రజానికం ఎమ్మెల్యేపై భారం వేసింది. దీంతో మన ప్రజాప్రతినిధులు సమస్యలపై వాణివినిపించేందుకు సిద్ధమవుతున్నారు. రైతు సమస్యలే ప్రధానంగా... తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయరంగం డీలా పడింది. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల కాలంలో జిల్లాలో 15మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఎక్కువ మంది చనిపోయారు. కరువు పరిస్థితులతో పెద్దఎత్తున పంటలు ఎండిపోయాయి. మరోవైపు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి తాగునీటికి సైత ం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపింది. తాజాగా శాసన సభ బడె ్జట్ సమావేశాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ అంశాన్నే ఆయుధంగా చేసుకుని మాట్లాడనున్నారు. అటు ఇటుగా మారి.. జిల్లాలో 14 ఎమ్మెల్యేలుండగా.. అధికార పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. ఎనిమిది మంది టీడీపీ సభ్యులు విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బలోపేతమయ్యేందుకు తలపెట్టిన ఆకర్ష్ మంత్రానికి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గత నెలలో గులాబీ పార్టీలో చేరగా.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య త్వరలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఇరకాటంలో పడ్డాయి. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమవైపునకు వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈక్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభలో సర్కారు పట్ల ఎలా వ్యవహరిస్తారో చూడాలి. నిధులు కేటాయింపుపై ఉత్కంఠ.. కొత్త రాష్ట్రంలో ప్రవేశపెట్టే తొలిబడ్జెట్‌పై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉన్న నేపథ్యంలో అభివృద్ధి అంశం కీలకమైంది. ఇటీవల వర్షాలతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. మరోవైపు భారీ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో మైనర్ ఇరిగేషన్‌కు చెందిన కోట్‌పల్లి, లక్నాపూర్, కాగ్నా ప్రాజెక్టులను ఆధునికీకరించాల్సి ఉంది. తాజా బడ్జెట్లో వీటికి కేటాయింపులు ఘనంగా ఉండాలని రైతాంగం కోరుకుంటోంది. తాగు, సాగునీటి శాశ్వత పరిష్కారం కోసం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్కారు పచ్చజెండా ఊపింది. గతంలో సర్వే పనులకు నిధులు కేటాయించగా.. తాజా బడ్జెట్లో ప్రాజెక్టు పనులకు కేటాయించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం కానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులపై స్పష్టత రానుంది. ఎత్తిపోతలపై మాట్లాడుతా.. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా సాగునీరు, తాగునీరు సాధనపై గళం వినిపిస్తా. ప్రభుత్వ పరిశీలనలోఉన్న రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతలను సాధిస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలతోపాటు, జిల్లా సమస్యలు ప్రస్తావిస్తా. ప్రధాన అంశాలకు బడ్జెట్ కేటాయించేలా ప్రభుత్వంపై వత్తితెస్తా. ఇప్పటికే పలు సమస్యలపై ప్రస్తావించేందుకు స్పీకర్‌తో సమయం తీసుకున్నా. వికారాబాద్‌లోని అనంతగిరిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోపాటు ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు, జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 22 మంది రైతు కుటుంబాలకు పరిహారం విషయంపై మాట్లాడుతా. పరిగి- నంచర్ల రోడ్డు విస్తరణ, హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు నాలుగు లేన్లుగా మార్చేందుకు నిధుల కేటాయింపు, వికారాబద్ నుంచి పరిగి మీదుగా మక్తల్ రైల్వేలైన్ ఏర్పాటుకు రాష్ట్ర వాటా నిధులు కేటాయింపు తదితర అంశాలపై బడ్జెట్ కేటాయించేలా సీఎల్పీ హోదాలో అసెంబ్లీలో చర్చిస్తా. - టీ.రామ్మోహన్‌రెడ్డి, సీఎల్పీ సెక్రెటరీ (పరిగి ఎమ్మెల్యే) -
ఇదేం ప్రత్యేకత!?
