ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తున్న బంధువులు
గద్వాల క్రైం: కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఓ ఆశ కార్యకర్త మభ్యపెట్టి ప్రైవేట్ క్లినిక్‌కు పంపించింది.. అక్కడ నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణాలొదిలింది.. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వైద్యురాలే కారణమని బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం గద్వాలలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..రెండురోజుల తర్వాత.. ధరూరు మండలంలోని నీళహల్లి గ్రామానికి చెందిన పావని అనే గర్భిణి ఈ నెల 22న కాన్పు కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అయితే డ్యూటీ డాక్టర్ వరలక్ష్మి గర్భిణిని పరిశీలించి కాన్పు కావడానికి ఇంకా సమయం ఉందని, ఎలాంటి భయం లేదని చెప్పారు. ఆస్పత్రిలోనే రెండు రోజులు గడిచినప్పటికీ పావనికి ఎలాంటి నొప్పులు రాలేదు. అయితే ఓ ఆశ కార్యకర్త తనకు తెలిసిన ఓ ప్రైవేట్ క్లినిక్‌లో డెలివరీ చేయించుకోండి అంటూ ప్రైవేట్ క్లినిక్‌కు ఈ నెల 24న పంపించారు. అక్కడ డాక్టర్ వరలక్ష్మి సాయంత్రం పావనికి సిజేరియన్ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు.
అయితే బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, ఉమ్మ నీరు తాగిందని, బిడ్డ పేగు మెడకు చుట్టుకుందని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన బంధు వులు గురువారం మధ్యాహ్నం గద్వా ల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెం ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేప ట్టా రు. కాన్పు కోసం వచ్చిన సమయ ంలో ఎలాంటి ఇబ్బంది లేదని, సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యురాలు వరలక్ష్మి.. రెండురోజులు నిర్లక్ష్యం చేసి.. తనకు సంబంధించిన ప్రైవేట్ క్లినిక్‌లో సిజేరియన్ చేయడంతోనే బిడ్డ మృతిచెందిందని ఆరోపించారు. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
నా తప్పిదం లేదు..
ఈ విషయమై వైద్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ చినపోవడంలో తమ తప్పిదం లేన్నారు. ఉమ్మనీరు తాగడం, పేగు మెడకు చుట్టుకోవడంతోనే మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపించామన్నారు. ఎవరికీ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యం చేయించుకోవాలని చెప్పలేదన్నారు.
విచారణ జరుపుతాం..
ప్రభ్తుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే కాన్పులు చేయాలి. అలా కాదని ఎవరైనా ప్రైవేట్ క్లినిక్‌లకు పంపించడం చట్టరీత్యా నేరం. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ విజయ్‌కుమార్, సూపరింటెండెంట్, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment