doctars
-
అతిగా నృత్యం చేస్తే ఏమవుతుంది? ఆయాసం రాగానే ఏం చేయాలి?
గుజరాత్లో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల గర్బా ఈవెంట్లలో పాల్గొన్నవారిలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన గడచిన 24 గంటల్లో చోటుచేసుకుంది. బాధితుల్లో యువకులు మొదలుకొని 50 ఏళ్లు పైబడిన వారి వరకు ఉన్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడు. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు కూడా గర్బా ఆడుతూ మృతి చెందాడు. రాష్ట్రంలో ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి గర్బా అనేది ఒక తరహా నృత్య రూపం. దీనిలో సామూహికంగా డాన్స్ చేస్తారు. అయితే ఈ విధంగా డ్యాన్స్ చేసేటప్పుడు శారీరక పరిమితికి మించి నృత్యం చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికసమయం నృత్యం చేయడం వలన గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. నిజానికి అధికంగా నృత్యం చేసినప్పుడు, అది శరీరంపై, ముఖ్యంగా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో డీహైడ్రేటెడ్‌గా ఉంటే, అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గుండె మన శరీరంలోని రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. అయితే మనం జిమ్, వ్యాయామం లేదా డ్యాన్స్ చేసినప్పుడు, మన శరీరం చురుకుగా మారుతుంది. ఫలితంగా మన శరీరం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తపోటు పెరగడం సహజం. అదేసమయంలో హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరానికి గరిష్ట ఆక్సిజన్ అవసరమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి బీపీ బాధితునికి ఎదురైతే గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. మధుమేహం లేదా బీపీ బాధితులు ఏ పరిమితితో పనిచేయాలో ముందుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగానే పనిచేయాలి. వ్యాయామం చేసేటప్పుడు లేదా డ్యాన్స్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
వైద్యురాలి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
గద్వాల క్రైం: కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఓ ఆశ కార్యకర్త మభ్యపెట్టి ప్రైవేట్ క్లినిక్‌కు పంపించింది.. అక్కడ నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణాలొదిలింది.. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వైద్యురాలే కారణమని బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం గద్వాలలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..రెండురోజుల తర్వాత.. ధరూరు మండలంలోని నీళహల్లి గ్రామానికి చెందిన పావని అనే గర్భిణి ఈ నెల 22న కాన్పు కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అయితే డ్యూటీ డాక్టర్ వరలక్ష్మి గర్భిణిని పరిశీలించి కాన్పు కావడానికి ఇంకా సమయం ఉందని, ఎలాంటి భయం లేదని చెప్పారు. ఆస్పత్రిలోనే రెండు రోజులు గడిచినప్పటికీ పావనికి ఎలాంటి నొప్పులు రాలేదు. అయితే ఓ ఆశ కార్యకర్త తనకు తెలిసిన ఓ ప్రైవేట్ క్లినిక్‌లో డెలివరీ చేయించుకోండి అంటూ ప్రైవేట్ క్లినిక్‌కు ఈ నెల 24న పంపించారు. అక్కడ డాక్టర్ వరలక్ష్మి సాయంత్రం పావనికి సిజేరియన్ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. అయితే బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, ఉమ్మ నీరు తాగిందని, బిడ్డ పేగు మెడకు చుట్టుకుందని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన బంధు వులు గురువారం మధ్యాహ్నం గద్వా ల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెం ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేప ట్టా రు. కాన్పు కోసం వచ్చిన సమయ ంలో ఎలాంటి ఇబ్బంది లేదని, సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యురాలు వరలక్ష్మి.. రెండురోజులు నిర్లక్ష్యం చేసి.. తనకు సంబంధించిన ప్రైవేట్ క్లినిక్‌లో సిజేరియన్ చేయడంతోనే బిడ్డ మృతిచెందిందని ఆరోపించారు. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నా తప్పిదం లేదు.. ఈ విషయమై వైద్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ చినపోవడంలో తమ తప్పిదం లేన్నారు. ఉమ్మనీరు తాగడం, పేగు మెడకు చుట్టుకోవడంతోనే మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపించామన్నారు. ఎవరికీ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యం చేయించుకోవాలని చెప్పలేదన్నారు. విచారణ జరుపుతాం.. ప్రభ్తుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే కాన్పులు చేయాలి. అలా కాదని ఎవరైనా ప్రైవేట్ క్లినిక్‌లకు పంపించడం చట్టరీత్యా నేరం. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ విజయ్‌కుమార్, సూపరింటెండెంట్, గద్వాల -
జీజీహెచ్‌కు, డాక్టర్‌కు ఫోరం వడ్డింపు
చికిత్స సరిగా చేయలేదని ఆశ్రయించిన ఫిర్యాదుదారుకు రూ.4 లక్షల 7వేలు చెల్లించాలని తీర్పు గుంటూరు లీగల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, వైద్యుడు కలసి ఫిర్యాదుదారుకు రూ. 4లక్షల 7వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు.... గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన తులసి శివనాగేశ్వరరావు పత్తి వ్యాపారం చేస్తుంటారు. శివనాగేశ్వరరావు 2010 సెప్టెంబర్ 2న గుడివాడలో రాత్రి 10గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలు ఎముకలు విరగటంతో బంధువులు 3వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదే నెల 14న డాక్టర్ ఎం. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి రాడ్లు అమర్చారు. చికిత్స అనంతరం నవంబర్ 14న శివనాగేశ్వరరావును డిశ్చార్జి చేశారు. ఆరు నెలలు గడచినప్పటికీ నొప్పి తగ్గక పోవడం, కాలు వాపు వస్తుండటంతో తిరిగి ప్రభుత్వ సమగ్ర అస్పత్రికి రాగా 2011 మే 26న తిరిగి ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చి జూన్ 9న డిశ్చార్జి చేశారు. అయినా సమస్య తగ్గక పోగా ఆయన పక్షవాతానికి గురయ్యారు. దీంతో 2011అక్టోబర్ 24న ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యుడు పరిశీలించి రాడ్స్ సరిగా అమర్చలేదని, అందుకే సమస్య వచ్చిందని ఆపరేషన్ చేసి అవి సరిచేయాలని చెప్పి మరలా ఆపరేషన్ నిర్వహించారు. ఎన్ఆర్ఐలో ఆపరేషన్ చేసినా ఫలితం లేక పోవడంతో మరో ఎముకల డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన కూడా రాడ్స్ సరిగా అమర్చనందున సమస్య ఏర్పడిందని మరలా ఆపరేషన్ చేయాలని తెలిపారు. అప్పటికే శివనాగేశ్వరరావుకు సుమారు రూ.90వేలు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కాలు సరికాలేదని ఆరోపిస్తూ, ఈ కాలంలో తాను ఆదాయం కూడా కోల్పోయానని పేర్కొంటూ జిల్లా వినియోగ దారుల ఫోరంను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించి...ఫిర్యాదు దారు ఆదాయం నష్టపోయినందుకు రూ. 3లక్షలు, మానసిక వేదనకు రూ. లక్ష, వివిధ ఖర్చుల కింద మరో రూ. 7వేలు ఆరువారాలలో చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు బి. రామారావు, సభ్యులు ఎ. ప్రభాకర గుప్త, టి. సునీతలతో కూడిన బెంచి తీర్పు చెప్పింది.