DL
-
ఇలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే!
డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) పొందడం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చే దరఖాస్తుదారులు సిమ్యులేటర్, 108 కెమెరాల పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ (DTC) డ్రైవింగ్ పరీక్షను మరింత కష్టతరం చేయనుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ మోసాలను అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది.ఇప్పటి వరకు ఇలా..ఇప్పటి వరకు డివిజనల్ రవాణాశాఖ కార్యాలయంలో మాన్యువల్‌గా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేవారు. ఏదో ఫార్మాలిటీగా మాత్రమే ఈ పరీక్ష ఉండేది. దీంతో డ్రైవింగ్ తెలియని వారు కూడా పరీక్ష రాసేవారు. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ పొందినవారు వాహనాలు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.‘జనవరి 16 నుంచి డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇందులో కెమెరాలు, సిమ్యులేటర్లు ఉంటాయి. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందులో మోసానికి ఆస్కారం ఉండదు. డ్రైవింగ్ తెలిసిన వారు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉన్నవారు మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు’ అని ప్రాంతీయ రవాణా అధికారి ప్రమోద్ కుమార్ సింగ్ చెబుతున్నారు.ఘజియాబాద్‌లో ప్రతిరోజూ సగటున 225 మంది మాన్యువల్ డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతున్నారు. అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ కోసం డిపార్ట్మెంట్ డీటీసీని ఏర్పాటు చేసింది. డీటీసీ పనులు పూర్తయ్యాయి. డీటీసీలో 108 కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.డ్రైవర్ పరీక్ష ఏజెన్సీ పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారా అనేది అధికారులు నిర్ణయిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల ప్రతి కదలికనూ వీడియో రికార్డింగ్ చేస్తారు.దరఖాస్తుదారు డ్రైవింగ్‌తో పాటు ట్రాఫిక్ నియమాలన్నింటినీ తెలుసుకోవాలి. డ్రైవింగ్‌తో పాటు ప్రతి నియమం తెలిస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. దీంతో టెస్టింగ్‌లో మోసాలు పూర్తిగా నిలిచిపోతాయి. 108 కెమెరాల వీడియో రికార్డును కేంద్రంలో భద్రంగా ఉంచుతారు. ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.సిమ్యులేటర్ అంటే ఏమిటి?సిమ్యులేటర్ అనేది నిజమైన కారుకు ప్రతిరూపం. ఇందులో స్టీరింగ్ వీల్, గేర్లు, బ్రేక్‌లు, పెడల్స్, సూచికలు, స్విచ్‌లు, స్పీడ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ద్వారా ఈ సిమ్యులేటర్ నడుస్తుంది. డ్రైవింగ్ ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగశాలగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారా ఎకో డ్రైవింగ్ శిక్షణ కూడా అందించవచ్చు. -
పచ్చ కండువా కప్పుకునేందుకు డీఎల్ విముఖత
కడప : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్న తరుణంలో డీఎల్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు సంప్రదించారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని అందుకు అవసరమైన ఖర్చు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. గుడ్డికంటే మెల్ల మేలని ఆ ప్రతిపాదనకు డీఎల్ అంగీకరించినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా కడప పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి తెరపైకి వచ్చారు. ఈ వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చొరవ ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కమారుగా డీఎల్ నిరుత్సాహపడ్డారు. టీడీపీ నుంచి పోటీ చేయని పక్షంలో పచ్చ కండువా ఎందుకు కప్పుకోవాలనే దిశగా డీఎల్ చర్యలు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఖాజీపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మాజీ మంత్రి డీఎల్ బాటలో పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా తన అనుచరులను నిలిపినా పార్టీలో చేరేందుకు మాత్రం సుముఖంగా లేరు. ఆమేరకే ప్రజాగర్జనలో టీడీపీ తీర్థం పుచ్చుకునే కార్యక్రమానికి గైర్హాజరు కానున్నట్లు సమాచారం. అసంతృప్తిలో కందుల .. కడప పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కందుల రాజమోహన్‌రెడ్డి సైతం టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచా రం. పలు పర్యాయాలు వద్దన్నా తమతో పోటీ చేయించి, ఇప్పడు టికెట్ అడిగినా ఇవ్వరా..అన్న ఆక్రోషంలో కందుల శివానందరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానని, నీవు మాత్రమే రాజకీయాలలో కొనసాగవచ్చని సోదరుడు రాజమోహ న్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంపీ రమేష్ ఏకపక్ష వైఖరితో కందుల సోదరులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు కొత్తగా చేరినట్లు కాకుండా ప్రజాగర్జనకు మాత్ర మే హాజరైందుకు రాజమోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కూడా శివానందరెడ్డి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. -
రాబోయే ఎన్నికల్లో మంచివ్యక్తిని ఎన్నుకోండి
కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'రచ్చబండ' కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వృద్ధుల కోసం కేటాయించిన రూ.9కోట్లు ఫించన్లు వారికి చేరలేదన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందని డీఎల్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. మరోవైపు పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం అభాసుపాలవుతోంది. అధికార పార్టీ నేతలతో, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అభివృద్దిపై కొందరు, సమైక్యాంధ్రపై మరికొందరు నిలదీస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తిరుపతి ఎంపీ చింతామోహన్, సత్యవేడు ఎమ్మెల్యే హేమలతను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. పదవులకు పార్టీకి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సమైక్యవాదులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చారంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే పులపర్తి అసహనం వ్యక్తం చేస్తూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. మరోవైపు కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ముఖ్యమంత్రి కిరణ్ నివేదిక ప్రసంగాన్ని చదవకుండానే మంత్రి శ్రీధర్‌బాబు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.