అనంత జిల్లా వైద్యాధికారికి బెదిరింపులు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో ముమ్మురంగా తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్ఓ) రామ సుబ్బారావు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో తనిఖీలు నిర్వహిస్తే చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆయన్ని బెదిరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆయన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అందులోభాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను ఆయన సీజ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆశా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను రామసుబ్బారావు సీజ్ చేశారు. దాంతో ఆయనకు బెదిరింపులు వచ్చి ఉంటాయని ఆయన భావిస్తున్నారు.