వనసమారాధనల కోసం కేవలం లక్ష మంజూరు మొక్కుబడిగా నిధుల కేటాయింపు సరిపోదంటున్న అధికారులు సాక్షి, విజయవాడ : పర్యాటకుల్ని ఆకట్టుకునేలా రాష్ట్ర నూతన రాజధాని నగరాన్ని తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా కార్తీకమాసంలో ప్రజలు వన సమారాధనలు, శైవక్షేత్ర దర్శనాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడం రివాజు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా కార్తీక వనసమారాధనలు జరుగుతున్నందున భవానీద్వీపంలో అధికారులు పలు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేస్తారనుకున్న పర్యాటకులకు నిరాశే మిగిలింది. జిల్లాకో లక్ష : కార్తీకమాసంలో దేవాలయాల సందర్శన, వనసమారాధనల ఏర్పాట్లు, పర్యాటకుల్ని ఆకట్టుకోవడం తదితర అంశాలపై హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఏడాది కంటే ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకట్టుకోవాలంటూ హితబోధ చేశారు. ఈ సమావేశంలో ఒక్కొక్క జిల్లాకు రూ.లక్ష మంజూరు చేశారు. ఈ డబ్బుతోనే పర్యాటకులకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలి. ఆదివారాల్లో చిన్నారులకు ఆటల పోటీలు, సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం, పర్యాటక ప్రదేశాల్లో మ్యూజిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భవానీద్వీపం వంటి అవసరమైన చోట మీడియా పబ్లిసిటీ కూడా ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి పి.బి.ఎస్.మోహన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. నవంబర్ రెండో తేదీ ఆదివారం నుంచి వీటిని అమలు చేయమని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఇచ్చిన లక్ష రూపాయలతో పర్యాటకులకు సౌకర్యాలు ఏం కల్పిస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అటువంటి సమయాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే నిధుల కొరత ఉండకూడదని అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. డివిజనల్ మేనేజర్లు బదిలీ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ల బదిలీ జరిగింది. విజయవాడ డివిజనల్ మేనేజర్ బాబూజీని కాకినాడ వేశారు. అక్కడి మేనేజర్‌ను హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు విభాగానికి బదిలీ చేశారు. విజయవాడ డివిజన్‌కు గతంలో పనిచేసిన సూర్యప్రకాశరావును ఓఎస్డీగా నియమించారు. ఆయన చార్జి తీసుకోకపోవడంతో బాబూజీకి కాకినాడ బాధ్యతలతో పాటు విజయవాడ డివిజన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. పర్యాటకుల నుంచి విశేష స్పందన భవానీద్వీపంలో ఏపీటీడీసీ అధికారులు అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ పర్యాటకుల నుంచి స్పందన బాగానే ఉన్నట్లు తెలిసింది. గత ఏడాది రూ.15 లక్షల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.18 లక్షలు రాబట్టాలని టార్గెట్‌గా ఇచ్చినట్లు తెలిసింది. అయితే పర్యాటకుల నుంచి వస్తున్న స్పందన బట్టి కనీసం రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే రూ. 25 లక్షలు వచ్చే అవకాశం ఉంది. భవానీద్వీపం వంటి ప్రదేశాలకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. ఒక్క భవానీద్వీపమే కాకుండా కొండపల్లి ఖిల్లాను కలుపుతూ వనభోజనాల ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
జైళ్ల పై నజర్
- కొత్త భవనాలకు రూ.40 కోట్లు - 14వ ప్రణాళికలో ప్రతిపాదనలు - 15లోగా కల్వకుర్తి సబ్‌జైల్ ప్రారంభం - ఖైదీలకు అక్షరాభ్యాసం జిల్లా జైలుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఖైదీల రాకపోకలు సాగుతుంటాయి. అప్పట్లో 5.5 ఎకరాల స్థలంలో 147 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు దీనిని నిర్మించారు. అయితే ప్రస్తుతం 300 మంది ైఖైదీలు ఉంటున్నారు. ఒక్కో సమయంలో 400 మందికి పైగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖైదీ లకు సౌకర్యవంతంగా ఉండేందుకుగాను జడ్చర్ల సమీపంలోని చిట్టెబోయిన్‌పల్లిలో పదేళ్లక్రితం ప్రభుత్వం 42 ఎకరా లు సేకరించి అందులో జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. అయితే గత ప్రభుత్వాల అలసత్వంతో నిధుల కేటాయింపులో జాప్యం ఏర్పడింది. తాజాగా 14వ ఆర్థిక ప్రణాళికలో జైళ్ల నిర్మాణానికి *40 కోట్ల ప్రతిపాదనలు పెట్టారు. ఈ నిధులు త్వరలోనే మంజూరు చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల జిల్లాలో అన్ని హంగులతో కూడిన ఆధునిక జైళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లాలో ఆరు సబ్జై ళ్లు ఉన్నా నాగర్‌కర్నూల్ మి నహా ఏ ఒక్కటి అందుబాటులో లేవు. అన్నీ శిథి లావస్థకు చేరాయి. కొడంగల్‌లోని సబ్‌జైలుకు మరమ్మతు చేపట్టేందుకు 90 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. తాజాగా కల్వకుర్తి సబ్‌జైలుకు మరమ్మతు చేపట్టారు. దీనిని సెప్టెంబర్ 15లోగా ప్రారంభించనున్నారు. ఇందులో 30 నుంచి 40 మంది ఖైదీలను ఉంచేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక అచ్చంపేట, నారాయణపేట, కొల్లాపూర్‌లోని జైళ్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నారాయణపేటలోని భవనం జైలుకు పనికిరాదని అధికారులు తేల్చి ప్రభుత్వానికి గతంలోనే నివేదించారు. జిల్లాలోనే అత్యధిక నేరాలు జరిగే ప్రాంతాల్లో షాద్‌నగర్‌కు మొదటి స్థానం దక్కింది. ఇక్కడ జైలు ఆవశ్యకత ఎంతో ఉంది. ఖైదీల్లో మార్పులు తీసుకురావడానికి గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, న్యాయవాదులను జైలులోకి అనుమతించేవారు. తాజాగా ఖైదీలతో ఎవరైనా బయటి నుంచే మాట్లాడాలని జైళ్ల శాఖ ఐజీ వీకే సింగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ములాకత్‌లపై నిఘా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటంబ సభ్యులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ములాకత్‌కు వచ్చే వారి వివరాలను కచ్చితంగా నమోదు చేస్తున్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, న్యాయవాదులకు ప్రత్యేక సమయాల్లో జైలులో వెళ్లేందుకు అనుమతి ఉండేది. రానున్న రోజుల్లోనే వీరికి క ప్రవేశం ఉండకపోవచ్చని జైలు అధికారులు తెలిపారు. శిక్ష అనుభవిస్తున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిది ద్దేందుకు జైళ్ల శాఖ ప్రతి జిల్లాలో విద్యదాన యోజనను అమలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లా జైలులోని సుమారు 300 మంది ఖైదీలకుగాను 150 మందికి పైగా నిరక్షరాస్యులే. నెలరోజుల క్రితం ఈ పథకం ప్రారంభం కాగా ప్రస్తుతం 140మందిపైగా ఖైదీలు సంతకాలు నేర్చుకున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం.ఆర్.భాస్కర్ తెలిపారు. దీని ఆవరణలోనే పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల జైలులో సత్ప్రవర్తన కలిగిన, చదుకున్న ఖైదీలకు ఈ బంకులో పనిచేసే అవకాశంతో పాటు ఉపాధి అవకాశాలు ఉంటాయి. -
జేఎన్టీయూకు మహర్దశ
యూనివర్సిటీ: జేఎన్టీయూ అనంతపురం ప్రగతి పథంలో పయనించడానికి అడుగులు వేస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక సాధారణ బడ్జెట్లో జేఎన్టీయూకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని పిలుపు మేరకు మంగళవారం వీసీ ఆచార్య కే లాల్‌కిశోర్, రిజిస్ట్రార్ కే హేమచంద్రారెడ్డిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ వివరాలను బుధవారం వీసీ ఆచార్య లాల్‌కిశోర్ వెల్లడించారు. 2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఆ కళాశాలను 300మంది విద్యార్ధులతో ప్రారంభించామని, 2015-16 విద్యా సంవత్సరానికి వీరి సంఖ్య 900 మందికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే ఖాళీగా వున్న బోధనా పోస్టుల భర్తీకై ఆర్థిక పరమైన అనుమతులను బడ్జెట్లో పొందుపరచాలని కోరామన్నారు. నూతనంగా రెండు కళాశాలలకు అటానమస్ హోదా 2014-15 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ పరిధిలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెన్సైస్, కడపలోని కేఎస్ఆర్ఎం కళాశాలలకు అటానమస్ హోదాను కల్పించారు. దీంతో జేఎన్టీయూఏ పరిధిలో 10 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించినట్లైంది. జేఎన్టీయూ కాకినాడ, హైదరాబాద్‌ల కంటే ఎక్కువ అటానమస్ కళాశాలలను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అలాగే నూతనంగా తాడిపత్రి సీవీ రామన్ కళాశాలలో ఎంబీఏ కోర్సు ప్రారంభానికి అనుమతి ఇచ్చారు. ఫుల్‌టైం పీహెచ్డీ ప్రోగ్రాంకు శ్రీకారం ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఫుల్‌టైం పీహెచ్డీ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. అనుబంధ కళాశాలలకు కూడా ఈ విధానాన్ని వర్తింపచేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది రీసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. -
తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం!
* ఆ దిశగా బడ్జెట్ ప్రణాళికలు రూపొందిస్తున్న నీటిపారుదల శాఖ * ఉన్నతాధికారులు, నిపుణులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: తక్షణ ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే సాగునీటి ప్రాజెక్టులకే బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నవాటిని వెంటనే పూర్తిచేసేలా వాటికి అవసరమైన నిధులకేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లోనే చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తును నీటిపారుదల శాఖ అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. 12 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టులవారీగా జరుగుతున్న పనులు, అవసరమైన నిధులు, వాటికింద సాగులోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలపై చర్చించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదల రంగానికి సుమారు రూ.6వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని లెక్క తేల్చినట్టుగా సమాచారం. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. తక్షణం పూర్తిచేసే ప్రాజెక్టులపైనే సోమవారంనాటి సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), భీమా(20టీఎంసీలు) ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నందున వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. వీటితోపాటు మొదటినుంచి ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల ప్రారంభానికి కూడా తగిన నిధులు కేటాయించాలని సర్కారు యోచిస్తోందని అధికారులు చెబుతున్నారు.