The division of the state
-
విభజన తప్పే.. క్షమించండి: రఘువీరా
తిరుపతి: రాష్ర్ట విభజన విషయంలో తప్పు చేశామని, ప్రజలు క్షమించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం ఎంఆర్‌పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల అంగీకారంతో విభజన చేశామని, ఇప్పుడు ఆ పాపం కాంగ్రెస్ నెత్తిన వేస్తున్నారని ఆయన అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు తిరువక్కరుసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. 126 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ చేసిన చిన్న తప్పునకు ప్రజలు మరణ శిక్ష విధించారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తప్పు తెలుసుకున్నామని, మీ ఓటుతో మరణ శిక్షను తొలగించాలని కోరారు. వెంకయ్య రాష్ట్రానికి చేసిందేమిటి? విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బండారు దత్తాత్రేయ కృషి చేస్తుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమిటని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బీజేపీ బిల్లు పెట్టాలని ఏఐసీసీ పరిశీలకుడు కుంతీయ డిమాండ్ చేశారు. -
ఆంధ్ర పొమ్మంది... తెలంగాణ వద్దంటోంది
పోస్టింగ్‌లు లేవు... జీతాలు రావడం లేదంటూ ఇంజినీర్ల ఆవేదన గాంధీనగర్ : ‘రాష్ర్ట విభజన పుణ్యమాని పోస్టింగ్‌లు లేవు. రెండు నెలలుగా జీతాలూ లేవు. మమ్మల్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు’ అని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కె.ఎల్.రావు భవన్లో ఆంధ్ర స్థానికత కలిగి స్థానికేతర కోటాలో తెలంగాణకు కేటాయించిన నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీటిపారుదల ఇంజినీర్ల(తెలంగాణకు బదలాయించిన) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నీటిపారుదల శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 299 మంది ఇంజినీర్లను ఆంధ్రప్రభుత్వం గత నవంబర్‌లో తెలంగాణకు బదలాయించిందని, వీరిలో 175 మంది ఆంధ్ర స్థానికత కలిగిన వారున్నారని చెప్పారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వబోమని స్పష్టం చేసిందన్నారు. ఇరు రాష్ట్రాల మంత్రులు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంజినీర్లు టి. సుధాకర్‌బాబు, పి. శ్రీనివాసరావు, లక్ష్మీసాయి, చలం, జగదీష్ పాల్గొన్నారు. -
నో ఎస్ఎమ్ఎస్
ఐసీడీఎస్‌లో మూలనపడిన ఎస్ఎమ్ఎస్ విధానం రాష్ట్ర విభజన వల్ల డెరైక్టరేట్లో టెలికం వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమంటున్న అధికారులు బీఎస్ఎన్ఎల్ నెట్వర్కు లేక పనిచేయని అంగన్వాడీల సీయూజీ సెల్ఫోన్లు చిత్తూరు(టౌన్): జిల్లాలోని ఐసీడీఎస్(స్త్రీ,శిశు సంక్షేమశాఖ) పరిధిలో పనిచేయాల్సిన ఎస్ఎమ్ఎస్ విధానం మూలనపడింది. అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం, బీ ఎస్ఎన్ఎల్ నెట్వర్కు లేకపోవడం, రాష్ట్ర విభజన వల్ల డెరైక్టరేట్ మార్పుతో ల్యాండ్ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు మార్చకపోవడం తదితర కారణాలతో ఎస్ఎమ్ఎస్ విధానానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జిల్లాలో పటిష్టంగా అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. ఈ విధానం ఎందుకంటే.. జిల్లాలో అంగన్వాడీల పనితీరును మెరుగుపరిచేందుకు ఎస్ఎమ్ఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిత్రం ప్రవేశపెట్టింది. దానికోసం జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డెరైక్టరేట్ అధికారులు, ఐసీడీఎస్ పీడీ, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లకు సీయూజీ (కామన్ యూజర్ గ్రూప్) పద్ధతిలో బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డులను ప్రభుత్వం అందచేసింది. ఐసీడీఎస్‌లో రాష్ట్రస్థాయి అధికారి మొదలు జిల్లా, డివిజన్, గ్రామాల్లోని అంగన్వాడీ వర్కర్ల వర కు కమ్యూనికేషన్ ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. అంగన్వాడీ పరిధిలో జరిగే రోజువారీ కార్యక్రమాలు, పిల్లల హాజరు, వారికి అందించిన ఆహార పదార్థాలు తదితర వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సీయూజీ ఫోన్ల ద్వారా డెరైక్టరేట్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాల్సి ఉంది. త ద్వారా అంగన్వాడీల్లో పారదర్శకత పెరిగి, ప్రజల్లో ఉ న్న అనుమానాలు తొలుగుతాయని భావించారు. పైగా నెలవారీగా అంగన్వాడీలకు సరఫరా అయ్యే సరుకు లు, కోడిగుడ్లు తదితరాలపై లెక్కల్లో ఎలాంటి తేడాలు కనిపించినా పసిగట్టే ఆస్కారముంది. అంగన్వాడీ వ ర్కర్లు క్రమం తప్పకుండా అంగన్వాడీలకు వెళుతున్నా రా లేదా అనేది కూడా ఈ విధానం ద్వారా తెలుస్తోంది. ఏ టవర్ నుంచి మెసేజ్ రిసీవ్ అయ్యింద నే సమాచారాన్ని కూడా డెరైక్టరేట్లో ఉండే మెసేజ్ రిసీవర్ రిసీవ్ చేసుకుని కంప్యూటర్లో ముద్రితమవుతుంది. నెలగా పనిచేయని ఎస్ఎమ్ఎస్ విధానం జిల్లాలో 4,387 మంది అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం