అనంత జిల్లా వైద్యాధికారికి బెదిరింపులు | District Medical and Health Officer Gets Threat Call For checkings in Private Hospitals | Sakshi
Sakshi News home page

అనంత జిల్లా వైద్యాధికారికి బెదిరింపులు

Published Sun, Jan 5 2014 10:25 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

District Medical and Health Officer Gets Threat Call For checkings in Private Hospitals

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో ముమ్మురంగా తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్ఓ) రామ సుబ్బారావు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో తనిఖీలు నిర్వహిస్తే చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆయన్ని బెదిరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆయన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

అందులోభాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను ఆయన సీజ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆశా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను రామసుబ్బారావు సీజ్ చేశారు. దాంతో ఆయనకు బెదిరింపులు వచ్చి ఉంటాయని ఆయన భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement