Distrustful
-
అవిశ్వాసాలు @ 30 మున్సిపాలిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ పాలక మండళ్లలో మొదలైన అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 34 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్ / చైర్పర్సన్ / వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తూ నోటీసులు జారీ చేయగా, 30 చోట్ల ప్రత్యే క సమావేశాలు నిర్వహించారు. అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోయిన వారిలో 15 మందిని పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగతా 15 చోట్ల నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. 9 మున్సిపాలిటీల్లో కొత్త చైర్పర్సన్లు అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవుల నుంచి దిగిపోయిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల స్థానంలో కొత్త వారిని ఎన్నుకొనే ప్రక్రియ కూడా 9 మున్సిపాలిటీల్లో పూర్తయింది. మహబూబ్‌నగర్, నేరేడిచర్ల, కోదాడ, భూపాలపల్లి, నస్పూర్, మంచిర్యాల, నల్గొండ, వేములవాడ, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో కొత్త వారు కొలువు దీరారు. జగిత్యాల, భువనగిరి, ఖానాపూర్, హుజూర్నగర్, సుల్తానాబాద్, నారాయణఖేడ్ మునిసిపాలిటీల్లో ఈనెల 28న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కొత్త చైర్మన్/వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాగారం, మణికొండ, తూంకుంట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, సమావేశం తేదీలను నిర్ణయించలేదు. కాగా బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని పట్టణాల్లో అవిశ్వాస నోటీసులు రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి ఇప్పటి వరకు 34 చోట్ల అవిశ్వాస నోటీసులు జారీ అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పురపాలక వర్గాలు చెపుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ సాగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలలోని పట్టణాల పరిధిలో మెజారిటీ మునిసిపాలిటీలను లోక్‌సభ ఎన్నికల లోపు హస్తగతం చేసుకొనే ఆలోచనలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సమయంలో భారత ప్రభుత్వం తన భవిష్యత్ వృద్ధిపై ఆశాజనకంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గురువారం నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అమెరికా, యూకే, యూరోజోన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో ఆర్థిక సవాళ్ల మధ్య ఉన్నాయని, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా వినియోగదారుల డిమాండ్లు, వేతనాల స్తబ్దత వంటి సమస్యలనెదుర్కొంటోందని తెలిపారు. ‘‘ప్రపంచబ్యాంకు గణాంకాల ప్రకారం 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి 3%గా ఉంది. 2023 నాటికి అది 2.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో మోర్గన్ స్టేన్లీ సంస్థ 2013లో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొంది. అదే సంస్థ తాజాగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ను గుర్తించింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే దీనికి కారణం’’ అని చెప్పారు. మిలేగా స్థానంలో మిల్గయా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం గరీబీ హఠావో నినాదాన్ని సీతారామన్ ఎగతాళి చేస్తూ వాస్తవంగా పేదరికం తొలగిపోయిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఒకప్పుడు మిలేగా (లభిస్తుంది) అన్న పదం స్థానంలో ఇప్పుడు మిల్ గయా (అన్నీ అందాయి) అని ప్రజలు చెప్పుకునే స్థాయికి పాలన వెళ్లిందన్నారు. అవినీతి, బంధుప్రీతితో దశాబ్దాల పాటు కాంగ్రెస్ సమయాన్ని వృథా చేసిందని, అన్ని సంక్షోభాల్ని అవకాశాలుగా అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నామన్నారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలో తమిళనాడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా తమిళంలో మాట్లాడారు. సెంగాల్ (రాజదండం) గురించి ఆమె ప్రస్తావిస్తూ దానిని ఎక్కడో మ్యూజియంలో పడేశారని అది తమిళనాడు ఆత్మగౌరవాన్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సెంగాల్‌ను లోక్‌సభలో ప్రతిష్టించి సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. అదే సమయంలో ఆమె సభను పక్కదారి పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, లెప్ట్ పార్టీల ఎంపీలు వాకౌట్ చేశారు. నిండుసభలో జయలలిత చీర లాగారు మణిపూర్‌లో మహిళల అకృత్యాల గురించి సీతారామన్ ప్రస్తావిస్తూ కేవలం మణిపూర్ మాత్రమే కాదు మహిళల్ని అవమానపరిచే, కించపరిచే ఘటనలు రాజస్థాన్, ఢిల్లీ ఇలా ఏ రాష్ట్రంలో జరిగినా ఆందోళన కలిగిస్తాయన్నారు. ఈ ఘటనలు ఎక్కడ జరిగినా తీవ్రంగా పరిగణించాలన్నారు. మణిపూర్ అంశంపై ప్రసంగించిన డీఎంకే ఎంపీ కనిమొళికి ఈ సందర్భంగా ఒక ఘటనను గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవం గురించి ప్రస్తావించారు. ‘‘జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు 1989 మార్చి 25న పరమ పవిత్రమైన నిండు సభలో ఆమె చీరను లాగారు. డీఎంకే సభ్యులు అదంతా చూస్తూ జయలలితను గేలి చేశారు. ఆమెను చూసి నవ్వుకున్నారు. రెండేళ్ల తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితను పరాభవించినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వారు ఇప్పుడు విపక్ష నేతలుగా ద్రౌపదికి చీర లాగడం గురించి మాట్లాడుతున్నారు’’ అని డీఎంకేకి చురకలు అంటించారు. -
Sakshi Cartoon: శ్రీలంక సర్కార్ మెడపై అవిశ్వాసం కత్తి
శ్రీలంక సర్కార్ మెడపై అవిశ్వాసం కత్తి -
టీకా వద్దనేవారు తగ్గిపోతున్నారు!
న్యూఢిల్లీ: భారత జనాభాలో కోవిడ్ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది. దేశ జనాభాలో టీకాలపై సందేహాలున్న వారి సంఖ్య కేవలం 7 శాతానికి చేరిందని, టీకాలివ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ఠ స్థాయని సర్వే తెలిపింది. 301 జిల్లాల్లో 12,810 మందిని వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించారు. వీరిలో 67 శాతం మగవారు కాగా 33 శాతం మంది మహిళలు. వీరిలో ఇప్పటివరకు టీకా తీసుకోనివారిని ప్రశ్నించగా 46 శాతం మంది కనీసం తొలిడోసైనా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం 27 శాతం మంది మాత్రం ఇంకా టీకాపై నమ్మకం కుదరడం లేదని, మరింత డేటా వచ్చాక టీకా తీసుకుంటామని చెప్పినట్లు సంస్థ అధిపతి సచిన్ తపారియా తెలిపారు. భారత్‌లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా వీరిలో 68 కోట్ల మంది కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకున్నవారున్నారు. సర్వే ఫలితాలను దేశజనాభాతో పోల్చిచూస్తే 7 శాతం మంది అంటే సుమారు 26 కోట్లమంది ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోలేదు. వీరిలో కొంతమంది త్వరలో టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ఆరంభమైనప్పుడు దేశ జనాభా(వయోజన)లో దాదాపు 60 శాతం మంది టీకాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్ అనంతరం టీకాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా టీకాల పంపిణీ ఆరంభించడం కూడా ప్రజల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాచుర్యం లభించేందుకు కారణమైంది. ఎందుకు వద్దంటే... టీకాలను వద్దనే సందేహరాయుళ్లు తమ వ్యతిరేకతకు పలు కారణాలు చెబుతున్నారు. కొత్తవేరియంట్ల నుంచి టీకా కల్పించే రక్షణపై సందేహాలను వెలుబుచ్చుతున్నారు. వీరి అనుమానాల్లో కొన్ని... ► సరైన పరీక్షలు పూర్తికాకముందే హడావుడిగా టీకాలకు అనుమతులిచ్చారు, కాబట్టి వాటితో లభించే రక్షణపై సందేహాలున్నాయి. ► టీకాలతో సైడ్‌ఎఫెక్టులుంటాయి, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు టీకాతో అనవసర సమస్యలు వస్తాయి. ► కొత్తగా వచ్చే వేరియంట్లను ప్రస్తుత టీకాలు ఎలాగూ రక్షించలేవు. అందువల్ల మరింత శక్తివంతమైన వ్యాక్సిన్లు వచ్చాక ఆలోచిద్దాం. ► మాకు బ్లడ్ క్లాటింగ్ సమస్యలున్నాయి అందుకే టీకాకు దూరంగా ఉంటున్నాము. ► మానవ పయ్రత్నం ఏమీ లేకుండా ఎలా వచ్చిందో అలాగే కోవిడ్ మాయం అవుతుంది, దానికోసం టీకాలు అవసరం లేదు. టీకాలపై మారుమూల ప్రాంతాల్లో వ్యాపించిన మూఢనమ్మకాలు, అభూత కల్పనలు కొందరిని టీకాకు దూరంగా ఉంచుతున్నాయి. వ్యాక్సినేషన్ తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారింది. జనాభాలో వీలైనంత ఎక్కువమందికి టీకాలు అందితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
అమ్మో ... ఆయన్ని నమ్మలేం బాబూ!!
'ఆయనని అస్సలు నమ్మలేం. ఆయన ఎవరినీ నమ్మలేం. ఆయన పరిపాలనే భయం, బెదిరింపుల మయం. ఆయన అధికారాన్ని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు' అమెరికన్ కాన్సులేట్ అధికారి ఒకాయన గుజరాతమ్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది. అమెరికా అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ట్విట్టర్ లోకంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, మోదీ వ్యతిరేకులు దీన్ని రీట్వీట్ చేసి, కామెంట్ చేసి మరీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ మద్దతుదారులు మాత్రం 'మోదీకి అమెరికా సర్టిఫికేట్ అవసరం లేదు. మోదీ ఎలాంటి వాడో మాకందరికీ తెలుసు' అని వాదిస్తున్నారు. వికీలీక్స్ ట్విట్టర్ హ్యాండిల్ లోనరేంద్ర మోదీ పనితీరుపై అమెరికా కాన్సుల్ జనరల్ మైకెల్ ఓవెన్ చేసిన కామెంట్లు ఈ వివాదానికి కారణం. 'మోదీ మాటలు తీయగా ఉంటాయి. ఆయన వ్యవహార శైలి హాయిగా ఉంటుంది. కానీ ఆయన కొద్ది మంది నమ్మకస్తులైన సలహాదారులు తప్ప మరెవరి మాటలను వినరు' అని ఓవెన్ అన్నట్టు వికిలీక్స్ తెలిపింది. మోదీ చాలా దురుసుగా వ్యవహరిస్తారని, ఆయన తీసుకునే నిర్ణయాలు మంత్రివర్గ సహచరులకు కూడా తెలియవని అమెరికన్ అధికారి అన్నారు. అయితే మోదీ పైకెదగడం ఖాయం కాబట్టి ఆయనను పదేపదే కలవడం అవసరమని ఓవెన్ అనడమే కొనమెరుపు.