'ప్రభుత్వం నుంచి నాకు ఏ ఆదేశాలు రాలేదు'
కాకినాడ : డీఎం అండ్ హెచ్ఓ గా డాక్టర్ పవన్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పుష్కర విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటివరకు ఆ హోదాలో ఉన్న సావిత్రమ్మను తూర్పు గోదావరి కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆమె బాధ్యతలు కొనసాగిస్తున్నారు.
కొద్దిసేపటి క్రితం డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయానికి వెళ్లి సావిత్రమ్మ కూర్చోవడంతో ఈ వివాదం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై మీడియా ఆమెను సంప్రదించగా... ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సావిత్రమ్మ స్పష్టంచేశారు.