సీయూజీ ఫోన్ సౌకర్యం కల్పించింది. వారిలో 3,640 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 864 మంది మినీఅంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరంతా ప్రతిరోజూ సాయంత్రం డెరైక్టరేట్‌కు ఎస్ఎమ్ఎస్ ద్వారా తమ కార్యకలాపాలను ప్రభుత్వానికి నివేదించేవారు. నెల రోజులుగా ఈ విధానం పనిచేయడం లేదు. డెరైక్టరేట్ నుంచి కూడా ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. గతంలో ఒక్క రోజు ఎస్ఎమ్ఎస్ రాకపోయినా డెరైక్టరేట్ అధికారులే వెంటబడేవారు. నెల రోజులుగా వారూ పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ఎమ్ఎస్ పంపడం మరిచారు. ఎంపీఆర్‌కు, ఎస్ఎమ్ఎస్లకు తేడాలొస్తే ఇబ్బందే అంగన్వాడీల ప్రగతిపై సెక్టార్ స్థాయి సమావేశాలను ప్రతినెలా 20 నుంచి 25వ తేదీలోగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నివేదికలను అదేరోజు అంగన్వాడీ వర్కర్లు సూపర్వైజర్లకు అందిస్తారు. వాటిని 25 నుంచి 28వ తేదీలోగా సీడీపీవోలకు సూపర్వైజర్లు అందిస్తారు. సీడీపీవోలకు అందిన నివేదికలను కన్సాలిడేట్ చేసి ప్రతినెలా 29 నుంచి 30, 31 తేదీల్లోగా ఐసీడీఎస్ పీడీకి అందిస్తారు. వాటిని మరుసటి నెల 5వ తేదీలోగా డెరైక్టరేట్‌కు అందేటట్లు ఐసీడీఎస్ కార్యాలయ అధికారులు మెయిల్ ద్వారా పంపుతారు. దీన్నే ఎంపీఆర్ (మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టు) అంటారు. ఈ విధంగా అందిన ఎంపీఆర్కి, అంగన్వాడీల నుంచి రోజూ వచ్చే ఎస్ఎమ్ఎస్లను సరిచూస్తారు. సీయూజీలకు నెట్వర్కు ప్రాబ్లమ్ జిల్లాలో 4,387 మందికి సీయూజీలను ఇచ్చినా వాటిలో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు నెట్వర్కు ప్రాబ్లమ్‌తో పనిచేయడం లేదని తెలిసింది. నెట్వర్కు లేనపుడు ఫోన్ పనిచేయడం లేదు. తద్వారా ఎస్ఎమ్ఎస్లు పంపడం వీలుకావడం లేదు. దీనిపై ఐసీడీఎస్ పీడీ ఉషాఫణికర్ను వివరణ కోరగా రాష్ట్ర విభజన వల్ల 15 రోజులుగా జిల్లాలో ఎస్ఎమ్ఎస్ విధానం పనిచేయడం లేదన్నారు. డెరైక్టరేట్లోనూ ల్యాండ్ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు. డెరైక్టరేట్ సెట్‌రైట్ అయితే మళ్లీ ఈ విధానం యథాతథంగా కొనసాగుతుందన్నారు. -
అఫిడవిట్లు ఇస్తేనే నమ్ముతాం
=జనవరి 18న చలో అసెంబ్లీ =శాసనసభ్యులందరూ పాల్గొనాలి =సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం డిమాండ్ తిరుపతి, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లుకు వ్యతిరేకంగా అఫిడవిట్లు సమర్పించిన వారినే నిజమైన సమైక్యవాదులుగా గుర్తిస్తామని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం స్పష్టం చేసింది. సోమవారం తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో శాప్స్, సైమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం సంయుక్తంగా ‘రాష్ట్ర విభజన-మన కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.పటేల్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజనకు ఒడిగడుతున్నారన్నారు. విభనకు మద్దతు ఇస్తున్న బీజేపీ ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించడం హాస్యాస్పదమని విమర్శిం చారు. అయితే విభజన బిల్లులో శాస్త్రీయత లేదని, ఈ బిల్లు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ఇప్పుడు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా మారుస్తామని చెప్పడం దారుణమన్నారు. ఒక ప్రాంతాన్ని విమర్శిస్తూ జాతీయ భావాలను దెబ్బతీసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 19లను దెబ్బతీస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనకు సహకరిస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులను చరిత్ర క్షమించదని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షుడు అశోక్‌రాజు అన్నారు. ఆర్ అండ్ బీ డెప్యూటీ ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ శేషారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ.రమణ మాట్లాడారు. ఇవీ తీర్మానాలు ఈనెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు. జనవరి ఒకటో తేదీ అందరి ఇళ్లముం దు సమైక్యాంధ్ర ముగ్గులు వేసేలా ప్రచారం చేయాలని, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు మద్దతుగా అఫిడవిట్లను రాష్ట్రపతికి, స్పీకర్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. ఉద్యమంలో అన్ని జేఏసీలు ఒకే తాటిపై నిలిచి పోరాడాలని, రాజకీయనాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని సమైక్య రాష్ట్రం కోసం చేయిచేయి కలిపి నడవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు చలో పార్లమెంట్ చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వివిధ జేఏసీల నాయకులు ఎం.రమేష్, టి.గోపాల్, సంతానం, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, కన్నయ్య, ద్వారకనాథరెడ్డి, ప్రతాప్, డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు.