సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖకు నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. నిధులు మూడేళ్లలో మూడింతలయ్యాయి. దీనిని బట్టి రైతుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవు తుంది. రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాల కారణంగా వ్యవసాయశాఖ బడ్జెట్ భారీగా పెరిగింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.15,511కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.20,107 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.4,596 కోట్లు పెరిగినట్లయింది. ఈసారి రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతుబీమా అమలుకు రూ.650 కోట్లు కేటాయిం చారు. అంటే సింహభాగం ఈ 3 పథకాలకే ప్రభుత్వం కేటాయించింది.
పంట కాలనీపై కేంద్రీకరణ...
ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పంట కాలనీలపై దృష్టి సారించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని బట్టి రాష్ట్రాన్ని పంట కాలనీలుగా చేస్తారు. ఆ దిశగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసా యశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా యి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు, దేశవిదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ పంట కాలనీల లక్ష్యం. ఈ పథకాన్ని అమలుచేసే క్రమంలో చిన్న, మధ్యతరహా భారీ ఆహారశుద్ధి కేంద్రాలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పుతారు. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళాసంఘాల్ని భాగస్వాములు చేయాలని ప్రభుత్వం సంక ల్పించింది. 1.61 లక్షలున్న రైతు సమితి సభ్యులకు గౌరవ వేతనమిచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలను అందించాలనే బహు ముఖ వ్యూహంతో సమితులు పనిచేస్తాయి. ఈ సమితుల వేదికగా రైతు లందరినీ సంఘటిత పర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఇతరత్రా పథకాలపై అస్పష్టత
వ్యవసాయ శాఖ చేపడుతున్న అనేక ఇతర పథకాలు, కార్యక్రమాలకు మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో స్పష్టత ఇవ్వ లేదు. వ్యవసాయ, ఉద్యానశాఖలు ఇప్ప టికే అనేక ముఖ్యమైన కార్య క్రమాలు చేపడుతు న్నాయి. గ్రీన్ హౌస్, వ్యవసాయ యాంత్రీకరణ వంటివి అమలు చేస్తున్నాయి. యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. కానీ ఈసారి ఎంతనేది తెలియరాలేదు. ఉద్యాన శాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఎంతనేది ప్రకటించలేదు. వ్యవసాయ మార్కెటింగ్‌కు గత బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో కేవలం రూ.122 కోటు కేటాయిం చారు. అయితే, ఈసారి ఎంతనేది తెలియాల్సి ఉంది.
రైతుబీమాతో ధీమా...
రైతు ఏ కారణం వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలను కేవలం పదిరోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటివరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు రూ.283 కోట్లు అందించింది. ఈ బడ్జెట్‌లో రైతుబీమా పథకానికిగాను రైతుల తరఫున కిస్తీ కట్టేందుకు రూ.650 కోట్లు ప్రతిపాదించారు.
ఇన్ని పథకాలు ఎక్కడా లేవు
ఒక రాష్ట్రంలో వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ బడ్జెట్ ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొట్ట మొదటిసారి. దీంతో శాస్త్రీయ సాగు, రైతులకు ఆధునిక సాగు పరిజ్ఞానం, సాగులో మౌలిక వసతులు తక్షణమే అందించేందుకు వీలవుతుంది. దేశంలో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ... ఈ మూడూ ఎక్కడా అమలు కావడంలేదు. ఏదో ఒక పథకం అమలు చేయడానికే వివిధ రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. కానీ, ఇక్కడ ఇన్ని పథకాలు అమలు చేయడం
చిన్న విషయం కాదు.
– పిడిగం సైదయ్య,ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన వర్సిటీ
రుణమాఫీకి 40 లక్షల మంది అర్హులు!
రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాష్ట్రరైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణా లు మాఫీ కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11ని గడువుగా లెక్కించి ఆ తేదీ నాటికి రుణం తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీని ప్రభు త్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వారందరికీ రూ. లక్ష లోపున రుణా లు మాఫీ చేయాల్సి వస్తే దాదాపు రూ. 28 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 31 నాటి వరకు ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఉన్న స్పష్టమైన లెక్కల ప్రకారం 48 లక్షల మందికి రూ. 31 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 11కి, డిసెంబర్ 31కి మధ్య రుణాలు తీసుకున్న వారి సంఖ్యలో భారీ తేడా కనిపిస్తుంది. 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి. రుణాలు తీసుకున్న రైతులు తమకు ఎప్పుడు మాఫీ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఈ రబీ సీజన్‌లో రూ. 16,998 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు కేవలం రూ. 7,765 కోట్లు మాత్రమే ఇచ్చాయి.
ఓటాన్ అకౌంట్ ఎందుకంటే..
2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి బడ్జెట్‌ను పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దానిపై సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వివరణ ఇచ్చారు. ‘ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు అనేక కారణాలున్నాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉం టాయి? ఏయే రంగాలకు ఎలాంటి కేటాయింపులుంటాయి? ప్రాధాన్యాలేం టి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలపై స్పష్టత లేదు. కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత మేరకు ఆర్థికసాయం అందుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. తెలంగాణ ప్రభు త్వం కూడా ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబో యే ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకున్నామ న్నారు.
Comments
Please login to add a commentAdd a comment